MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాటమరాయుడే కదిరి నరసింహుడు_Kadirinarasimhudu



కాటమరాయుడే కదిరి నరసింహుడు Kadirinarasimhudu KadiriGod KadiriLakshmiNarasimhaswamy Lord Narasimha BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Makarandam Eenadu EenaduMakaranadam


కాటమరాయుడే కదిరి నరసింహుడు
దక్షిణ భారతదేశంలోని నవ నారసింహ ఆలయాల్లో అనంతపురం జిల్లాలోని శ్రీఖాద్రీ క్షేత్రం ఒకటి. నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాదుడు వెలసిన క్షేత్రమిదే! పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు కదిరి నృసింహుడు.. కంబమున వెడల్ఠె అని కీర్తించింది ఈయననే. ఒకప్పుడు ఈ ఆలయం మైసూర్‌ సంస్థానంలో అంతర్భాగంగా ఉండటంతో కదిరి కాటమరాయుడిని తెలుగువారితో పాటు కన్నడిగులూ ఇలవేల్పుగా భావిస్తారు. ఈ నెల 25 నుంచి కదిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా కాటమరాయుడి కథ మనమూ తెలుసుకుందాం!

కదిరి అసలు పేరు ఖాద్రి. ఖా అంటే విష్ణుపాదం. అద్రి అంటే పర్వతం. విష్ణుమూర్తి పాదం మోపిన ప్రాంతంగా ఖాద్రీ వాడుకలోకి వచ్చింది. కాలగమనంలో ఆ పేరే కదిరిగా రూపాంతరం చెందింది. కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పెద్ద పర్వతం ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన నృసింహుడు ఆగ్రహం చల్లారక భీకర అరుపులతో ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. స్వామిని శాంతపరచడానికి దేవతలు, మహర్షులు, ప్రహ్లాదుడు అందరూ ఈ కొండపైకి వచ్చి అనేక స్తోత్రాలతో స్తుతించారట. అందుకే ఈ కొండకు స్తోత్రాద్రి అన్న పేరు వచ్చింది. కాటమ అంటే అడవి. రాయుడు అధిపతి. అడవికి అధిపతి సింహం. కాబట్టి కాటమరాయుడే కదిరి నృసింహుడిగా పూజలందుకుంటున్నాడు. అప్పట్లో నరసింహ స్వామివారిని స్త్రోత్రాద్రి ప్రాంతంలో నివసించే చెంచులు పాడుకున్న భక్తితత్వమే జానపదగేయంగా వాడులోకి వచ్చింది.

కుంకుమ.. మల్లెలు.. దవనం

కదిరి క్షేత్రంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి కుంకుమకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుంది. సంప్రదాయ బద్ధంగా పసుపుతో చేసిన కుంకుమ సుగంధాలు వెదజల్లుతుంటుంది. ఒకప్పుడు వందల కుటుంబాలు కుంకుమ తయారీపై ఆధారపడేవి. కదిరిలో మరో ఆకర్షణ మల్లెలు. స్వామివారికి మల్లెలను విశేషంగా అలంకరిస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు మల్లెలు కొనకుండా తిరుగు ప్రయాణం అవ్వరు. సువాసనలు వెదజల్లే దవనాన్ని కదిరి ప్రాంతంలో అధికంగా సాగు చేస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో దవనం రైతుల చేతికొస్తుంది. మల్లెల పరిమళాలకు దవనం తోడవ్వడంతో నారసింహుని కల్యాణం సుగంధ భరితంగా సాగిపోతుంది.

స్వామి వారి స్వేద బిందువులు

శ్రీఖాద్రీలక్ష్మీనరసింహుని జన్మనక్షత్రం స్వాతీ నక్షత్రం. జన్మనక్షత్రం రోజున మూలవర్లకు ్బమూలవిరాట్టుక్శు నిజరూప విగ్రహానికి అభిషేకాలు నిర్వహిస్తారు.అభిషేక అనంతరం స్వామివారిని శేషవస్త్రంతో తుడిచినప్పుడు స్వేదబిందువులు వస్తుంటాయి. ఎన్నిసార్లు తుడిచినా ఆగకుండా వస్తుండటం విశేషం. స్వామివారి విగ్రహం నుంచి కారిన స్వేదబిందువులను తీర్థంగా భక్తులు స్వీకరించి అనుగ్రహప్రాప్తిగా భావిస్తారు.

చెట్టు కింద పుట్టలో..
ఖాద్రీ క్షేత్రంలో మొదట పశ్చిమ చాళుక్యులు 9851076 మధ్య దుర్గాదేవి ఆలయాన్ని అద్భుత శిల్పసంపదతో నిర్మించారు. 12741275 మధ్య కాలంలో విజయనగర రాజు వీరబుక్కరాయలు కదిరి ప్రాంతాన్ని సందర్శించారు. తన పరివారంతో రాత్రి ఇక్కడే బస చేశారు. రాజుకు కలలో నారసింహుడు కనిపించి ఖదిరి ్బచండ్శ్ర వృక్షంలో ఉన్నానని చెప్పాడట. స్వామి ఆదేశానుసారం ఖదిర వృక్షం కింద పుట్టలో నుంచి స్వామివారి సాలగ్రామాలు దొరికాయట. దుర్గాదేవి ఆలయానికి దక్షిణ భాగంలో నారసింహ ఆలయాన్ని నిర్మించి సాలగ్రామాలను ప్రతిష్ఠించారు. ప్రహ్లాదుడి విగ్రహం కొలువుదీర్చారు. 1356లో కొక్కంటి పాలెగాళ్లు పశ్చిమ గోపురాన్ని, 1457లో స్వామి భక్తురాలైన సాసవల చిన్నమ్మ దక్షిణ గోపురాన్ని, 1509లో శ్రీకృష్ణ దేవరాయలు ఉత్తర రాజగోపురాన్ని, తూర్పు సింహద్వారాన్ని 152942మధ్య కాలంలో అచ్యుతరాయలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.


-వునికిలి హరగోపాలరాజు, ఈనాడు, అనంతపురం
     

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list