ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మకుమార్ కుంచె నుంచి జాలువారిన ఎన్నో అద్భుత కళాఖండాలను ‘రాజారవి వర్మ హెరిటేజ్ ఫౌండేషన్’ తొలిసారి గూగుల్‌లో ఉంచింది. ఫౌండేషన్ సీఈవో గీతాంజలి మైనీ బెంగళూరులో శనివారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. రామాయణంలోని పాత్రలు, హిందూ దేవుళ్ల చిత్రాలు గూగుల్‌లో అందుబాటులో ఉంచామన్నారు
కేరళలోని ట్రావెంకూర్ సంస్థాన యువరాణి, రాజారవివర్మ కుమార్ వంశానికి చెందిన రుక్మిణీబాయ్ చొరవతో ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రముఖ చిత్రకారుడు జయవర్మ కూడా ఈ ప్రాజెక్టుకు తోడ్పాటు అందించారన్నారు. బెంగళూరులోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో నెలరోజుల పాటు రవి వర్మ కళాఖండాల ప్రదర్శన నిర్వహించగా అనూహ్య స్పందన లభించిందని, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు గూగుల్‌లో ఆ అద్భుత కళాఖండాలను కళాభిమానులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. గూగుల్ ఆర్ట్స్ కల్చర్‌ను సందర్శిస్తే వీటిని తిలకించవచ్చన్నారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565