MohanPublications Print Books Online store clik Here Devullu.com

MahaNati Movie Review సావిత్రి...చెదరని జ్ఞాపకం! మహానటి సినిమా రివ్యూ మహానటి రివ్యూ MahaNatiMovieReview #MahaNati_Review ప్రేక్షకుల గుండెల్లో ధ్రువతార.. #మహానటి సావిత్రి #సావిత్రి... Mahanati Telugu Movie Review | Keerthy Suresh Mahanati Movie


MahaNati Movie Review   సావిత్రి...చెదరని జ్ఞాపకం!  Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI

 MahaNati Movie Review 

చిత్రం: మహానటి
నటీనటులు: కీర్తిసురేష్‌.. దుల్కర్‌ సల్మాన్‌.. సమంత.. విజయ్‌ దేవరకొండ.. రాజేంద్రప్రసాద్‌.. తనికెళ్ల భరణి.. భానుప్రియ.. మాళవికా నాయర్‌.. కాజల్‌ అగర్వాల్‌.. షాలిని పాండే.. తులసి.. దివ్యవాణి తదితరులు
అతిథి పాత్రలు: మోహన్‌బాబు.. నాగచైతన్య.. నాని.. ప్రకాష్‌రాజ్‌.. బ్రహ్మానందం.. నరేష్‌.. క్రిష్‌.. శ్రీనివాస్‌ అవసరాలు.. సందీప్‌ పవంగా.. తరుణ్‌ భాస్కర్‌ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: డానీ శాంచెజ్‌ లోపెజ్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి
స్క్రీన్‌ప్లే: సిద్ధార్థ్‌ శివస్వామి
నిర్మాత: స్వప్నాదత్‌.. ప్రియాంక దత్‌
దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
బ్యానర్‌: వైజయంతీ మూవీస్‌, స్వప్న మూవీస్‌
విడుదల తేదీ: 09-05-2018
మీరెలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అని ఏ కథానాయికనైనా, ప్రశ్నిస్తే.. ‘గ్లామర్‌ రోల్స్‌తో పాటు, సావిత్రిలా నటనకు ప్రాధాన్యం ఉన్న ఒక్క పాత్రనైనా నా కెరీర్‌లో చేయాలనుకుంటున్నా’. దాదాపు అందరు కథానాయికలూ చెప్పే సమాధానం ఇదే. తరాలు మారినా చెరిగిపోని, మాసిపోని, మెరుపుపోని నటనా చాతుర్యం ఆమెది. కళ్లతోనే హావభావాలు పలికించగలిగిన అతి కొద్దిమంది నటీమణుల్లో సావిత్రిది అగ్రస్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలితరం కథానాయికల తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన ధ్రువతార సావిత్రి. ఆమె కన్నా ముందు చిత్ర పరిశ్రమలో చాలా మంది కథానాయికలు ఉన్నారు.. ఆ తర్వాత చాలా మంది వచ్చారు.. కానీ, సావిత్రి మాత్రమే ‘మహానటి’ అయ్యారు. అంతటి గొప్ప నటీమణి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. నటీనటుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచార చిత్రాల వరకూ ప్రతిదీ విభిన్నంగా తీర్చిదిద్దారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? సావిత్రిగా టైటిల్‌ రోల్‌ పోషించిన కీర్తిసురేష్‌ ఏ మేరకు ఆకట్టుకుంది? అతిరథ మహారథులు పోషించిన అతిథి పాత్రలు ఎలా ఉన్నాయి?

కథేంటంటే: బెంగళూరులోని చాళుక్య హోటల్‌లో తీవ్ర అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోయిన సావిత్రి (కీర్తి సురేష్‌)ను ఆస్పత్రిలో చేరుస్తారు. ఆవిడ సాధారణ మహిళ అనుకొని అందరు పేషెంట్లలాగే చూస్తారు. అయితే, ఆమె ‘మహానటి’ సావిత్రి అని తర్వాత తెలుస్తుంది. అభిమానులు ఆస్పత్రికి పోటెత్తుతారు. అప్పటి నుంచి ఏడాది పాటు ఆమె కోమాలోనే ఉండిపోతుంది. ఆ సమయంలోనే ప్రజావాణి పత్రికలో విలేకరిగా చేరుతుంది వాణి(సమంత). ఆమెకు సావిత్రి కథ రాసే బాధ్యతను అప్పగిస్తారు. ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌ ఆంటోనీ(విజయ్‌ దేవరకొండ)తో కలిసి ఆమె పరిశోధన మొదలు పెడుతుంది. కోమాలోకి వెళ్లడానికి ముందు సావిత్రి ఏం చేసింది? బెంగళూరులో శంకరయ్యను కలవడానికి వచ్చిన సావిత్రికి ఏం జరిగింది? అసలు శంకరయ్య ఎవరు? తదితర విషయాలను వాణి ఎలా వెలుగులోకి తీసుకొచ్చిందనేది ‘మహానటి’ చిత్రం.
ఎలా ఉందంటే: తరతరాలుగా గుర్తుండిపోయే నటి సావిత్రి. ఆమె జీవితాన్ని పలు రచనలు రకరకాల కోణాల్లో ఇప్పటికే ఆవిష్కరించాయి. అయితే నవ తరానికి కూడా సావిత్రి జీవితం గురించి తెలిసేలా, తెలిసిన వాళ్లు కూడా మరొకసారి ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకునేలా అందంగా తెరకెక్కించిన చిత్రమే మహానటి. జీవిత కథల్ని తెరకెక్కించాలంటే తగిన పరిశోధన అవసరం. వాస్తవికత ఉట్టిపడుతూనే ఆయా కథల్లో తగిన డ్రామా పండాలి. ఆ నేపథ్యం కూడా తెరపై పక్కాగా కనిపించాలి. ఆ విషయంలో దర్శకుడు. నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. సావిత్రి వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె నట జీవితం లోతుల్లోకి తొంగిచూసి కథను రాసుకున్నాడు దర్శకుడు. ఒక కంట్లో నుంచే కన్నీళ్లు రావాలని, అది కూడా రెండు చుక్కల కన్నీరే కార్చాలని దర్శకుడు కేవీ రెడ్డి చెప్పడం సావిత్రి గ్లిజరిన్‌ వాడకుండా రెండంటే రెండు చుక్కలే కన్నీళ్లు కార్చడం లాంటి సన్నివేశంతో మొదలు పెడితే దాదాపుగా ఆద్యంతం సినిమా ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. దశాబ్దాల నట ప్రయాణం.. 300 సినిమాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణం సావిత్రిది. ఆ జీవితం మొత్తాన్ని తెరపై చూపించాలంటే సాహసంతో కూడుకున్న పనే. కానీ, దర్శకుడు సావిత్రి బాల్యం మొదలుకొని, ఏ దశను వదిలి పెట్టకుండా జీవితం మొత్తాన్ని తెరపై చూపించాడు.

తొలి సగభాగంలో బాల్యంతో పాటు, నాటకజీవితం, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు, నటిగా ఎదిగే క్రమం, ప్రేమ, పెళ్లి వరకూ చూపించారు. చాలా సన్నివేశాలు సరదాగా మరికొన్ని సన్నివేశాలు హృద్యంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తను అనుకొన్నది సాధించేవరకూ వదలిపెట్టని సావిత్రి నైజాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో జెమినీ గణేశన్‌తో కలిసి జీవితాన్ని మొదలు పెట్టడం, పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా ఓ వెలుగు వెలగడం ఆ తర్వాత వైవాహిక జీవితంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు తదితర విషయాలను చూపించారు. వీటన్నింటి మధ్యలోనే ఆమె నటనా వైభవాన్ని ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’, ‘మూగ మనసులు’ తదితర చిత్రాల్లోని ఘట్టాలతో చూపించిన విధానం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విజయ్‌ ఆంటోనీ, వాణి పాత్రల్లో సావిత్రి పాత్రను ముందుకు నడిపించిన విధానం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. పతాక సన్నివేశాల్లో సమంత నటన, ఆమె మాటలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. మొత్తంగా సావిత్రి జీవితానికి గొప్ప నివాళిలా నిలిచే చిత్రమిది.
ఎవరెలా చేశారంటే: సావిత్రిగా కీర్తి సురేష్‌ నటించారు అనడం కంటే జీవించారు చెప్పాలి. లుక్‌ పరంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ షేడ్స్‌తో కూడిన సన్నివేశాల్లో అచ్చం సావిత్రిలానే కనిపించారు. సావిత్రి నటనను అనుకరించిన విధానం, ఆమె హావభావాలను పక్కాగా ఒంట బట్టించుకొని నటించిన వైనం చిత్రానికి ప్రాణం పోసింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ చాలా బాగా నటించారు. ‘కాదల్‌ మన్నన్‌’గా గుర్తింపు పొందిన జెమినీ శైలిలోనే దుల్కర్‌ హావభావాలను ప్రదర్శించాడు. ఆ పాత్ర కొన్ని చోట్ల వ్యతిరేక ఛాయలతో సాగుతున్నట్లు అనిపిస్తుంది. సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్రప్రసాద్‌ అభినయం ఆకట్టుకుంటుంది. పాత్రికేయురాలు వాణిగా సమంత, ఆమెకు సాయం చేస్తూనే ఆమెను ప్రేమించే ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌ ఆంటోనీగా విజయ్‌ దేవరకొండ ప్రశంసలు పొందే స్థాయిలో నటించారు. ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనైనా, ఆయన పాత్ర ప్రేక్షకులపై చక్కని ప్రభావం చూపిస్తుంది. ఏయన్నార్‌గా నాగచైతన్య తళుక్కున మెరుస్తారు. ఎన్టీఆర్‌ పాత్ర కూడా ఓ సన్నివేశంలో అలా కనిపిస్తుందంతే. సావిత్రి జీవితాన్ని ప్రభావితం చేసిన నిన్నటితరం సినీ ప్రముఖుల పాత్రలన్నీ తెరపై చూపించిన విధానం బాగుంది.

సాంకేతికంగా..: సాంకేతికంగా ఈ సినిమాకు నూటికి నూరు మార్కులు పడతాయి. తోట తరణి నేతృత్వంలో శివం రావు, అవినాష్‌లు ఆకాలం నాటి నేపథ్యాన్ని.. అందుకు సరిపోయే చక్కటి వాతావరణం సృష్టించారు. మిక్కీ జె.మేయర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా వెంటాడతాయి. ‘మూగ మనసులు’ ‘మహానటి’ పాటలు తెరపై చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. డానీ కెమెరా పనితనం సినిమాకు జీవం పోసింది. కొన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ సన్నివేశాలను చాలా బాగా తీర్చిదిద్దారు. ఆరోజులను గుర్తు చేసేలా రీల్‌ కెమెరాతో కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం సినిమాకు సహజత్వాన్ని తెచ్చి పెట్టింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కథను అల్లిన విధానం సన్నివేశాలను తెరపైకి తీసుకొచ్చిన విధానం ఆయన అభిరుచికి, ప్రతిభకు అద్దం పడతాయి. సాయిమాధవ్‌ బుర్రా మాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ‘ప్రతిభ ఇంటి పట్టునే ఉండిపోతే ప్రపంచానికి పుట్టగతులు ఉండవు’ వంటి సంభాషణలు సినిమాలో చాలానే వినిపిస్తాయి. నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంక దత్‌ కళకు, తపనకు, అభిరుచికి తార్కాణంగా నిలుస్తుంది ‘మహానటి’.
బలాలు
+ కథ, కథనం
+ కీర్తి, ఇతర నటీనటులు
+ సాంకేతిక బృందం పనితీరు



బలహీనతలు
- ద్వితీయార్ధంలో కొంచెం వేగం తగ్గడం
చివరిగా: ‘మహానటి’ సినిమా కాదు జీవితం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



సావిత్రి...చెదరని జ్ఞాపకం! 

MahaNati Movie Review   సావిత్రి...చెదరని జ్ఞాపకం!  Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



సావిత్రి...చెదరని జ్ఞాపకం!


సావిత్రి...
కళ్ళతోనే మాట్లాడే కళాకారిణి
ముఖంలోనే అన్ని భావాలూ పలికించే ‘మహానటి’
భాషలు ఎల్లలు దాటిన ‘నడిగయర్‌ తిలకం’! సూపర్‌ స్టార్‌!!
మూడున్నర దశాబ్దాల క్రితం మరణించినా...
మరపురాని అభినేత్రి... మరిచిపోలేని మంచి మనిషి...
మన తెలుగింటి ప్రియపుత్రి!


సావిత్రి...
చరిత్రలో చెరగని సంతకం! చెదరని జ్ఞాపకం!
కాదు... కాదు... ఎన్నెన్నో జ్ఞాపకాల తేనెతుట్టె!
మలుపులు... మెరుపులు... గెలుపులు... ఓటములు...
సరాగాలు... విరాగాలు.. విషాద ‘నిషా’దాలు...
వెరసి... ఆమె జీవితమే ఓ సినిమా!
ఆమె జీవితంలోని కొన్ని కోణాలను
తెలుగుతెర చూపెట్టే ప్రయత్నం చేస్తున్న వేళ...
ఆమెను సన్నిహితంగా చూసినవారు,
సహ ప్రయాణికుల మనసులోని మాటలు...
ఈ ఆదివారం ‘నవ్య’కు ప్రత్యేకం.
-డాక్టర్ రెంటాల జయదేవ

నాకు నీ అంత ధైర్యం లేదనేది... - ‘షావుకారు’ జానకి


‘‘సావిత్రి అనగానే నాకు ఎన్నో గుర్తొస్తాయి. సావిత్రి, నేను ‘బ్రదర్‌’ అని ఆత్మీయంగా పిలుచుకొనే ఆమె భర్త జెమినీ గణేశన్‌ నాకు సన్నిహితంగా తెలుసు. నేను సినిమా రంగంలోకి వచ్చింది 1949లో! ‘షావుకారు’ సినిమాతో పరిచయమయ్యా. సావిత్రి నాకు
జూనియర్‌. సావిత్రిని మొదటిసారి, యాదృచ్ఛికంగా మేకప్‌ లేకుండా చూశా.

మిస్సయిన తొలి పరిచయం!

అదెలాగంటే... నేను జెమినీ వారి ‘ముగ్గురు కొడుకులు’ తెలుగు వెర్షన్‌లో అవకాశం కోసం వెళ్ళా. అప్పుడు జెమినీ స్టూడియోలో గణేశన్‌ క్యాస్టింగ్‌ మేనేజర్‌. అతనే నా ఫోటోలు, వివరాలు తీసుకొని, ఫలానా ‘షావుకారు’లో చేసిన నటి. మంచి కుటుంబం నుంచి వచ్చింది. ప్రతిభావంతురాలు అంటూ నిర్మాత ఎస్‌.ఎస్‌. వాసన్‌ గారికి రికమెండ్‌ చేశాడు. ఆ సినిమాలో నాకు అవకాశం వచ్చేలా చేశాడు. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. ఉండడానికి ఇంటి కోసం వెతుక్కుంటున్నా. ఆ టైమ్‌లో ‘బ్రదర్‌’ జెమినీ నన్ను మద్రాసులో థౌజండ్‌ లైట్స్‌ ఏరియాలో షాఫీ మహమ్మద్‌ రోడ్‌లో ఓ పోర్షన్‌ ఖాళీగా ఉన్నట్లు తెలిసిందని తీసుకువెళ్ళాడు. మేడ మీద పోర్షన్‌లో ఓ అమ్మాయి నైట్‌ గౌను వేసుకొని కనపడింది. ఆ అమ్మాయి కొత్తగా సినిమాల్లోకి
వచ్చిందనీ, పేరు సావిత్రి అనీ, పై పోర్షన్‌లో ఉంటోందనీ, కింద పోర్షన్‌ ఖాళీ కాబట్టి, మీరు ఉండవచ్చనీ చెప్పారు. అయితే, ఇద్దరు ఆర్టిస్టులు ఒకే ఇంట్లో ఉండడం సరికాదంటూ, నేను వద్దనేశా. కొంతకాలానికి ‘సంసారం’లో హీరో అక్కినేని కారు నెట్టే అమ్మాయిల గుంపులో ఒకమ్మాయిగా చిన్న బిట్‌ రోల్‌లో సావిత్రి వెండితెరకు పరిచయమైంది. కొద్దికాలంలోనే మేమిద్దరం కలసి ఓ సినిమాలో చేశాం. జగ్గయ్య గారు, నేను, సావిత్రి చేసిన ఆ సినిమా ‘ఆదర్శం’. సావిత్రితో మాట్లాడింది మొదటిసారిగా అప్పుడే. అద్దె ఇంటి దగ్గర మిస్సయిన సావిత్రితో పరిచయం ఆ రోజు అలా జరిగింది.

పార్వతి పాత్ర నాకు మిస్‌! సావిత్రికి ప్లస్‌!
మొదట చిన్న వేషాల్లో కనిపించినా, ‘దేవదాసు’తో సావిత్రి బాగా పాపులరైంది. నిజానికి ‘దేవదాసు’లో సావిత్రి కన్నా ముందు నన్ను పార్వతి పాత్రకు బుక్‌ చేశారు. నాకు దుస్తులు కుట్టించి, మేకప్‌ స్టిల్స్‌ తీశారు. అలాగే, ‘ఓ దేవదా...’పాటకు నాతో రిహార్సల్‌ కూడా చేయించారు. కానీ, రేపు పొద్దున్న షూటింగ్‌ అనగా, ఇవాళ కారణం చెప్పకుండానే టెర్మినేటెడ్‌ అన్నారు. చంద్రముఖి పాత్రకు అనుకున్న సావిత్రికి పార్వతి పాత్ర ఇచ్చారు. ఫైనాన్షియర్ల నుంచి వచ్చిన నిర్బంధం వల్ల అది జరిగినట్లు తరువాత తెలిసింది. అయితే, ఆ రోజుల్లో నటీనటుల మధ్య ఈర్ష్యాద్వేషాలు ఉండేవి కావు. అందుకే, సావిత్రి, నేను దగ్గరయ్యాం. ‘కన్యాశుల్కం’, ‘మంచి మనసులు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’... ఇలా ఎన్నో మంచి సినిమాల్లో కలసి నటించాం. సావిత్రి చాలా ఫోటోజెనిక్‌. ప్రతిభావంతురాలు కూడా! అందుకే, ఆ తరంలో తోటి నటీనటులందరం ఆమె నటనను ఆరాధించేవాళ్ళం. జెమినీ నన్ను ఎప్పుడూ ‘జానీ’ అని పిలిచేవాడు. జెమినీని నేనెప్పుడూ ‘బ్రదర్‌’ అనే పిలిచేదాన్ని. మొదటి నుంచి ఉన్న పరిచయం వల్ల సరదాగానే మాట్లాడేవాడు. దాంతో, ఒక సందర్భంలో సావిత్రి, నన్ను అపార్థం కూడా చేసుకుంది. అయితే, జెమినీని నా సొంత సోదరుడి కన్నా ఎక్కువగా అనుకొంటాననే విషయం ఆమెకు వివరంగా చెప్పా. దాంతో, సావిత్రి అర్థం చేసుకొని, మన్నించమంది. నిజం చెప్పాలంటే, ఒక దశలో సావిత్రి వల్ల తమిళంలో జెమినీకి బాగా మార్కెట్‌ వచ్చింది. వాళ్ళిద్దరూ జంటగా పలు సినిమాలు వచ్చాయి. డబ్బు విషయంలో జెమినీ తెలివైనవాడు, జాగ్రత్తపరుడు. డబ్బు, ఆరోగ్యం, అందం లాంటి విషయాల్లో సావిత్రికి మొదటి నుంచీ జాగ్రత్త లేదు. తిండి మీద నియంత్రణ లేదు. మందు అలవాటు మరీ దెబ్బతీసింది.

నగలన్నీ సొంత డిజైన్లే!
హబీబుల్లా రోడ్డులో సావిత్రి ఇల్లు. ఆ పక్కనే గిరి రోడ్డులో మా ఇల్లు. సావిత్రి చాలా ఆర్టిస్టిక్‌ మనిషి. చాలా సరదాలుండేవి. బ్రహ్మాండంగా కారు నడిపేది. సావిత్రికి బట్టల కన్నా నగల మీద చాలా ఇంట్రెస్ట్‌. బ్రదర్‌ జెమినీ తంజావూరు నుంచో, కుంభకోణం నుంచో రంగస్వామి అయ్యంగార్‌ అనే ఆయనను ప్రత్యేకంగా రప్పించారు. ఆయన మా ఇళ్ళలో కూర్చొని, ప్రత్యేకంగా నగలు చేసేవారు. నగల డిజైనింగ్‌ అంటే సావిత్రికి భలే ఇష్టం. దగ్గరుండి డిజైన్లు చెప్పేది. మేమిద్దరం ఒకే ఇంట్లో కూర్చొని, సొంత డిజైన్లు ఇచ్చి, మిగిలినవాళ్ళ కన్నా పూర్తిగా భిన్నంగా ఉండేలా నగలు చేయించుకొనేవాళ్ళం. అందుకే, మా ఇద్దరి ఉంగరాలు, గాజులు, నెక్లె్‌సలు... మాత్రం ఒకేలా ఉండేవి. సావిత్రి గనక జ్యువెలరీ డిజైనర్‌గా ఉండి ఉంటే, ఇండియాలో టాప్‌ డిజైనర్‌ అయ్యుండేది. సినిమా షూటింగ్‌లకు కూడా మేము చాలాసార్లు వడ్డాణాలు, వగైరా సొంత నగలే పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. షూటింగ్‌లో నగలు పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.


మోసపోయింది!

సావిత్రికి జాగ్రత్త తక్కువ. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నమ్మినవాళ్ళే ఆమె డబ్బు, నగలు మోసం చేసిన సందర్భాలు ఎక్కువ. సావిత్రి ఇంట్లో పనిచేసేవాడు ఒకసారి కర్చీ్‌ఫలో సావిత్రి గాజులు తీసుకొని వచ్చి టి.నగర్‌ ఉస్మాన్‌ రోడ్డులోని టి.బి. జ్యూవెలర్స్‌కు వచ్చి అమ్మబోయాడు. సరిగ్గా అదే సమయానికి నేను పెళ్ళికని ఏవో వెండి సామాన్లు కొనడానికి అక్కడికి వెళ్ళా. అమ్ముతున్న ఆ గాజులు అచ్చం నా గాజుల లానే ఉండడం చూసి, ఆరా తీస్తే దొంగతనం బయటపడింది. ఆ షాపు ఓనరుకు చెప్పి, సావిత్రికి ఆ నగలు వెనక్కి ఇప్పించా. ఎవరూ చూడకుండా ఇలా ఎన్ని నగలు పోయాయో ఎవరికి తెలుసు!
సావిత్రి నాతో అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పుకొనేది. జెమినీ బయటెక్కడో తాగి, అల్లరి పాలవుతుంటే, దగ్గరుండి చూసుకోవడానికి ఆయన కోసమే తాను మందు అలవాటు చేసుకున్నానని చెప్పింది. అయితే, జీవితంలోని బాధలు మరచిపోవడానికి ఆమె ఆ అలవాటును ఆసరాగా చేసుకోవడంతో, చివరకది వ్యసనంగా మారింది. ఆమె జీవితాన్నే నాశనం చేసింది. ముందు నుంచి బయట తిరుగుళ్ళు అలవాటున్న జెమినీని తెలిసి తెలిసి కట్టుకున్నాక, అతని ప్రవర్తన మారుతుందని ఆశపడడం తప్పు. సావిత్రి ఆ తప్పే చేసింది. ‘అతని కోసం నీ జీవితం, నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోకు.
జీవితంలో అందరం తప్పులు చేస్తాం. నేనూ చేశాను. కానీ, ఆ తప్పుల నుంచి బయటపడేలా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య కుదరనప్పుడు మానసికంగా డిటాచ్‌ అవ్వాలి’ ...ఇలా సావిత్రితో చెబుతుండేదాన్ని. అందుకే, చాలా సందర్భాల్లో ‘జానకీ! నీకున్న ధైర్యం నాకు లేదు’ అని బాధపడేది.

ఆఖరి మాటలు...
కోమాలోకి వెళ్ళడానికి ముందు సావిత్రి ఆఖరుగా షూటింగ్‌లో పాల్గొన్నది కన్నడ సినిమా ‘ఆరద గాయ’ (తీరని గాయం)లో. ఆ సినిమా షూటింగ్‌ మైసూరు ప్రీమియర్‌ స్టూడియో్‌సలో జరిగింది. ఆ రోజున మధ్యాహ్నం తీరిక చేసుకొని, స్పాట్‌లోనే వంట చేసుకుంటున్నా. బ్రేక్‌ టైమ్‌లో సావిత్రి నా దగ్గరకు వచ్చి కూర్చొని, నడిగర సంగంలో మనోహర్‌ వాళ్ళతో అర్జెంట్‌ పని మీద మద్రాసు వెళుతున్నా అని చెప్పింది. ఆకలేస్తోంది అంది. అప్పటికి నేను అన్నం, మైసూరు రసం వండడం అయ్యాయి. పెరుగు ఉంది. తినమని అప్పటికప్పుడు స్టీలు ప్లేటులో పెడితే, ఆవురావురుమంటూ కొద్దిగా తిన్నది. అప్పుడే పర్సులో నుంచి చిన్న టర్కీ టవల్‌ లాంటి దానిలో చుట్టిన ప్యాకెట్‌ విప్పింది. అందులో ఉన్నవి చూపిస్తూ, ‘నా నగల్లో ఈ కొద్దిగానే మిగిలాయి’ అంటూ బాధపడింది. సావిత్రితో ఆఖరుసారి మాట్లాడింది అప్పుడే. అలా మద్రాసు వెళ్ళిన సావిత్రి, మళ్ళీ షూటింగుకు రాకుండానే, బెంగళూరులో కోమాలోకి వెళ్ళిపోయింది. అలా కోమాలోనే ఏడాదికి పైగా ఉంటూ, కన్నుమూసింది.

పెద్దగా చదువు లేని పిల్ల కష్టపడి పైకి వచ్చి, చిత్రసీమలో ఇంత స్థాయికి ఎదిగిందంటే మామూలు విషయం కాదు. పెద్దగా చదువుకోకపోయినా, పోషించే పాత్రలను ఆమె స్టడీ చేసే తీరు, తద్వారా వాటికి ప్రాణం పోసే పద్ధతి అద్భుతం. ఇన్నీ ఉన్న మంచి అమ్మాయి తన గురించి కానీ, చివరకు తన బిడ్డల గురించి కానీ, లక్షలాది అభిమానుల గురించి కానీ ఆలోచించకుండా, జీవితంలో బ్యాలెన్స్‌ను కోల్పోవడమే పెద్ద
దురదృష్టం. అందుకే, సావిత్రి చనిపోయినప్పుడు ఎవరో అడిగితే చెప్పా... ‘ఒక అందమైన బొమ్మ గీసింది తనే! తరువాత భరించరాని వేదనతో ఆ చిత్రాన్ని కాళ్ళతో తొక్కి, నాశనం చేసుకున్నదీ తనే!!’ ఏమైనా, ఇప్పటికీ సావిత్రి మరపురాని మనిషి. మరణం లేని నటి.’’

అప్పటికే పెళ్ళయి, పిల్లలుండి, నటి పుష్పవల్లితో అనుబంధం కొనసాగిస్తున్నాడని తెలిసీ బ్రదర్‌ జెమినీని సావిత్రి
ప్రేమించడం, పెళ్ళాడడం... అదంతా వేరే కథ. వాళ్ళిద్దరూ కలసి నటించిన తొలి చిత్రం ‘మనంపోల మాంగల్యం’. గమ్మత్తేమిటంటే, ఆ సినిమాలో ఆ పాత్ర అసలు నేను చేయాల్సింది! నిర్మాతలు నా దగ్గరకు వచ్చారు. డేట్లు ఎడ్జస్ట్‌ కాక, ఆ ఛాన్స్‌ వదిలేశా. అలా ఆ పాత్ర సావిత్రి చేసింది. ఆ సినిమా టైమ్‌లోనే జెమినీ, తాను పెళ్ళి చేసుకున్నట్లు తరువాత నాలుగేళ్ళకు ప్రపంచానికి బయటపెట్టింది.



నన్ను పెళ్ళికూతుర్ని చేసింది! - జమున 

‘‘సావిత్రిది చాలా స్నేహ స్వభావం. పరిచయమైనవారినీ, సాయం చేసినవారినీ అస్సలు మర్చిపోదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నా సినీ జీవితం తొలి రోజుల్లో జరిగింది. సినిమాల్లోకి రాక ముందు నుంచి సావిత్రి, నేను ఒకరికొకరం తెలుసు. అప్పట్లో సావిత్రి విజయవాడలోని తమ సంగీత నాట్య మండలి బృందంతో కలసి ఊరూరూ తిరుగుతూ, ప్రదర్శనలిచ్చేది. శ్రీరామనవమి ఉత్సవాలకు మా ఊళ్ళో (తెనాలి దగ్గర దుగ్గిరాల) రథశాల దగ్గర బల్లలు వేసి, రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇప్పించేవారు. ఒకసారి ఉత్సవాలకు సావిత్రి వాళ్ళ బృందం మా ఊరు వచ్చింది. చిన్నప్పటి నుంచి పాటలు, నాటకాలు, నాట్యాల ప్రదర్శనలంటే పిచ్చి కాబట్టి, వాళ్ళను చూడడానికి నేనూ వెళ్ళా. ఆ బృందమంతా మా ఊళ్ళో స్కూలులో దిగారు. సావిత్రిని తొలిసారిగా ఆ బృందంలో చూశా. సావిత్రి కన్నా నేను కొద్దిగా (8 నెలలు) చిన్న. అందరం బాల్యం నుంచి కౌమారంలోకి వస్తున్న రోజులవి. సావిత్రి, తనతో పాటు ఆమె బృందంలో వచ్చిన స్నేహితురాళ్ళు మద్దాలి సుశీల, తదితరులు స్నానాలు చేయాలంటే, మా ఇంటికి తీసుకువెళ్ళా. ఆ రోజుల్లోనే మా ఇంట్లో ప్రత్యేకంగా బాత్రూమ్‌ వసతి ఉండేది. అందరూ స్నానాలు చేసి తయారయ్యాక, భోజనం పెట్టి తీసుకొచ్చా. సావిత్రి వాళ్ళు డ్యాన్స్‌ ఆడుతుంటే, వాళ్ళ వెనకాలే తిరిగా. అది మా మొదటి పరిచయం.


ఫోటో చూసి గుర్తుపట్టింది!

కట్‌ చేస్తే... 1952. అప్పటికి సావిత్రి సినీరంగానికి వచ్చేసింది. ‘దేవదాసు’ విడుదలై, పేరొచ్చింది. నేను అప్పుడే సినిమాల్లోకి వచ్చా. గరికపాటి రాజారావు గారి దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ చేస్తున్నా. ఇంతలో నూతన నటి జమున... అంటూ నా ఫోటో ఒకటి ఏదో పత్రికలో ముఖచిత్రంగా పడింది. అది చూసి, సావిత్రి తన దగ్గర ఉండే లింగం అనే కుర్రాణ్ణి, కారు ఇచ్చి మా ఇంటికి పంపింది. ‘‘చిన్నప్పుడు దుగ్గిరాలలో సావిత్రి గారు చూసిన జమున, మీరూ ఒకరేనా? కనుక్కొని ఇంటికి తీసుకురమ్మని అన్నారు’’ అంటూ అతను మాతో చెప్పాడు. అప్పుడు సావిత్రి థౌజండ్‌ లైట్స్‌లో మేడ మీద ఉండేది. నేను, మా నాన్న గారు కారు ఎక్కి, సావిత్రి ఇంటికి వెళ్ళగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకొంది. పాత సంగతులన్నీ గుర్తు చేసుకొంది. నటిగా పేరొచ్చిన తరువాత కూడా గతాన్ని మర్చిపోకుండా ఉండడం సావిత్రి ప్రత్యేకత.

తోడబుట్టని అక్కయ్య!
‘పుట్టిల్లు’తో మొదలుపెట్టి, తరువాత వరుసగా విజయవంతమైన సినిమాలు చేయడంతో నాకూ మంచి గుర్తింపు వచ్చింది. అందులోనూ ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’.. ఇలా వరుసగా చాలా సినిమాల్లో సావిత్రి, నేను అక్కాచెల్లెళ్ళుగా నటించాం. దాంతో, సావిత్రిని నేను ‘అక్కా’ అని పిలిచేదాన్ని. తనేమో నన్ను ‘చెల్లీ’ అనేది. ఆ ఆప్యాయత ఎంతగా కొనసాగిందంటే, నా పెళ్ళికని శుభలేఖ ఇస్తే, సావిత్రి రావడమే కాదు... నాకు జడవేసి, అలంకారం చేసి, నగలన్నీ తొడిగి, పెళ్ళికూతురిని చేసి, ఆశీర్వదించింది. తరువాత నా సీమంతానికి వచ్చింది. కొడుకు పుట్టి, ఉయ్యాలలో వేస్తే, ఆ ఫంక్షన్‌కీ హాజరైంది. అంత మంచి మనిషి.

కళ్ళతోనే అభినయం!
ఇక, సావిత్రి ఎంత గొప్ప నటి అంటే, కళ్ళతోనే అద్భుతంగా నటించేసేది. కావాలంటే, ‘మూగమనసులు’లో ఓ సీన్‌లో ‘ముద్దబంతిపూవులో..’ పాట పాడనా అని అడిగినప్పుడు, సావిత్రి తన తల ఊపకుండా, చేతులు కదపకుండా, కళ్ళతో ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి అంగీకారం తెలిపే సీన్‌ చూడండి. అదే సీన్‌ హిందీ రీమేక్‌ ‘మిలన్‌’లో నేను చేసినప్పుడు, సావిత్రి స్థానంలో నటించిన నూతన్‌ను చూడండి. తల ఊపుతూ పాడమంటుంది నూతన్‌. అదీ ఇతరులకూ, సావిత్రికీ తేడా! ‘మాయాబజార్‌’లో మాయా శశిరేఖగా ఆమె చేసిన అభినయం, హాస్యం కూడా పండించగలనని నిరూపించిన వైనం నాకు బాగా ఇష్టం. సావిత్రి దర్శకత్వంలో కూడా నేను నటించా. ఒక్క కెమేరామన్‌ మినహా మిగతా ప్రధాన అందరూ మహిళా టెక్నీషియన్లు కలసి పనిచేసిన ‘చిన్నారిపాపలు’ చిత్రానికి సావిత్రే దర్శకురాలు. అందులో జగ్గయ్య మొదటి భార్యగా నాది కోయపిల్ల వేషం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, సుందర్‌లాల్‌ నహతా దగ్గర అప్పోసొప్పో చేసి మరీ, సావిత్రి ఆ సినిమా పూర్తి చేసింది. చాలా డబ్బు పోగొట్టుకుంది. ఆ తరువాత ‘మూగమనసులు’ చిత్రాన్నితమిళంలో శివాజీ గణేశన్‌తో స్వీయదర్శకత్వంలో నిర్మించింది. తెలుగులో వేసిన గౌరి పాత్రనే మళ్ళీ వేయమని నన్ను అడిగింది. కానీ, అప్పటికి నేను మా అబ్బాయిని కడుపుతో ఉన్నా. అందుకని చేయలేకపోయా.

సెట్స్‌లో సరదాగా ఉండేది. అల్లరి చేస్తూ, జోకులు వేస్తూ ఉండేది. ఏయన్నార్‌, సావిత్రి క్లోజ్‌. ఏయన్నార్‌ని హీరో గారు, గురువు గారు అనీ, నన్ను చెల్లీ అనీ, గుమ్మడి గారిని అన్నయ్యా అనీ పిలిచేది. నాటకాల రోజుల నుంచి కలసి నటించిన జగ్గయ్య గారిని ‘బావా.. బావా’ అని పిలిచి, ఏడిపించేది. నేనంటే చాలా ముద్దు. ‘చిన్నారిపాపలు’ చేస్తున్నప్పుడు సీన్‌ బాగా చేస్తే, ఆప్యాయంగా ముద్దు పెట్టుకొనేది.

ఏడాది పాటు మాట్లాడుకోలేదు!
నేను సర్దుబాటు లేకుండా, ఎంత వివాదాస్పదంగానైనా మాట్లాడేస్తా కానీ, సావిత్రి మాత్రం స్వతహాగా వివాదాల జోలికి పోయేది కాదు. ఎవరి మనసూ బాధించేది కాదు. చక్కగా, హాయిగా, సరదాగా మాట్లాడేది. కానీ, విషయం ఏమిటో గుర్తు లేదు కానీ తనను నేను విమర్శించాననో, నన్ను తను విమర్శించిందనో చెప్పుడు మాటలు చెప్పి, మా ఇద్దరి మధ్య ఎవరో తగువు పెట్టారు. దాంతో, దాదాపు ఓ ఏడాది పాటు మేమిద్దరం మాట్లాడుకోలేదంటే నమ్మండి. కానీ
కొద్దిరోజులకు ఆ తగవు సమసిపోయి, ఇద్దరం కలిసిపోయాం. సావిత్రి తన వ్యక్తిగత జీవిత కష్టాలు కూడా నాతో చెప్పుకొనేది. ఆమె మానసిక వేదనలో మునిగిపోయి, మోతాదుకు మించి తాగుతున్నప్పుడు, నేను కుటుంబపరంగా సలహాలు ఇచ్చి, మంచి మాటలు చెప్పా. కానీ, చివరకు విధి చేతిలో ఆమె జీవితం విషాదాంతం అయిపోయింది.

ఫలించని అమెరికా ఆలోచన
1970ల తొలినాళ్ళకల్లా నేను హైదరాబాద్‌ వచ్చేశా. సావిత్రి కోమాలోకి వెళ్ళిపోయిన టైమ్‌లో నేను ఆంధ్రప్రదేశ్‌ సంగీత, నాటక అకాడెమీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నా.
ఆ సమయంలో ఒక కార్యక్రమం నిమిత్తం నేను, మంత్రి భాట్టం శ్రీరామ్మూర్తి గారు మద్రాసు వెళ్ళాం. అంత నిండైన భారీ మనిషి, మంచం మీద మూరెడు అయిపోవడం చూసి, ఎంత ఏడ్చానో! చెంపలు పట్టుకొని ఊపుతూ, ‘‘అక్కా! నీ చెల్లిని వచ్చా. చూడు’’ అంటూ బాధపడ్డా. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారికి భాట్టం గారితో ఫోన్‌ చేయించా. ఒకప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మద్రాసు వస్తే, సహాయనిధికి విరాళంగా ఆయన మెడలో గజమాలను పాతికవేలిచ్చి కొన్న సావిత్రికి ప్రభుత్వ పక్షాన ఏదైనా చేసి, అమెరికా తీసుకువెళ్ళాల్సిందిగా అడిగా. నా సొంత ఖర్చుతో ఆమె వెంట అమెరికా వెళ్ళి వస్తానన్నా. అంజయ్య గారు కూడా సరేనన్నారు. కానీ, సావిత్రిని ఆ స్థితిలో కదిలిస్తే ప్రాణాలు నిలవడం కష్టమని డాక్టర్లు చెప్పారు. దాంతో, అక్కయ్య సావిత్రి ఆరోగ్యం కోసం చేసిన మంచి ప్రయత్నం కుదరలేదు. ఏమైనా, మనందరం గర్వించదగ్గ మంచి నటీమణి,
అంతకన్నా మంచి మనిషి మా అక్కయ్య సావిత్రి.’’


అప్పట్లో సావిత్రి హబీబుల్లా రోడ్డులో ఉంటే, మేము ఆ వెనుకనే తిరుమలపిళ్ళై వీధిలో ఉండేవాళ్ళం. మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. పండుగలు, పబ్బాలకు కలుస్తుండేవాళ్ళం. సావిత్రికి దైవభక్తి చాలా ఎక్కువ. వాళ్ళది చాలా పెద్ద పూజ గది. మైసూరు నుంచి ప్రత్యేకంగా మనుషుల్ని రప్పించి, అందులో మొత్తం గంధపుచెక్కతో చాలా పెద్ద పూజా మండపం కట్టించింది.






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list