MohanPublications Print Books Price List clik Here MohanBookList

సత్యంశివంసుందరం_SatyamSivamSundaram


సత్యంశివంసుందరం SatyamSivamSundaram LordSiva LordShiva Sivarathri Sivaratri MahaSivarathri MahaSivaratri BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu Makarandam EenaduMakarandam

సత్యంశివంసుందరం SatyamSivamSundaram LordSiva LordShiva Sivarathri Sivaratri MahaSivarathri MahaSivaratri BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu Makarandam EenaduMakarandam

సత్యం శివం సుందరం‘ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌’ అని ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది.
అంటే సమస్తంలోనూ కొలువై ఉన్న పరబ్రహ్మ స్వరూపమే ఆ పరమేశ్వరుడు.
శివుడంటే ఎక్కడో కైలాసంలో కూర్చుని ఉండేవాడు మాత్రమే కాదు...
మనిషి నిద్ర లేచింది మొదలు...
నిద్ర పోయే దాకా ప్రతిదీ ఈశ్వర సంబంధమే...
శివం అంటే శుభం, చైతన్యం అని కూడా అర్థాలున్నాయి.
సాధకుడికి నిత్య సుఖాన్ని, ఆనందాన్ని, అద్భుతమైన శక్తినిచ్చేవాడు శివుడని పురాణాలు చెబుతున్నాయి.
పరమేశ్వరుడు శుభకరుడు...
సుందరుడు... సత్య స్వరూపుడు...
ఆయన కథలు, లీలలు అమృత గుళికలే.మచ్చుకు కొన్ని...

పరమేశ్వరుడు... విశ్వరూపం
శ్రీకృష్ణుడు విశ్వరూపం ధరించి కర్తవ్య బోధ చేసిన వైనం మనకు మహాభారతంలో ఉంది. శివుడు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించాడా?... అవునని చెబుతోంది శివ పురాణం.ఉమా సంహిత మొదటి అధ్యాయం. శ్రీ కృష్ణుడు సంతానం కోసం ఈశ్వరుడిని ప్రార్థించేందుకు కైలాసానికి బయలుదేరాడు.  
అక్కడ కృష్ణుడికి పరమ శివ భక్తుడైన ఉపమన్యు మహర్షి కనిపించాడు. మాటల మధ్యలో ఆ మహర్షి తాను దర్శించిన శివుడి దివ్య రూపాన్ని గురించి ఇలా వివరించాడు... ఆ స్వామి నిత్యానంద స్వరూపుడు. ఎప్పటికీ నాశనం లేనివాడు. ఆయన ఒక అంశలో జగద్రూపంతో ఉంటాడు. అంటే జగత్తంతా ఆయన స్వరూపమే. ఆయనకు మరో రూపం కూడా ఉంది. పెద్ద కోరలు, మంటలను మింగే నోళ్లతో ఉంటాడు. రెండు వేల సూర్యుల కిరణాల కాంతితో ప్రకాశిస్తుంటాడు. ఆయన చేతుల్లో శ్రేష్ఠమైన అస్త్రాలన్నీ ఉంటాయి. అనేక నేత్రాలు, అసంఖ్యాక పాదాలు ఆయనకుంటాయి. అలా ఉండే ఆయన ఎడమ పక్కన హంసలను పూన్చిన దివ్యవిమానాన్ని ఎక్కి బ్రహ్మ, ఆ పక్కనే గరుడ వాహనాన్ని ఎక్కి నారాయణుడు ఉంటారు. ఇంకా పార్వతి, ప్రమధగణాలు ఆయనతో పాటే ఉంటాయి. కల్పాంతంలో జగత్తునంతటినీ ఉపసంహరించేది శివుడికి సంబంధించిన ఈ విరాడ్రూపమేనని ఉపమన్యు కృష్ణుడికి తెలిపాడు.

కృష్ణయ్య కోసం గోపికగా...
విష్ణువు మోహినీ అవతారం ధరించి దేవతలకు అమృతాన్ని పంచిన కథ మనకందరికీ తెలుసు. శివుడు స్త్రీ వేషం ధరించి కృష్ణుడి కోసం తపించిన వైనాన్ని  
బృందావనంలో మనం చూడొచ్చు. పూతన తదితర రాక్షసులు రకరకాల వేషాలతో కృష్ణుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో శివుడు బృందావనానికి వెళ్లారు. ఆయనను గోపాలకులు హెచ్చరించి వెనక్కి పంపారు. తాను సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అని చెప్పినా వారు పట్టించుకోలేదు. అప్పుడు శివుడు గోపికగా మారి బృందావనంలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు అది చూసి ‘స్వామీ! ఏమిటీ వేషం’ అని అడిగాడు. అప్పుడు ‘కృష్ణా! నీ లీలలు చూడడానికి ఈ వేషం తప్పలేదు’ అని శివుడు అన్నాడట. శ్రీకృష్ణుడు స్వయంగా బృందావనంలో ఓ శివాలయం కట్టించాడట. సాయంత్రమైతే గోపికగా మారతాననీ, అందుకు అనుమతిస్తేనే తాను ఇక్కడ ఉంటానని షరతు పెట్టి ఆలయంలో కొలువుదీరాడని చెబుతారు. నేటికీ బృందావనంలోని గోపీశ్వరాలయంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత భక్తులకు ప్రవేశం నిషిద్ధం. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పరిమళ ద్రవ్యాలు పూసుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.

అంబరంలో సాంబయ్య జాడ!
ఉత్తరాయణంలో తొలిగా వచ్చే గొప్ప పర్వదినం మహాశివరాత్రి. ఉత్తరాయణంతో దేవతలకు పగలు మొదలవుతుంది. రోజులో దేవతలు పాల్గొనే తొలి అర్చన శివరాత్రి. మొదటగా ఆరాధించేది పరమేశ్వరుడినే అన్నమాట. శివరాత్రి ఆధ్యాత్మిక పరిమళాల్నే కాదు.. వైజ్ఞానిక సుగంధాలనూ వెదజల్లుతుంది. ఈ పర్వదినాన ఉత్తర ధ్రువం నుంచి ఖగోళ అద్భుతాలను స్పష్టంగా చూడవచ్చు. సహజంగా ప్రతి నెలలో కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా చేసుకుంటాం. ఖగోళ దర్శనానికి ఇంతకు మించిన మంచి రోజు లేదంటారు. చంద్రుని వెలుగులో కనిపించని నక్షత్రాలు.. అమావాస్య ముందురోజైన చతుర్దశి నాడు స్పష్టంగా గోచరిస్తాయి. పైగా.. మహాశివరాత్రి రోజు ఆకాశాన్ని పరీక్షగా చూస్తే.. నక్షత్రాలన్నీ జ్యోతిర్లింగాకృతిలో దర్శనమిస్తాయి. ఉత్తర ధ్రువం నుంచి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సృష్టంతా అండాకృతిలో ఉందని పెద్దల మాట. లింగ స్వరూపం కూడా అదే ఆకృతి. శివుడికి స్థాణువు అన్న పేరు కూడా ఉంది. స్థాణువు అంటే కదల్లేనిది అని అర్థం. కదలడానికి వీలులేనంతగా అంతటా నిండి ఉన్న శివత్వమే స్థాణువు. అది సృష్టంతా నిండి ఉంది. ఖగోళమంతా పరివ్యాప్తమై ఉంది.

అఘోర ఎవరు?
సాధారణంగా అఘోర రూపం భయానకమైందని భావిస్తారు. కానీ, వాస్తవం దీనికి పూర్తిగా భిన్నం. శివుడు నిశ్చల శాంతి రూపుడని చెప్పడానికి ఆయన అఘోర రూపం ఓ ఉదాహరణ. అఘోరుడిగా శివుడు శివం అనే కల్పంలో అవతరించాడు. కల్పం ఆరంభంలో బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చేయాలో గుర్తు రాలేదు. అప్పుడు తనకు జ్ఞానం కావాలని తపస్సు చేసినప్పుడు శివుడు ఈ అవతారాన్ని ధరించి జ్ఞానబోధ చేశాడని చెబుతారు. అప్పుడాయన నల్లటి ఛాయలో ఉన్నాడు. ధరించిన వస్త్రాలు, యజ్ఞోపవీతం, కిరీటం కూడా నల్లటివే. శరీరానికి దివ్యసుగంధాది ద్రవ్యాలను అద్దుకుని ప్రశాంతవదనంతో ఆయన అవతరించాడు.

ఆనందానికి అసలు రూపం
ఏది సత్యమో... ఏది నిత్యమో... అదే నిజమైన ఆనందం. నిజమైన సుఖం. ఈ స్థితినే గీతలో శ్రీకృష్ణుడు దుఃఖసుఖాత్యయం అని నిర్వచిస్తాడు. అంటే దుఃఖానికి, సుఖానికి అతీతమైన స్థితి అని అర్థం. ఇంద్రియాల వల్ల వచ్చే హాయి కలిగినట్టే కలిగి అలాగే పోతుంది. అది ఎంత కలిగిందో అంతా ఉండదు. సున్నా అవుతుంది. చివరకు దుఃఖంగా మారిపోవచ్చు కూడా.. ఒక రేఖకు ఒక చివర సుఖమైతే మరో చివర దుఃఖం ఉంటుంది.రెండింటి మధ్య బిందువు దగ్గర అది సుఖ, దుఃఖాలను దాటిన స్థితి అవుతుంది. ఇక్కడ ఏ అలజడీ ఉండదు. ఇదే నిజమైన ఆనందం... దీన్నే శివం అని పిలుస్తారు. అందుకే స్వచ్ఛమైన ఆనందానికి ఒక రూపం ఊహిస్తే అదే శివ స్వరూపం. సుఖదుఃఖాల మధ్య బిందువుకు ఎలా చేరుకోవాలి? అనే ప్రశ్నకూ శివ స్వరూపమే సమాధానం చెబుతుంది. శివుడు యోగ ముద్రలో కూర్చోవడమే కాదు. ఆయన మెడ చుట్టూ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరకుండా, బెదరకుండా, కదలకుండా యోగ ముద్రలో కూర్చోవడమే ఆనందానికి¨ మార్గమని శివుడు తన రూపంతో మనకు ఉపదేశిస్తున్నాడు. చుట్టూ ఎన్ని కష్టాల పాములు చుట్టుకున్నా క్షోభ పడకుండా, భయపడకుండా ఉండడమే ఆనందమంటే..

 
సుదర్శన చక్రం శివుడి చేతిలోనూ...
విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం. మరి శివుడు కూడా సుదర్శన చక్రాన్ని ధరించాడా? అవునంటుంది శివ పురాణం. పరమేశ్వరుడి అవతారాల్లో ఒకటైన వామదేవ మూర్తిది విష్ణు స్వరూపం. ఆయన చేతిలో శంకు, చక్రాలు కూడా ఉంటాయి. శివకేశవ ఏకత్వాన్ని రూఢి చేస్తూ ‘శివాయ విష్ణు రూపాయ... శివ రూపాయ విష్ణవే’ అనే మంత్రభాగం ఉండనే ఉంది. ఇది కాకుండా ఉపమన్యు మహర్షి శివుడు తనకు దర్శనమిచ్చిన అవతారంలో చేతిలో సుదర్శన చక్రం ఉందని చెబుతారు. ఇంకా రుద్రుడి చేతిలో ఓ మహత్తరమైన ఆయుధం ఉంటుంది. అదే త్రిశూలం. దానిని విజయం అని పిలుస్తారు. త్రిశూలాన్ని ధరించినందునే శివుడిని శూలి అని అంటారు. భూమిని బద్దలుకొట్టి, సముద్రాలను ఎండగట్టి, నక్షత్ర సమూహాలను కూల్చేసే శక్తి ఈ ఆయుధానికి ఉంటుందని చెబుతారు. ఈ శూలం మూడు కొనలు కనుబొమల్లా, నిలువెత్తున ఉండి భయంకరంగా కనిపిస్తుంది. అలాగే శివుడి చేతిలో గండ్రగొడ్డలి ఒకటి ఉంటుంది. వీటితో పాటు సుదర్శన చక్రం, వజ్రాయుధం, అమ్ములపొదిలో పినాకం అనే ధనుస్సు, కత్తి, పాశం, అంకుశం కూడా ఉంటాయి.అభిషేక ఫలితం

పంచామృతాలు - ఆరోగ్యం
నెయ్యి - మోక్ష సిద్ధి
పాలు - దీర్ఘాయుష్షు
పెరుగు - ఆరోగ్యం, సంతానవృద్ధి
పద్మాలు, మారేడు దళాలు - సంపద
గంధం - లక్ష్మీప్రదం
భస్మం - అపమృత్యు దోషం నుంచి విముక్తి

- యల్లాప్రగడ మల్లికార్జునరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం