ఇది యాప్ లవ్
ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు వెతుక్కుంటున్నారా? మనసులో మాటను చెప్పడానికి తటపటాయిసున్నారా? అయితే ఈ యాప్స్‌తో ట్రై చేయండి. కొత్తగా ప్రేమను వ్యక్తం చేస్తున్న వారికి ఇవి లవ్ సక్సెస్‌కు దారి చూపిస్తాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి ఈ వాలెంటైన్స్ డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా మధురానుభూతిని అందించేలా చేస్తాయి.
కొంచెం కొత్తగా...
‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’, ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’, ‘నువ్వంటే ప్రాణం’.. ఇలాంటి రొటీన్ డైలాగులతో ప్రియుడి/ప్రేయసి మనసు ఏం దోచుకుంటారు. స్మార్ట్‌ఫోన్‌లో ‘వాలెంటైన్స్ డే స్పెషల్’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని కొత్తగా ట్రై చేయండి. ఇందులో మీ ప్రియుడి/ప్రేయసి హృదయానికి హత్తుకునే సందేశాలు, హృదయాన్ని కరిగించే మాటలు బోలెడు ఉన్నాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి మాటల కోసం వెతుక్కోవ్వాల్సిన అవసరం ఉండదు. రొమాంటిక్ సందేశాలు, ప్రేమ పద్యాలు....ఇలా మీకు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు.
పూలతో గెలుచుకోవాలంటే..!
ప్రియురాలి మనసు గెలుచుకోవాలంటే పూలకు మించి మరో మంచి మార్గం లేదు. ప్రేమికుల రోజున ఏ ప్రేమ జంటను చూసినా ఎరుపు రంగు పూలే కనిపిస్తాయి. మరి మీ ప్రియురాలికి ఇష్టమైన పూలను వ్యక్తిగతంగా కలిసి ఇస్తే ఫరవాలేదు. లేదంటే ‘1-800- ఫ్లవర్స్’ యాప్‌ను ఎంచుకోండి. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలలో ఈ యాప్ సేవలందిస్తోంది. రకరకాల పూలు, మీ బడ్జెట్‌లో మీ ప్రియురాలు మెచ్చే పూలు ఇందులో ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసిందే తడవుగా ఆ పూలు మీ ప్రియురాలికి చేరిపోతాయి. మీరు ఏ సమయంలో తనకు పూలు అందాలో చెబితే ఠంచనుగా అదే సమయంలో పూలు ఆమెకు అందుతాయి.
ప్రేమసందేశాల కోసం ప్రత్యేకం
ప్రేమికులు ఊసులు మరొకరు వినడం ఎందుకు? మరొకరు చదవడం ఎందుకు? ప్రేమికుల మధ్య ఎన్నో రహస్య సంభాషణలుంటాయి. మరి అవన్ని మూడో కంటికి చేరకూడదంటే ‘బిట్వీన్’ యాప్‌ని ఎంచుకోవాల్సిందే. సంభాషణలే కాదు మీరు పంపుకునే ఫొటోలకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. ప్రేమ సందేశాలు పంపుకోవడానికి ఇది బెస్ట్ యాప్.
ఉత్తరాలతో సర్‌ప్రైజ్ చేస్తారా!
ఫేస్‌బుక్‌లో లేక వాట్సప్‌లో మెసేజ్‌లు పంపుకోవడం అందరూ చేసేదే. మీరు కాస్త ప్రత్యేకం అనిపించుకోవాలంటే సోషల్ మీడియాలోనే లవ్ లెటర్‌ను పంపి మీ స్వీట్‌హార్ట్ మనసు గెలుచుకోండి. ఇందుకోసం టామ్స్ లవ్ లెటర్ యాప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ సహాయంతో మీకు నచ్చిన విధంగా పోస్ట్‌కార్డులను తయారుచేసుకుని పంపుకోవచ్చు. మీ లవ్‌స్టోరీకి అదనపు మసాలా జోడించుకోవచ్చు.
రొమాంటిక్ డిన్నర్ కోసం..
క్యాండిల్స్ వెలుగుల్లో, తనకిష్టమైన పూల పరిమళాల చెంతన డిన్నర్ చేస్తూ ‘ఐ లవ్ యు’ అని చెబితే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. మరి అలాంటి డైనింగ్ కావాలంటే ‘ఓపెన్ టేబుల్’ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్రేమికుల రోజున మంచి రెస్టారెంట్‌లో టేబుల్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఎమోజీలతో చెబుతారా!
పది వాక్యాల భావాన్ని ఒక్క ఎమోజీతో ప్రకటించవచ్చు. ప్రేమికుల రోజున సందేశాలే కాకుండా ఎమోజీలతో మీ ప్రేమను వ్యక్తపరిస్తే కొత్తగా ఉంటుంది. ఇందుకోసం వాలెంటైన్ లవ్ ఎమోజీ యాప్ ఉంటే చాలు. మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఎమోజీలు బాగా పనికొస్తాయి. ఫీలింగ్స్‌ను ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్న వారు ఎమోజీలను ఎంచుకుంటే మీ ఫీలింగ్ వారికి నేరుగా చేరిపోతుంది.
ప్రేమను రొమాంటిక్‌గా...
మీ ప్రేమను కాస్త రొమాంటిక్ వేలో వ్యక్తపరచాలా! అయితే మీ ప్రేమకు అందమైన ఫొటోలను జోడించండి. ఇందుకోసం ‘టచ్ మి లవ్ యు’ యాప్‌ని ఎంచుకోండి. ఈ యాప్‌లో రొమాంటిక్ వాల్‌పేపర్స్, గ్రీటింగ్ కార్డులు, లవ్ సింబల్స్, కలర్‌ఫుల్ క్యాలెండర్లు, ప్రేమ గడియారాలు... ఇలా బోలెడు లవ్‌థీమ్స్ ఉన్నాయి. వీటితో మీ ప్రేమ మరింత రొమాంటిక్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బహుమతులతో చెబుతారా!
ప్రేమ ఓ అద్భుతం. దాన్ని వ్యక్తపరచడానికి మాటలు చాలవు. అలాంటప్పుడు మంచి బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఎలాంటి బహుమతి ఇవ్వాలి అంటే దానికీ ఓ యాప్ ఉంది. ‘గిఫ్ట్‌గ్రామ్’ను ఎంచుకోవడం ద్వారా రకరకాల గిఫ్ట్ ఐడియాలు తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565