MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇలా చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ప్రెస్ వేగంతో పనిచేస్తుంది_SmartPhone


ఇలా చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ప్రెస్ వేగంతో పనిచేస్తుంది SmartPhone Smartphone SpeedInSmartPhone HighSpeedFromSmartPhone PhoneBecomeSlow BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu




ఇలా చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ప్రెస్ వేగంతో పనిచేస్తుంది!

లిమిటెడ్‌ స్టోరేజ్‌ స్పేస్‌తో లభ్యమయ్యే ఫోన్‌లలో మైక్రో ఎస్డీ కార్డుస్లాట్‌ ఉండదు. దీంతో స్టోరేజ్‌ స్పేస్‌ను విస్తరించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ క్రమంలో స్టోరేజ్‌ స్పేస్‌ నిండిపోయిన ప్రతిసారీ ఫోన్‌లో పనికిరాని డేటాను డిలీట్‌ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకోసం స్పేస్‌ క్లియర్‌ చేయడం ఎలానో తెలుసుకుందాం.

ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను గూగుల్‌ డ్రైవ్‌, మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌ వంటి క్లౌడ్‌ సర్వీసులలోకి మూవ్‌ చేయడం ద్వారా స్టోరేజీ స్పేస్‌ ఆదా అవుతుంది.
అన్ని పాత మెసేజ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేయడంతో స్పేస్‌ క్లియర్‌ అవుతుంది.
ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజీలోని డేటాను మైక్రో ఎస్టీ కార్డు స్లాట్‌లోకి మూవ్‌ చేయడంతో స్టోరేజీ స్పేస్‌ ఆదా చేసుకోవచ్చు.
ఫోన్‌లో నిరుపయోగంగా వున్న ఫొటోలు, వీడియోలను డిలీట్‌ చేయడంతో పాటు హైడెఫినిషన్‌ ఫొటోలకు బదులు నార్మల్‌ ఫొటోలను చిత్రీకరించడంతో స్టోరేజ్‌ స్పేస్‌ ఆదా అవుతుంది. ఫోన్‌ బ్రౌజర్‌ హిస్టరీని క్లియర్‌ చేయడం వంటివి చేయాలి.
ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు ఫోన్‌లోని అధిక స్పేస్‌ను ఆక్రమిస్తాయి. అందువల్ల వాటికి వేరొక చోటకు బ్యాకప్‌ చేసుకుని డిలీట్‌ చేయాలి.
నిరుపయోగంగా మారిన యాప్స్‌తో పాటు ఆఫ్‌లైన్‌ డేటాను క్లియర్‌ చేయడం ద్వారా స్పేస్‌ పెంచుకోవచ్చును.
పాటలను ఫోన్‌లో స్టోర్‌ చేసుకుని వినే బదులు మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసుల ద్వారా వినడంతో స్టోరేజ్‌ స్పేస్‌ చాలావరకు ఆదా అవుతుంది.
డేటా కేబుల్‌ సహాయంతో ఫోన్‌లోని డేటాను కంప్యూటర్‌ హార్డ్‌డి్‌స్కలోకి మూవ్‌ చేయడం ద్వారా స్టోరేజ్‌ స్పేస్‌ ఆదా అవుతుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list