MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధర్మకార్యాలను వాయిదా వేయవ.._Darmakaryam


ఎప్పుడెలా మారిపోతుందో!
      ఒకసారి కర్ణుడు తన ఇంటి ఆవరణలో నూనెతో తలంటుకుంటున్నాడు. వజ్ర, వైఢూర్యాలు పొదిగిన పాత్రలో నూనె ఉంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వచ్చాడు. కృష్ణుడి రాకను గమనించి ప్రణామాలు తెలిపాడు కర్ణుడు. అతడి పక్కనే ఉన్న నూనె ఉంచిన పాత్రను చూడగానే.. కృష్ణుడికి ముచ్చటేసింది. ‘కర్ణా! నాకు ఈ నూనె పాత్ర ఎంతో నచ్చింది. దానిని నాకు దానమివ్వు’ అని అడిగాడు కృష్ణుడు. ‘పరమాత్మా! మీరు అడగాలే కానీ, ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధం’ అంటూ వెంటనే నూనె పాత్రను కృష్ణుడికి దానం ఇచ్చేశాడు. కుడి చేతి నూనెతో ఉండటం వల్ల ఎడమ చేతితో దానం ఇచ్చాడు కర్ణుడు. ఇది గమనించిన కృష్ణుడు.. ‘కర్ణా! ఇలా వామహస్తంతో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలియాదా?’ అని ఆక్షేపించాడు. దానికి కర్ణుడు.. ‘కృష్ణా! ఈ జీవితం క్షణ భంగురం.
లిప్తపాటులో మృత్యువు దాపురించవచ్చు. పైగా ఈ చిత్తం మాయామోహ వలయంలో చిక్కుకుని ఉంటుంది. ఈ క్షణంలో అనుకున్నది మరుక్షణంలో మాయ చేసి మార్చివేస్తుంటుంది. నా కుడి చేతి నూనెతో ఉంది. చేయి కడుక్కొని వచ్చి దానమిచ్చేలోపు.. నా ప్రాణాలు ఉంటాయో పోతాయో ఎవరికి తెలుసు? పైగా ఈ లోపు దానమివ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాక ముందే దా నంఇవ్వాలనుకున్నా. అందుకు మీరు అడిగిన వెంటనే నూనె పాత్ర దానం చేశాను. అంతేగాని, ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తెలియక కాదు!’ అన్నాడు. కర్ణుడి దానశీలతకు కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయాడు. అతణ్ణి మనసారా ఆశీర్వదించి దానం తీసుకున్నాడు. దానధర్మాలు, మంచిపనులు అనుకున్న వెంటనే చేయాలి. జీవితం క్షణభంగురమని గుర్తెరిగి ధర్మకార్యాలను వాయిదా వేయకుండా సంకల్పం అయిన వెంటనే ఆచరించాలి. అప్పుడే మాధవుడి అనుగ్రహం కలుగుతుంది.


1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list