చెక్ పెట్టేద్దాం!
చలి చలిగా ఉందిరా! హొయ్ రామా! హొయ్ రామా!
గిలి గిలి పెడుతోందిరా! హొయ్ రామా! హొయ్ రామా!
గిలి గిలి పెడుతోందిరా! హొయ్ రామా! హొయ్ రామా!
అవును మరి! చలి గిలిగింతలు పెడుతుంటే భలేగా ఉంటుంది. కానీ అదే చలి చర్మాన్ని చురుక్కుమనిపిస్తూ, చిరాకు కూడా పెడుతూ ఉంటుంది. చిట్లడం, ముడతలు పడటం, కళ తప్పి నల్లగా మారటం...ఇలా ఒకటా రెండా....చలికాలంలో చర్మానికి తిప్పలు చాలానే! అయితే కొంచెం శ్రద్ధ, ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే...చలి పులి నుంచి చర్మాన్ని కాపాడుకోవటం పెద్ద కష్టమేం కాదు!
చర్మానికి అతి వేడి, అతి చల్లదనం రెండూ పనికిరావు. చల్లని వాతావరణాన్ని తట్టుకునేంత పరిమాణంలో చర్మం నుంచి సహజసిద్ధ నూనెలు స్రవించకపోవటం వల్ల ఈ కాలంలో చర్మం పొడిబారిపోతుంది. దాంతో బిరుసెక్కి చిట్లుతుంది. అలాంటప్పుడు తేమనందించే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. కానీ మనం ఇందుకు విరుద్ధంగా చలిని తట్టుకోవటం కోసం ఎండలో కూర్చుంటాం. మరిగే మరిగే నీళ్లతో స్నానం చేస్తాం! చిటపటమంటూ దురద పెడుతుంటే గోళ్లకు పని చెబుతాం. కానీ ఇవన్నీ చేయకూడని పనులు! తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ఈ పనుల వల్ల చర్మ సమస్యలు మరింత పెరుగుతాయి.
వీళ్లు మరింత జాగ్రత్త...
పొడి చర్మం కలిగి ఉండే వాళ్లకు చలికాలం చర్మ సమస్యలు రెండింతలు ఉంటాయి. సున్నిత చర్మం కలిగి ఉండే పిల్లలు, చర్మం కింద కొవ్వు తక్కువగా ఉండే వృద్ధులు, చర్మం పొడిబారే అవకాశం ఉండే హైపో థైరాయిడ్ వ్యక్తులు ఈ కాలంలో రెట్టింపు జాగ్రత్తలు పాటించాలి.

చలి సమస్యలు ఇవే!
ఎగ్జిమా: కొందరికి చర్మం చిట్లి
ఎగ్జిమాకు దారి తీస్తుంది. చర్మం ఎర్రగా మారి, దురద పెడుతూ, గరుకుగా తయారవుతుంది. కొంతమందికి చిన్న పుండ్లు కూడా ఏర్పడతాయి. ఈ పరిస్థితిని ముందస్తుగానే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే తగిన మందులతో సమస్యను అదుపులోకి తేవొచ్చు.
చర్మపు పగుళ్లు: ఇది సర్వసాధారణం. చర్మం సాగినప్పుడల్లా దురద పెట్టడం, చిట్లి మంట పుట్టడం ఈ కాలంలో సహజం.
కాలి పగుళ్లు: అర చేతులు, పాదాల్లో నూనె గ్రంధులు ఉండవు కాబట్టి వీటిపై చలి ప్రభావం ఎక్కువ. పైగా అర చేతులు, పాదాలను ఎక్కువగా నీళ్లలో తడుపుతూ ఉంటాం కాబట్టి మరింత పొడిబారిపోతూ ఉంటాయి. దాంతో మరీ ముఖ్యంగా పాదాల పగుళ్లు పెరుగుతాయి.
పెదవుల పగుళ్లు: ఈ కాలంలో పొడిబారిపోయే పెదవులను నాలుకతో పదే పదే తడుపుతూ ఉంటాం. దీంతో పెదాలు మరింత పొడిబారిపోయి పగులుతూ ఉంటాయి.
పొడి చర్మం బాధలు: స్వతహాగా పొడి చర్మం కలిగిన వాళ్లు, వృద్ధులు, పసి పిల్లలు, హైపో థైరాయిడ్ వ్యక్తులకు పొడిగా ఉండే చర్మం ఈ కాలంలో మరింత పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
చర్మ ఇన్‌ఫెక్షన్లు: అప్పటికే సోరియాసిస్, ఎగ్జిమా మొదలైన చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవాళ్లకు చలి కాలంలో ఆ సమస్యలు మరింత పెరుగుతాయి. ఇలాంటప్పుడు చలికాలం ప్రారంభంలోనే చర్మ వైద్యుల్ని కలవాలి.
చర్మ రక్షణ మన చేతుల్లోనే...
చలి సమస్యలతో చికాకు పెట్టే చర్మ సమస్యలకు చర్మ వైద్యుల్ని కలవటం అవసరమా! అనుకుంటాం. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి బ్లీచింగ్, ఫేసియల్స్, స్క్రబింగ్ చేయించుకుంటాం. లేదంటే ఇంట్లోనే తెలిసిన చిట్కాలు పాటించి ఉపశమనం పొందుతూ ఉంటాం. కానీ ఈ కాలంలో కొన్ని సౌందర్య చికిత్సలకు దూరంగా ఉండాలి. అవేంటంటే...

బ్లీచింగ్: బ్లీచింగ్ చేయించుకోవటం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుంది. దాంతో అప్పటికే పొడిబారి పగిలి ఉన్న చర్మం లోకి రసాయనాలు చొరబడి చర్మాన్ని మరింత పాడు చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లీచింగ్ చేయించుకోకూడదు.
ఎస్‌పిఎఫ్ తక్కువ ఉండే సబ్బులు: ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఉండే సబ్బులు వాడాలి. ఒకవేళ మాయిశ్చరైజర్ సోప్స్ వాడినా జిడ్డు వదలకుండా ఉంటోందని సబ్బును మార్చేస్తాం. కానీ ఇది సరి కాదు.
మాయిశ్చరైజర్లు: బజార్లో దొరికే మాయుశ్చరైజర్లు నిస్సందేహంగా వాడొచ్చు. అయితే వాటిని స్నానం చేసిన వెంటనే, చర్మం తడి పొడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. పొడి చర్మం కలిగిన వాళ్లు మరింత చిక్కని, ఆయిల్ బేస్‌డ్ మాయిశ్చరైజర్లు వాడాల్సి ఉంటుంది.
సబ్బు వాడితే స్నానం తర్వాతే నూనె: సబ్బు వాడేవాళ్లు స్నానం చేసే ముందు ఒంటికి వెన్న లేదా నూనె పూసుకుని తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల చర్మం నుంచి నూనె పూర్తిగా వదలిపోయి తిరిగి పొడిబారుతుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాత నూనె పూసుకోవాలి.
సబ్బు బదులు సున్ని పిండి: నిజానికి సున్నిత చర్మం కలిగిన వాళ్లు సబ్బు బదులు సున్ని పిండి వాడటం మేలు. సున్నిపిండి వాడుతుంటే మాత్రం స్నానానికన్నా ముందే ఒంటికి నూనె లేదా వెన్న పట్టించి, తర్వాత సున్ని పిండితో స్నానం చేసి, వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
ఎగ్జిమా, చర్మపు ఇన్‌ఫెక్షన్లు: వీటికి వైద్య చికిత్స తప్పనిసరి. తెలిసిన చిట్కాలు పాటిస్తూ సమస్యను పెంచుకోకుండా వెంటనే చర్మ వైద్యుల్ని కలిస్తే సమస్యలు అదుప్చులోకి వస్తాయి.
పదే పదే తడపటం: చర్మం చిట్లి దురద పెడుతూ ఉంటే ఉపశమనం కోసం నీళ్లలో తడుపుతూ ఉంటాం. కానీ ఇలా చేస్తే సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. అలాగే చర్మం దురద పెడుతున్నప్పుడు నూనెతో మర్దనా చేస్తూ ఉంటాం. కానీ చర్మ రంధ్రాలు తెరుచుకుని ఉన్నప్పుడే ఆ నూనె చర్మంలోకి ఇంకి సమస్య అదుపులోకొస్తుంది. కాబట్టి తోచినప్పుడు కాకుండా స్నానం చేసిన వెంటనే నూనె రాసుకోవాలి.
లిప్ బామ్: పెదవులకు తరచుగా లిప్ బామ్ రాస్తూనే ఉండాలి. లేదంటే వెన్న పూస్తూ ఉండాలి. నాలుకతో తడుపుకోకూడదు.
సెన్సిటివ్ స్కిన్: సున్నిత చర్మం కలిగిన వారికి బజార్లో దొరికే మాయిశ్చరైజర్లు సరిపడకపోవచ్చు. ఇలాంటి వాళ్లు చర్మ వైద్యుల సూచన మేరకు రసాయనాలు తక్కువగా ఉండే సున్నితమైన మాయిశ్చరైజర్లను అప్లై చేస్తూ ఉండాలి.
తినే తిండీ కీలకమే..!
మనం తినే ఆహారమే చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. కాబట్టి చలి కాలంలో తీసుకునే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఈ కాలంలో...
ఆహారంలో నెయ్యి తినొచ్చు. రోజు మొత్తంలో ఒక స్పూను వెన్న లేదా నెయ్యి తినటం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.
ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉండే చేపలు, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, సోయా, సబ్జా లాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ప్రొటీన్లు, పీచు, పిండి పదార్థాలు, విటమిన్లు సమంగా ఉండే ఆహారం తీసుకుంటే చర్మానికి తగినన్ని పోషకాలు అంది సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. చలి కాలం ఫేస్ ప్యాక్స్.. చర్మాన్ని తేమగా ఉంచాలే గానీ పొడిబార్చకూడదు. కాబట్టి అందుకోసం వాడే పదార్థాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

నోటి ద్వారా మాయిశ్చరైజర్లు
పై పూతగా మాయిశ్చరైజర్లు పని చేయని వారికి నోటి మాత్రల రూపంలో ఉండే మాయిశ్చరైజర్లు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. సహజసిద్ధంగానే పొడి చర్మం కలిగిన వారు, హైపో థైరాయిడ్ వల్ల చర్మం పొడిబారినవారికి ఈ రకమైన చికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏం చేయాలి? ఏం చేయకూడదు?
చలిని తట్టుకోవటం కోసం తరచూ మనం చేసే ప్రయత్నాలు చాలావరకూ చర్మానికి చేటు చేసేవే! మనకు తెలిసో, తెలియకో చేసే ఈ ప్రయత్నాల వల్ల చర్మం రెండింతలు పొడిబారి చలి కాలానికి భయపడేలా చేస్తుంది. కాబట్టి చలి బాధ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
చలిని తరమటం కోసం మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే చర్మం మరింత పొడి బారుతుంది. కాబట్టి గోరు వెచ్చని నీళ్లే వాడాలి.
సువాసన వెదజల్లే పర్‌ఫ్యూమ్స్, బాడీ స్ర్పేలకు దూరంగా ఉండాలి.
అతి చల్లని నీటితో ముఖం కడగకూడదు.
చలి నుంచి ఉపశమనం పొందటం కోసం ఎండలో కూర్చోకూడదు.
గదిలో హీటర్లు వాడాలి.
అలాగే తేమను సమంగా ఉంచటం కోసం హ్యుమిడిఫయర్లు వాడొచ్చు.
పాదాల పగుళ్లు రాకుండా ఉండాలంటే రాత్రివేళ సాక్సులు వేసుకోవాలి.
స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

చలికాలం సన్‌స్ర్కీన్ వాడాల్సిందే!
సన్‌స్ర్కీన్ వేసవికే పరిమితం అనుకుంటారు. కానీ చలి కాలం ఎండ తక్కువగా ఉన్నట్టు అనిపించినా సూర్యరశ్మిలో తేడా ఉండదు. కాబట్టి చర్మం నల్లబడకుండా రక్షణ కల్పించాలంటే చలి కాలం కూడా తప్పనిసరిగా సన్ స్ర్కీన్ వాడాల్సిందే! బయటికెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నా ముందుగా మాయిశ్చరైజర్, తర్వాత సన్‌స్ర్కీన్ అప్లై చేయాలి.
చలిని తట్టుకోవటం కోసం ఎండలో కూర్చుంటాం. మరిగే మరిగే నీళ్లతో స్నానం చేస్తాం! చిటపటమంటూ దురద పెడుతుంటే గోళ్లకు పని చెబుతాం. కానీ ఇవన్నీ చేయకూడని పనులు! తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ఈ పనుల వల్ల చర్మ సమస్యలు మరింత పెరుగుతాయి.
- డాక్టర్ కవిత, డెర్మటాలజిస్ట్,
నియోడెర్మ్ స్కిన్ క్లినిక్, హైదరాబాద్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565