MohanPublications Print Books Online store clik Here Devullu.com

J


MohanPublictions BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


‘‘జ్ఞా’’

న్యూఢిల్లీ: భారతీయ భాషలోని ఒక్క అక్షరం కారణంగా అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్ తలపట్టుకుంటున్నదంటే నమ్మగలరా...! అందునా ఓ తెలుగు అక్షరంలో దాగిఉన్న బగ్.. ప్రపంచంలోని యాపిల్ ఐఫోన్లను నిలువునా క్రాష్ చేస్తోందంటే ఆశ్చర్యంగా లేదు...? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ! కారణమేంటంటే... ‘‘జ్ఞా’’ అనే ఒక్క అక్షరం ఐమెసేజ్‌ యాప్‌ సహా పలు మెసేజింగ్ యాప్‌లను ఉన్నపళాన చతికిలపడేట్టు చేస్తోంది. కనీసం టెక్స్ట్ ఫీల్డ్‌లో ఇన్‌సెర్ట్ చేసినా ఇక ఆ పోన్లు మొండికేస్తున్నాయి. ఐఫోన్లే కాదు... మ్యాక్ ఓఎస్, టీవీఓఎస్ 11, వాచ్ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఈ అక్షరం కారణంగా క్రాష్ అవుతున్నాయి. మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు కూడా ఈ బగ్ ధాటికి బాధితులుగా మారాయి. అయితే టెలీగ్రామ్, స్కైప్ వంటి యాప్‌లు దీని బారిన పడకపోవడం విశేషం. ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించామనీ... దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు కృషి చేస్తున్నామని యాపిల్ కంపెనీ వెల్లడించింది.

యాపిల్‌ఫోన్ పాత వెర్షన్ల జోలికి వెళ్లని ఈ బగ్... ఐఓఎస్ 11.2.5పై పనిచేసే ఫోన్లనే క్రాష్ చేస్తోంది. ఐమెసేజ్ యాప్‌తో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, జీమెయిల్, ట్విటర్‌లను కూడా ప్రభావితం చేస్తోంది. ఒక్కసారి ఈ బగ్ బారిన పడ్డారంటే ఇక మళ్లీ మళ్లీ రీస్టార్ట్ చేసినా సదరు యాప్‌లు పనిచేయడం లేదని చెబుతున్నారు. ప్రత్యేకించి ఐఫోన్‌లో ఏదైనా నోటిఫికేషన్ ద్వారా ‘‘జ్ఞా’’ అనే అక్షరం వచ్చిందంటే.. అది ఐఫోన్ స్ప్రింగ్ బోర్డు మొత్తాన్ని (హోం పేజిని మేనేజ్ చేసే సాఫ్ట్‌వేర్) స్తంభింపచేస్తోంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే వినియోగదారులు రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అది బూట్‌లూప్‌కి (పునరుద్ధరించకుండా బ్లాక్ చేయడం) కారణమై మళ్లీ డివైజ్‌లు తిరిగి ఆన్ అయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీని ద్వారా హ్యాకర్లు సొమ్ములు డిమాండ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ‘మొబైల్ వరల్డ్’ అనే ఓ వెబ్‌సైట్ వాళ్లు ఈ బగ్‌ను తొలుత గుర్తించారు. కాగా 2015 మరాఠీ, అరబిక్, చైనా భాషల్లోని అక్షరాలు, సంకేతాలు ఇదే మాదిరిగా ఐఫోన్ మెసేజ్ యాప్‌‌ను క్రాష్ చేశాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list