మీఠా రమజాన్
ఒక నెల రోజులు...ఎంగిలి కూడా మింగకుండా అల్లాని ధ్యానించారు. మరి... పండగొచ్చినప్పుడు నోరూరే మిఠాయిలు చేసుకోవద్దా?చలో... జషన్ మనాయేంగే!మీఠా మీఠా జషన్ మనాయేంగే! ఈద్ ముబారక్!!
షీర్ ఖుర్మా
కావల్సినవి: సేమ్యా – 100 గ్రాములు; నెయ్యి – టేబుల్ స్పూన్; పాలు – 3 లీటర్లు; పంచదార – 200 గ్రాములు; బియ్యప్పిండి – 10 టేబుల్ స్పూన్‌లు;ఏలకుల పొడి – చిటికెడు; పాలపొడి – కప్పు;ఎండు ఖర్జూరం – 100 గ్రాములు(కొన్ని నీళ్లు పోసి రాత్రి పూట నానబెట్టి,
మరుసటి రోజు సన్నగా తరగాలి);బాదంపప్పు – 50 గ్రాములు;పిస్తాపప్పు – 50 గ్రాములు;పచ్చికొబ్బరి ముక్కలు – 50 గ్రాములు;
కెవ్రా (మార్కెట్‌లో లభిస్తుంది) – టీ స్పూన్
తయారీ:∙పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి∙అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి ∙గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి ∙స్యేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి ∙బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడిని మరుగుతున్న పాలలో పోసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి ∙అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్‌మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి ∙సేమ్యావేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి తీయాలి.
కద్దూ కా మీఠా
కావలసినవి: సొరకాయ తురుము – 2 కప్పులు; పాలు – 1 లీటరు; పంచదార – 2 కప్పులు; కోవా – 2 కప్పులు; సగ్గుబియ్యం – అర కప్పు; బాదం పప్పులు – అర కప్పు; పిస్తా – అర కప్పు; మిల్క్‌మేడ్ – కప్పు; పైనాపిల్ ముక్కలు – అర కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు, కిస్‌మిస్: పది
తయారీ ∙సొరకాయ తురుమును ఉడికించి నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకోవాలి ∙బాదం, పిస్తా పప్పులను నెయ్యిలో వేయించాలి ∙అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగబెటి,్ట సగ్గుబియ్యం కలిపి ఉడికాక కోవా కలపాలి ∙ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత పంచదార కలిపి కరిగాక స్టౌపై నుంచి దించేయాలి ∙ఈ మిశ్రమాన్ని చల్లబరచి ఉడికించిన సొరకాయ తురుమును కలుపుకోవాలి ∙చివరిగా పైనాపిల్
ముక్కలు, వేయించి ఉంచిన బాదం, పిస్తా పలుకులు, కిస్‌మిస్ కలుపుకోవాలి.
చావల్ కా మీఠా
కావలసినవి: బాస్మతి బియ్యం రవ్వ – కప్పు; పాలు – 2 కప్పులు; కోవా – కప్పు; జీడిపప్పు పేస్ట్ – అర కప్పు; రోజ్‌వాటర్ – టీ స్పూను; బాదం, కిస్‌మిస్ – అరకప్పు
తయారీ :అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరిగించి బాస్మతి బియ్యం రవ్వ కలిపి ఉడికించాలి ∙రవ్వ ఉడికిన తరువాత కోవా, పంచదార కలిపి ఐదు నిమిషాలుంచి పిస్తా, రోజ్‌వాటర్ కలిపి స్టౌ పైనుంచి దించేయాలి ∙చావల్ కా మీఠాను మట్టిపాత్రలో వుంచితే తేమని పీల్చుకుని మరింత రుచిగా వుంటుంది. బాదం, కిస్‌మిస్‌తో గార్నిష్ చేయాలి.
ఖుబాని కా మీఠా
కావలసినవి: ఖుబాని (డ్రై ఆప్రికాట్లు) – 1 కప్పు పంచదార – ఒకటిన్నర కప్పు రాస్‌బెర్రి ఎసెన్స్ – అర టీ స్పూను డ్రైఫ్రూట్స్ : గార్నిషింగ్‌కి
తయారీ: ఖుబానీలను 10 గంటలు నానబెట్టుకోవాలి విత్తనాలు తీసేసి ఒక గంట ఉడకబెట్టాలి .ఖుబానీలు మెత్తబడగానే పంచదార కలపాలి .తరువాత మరో అరగంట పాటు ఉడికించి చివరిగా రాస్‌బెర్రి ఎసెన్స్ కలిపి దించాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి.
డబుల్ కా మీఠా
కావలసినవి: బ్రెడ్ – 4 స్లైసెస్; పాలు – 1 కప్పు; పంచదార – 1 కప్పు; జీడిపప్పు – అర కప్పు; పిస్తా పప్పు – అరకప్పు; బాదంపప్పు – అర కప్పు; నెయ్యి – అర కప్పు; నీళ్ళు – 3 టీస్పూన్లు; ఏలకులపొడి – అర టీ స్పూను
తయారీ: బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, నెయ్యిలో వేయించి పక్కన ఉంచాలి ∙బాదం, పిస్తా, జీడిపప్పులను కూడా ఆ నెయ్యిలో వేయించాలి ∙ఓ పాత్రలో పాలు మరగబెట్టాలి ∙బ్రెడ్ ముక్కలను మరిగిన పాలలో వేసి కలుపుకోవాలి ∙పంచదారలో నీళ్ళు పోసి కలిపి పాకం పట్టి, బ్రెడ్ ను వేయించగా మిగిలిన నెయ్యిని కలుపుకోవాలి ∙దీంట్లో బ్రెడ్ మిశ్రమాన్ని, పిస్తా, బాదం, జీడిపప్పు, ఏలకులపొడి చల్లి మంట తీసేయాలి ∙దీనిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు.
కేసర్ సేమ్యా మీఠా
కావల్సినవి:సేమ్యా – 10 గ్రాములు పాలు – కప్పుపంచదార – 200 గ్రాములుకోవాల లేదా కలాకండ్ – 100 గ్రాములుజీడిపప్పు – 50 గ్రాములు కేసరి కలర్ – చిటికెడు కుంకుమపువ్వు – 10 రేకలు
తయారీ: కడాయిలో నెయ్యి వేసి, సేమ్యాని వేయించి తీయాలి ∙మరొక పాత్రలో పాలు మరిగించి అందులో పంచదార, ఏలకుల పొడి, కేసరి రంగు, కోవా, కుంకుమపువ్వు వేసి కలపాలి దీంట్లో సేమ్యా కలపాలి ∙సేమ్యా ఉడికాక, దించి, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి.
స్వీట్ సెలబ్రేషన్
నోరు తీపి చేసుకోవాలంటే మంచి సందర్భం ఉండాలోయ్! అలాంటి సందర్భం రానే వచ్చింది. రెండు రోజుల్లో రంజాన్. నెల రోజులపాటు రోజూ ఉపవాస దీక్ష తర్వాత వచ్చే పండుగ. మరి ఈద్ సెలబ్రేషన్స్‌లో రకరకాల స్వీట్లు ఉండాల్సిందే కదా! అందుకే ఈ వెరైటీ స్వీట్లు. ఇన్ని రకాల తీపి పదార్థాలు చవులూరిస్తుంటే.. ఎవరు మాత్రం నోరు కట్టేసుకోగలరు! నెలవంక తొంగి చూసే సమయంలో... అందరం నోరు తీపి చేసుకోవాల్సిందే! లెటజ్ సెలబ్రేట్...దిస్ అకేషన్ !
దమ్‌రూట్
(గుమ్మడి కాయ హల్వా)
కావలసిన పదార్థాలు:
గుమ్మడి కాయ కోరు - 2 కప్పులు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - 1 కప్పు
జాజికాయ పొడి - చిటికెడు
యాలకుల పొడి - 1 టీస్పూను
పాలు - 1 కప్పు
ఫుడ్ కలర్ - చిటికెడు
జీడిపప్పు, ఎండు ద్రాక్ష - తగినన్ని
తయారీ విధానం:
గుమ్మడి కోరు బాగా పిండి నీరు పక్కన పెట్టుకోవాలి.
బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయుంచి తీయాలి.
తర్వాత గుమ్మడి కోరు వేసి 4 నిమిషాలపాటు చిన్న మంట మీద వేయించాలి.
తర్వాత గుమ్మడి కోరు పిండి పెట్టుకున్న నీటిని చేర్చి నీరు ఇగిరిపోయేవరకూ
ఉడికించాలి.
తర్వాత పాలు పోసి కోరు మెత్తగా ఉడికించాలి.
ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి.
తర్వాత చక్కెర పోసి తిప్పాలి.
హల్వా బాగా ఉడికి, నెయ్యి పైకి తేలేవరకూ ఉడికించాలి.
చిక్కబడిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, జాజి పొడి వేసి కలిపి దింపేయాలి.
(తయారీ సమయం - గంట)
షాహీ తుకడా
కావలసిన పదార్థాలు:
రబ్రి కోసం:
పాలు - 4 కప్పులు
చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
పాల పొడి - 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూను
రోజ్ వాటర్ - 1 టీస్పూను
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార పాకం కోసం:
చక్కెర - అర కప్పు
నీళ్లు - పావు కప్పు
యాలకుల పొడి - పావు టీస్పూను
బ్రెడ్ కోసం:
బ్రెడ్ - 6 స్లయిసెస్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
అలంకరణకు:
బాదం పప్పులు - 15
కుంకుమ పువ్వు - చిటికెడు
పిస్తా - 10
తయారీ విధానం:
పప్పుల కోసం:
నీళ్లు వేడి చేసి బాదం, పిస్తా పప్పులు వేయాలి.
ఒక అరగంటపాటు పక్క నుంచి తర్వాత తోలు తీసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
షాహీ తుకడా తయారీ విధానం:
మందపాటి బాండీలో పాలు పోసి మరిగించాలి.
తర్వాత మిల్క్ పౌడర్ వేయాలి.
కుంకుమ పువ్వు వేసి కలపాలి.
పాల మీద కట్టే మీగడను తీసి పాలలో కలుపుతూ ఉండాలి. అలాగే అంచులకు అంటుకున్న మీగడను గరిటతో తీసి పాలలో కలపాలి.
అడుగంటకుండా ఆపకుండా కలుపుతూనే ఉండాలి.
పాలు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ నుంచి దింపేయాలి.
దీనికి చక్కెర కలిపి కరిగేదాకా తిప్పాలి.
రోజ్ వాటర్, కుంకుమ పువ్వు వేసి తిప్పాలి.
బ్రెడ్‌ను త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి.
అంచులను కట్ చేసి తీసేయాలి.
పెనం మీద నెయ్యి వేసి బ్రెడ్ రెండు వైపులా కాల్చుకోవాలి.
ఇలా అన్నీ కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి.
పంచదారకు నీళ్లు చేర్చి ఒక తీగ పాకం వచ్చేవరకూ ఉడికించాలి.
తర్వాత యాలకుల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని చక్కెర పాకంలో ముంచి వెడల్పాటి ప్లేట్‌లో ఉంచాలి.
ఇలా అన్నిటినీ పాకంలో ముంచి ప్లేట్‌లో గుండ్రంగా అమర్చుకోవాలి.
వీటి మీద కాచి ఉంచిన పాలు పోయాలి.
దీని పైన బాదం, పిస్తా పలుకులు చల్లి సర్వ్ చేయాలి.
(తయారీ సమయం - గంట)
కద్దూ కీ ఖీర్
కావలసిన పదార్థాలు:
సొరకాయ తరుగు - 1 1/4 కప్పులు
చిక్కని పాలు - 2 కప్పులు
నెయ్యి - 1 టేబుల్ స్పూను
పంచదార - 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూను
కుంకుమ పవ్వు - చిటికెడు
బాదం పప్పు - 4
తయారీ విధానం:
సొరకాయ కోరు పిండి, నీరు తీసేయాలి.
బాండీలో నెయ్యి వేసి కోరు వేసి వేయించుకోవాలి.
పచ్చి వాసన పోయేవరకూ చిన్న మంట మీద వేయించుకోవాలి.
నీరంతా ఇగిరిపోయేవరకూ వేయించుకోవాలి.
తర్వాత పాలు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
తర్వాత చక్కెర, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి.
చిక్కబడేవరకూ ఉడికించి పొయ్యి నుంచి దింపేయాలి.
సన్నగా తరిగిన బాదం పప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి.
(తయారీ సమయం - 30 నిమిషాలు)
ఫిర్నీ
కావలసిన పదార్థాలు:
బియ్యం - 5 టేబుల్ స్పూన్లు (నానబెట్టుకోవాలి)
పాలు - 1 లీటరు
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార - 3/4 కప్పులు
యాలకుల పొడి - అర టీస్పూను
పిస్తా - 15
తయారీ విధానం:
బియ్యం శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మిక్సీలో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
పాలను మరిగించుకోవాలి.
బియ్యం పేస్ట్‌ను పాలల్లో వేసి కలుపుకోవాలి.
ఈ బియ్యం పేస్ట్‌ను అలాగే పొయ్యి మీద ఉంచి బాగా ఉడికించుకోవాలి.
కుంకుమ పువ్వు చేర్చి, ఆపకుండా కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి.
పంచదార చేర్చి కరిగేవరకూ కలిపి స్టవ్ నుంచి దింపేయాలి.
ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలో నింపి పైన పిస్తా పలుకులతో అలంకరించి సర్వ్ చేయాలి.
(తయారీ సమయం - 30 నిమిషాలు)
మ్యాంగో పాన్
కావలసిన పదార్థాలు:
మామిడి తాండ్ర - 10 (నలుచదరపు ముక్కలు)
గుల్కంద్ మసాలా - 2 టేబుల్ స్పూన్లు
డెకరేషన్ కోసం - టూత్ పిక్స్
తయారీ విధానం:
మామిడి తాండ్ర ముక్కల మధ్య గుల్‌కంద్ మసాలా ఉంచాలి.
ఆ రెండు ముక్కలు ఊడిపోకుండా టూత్ పిక్ గుచ్చాలి.
డిన్నర్ తర్వాత సర్వ్ చేయాలి.
(తయారీ సమయం - 10 నిమిషాలు)
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565