MohanPublications Print Books Online store clik Here Devullu.com

యాదగిరి బ్రహ్మోత్సవాలు_YadadriBrahmotsavam


యాదగిరి బ్రహ్మోత్సవాలు YadadriBrahmotsavam YadagiriBrahmotsavam YadagiriKalyanam Yadagirigutta YadagiriTelengana LordNarasimha Narasimhaswamy BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu



యాదగిరి బ్రహ్మోత్సవాలు 
 
అణువణువునా భగవంతుడు ఉన్నాడనే భక్తుడి మాటను నిలిపేందుకు స్తంభంలో ఉద్భవించిన అవతారమూర్తి నరసింహస్వామి. ప్రహ్లాదుడి పిలుపుతో ప్రకటితమైన ఉగ్రనారసింహుడు తెలుగు రాష్ట్రాల్లో కొండల్లో.. కోనల్లో.. ఎన్నో చోట్ల వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అలాంటి దివ్య క్షేత్రాల్లో ప్రముఖమైనది తెలంగాణలోని యాదాద్రి. ఈ క్షేత్ర మహిమను భృగు మహర్షి సహసాలనీక చక్రవర్తికి తెలిపినట్టు స్కాందపురాణ వచనం.
 
యాదగిరి బ్రహ్మోత్సవాలు YadadriBrahmotsavam YadagiriBrahmotsavam YadagiriKalyanam Yadagirigutta YadagiriTelengana LordNarasimha Narasimhaswamy BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu

రుష్యశృంగ మహర్షి పుత్రడు యాదర్షి. బాల్యం నుంచి అతడు నిరంతరం హరినామ స్మరణ చేసేవాడు. యాదర్షి తపస్సుకు మెచ్చిన స్వామి నారసింహుడిగా జ్వాలాకారుడిగా, భయంకర ధ్వనులతో దర్శనమిచ్చాడట. యాదర్షి కోరిక మేరకు ఆతడు తపస్సు చేసిన ప్రదేశంలో అర్చామూర్తిగా వెలిశాడని స్థలపురాణం. యాదర్షి తపస్సు చేసిన ప్రదేశమే ఇప్పటి యాదాద్రి. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి. ఆ స్వామి ఆజ్ఞ మేరకే యాదర్షి ఇక్కడ తపస్సు చేశాడని కథనం. నరసింహుడి ఆలయ సమీపంలోనే ప్రసన్నాంజనేయ స్వామి దర్శనమిస్తాడు.
ఇక్క విష్ణుభగవానుడు జ్వాలా నరిసింహ, ఉగ్ర నరసింహ, యోగ నరసింహ, లక్ష్మీ నరసింహ, గండభేరుండ నరసింహ ఇలా పంచ నారసింహుడిగా ఏక శిలపై అవతరించినట్టు స్థలపురాణం చెబుతోంది. కృతయుగం నాటి నుంచే ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడని విశ్వసిస్తారు. క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు మునులు, యోగులు, సాధకులు, సిద్ధులు మాత్రమే స్వామిని దర్శించుకునేవారట. అందుకే స్వామికి సాధక తారకుడనే పేరు వచ్చింది. 12వ శతాబ్దిలో పశ్చిమ చాళుక్యులలో ప్రసిద్ధుడైన త్రిభువనమల్లుడు తన రాజ్యవిస్తరణలో భాగంగా భువనగిరిలో కోటను నిర్మించుకొని స్వామిని సేవించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు ఈ క్షేత్రమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది. క్రూరమృగాలు ఉండేవి. అప్పుడు కూడా భక్తులు గుంపులు గుంపులుగా కలిసి వచ్చేవారు. భజనలు చేస్తూ, నారసింహుడి నామం స్మరిస్తూ.. కొండపైకి చేరి ఉత్సవాలు చేసేవారు. సుమారు 150 సంవత్సరాల కిందట కొండపైకి కాలిబాట ఏర్పడింది. మూలవిరాట్టు వద్దకు వెళ్లి అభిషేకాలు చేసేవారు.

యాదగిరి బ్రహ్మోత్సవాలు YadadriBrahmotsavam YadagiriBrahmotsavam YadagiriKalyanam Yadagirigutta YadagiriTelengana LordNarasimha Narasimhaswamy BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu

తరలి వచ్చిన శివుడు..

జ్వాలానరసింహుడి క్షేత్ర మహిమ తెలుసుకున్న పరమేశ్వరుడు యాదిగిరి శిఖరాగ్రంలో స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మకం. వైష్ణవ క్షేత్రంలో శివాలయం నిర్మించి పూజించడం.. శివకేశవుల అభేదత్వానికి ప్రతీకగా కనిపిస్తుంది.
 
యాదగిరి బ్రహ్మోత్సవాలు YadadriBrahmotsavam YadagiriBrahmotsavam YadagiriKalyanam Yadagirigutta YadagiriTelengana LordNarasimha Narasimhaswamy BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu

ఈ క్షేత్రంలో మొదట్లో మూడురోజులు ఉత్సవాలు చేసేవారు. తర్వాతి కాలంలో ఐదు రోజులు చేశారు. కాలక్రమంలో నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగడం మొదలైంది. ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. అందులో భాగంగా 23న ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. 24న తిరుకల్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగుతుంది. 25న దివ్య విమాన రథోత్సవం. 26న రథోత్సవం, 27న శతఘటాభిషేకం జరుగుతాయి. అదే రోజు పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం అద్భుతంగా సాగుతుంది. శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అవుతాయి.


యాదగిరిగుట్ట- నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.

క్షేత్ర మహిమ/ స్థల పురాణం: శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ రుషి చేసిన మహాతపస్సు ఫలితమే.. ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలసిందన్నది ఐతిహ్యం. సింహం ఆకారంలో ఉన్న గుహలో యాద మహర్షి చేసే తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచాడట! ఆ మేరకు ఇక్కడ ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడిగా నిత్యపూజలు అందుకొంటున్నాడు. గ్రహ పీడితులు, మానసిక రోగులు ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించే ఆంజనేయస్వామికి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకుంటే ఆయా బాధల నుంచి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.



త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని స్థలపురాణం. జ్వాలా నరసింహుడు, యోగా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శమిచ్చిన స్వామి.. లోకకల్యాణార్థం మీరు ఈ రూపాల్లో.. ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆ మహర్షి కోరికపై ఇక్కడే ఉండిపోయారట!

దర్శనవేళలు

* ఉదయం 4 గంటలకు ఆలయం తెరుస్తారు.

* ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ. 100, రూ. 150 టికెట్లపై ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది.

* ఒక ప్రత్యేక దర్శనం టికెట్‌పై ఒకరినే అనుమతిస్తారు. క్యూలైన్‌లోనే ఈ ప్రత్యేక టికెట్లను విక్రయిస్తారు.

* మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు విరామం

* ప్రత్యేక పూజలకు సంబంధించి అభిషేకం టికెట్‌ రూ. 500, అర్చన రూ. 216, సువర్ణ పుష్పార్చన రూ. 516

* త్వరలో ఆన్‌లైన్‌లో పూజ టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

పరిసరాలు.. ఉపాలయాల విశేషాలు: యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కొండపైనే శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని మాత సమేత రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం.. ఈ రెండు ఆలయాల్లోనూ నిత్యపూజలు కొనసాగుతుండటం విశేషం!

ప్రధాన పూజల వివరాలివి.. ఆలయంలో నిత్యం అభిషేకం, అర్చన, కల్యాణోత్సవం, అలంకారోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు కొనసాగుతాయి.

ఆర్జిత సేవల వివరాలు

* ఆలయంలో నిత్యం జరిగే శ్రీ లక్ష్మీ నరసింహుల నిత్య కల్యాణం టికెట్టు ధర రూ. 1,250

* శుక్రవారం అమ్మవారి ఉత్సవ సేవ టికెట్టు ధర రూ. 750

* ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజ, టికెట్‌ధర రూ. 216

* ప్రతి ఏకాదశి రోజున లక్ష తులసి పుష్పార్చన, టికెట్‌ ధర రూ.5,116

* స్వాతి నక్షత్రం రోజున శతఘటాభిషేకం, టికెట్‌ ధర రూ. 750

* కొండపైనే ఉన్న శివాలయంలో లక్షబిల్వార్చన టికెట్టు ధర. రూ. 250.

* శనివారం నవగ్రహ పూజలు, సోమవారం రుద్రాభిషేకం, కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవానికి రూ. 250

*నవగ్రహ పూజకు రూ. 116, రుద్రాభిషేకం కోసం రూ. 116 టికెట్లను ఖరీదు చేయాలి.

వసతి సౌకర్యాలు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కొండపై వసతిగదులు, కాటేజీలు ఉన్నాయి. రుసుము రూ. 200 నుంచి రూ. 2,500 వరకు ఉంటుంది. దేవస్థానం కాటేజీలు విచారణ కోసం ఫోన్‌: 08685- 236623, 236645 నంబర్లలో సంప్రదించవచ్చు.

యాదగిరిగుట్టలోని ప్రైవేటు లాడ్జిల సమాచారం

వెంకటేశ్వర లాడ్జి ఫోన్‌: 81252 69331

వెంకటాద్రి లాడ్జి ఫోన్‌: 08685- 236455

భూలక్ష్మి లాడ్జి ఫోన్‌: 08685-236999

శివలాడ్జి ఫోన్‌: 92900 63755

మహేశ్వరీ లాడ్జి ఫోన్‌: 92900 63755

భవ్య ఫంక్షన్‌ హాలు లాడ్జి ఫోన్‌: 92472 87901

రవాణా సౌకర్యం: హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు నల్గొండ నుంచి.. హైదరాబాద్‌- ఎంజీబీఎస్‌ నుంచి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. జేబీఎస్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు చొప్పున టీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సుల సౌకర్యమూ ఉంది. దగ్గరలోని విమానాశ్రయం.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయమే!


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list