MohanPublications Print Books Online store clik Here Devullu.com

అనంత కాల ప్రవాహం_భారతీయ_కాల_ప్రమాణాలు_Infinite time stream Mohanpublications Granthanidhi Bhaktipustakalu



అనంత కాల ప్రవాహం భారతీయ_కాల_ప్రమాణాలు Infinite time stream time stream time limit indian astrologers aryabhatta indian time streams indian time setttings Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI

అనంత కాల ప్రవాహం - #భారతీయ_కాల_ప్రమాణాలు

ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించింది? ఈ అవనీ తలం ఎప్పుడు యేర్పడింది? ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? దీని ఆది ఎక్కడ? అంతం ఎప్పుడు? అది తెలుసుకోడం ఎలా?

ప్రపంచం ఎక్కడ మొదలైయ్యిందో, ఎంత కాలం గడచిందో, భవిషత్ కాలం ఎంత వుందో, అందులో ఈ పృధ్వ్వీ మండలానికి యెంత కాల పరిమితి వుందో, మానవులకు, చరా చర రాశులకు యెంత కాల మానం నిర్ణయమై ఉందో తెలుసుకోవడం ఎలా?

బ్రహ్మ, కేశవ, మాధవ, ఈశ్వర, సదాశివ #కాలాలు ఎంత?

అనంత కాల ప్రవాహం - #భారతీయ_కాల_ప్రమాణాలు

ఆది నుండి విజ్ఞానానికి నిలయం - భారతం. తర తరాలుగా వారసత్వ రూపేణ, పరంపరల ఫలస్వరూపంగానో సాంప్రదాయ బధ్ధంగానో, శృతి, లేదా విభిన్న గ్రంధాల ద్వారానో విజ్ఞాన సంపద భావి తరాలకు అందజేయబడుతున్నాయి. విద్యా శక్తి, మేధా శక్తి, ఇచ్చా, క్రియా శక్తులు కాలనుగుణంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ శక్తుల సమన్వయీకరణ, మానవాళికి ఉపయుక్త సాధనంగా మారి, జీవన గమనం సులభసాధ్యం చేస్తూ, జీవిత సాఫల్యానికి దోహదపడుతున్నాయి.

ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తువులు నిక్షిప్తమై ఉన్నాయి. భారత దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తున్న, అనేక జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన విశేషాల సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త, పరమార్ధాలను విశ్లేషించి తదనుగుణ విషయాలను సేకరించి, సమన్వయం చేసి ఈ #విజ్ఞాన_భారతీయం " శీర్షికలో ప్రస్తుతీకరిస్తున్నాం.

ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించింది? ఈ అవనీ తలం యెప్పుడు యేర్పడింది? ఈ అనంత కాల ప్రవాహాన్ని యెలా కొలిచేది? దీని ఆది యెక్కడ? అంతం యెప్పుడు? అది తెలుసుకోడం యెలా? మానవ మనుగడకు సంబంధించిన ఇలాటి ప్రాధమిక ప్రశ్నలను, అతి సంక్లిష్ట సమస్యను పరిష్కారం చేసిన భారతీయ విజ్ఞానవేత్తల మేదస్సు మహాద్భుతమైనది. సమస్యని పరిష్కరించడంతో పాటు అది జనానికి సులభంగా అర్ధమయ్యేట్టు విశదీకరించడం, కాలాన్ని నియంత్రించే మార్గాన్ని రూపొందించడం వీరి మనవాతీత మేదస్సుకు ఓ మచ్చుతునక. ఆది, అంతం తెలీనప్పుడు కాలాన్ని యెలా కొలవడం? కొలిచిన కాల మానాన్ని మానవ సౌర సంవత్సరాలతో అనుసంధానం చేయడమెలా? ఇలాటి చిక్కు ముడి ప్రశ్నలకు అద్వితీయ సమాదానాలు ఇచ్చారు ప్రాచీన భారతీయ శాస్త్ర, విజ్ఞానవేత్తలు.

విద్యా, మేధా, క్రియా శక్తులకు ఆలవాలం భారతం. ఉదాహరణకు - నక్షత్ర విద్య, రాశీ విద్య, బ్రహ్మ విద్య, పర విద్య, గణితం, క్షేత్ర గణితం, విశ్వ శాస్త్రం, జ్యోతిషం, సంఖ్యాన, గణన, త్రైప్రశ్న (దిక్కు, స్థానం, కాలం) కాలశాస్త్రాలు, దిక్, కాల సంబంధ పరిపూర్ణ పరిజ్ఞానం అందించాయి. ప్రపంచం యక్కడ మొదలైయ్యిందో, యెంత కాలం గడచిందో, భవిషత్ కాలం యెంత వుందో, అందులో ఈ పృధ్వ్వీ మండలానికి యెంత కాల పరిమితి వుందో, మానవులకు, చరా చర రాశులకు యెంత కాల మానం నిర్ణయమై ఉందో తెలుసుకోవడం దుర్లభంగా గోచరించ వచ్చు. ఇట్టి ఉత్కృష్ట సమస్యలను పరిణితి చెందిన పాండిత్య ప్రకర్షలతో, విభిన్న శాస్త్రీయ పద్ధతులనుసారంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించారు ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు.

కాలాన్ని ఒక " ప్రాధమిక " పదార్ధంగా పేర్కొన్నాడు సుప్రసిద్ధ వైజ్ఞానికుడు, #కణాదుడు - వైశేషిక శాస్త్రం లో. అకాశం, కాలం, దిక్ అనంతాలు; వీటికి అంతం లేదు. దిక్, కాలం - ఈ రెండూ సర్వ వ్యాప్త పదార్ధాలు. భూత, భవిషత్, వర్తమాన నిర్ధారణా చేయడానికి కాలమే మూలం. ఈ కొల బద్ధ లేనిదే భూత, భవిషత్, వర్తమాన వర్గీకరణ అసంభవం. కాలం సూర్య భ్రమణం మీద ఆధార పడి క్షణ, దిన, ఋతు, సంవత్సరాది కొలబద్ధ ప్రామాణికమయ్యాయి. ఆంగ్లం (ఇంగ్లిషు) లో పలికే " #హవర్" (hour) కాల ప్రమాణానికి మూలం రూపం సంస్కృతంలోని " #అహోరాత్రి " (అహొ - పగలు; రోజు; రాత్రి - రాత్రి; ఒక పగలు ఓ రాత్రి కలసినది అహో రాత్రి - కాల సంభంద మైన శాస్త్రం హోరా శాస్త్రం).

దాదాపు 2300 యేళ్ళ నాటి జైన శాస్త్రాలలో - విభిన్న అనంతాలు (టైప్స్ ఆఫ్ ఇన్ఫినిటి) వాటి భావార్ధ, పరమార్ధాలు గ్రహించి వర్గీకరణ చేసారు, ఈ శతాబ్ధం ఆరంభంలో ప్రముఖ భారతీయ గణిత శాస్త్ర దిగ్గజం, డాక్టర్ #ప్రశాంత_చంద్ర_మహాలనోబిస్, ఈ అనంతాల విభజనతో పాటు, షడ్వాద పద్ధతిని అవలోకనం చేసి నేటి విధానలతో అనుసందానం చేసి తన దృక్పథాలు, మెళకువలు చాటి చెప్పిన గణిత కోవిదుడు.

సంకల్పం లోని #కాల_ప్రమాణం

నిత్య పూజలలో సంకల్పం చేస్తూ వుంటారు. సంకల్పములో - ఆది నుండి, అంటే అధ్య బ్రహ్మణం లగాయితు, వర్తమానం వరకు గడచిన కాల మానాని ప్రస్తావిస్తారు. అనునిత్యం పూజారంభంలో గోత్ర నామలతో సంకల్పం చేస్తారు:

అద్య బ్రాహ్మణ, ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతర, అష్టావింశత్ మహాయుగే, కలి యుగే, ప్రధమ పాదే ..... అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే, శ్రీ సర్వధారి నామ సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయణే, వసంత/గ్రీష్మ/వర్ష/శరధ్/హేమంత/శిసిర ఋతౌ, చైత్ర /.. మాసే, శుక్ల/కృష్ణ పక్షే, .. తిథౌ, వాసరహ వాసరస్తు, భాను/ఇందు/భౌమ/సౌమ్య/గురు/భృగు/స్థిర వాసరే, శుభ నక్షత్రే, శుభ యొగే, శుభ కరణ,ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభ తిథౌ, ....

సృష్టికి ఆది ఐన బ్రహ్మ మొదలిడుకుని, ద్వితీయ పరార్ధ, శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, అష్టావింశతి (28) మహాయుగంలో, కలి యుగ ప్రధమ పాదంలో, ....

ఇలా మానవులను పరాత్పరుడితో కాలంతో అనుభందం చేసారు. ఒక్క భారతీయ పరంపరలో తప్పితే, ప్రపంచ ఇతిహాశంలో మరే పరంపరలో ఇంత పరీవ్యాప్తమైన భారీ కాల మనాలను ప్రస్తావించిన వైనాలు లేవు.

షట్ కాల చక్రం

మనం ఆచరించే ఆరు కాలాలు - 1. సంవత్సరం; 2. ఆయనం; 3. ఋతువు; 4. మాసం; 5. పక్షం; 6. దినము;
పంచ కాల స్వరూపాలు

భారతీయులు అనాదిగా ఆచరిస్తున్న కాల స్వరూపాలు - చాంద్రమాన సంవత్సరం; సౌరమాన సంవత్సరం; సావన మాన సంవత్సరం; నక్షత్ర మాన సంవత్సరం, బృహస్పత్య సంవత్సరం.

చాంద్ర మాన సంవత్సరం - శుక్ల పాడ్యమి మొదలు పౌర్ణమి; కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య - ఈ విధంగా 12 పౌర్ణమిలు, 12 అమావాస్యలు కలిగి వుండేది చాంద్ర మాన సంవత్సరం. ఇందులో 12 మాసాలుంటాయి.

నెల (మాసం) పేరు యెలా వస్తుందంటే? - చంద్రుడు పౌర్ణమి నాడు యే నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ నెల పిలువబడుతుంది.
చిత్తా నక్షత్రమున పౌర్ణమి కల్గిన చైత్ర మాసం (30 లేక 31 దినాములు)
విశాఖ నక్షత్రమున పౌర్ణమి కల్గిన వైశాఖ మాసం (31 దినములు)
జ్యేష్ఠ నక్షత్రమున పౌర్ణమి కల్గిన జ్యేష్ఠ మాసం (31 దినములు)
పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రమున పౌర్ణమి కల్గిన ఆషాఢ మాసం (31 దినములు)
శ్రవణ నక్షత్రమున పౌర్ణమి కల్గిన శ్రావణ మాసం (31 దినములు)
పూర్వాభాధ్ర, ఉత్తరాభాధ్ర నక్షత్రమున పౌర్ణమి కల్గిన భాద్రపద మాసం (31 దినములు)
అశ్విని నక్షత్రమున పౌర్ణమి కల్గిన ఆశ్వీజ మాసం (30 దినములు)
కృత్తిక నక్షత్రమున పౌర్ణమి కల్గిన కార్తీక మాసం (30 దినములు)
మృగశిరా నక్షత్రమున పౌర్ణమి కల్గిన మార్గశిర మాసం (30 దినములు)
పుష్యమి నక్షత్రమున పౌర్ణమి కల్గిన పుష్య మాసం (30 దినములు)
మఖా నక్షత్రమున పౌర్ణమి కల్గిన మాఘ మాసం (30 దినములు)
పుబ్బ (పూర్వ ఫల్గుణి) నక్షత్రమున పౌర్ణమి కల్గిన ఫాల్గుణ మాసం (30 దినములు) ప్రాప్తిస్తాయి.

శుద్ధ పక్షము (శుక్ల పక్షం) / బహుళ పక్షం (కృష్ణ పక్షం) - అమావాస్య తరువాత 15 దినములు శుక్ల పక్షమని వ్యవహరిస్తారు. అలానే పౌర్ణమి తరువాత 15 రోజులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షమని వ్యవహరిస్తారు.
శుక్ల పాడ్యమి కృష్ణ పాడ్యమి శుక్ల విదియ కృష్ణ విదియ శుక్ల తదియ కృష్ణ తదియ శుక్ల చవితి కృష్ణ చవితి శుక్ల పంచమి కృష్ణ పంచమి శుక్ల షష్ఠి కృష్ణ షష్ఠి శుక్ల సప్తమి కృష్ణ సప్తమి శుక్ల అష్టమి కృష్ణ అష్టమి శుక్ల నవమి కృష్ణ నవమి శుక్ల దశమి కృష్ణ దశమి శుక్ల ఎకాదశి కృష్ణ ఎకాదశి శుక్ల ద్వాదశి కృష్ణ ద్వాదశి శుక్ల త్రయోదశి కృష్ణ త్రయోదశి శుక్ల చతుర్దశి కృష్ణ చతుర్దశి పౌర్ణమి అమావాస్య

#సౌరమాన_సంవత్సరం

సూర్యుడు మేష రాశిలో ప్రవేశించి మీన రాశి వరకు సంచరించు కాలాన్ని సౌర సంవత్సరంగా పరిగణిస్తారు.
సూర్యుడు మేష రాశిలో సంచరించు కాలం - మేష మాసం
సూర్యుడు వృషభ రాశిలో సంచరించు కాలం - వృషభ మాసం
సూర్యుడు మిథున రాశిలో సంచరించు కాలం - మిథున మాసం
సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించు కాలం - కర్కాటక మాసం
సూర్యుడు సిమ్హ రాశిలో సంచరించు కాలం - సిమ్హ మాసం
సూర్యుడు కన్య రాశిలో సంచరించు కాలం - కన్య మాసం
సూర్యుడు తుల రాశిలో సంచరించు కాలం - తుల మాసం
సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించు కాలం - వృశ్చిక మాసం
సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించు కాలం - ధనస్సు మాసం
సూర్యుడు మకర రాశిలో సంచరించు కాలం - మకర మాసం
సూర్యుడు కుంభ రాశిలో సంచరించు కాలం - కుంభ మాసం
సూర్యుడు మీన రాశిలో సంచరించు కాలం - మీన మాసం
ఈ సౌర సంవత్సరంలో 12 రాశులలో సూర్యుడు మొత్తము 365 దినములు సంచరిస్తాడు.

#సావన_సంవత్సరం

ఇందులో మాసానికి 30 దినములు; 12 మాసాలకి 360 దినములు కలిగి ఉంటుంది.

#నక్షత్ర_సంవత్సరం

అశ్వినాది 27 నక్షత్రముల మీద చంద్రుడు సంచరించు కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు. ఇలాటి 12 మాసాలు ఉండి, 324 దినములు ఒక సంవత్సరముగా వ్యవహరిస్తారు
బృహస్పత్య సంవత్సరం

బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశిలో ప్రవేశించి ఆ రాశి యందు పూర్తి సంచార కాలం, ఒక సంవత్సరముగా పరిగణిస్తారు.

#ఆయనములు

ప్రతీ సంవత్సరానికి రెండు ఆయనాలుంటాయి. అవి -
ఉత్తరాయణం; దక్షిణాయణం.
సూర్యుడు ఉత్తరధ్రువంలో సంచరించు కాలం ఆరు నెలలు. అంటే ఇది మకర ప్రవేశం నుంచి మిథునం ఆఖరు వరకు ఉండే కాలం. సూర్యుడు దక్షిణధ్రువంలో సంచరించు కాలం ఆరు నెలలు. అంటే కర్కాటకం నుండి ధనస్సు ఆఖరు వరకు సంచరించిన కాలం.

#ఋతువులు

చాంద్ర మాన సంవత్సరంలో రెండు నెలలకు ఓ ఋతువు. ఇలా యేడాదికి ఆరు ఋతువులు ఏర్పడ్డాయి.
చైత్ర, వైశాక మాసాలు - వసంత ఋతువు
జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు - గ్రీష్మ ఋతువు
శ్రావణ, భాద్రపద మాసాలు - వర్ష ఋతువు
ఆశ్వయుజ, కార్తీక మాసాలు - శరద్ ఋతువు
మార్గశిర, పుష్య మాసాలు - హేమంత ఋతువు
మాఘ, ఫాల్గుణ మాసాలు - శిశిర ఋతువు

మరికొన్ని భారతీయ కాల #స్వరూప_ప్రమణాలు

ఎంతో కాలంగా వాడుకలో ఉన్న మరికొన్ని భారతీయ కాల రాశులు:
60 తత్పరలు 1 పర
60 పర లు 1 విలిప్త
60 విలిప్తలు 1 లిప్త
60 లిప్తలు 1 విఘడియ (24 సెకండ్లు)
60 విఘడియలు 1 గడియ (24 నిమిషాలు)
60 గదియలు 1 రోజు (24 గంటలు)
30 అహొరాత్రులు (రోజులు) 1 మాసం (నెల)
12 మాసాలు 1 సంవత్సరం
12 సంవత్సరాలు 1 పుష్కరం
7 రోజులు 1 వారం
15 రోజులు 1 పక్షం
2 పక్షాలు 1 మాసం
2 మాసాలు 1 ఋతువు (సీజన్)
6 రుతువులు 1 సంవత్సరం
60 లిప్తలు 1 భాగ
30 భగాలు 1 రాశి
12 రాశులు 1 భగణం

ఇలా ఖగోళంలోని సూర్య చంద్ర నక్షత్రాలతో భూ మండల, చరా చర రాశులతో అనుసందాంచేసిన మేదస్సు అసామాన్య శక్తే. ఇంతటి మహోత్కృష్ట విషయాలను ప్రపంచంలో భారతీయ సాంప్రదాయం తప్ప మరెవరు చెప్పలేక పోయారు సరికదా, వారికి ఇది అవగాహన అవటానికి చాలా కాలం పట్టింది.

ప్రపంచ, అవనీ తల #కాలమానాలు

ప్రపంచ కాలమానం, అందులో భూగోళ కాలమానం, పాక్షిక ప్రళయాలు, అంతః ప్రళయాలు - ఇలా అనంత కాలచక్రాన్ని వివరించారు. మానవాతీత శక్తి తోడవుతే కాని ఇంతటి మహత్తర పరిమాణంగల విషయాలు ఆకళింపుజేసుకోవడం దుస్సాధ్యం. ఇది భారతీయ శాస్త్రజ్ఞుల ఇచ్చా శక్తి, క్రియా శక్తులకు నిదర్శనాలు. అంతే కాదు, ఇంత భారీ కాల ప్రమాణాలు, నిర్వచించాలంటే పటిష్టమైన గణిత శాస్త్రం, సంఖ్యా శాస్త్ర సాధనా పద్ధతులు కూడా తెలిసి ఉండాలి. విభిన్న గణిత సంబంధ శాస్త్రాలను అవపోసన చెసిన కాల శాస్త్రవేత్తలకు అనంత కాలాల్ని ఒక క్రమ పద్ధతిలో పట్టికలాగ వివరించేదుకు ఆస్కారం కలిగింది. బ్రహ్మ కాలం (ఆయువు) లో 120 మహాకల్పాలు (దివ్య సంవత్సరాలు) ఉన్నాయి.

మనుగడలో ఉన్న విభిన్న మాస, సంవత్సరాల కాలమనాలు:

1 చాంద్ర మాసం లో 29 189005/356222 (29.53) రోజులు ఉన్నాయి
1 కల్పం లో - సూర్య, చంద్రుల భ్రమణ తేడా - 534333300000
1 సౌర మాసంలో - 30 సౌర దినాలు; 30 1362987/3110400 సాధారణ రోజులు ఉన్నాయి
1 పితృ-మాసం - 30 మానవ మసాలు; ఇందులో 885 163410/178111 సాధారణ రోజులు ఉన్నాయి
1 దెవ-మాసం - 30 యేళ్ళు; ఇందులో 10957 241/320 సాధారణ రోజులు ఉన్నాయి
1 బ్రహ్మ మాసం - 60 కల్పాలు; ఇందులో 94,674,987,000,000 సాధారణ రోజులు ఉన్నాయి
1 పురుష మాసం - 2,160,000 కల్పాలు; ఇందులో 3,408,299,532,000,000,000 సాధారణ రోజులు ఉన్నాయి
1 " ఖ " మాసం - 9,467,498,700,000,000,000,000,000,000,000 సాధారణ రోజులు
1 చాంద్ర మాన సంవత్సరంలో - 354 65,364/178,111 సాధారణ రోజులు ఉన్నాయి
1 సౌర సంవత్సరం లో - 365 827/3200 సాధారణ రోజులు ఉన్నాయి
1 పిత్రు సంవత్సరం లో - 10,361 1699/178,111 సాధారణ రోజులు ఉన్నాయి
1 దేవ సంవత్సరం - 131,493 3/80 సాధారణ రోజులు
1 బ్రహ్మ సంవతసరం లో - 1,136,099,844,000,000 సాధారణ రోజులు
1 పురుష సంవత్సరం లో - 25,920,000 కల్పాలు; 40,899,594,384,000,000,000 సాధారణ రోజులు

1 " ఖ " సంవత్సరం లో - 113,609,984,400,000, 000, 000, 000, 000, 000, 000 సాధారణ రోజులు
ఇంతటి మహాత్కాలాల్ని భారీ సంఖ్యలను వాడి విశదీకరించడం అప్పటి భరతీయ శాస్త్రకారుల అసమాన ప్రతిభాపాటవాలని చాటి చెప్తోంది.

ఈ పేర్కొన్న అంశాలన్ని #అల్-బరూని (1034 ఏ డీ) విభిన్న భారతీయ శాస్త్రాల నుండి తర్జుమా చేసి " తారీక్ అల్ హింద్ ", " తహ్-కీక్ అల్ హింద్ " పుస్తకల రూపేణ పర్షియా (నేటి ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనన్) అరేబియా దేశాలకు చేరవేసాడు. దీనితో భారతీయ సాంకేతిక విషయాలు ఈ ప్రాంతాల వాడుకలోకి చేరి, కొంతకాలానికి యురోప్ లో క్రమంగా చేరాయి. ఇక్కడ పేర్కొనదగిన విషయమేమిటంటే అప్పటికి యురోప్ లో రోమన్ అంకెలే ప్రాచుర్యంలో ఉండేవి. క్రమేపి భారతీయ సాధనా పద్ధతులను వాడుకోవడం మొదలయ్యింది.

బ్రహ్మ, కేశవ, మాధవ, ఈశ్వర, సదాశివ #కాలాలు

బ్రహ్మ కాలం = 72,000 కల్పాలు = 1 కేశవ దినం (రోజు)
నారాయణ = 155,520,000,000 కల్పాలు
కేశవ కాలం = 2,592,000,000 కల్పాలు (ఒక కల్పం - సుమారు 4.2

మహాదేవ కాలం = 93,312,000,000,000 కల్పాలు

రుద్ర కాలం = 5,374,771,200,000,000,000 కల్పాలు

ఈశ్వర కాలం = 3,359,232,000,000,000,000 కల్పాలు

సదాశివ కాలం = 120,932,352,000,000,000,000,000 కల్పాలు - ఇది 1 వికరణ (Eternal) లో ఒక రోజు

#శక్తి_కాలం = 10,782,449,978,758,523,781,120,000,000,000,000,000,000,000,000,000 కల్పాలు ఒక్క శివ రోజు -

37,264,147,126,589,458,187,550,720,000,000,000,000,000,000,000,000,000,000 కల్పాలు. శివ వికరణ - దీనికి మించినది యేమి లేదు.

నేటి లెక్కలతో పోలిస్తే కొన్ని లక్షల ట్రిల్లియన్ల యేళ్ళన్నమాట. ఇట్టి మహతర పరిమాణంలో సంవత్సరాలు ప్రపంచంలో మరెక్కడా, యెన్నడూ పేర్కొనడం గానీ, లెక్కించిన ఉదంతాలు లేవు. ఈ అద్బుత గణాంక సాధనాలు భారతీయ వైజ్ఞానికులదే!.

#మన్వంతరాలు

పద్నాలుగు మన్వంతరాలు:
స్వయంభువ మనువు
స్వారోబిష మనువు
ఉత్తమ మనువు
తామస మనువు
రైవత మనువు
చక్షుష మనువు
వైవస్వత మనువు
సూర్య సావర్ణిక మనువు
దక్ష సావర్ణిక మనువు
బ్రహ్మ సావర్నిక మనువు
రుద్ర సావర్ణిక మనువు
ధర్మ సావర్ణిక మనువు
రోచ్చ్య మనువు
భౌచ్చ్య మనువు

28 మన్వంతరాలు ఒక బ్రహ్మ రోజు. ఒక్కకొక్క మన్వంతరానికి ఒక అధిపతి - మనువు - ఉన్నాడు.

పరం, పరమార్ధలు - #మానవ-బ్రహ్మ కాల #అనుసంధానం

బ్రహ్మ జీవన కాలం ఒక పరం. అందులో సగ భాగం పరార్ధం. బ్రహ్మ కాలమానం ప్రకారం ఇప్పుడు ద్వితీయ పరార్ధం నడుస్తోంది. యాబై ఒకటవ పడి నడుస్తోంది.

ముప్పై కల్పాలు - శ్వేత-కల్ప, నీలలొహిత, వామదేవ, గతంతర, రౌరవ, ప్రాణ, బృహత్-కల్ప, కందర్ప, సధ్యోత, ఈశన, ధ్యాన, సారస్వత, ఉదాన, గరుడ, కౌర్మ, నారసిమ్హ, సమాధి, ఆగ్నేయ, విష్ణుజ, సౌర, సోమ-కల్ప, భావన, సుపుమ, వైకుంఠ, ఆర్సిస, వలి-కల్ప, వైరజ, గౌరి-కల్ప, మహేశ్వర, పైత్ర-కల్ప.

కొన్ని కల్పాల పేర్లు నిత్య పూజలలో చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు - శ్వేత వరాహ కల్పం. నమక ప్రశ్నలో నీలలోహిత, ఈశాన, ఉదాన, ద్యాన, మహేశ్వర వాడి ఉన్నారు. ఈ ప్రశ్నలు కృష్ణ యజుర్వేదంలోనివి. అంటే ఇవి వేలాది సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నాయన్న మాట!.

#బ్రహ్మ కాలం

కల్పాల ప్రమాణంలో బ్రహ్మ కాలం వివరించ బడింది.
1 బ్రహ్మ రోజు - 4,320,000,000 మానవ యేళ్ళు (4.32 బిల్లియన్ యేళ్ళు)
1 బ్రహ్మ అహో-రాత్రి - 8,640,000,000 మానవ యేళ్ళు (8.64 బిల్లియన్ యేళ్ళు)
1 బ్రహ్మ మాసం - 259,200,000,000 మానవ యేళ్ళు (259.2 బిల్లియన్ యేళ్ళు)
1 బ్రహ్మ సంవత్సరం - 3,110,400,000,000 మానవ యేళ్ళు (3.1104 ట్రిల్లియన్ యేళ్ళు)
100 బ్రహ్మ సంవత్సరాలు (బ్రహ్మ ఆయువు) - 311,040,000,000,000 మానవ యేళ్ళు (311.04 ట్రిల్లియన్ యేళ్ళు)

ఒక మహాయుగంలో 4,320,000 యేళ్ళు ఉన్నాయి. ఇందులో కృతయుగ ప్రమాణం 1,728,000 యేళ్ళు. త్రేతాయుగ ప్రమాణం 1,296,000 సంవత్సరాలు; ద్వాపరయుగ ప్రమాణం 864,000 యేళ్ళు; కలియుగంలో 432,000 సంవత్సరాలు. ఇలాటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. ఇలాటి 14 మన్వంతరాలు బ్రహ్మకు పగటి కాలం - 1 అహస్సు. ఇదే ఒక కల్పం. రెండు కల్పాలు కలిపితే బ్రహ్మకు ఒక అహోరాత్రి. ఇలాటివి 360 దినాలు ఉంటే ఒక బ్రహ్మ సంవత్సరం అవుతుంది. బ్రహ్మకు ఇప్పుడు 51 వ సంవత్సరంలో ప్రధమ కల్పంలో యేడవ మనువు - వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం నడుస్తోంది. ఇప్పటికి స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, దైవత, చాషుఘులు - ఆరు మనువులు గడచినాయి. ఇంతటి అపార సంఖ్యలు ప్రాచీన శాస్త్రవేత్తలు సునాయాసంగా లెక్కలు కట్టేసి వ్రాశారు. మానవ కాలాన్ని బ్రహ్మ కాలంతో సమన్వయం కూడా చేశారు. వారి ప్రజ్ఞా పాటవాలు యెంత మహత్తర మైనవో ఈ విషయాలను బట్టి అర్ధమవుతుంది.

చంద్రుడు దినానికి సుమారు ఒక నక్షత్రం, అంటే 800 లిప్తల క్షేత్రములు, కుజుడు దినానికి 31.5 లిప్తల క్షేత్రము, బుధుడు 245.5 లిప్తల క్షేత్రము, గురువు దినానికి 5 లిప్తల క్షేత్రము, శుక్రుడు దినానికి 96 లిప్తల క్షేత్రము, శని దినానికి 2 లిప్తల క్షేత్రము కడిచేస్తారు.

#బ్రహ్మండ_పురాణ - కాల పట్టిక వ్యఖ్యానం

బ్రహ్మండ పురాణం (3.4.2.92-103) లో పద్దెనిమిది సంఖ్యల వరకూ అంకడాలు వివరించారు. అవి:

దశ = 10
శతం; పరివృధ = 100
శహస్రం; పరిపద్మకం = 1,000
అయుతం = 10,000
నియుతం = 100,000
ప్రయుతం = 1,000,000
అర్వుతం; అర్బుదం = 10,000,000
న్యర్బుదం = 100,000,000
వృదం; ఖర్బుదం = 1,000,000,000
పరం = 10,000,000,000
ఖర్వం = 100,000,000,000
నిఖర్వం = 1,000,000,000,000
శంఖం = 10,000,000,000,000
పద్మం = 100,000,000,000,000
సముద్ర = 1,000,000,000,000
అంత్యం = 1,000,000,000,000,000
మధ్యమం = 10,000,000,000,000,000
పరార్ధం = 150,055,002,000,000,000
పర = 2 X పరార్ధ = బ్రహ్మా ఆయువు (లైఫ్ టైం) = 311.04 ట్రిలియన్ యేళ్ళు

తైత్తిరీయ సంహిత, కటక సంహిత కూడా ఈ సంఖ్యా కాలాలు ప్రస్తావించేయి. వాజసనేయి సంహిత, బౌద్ధ గ్రంధం #లలితవిస్తార (5 వ సంవత్సరం క్రీస్తు పూర్వం), శ్రీధర త్రైశతిక (క్రీ.శ.750), గణిత సార సంగ్రహ ఇత్యాది గ్రంధాలలో ఈ గణాంకాలు వివరిచబడ్డాయి.

అనేక వేల సంవత్సరాలకు పూర్వమే ఇట్టి అసాధరణమైన సంఖ్యలను ఉదాహరించారు భారతీయ వైజ్ఞానికులు, గణికులు, ఋషులు. దశాంశమాన గణితం కూడా ప్రాచుర్యంలో ఉందని వెరే చెప్పనక్కర లేదు. సుమారు 600-1000 సంవత్సర కాలం లో ఈ విషయాలు అరబ్ దేశాలు, ఉత్తర ఆఫ్రికా - మొరాకో ల మీదుగా ఇటలీ, స్పేన్, ఫ్రాన్స్, యూరోప్ చేరాయి. ఫిభొనాసి - క్రీ.శ.1225 సంవత్సరంలో - భారతీయ దశాంక గణితాన్ని యూరోప్ లో పరిచయం చేసినా, రోమన్ పద్ధతిని వీడి, భారతీయ దశాంశ గణాక పద్ధతిని అవలంబించడానికి దదాపు 200 సంవత్సరాలు పట్టింది.

అమెరికా ఎం ఐ టి విశ్వవిద్యాలయ తత్వ శాస్త్రం అచార్యుడు, రచయిత, #హ్యూస్టన్ స్మిత్ మాటల్లో చెప్పాలంటే -

 " భారతీయులకు కనపడనిదంటూ ఏమి లేదు; కనిపించనిది, దేన్ని మినహాయించనిది లేదు - భారత దేశ ఆత్మ అనంతం. వారు అనంతంలో కూడా యేమి ఉందో మినహాయించకండా విశదీకరించి చెప్పేసారు. భారతీయుల మేధా శక్తి అంతః-కరణాన్ని అబ్బుర పరుస్తుంది". మరి కొంత వివరణ ఇస్తూ ఇలా అన్నారు " భారతీయులు - కల్పాలు, విశ్వం, అపార కాల గణాలు యెప్పుడో ప్రకటించారు. వారి వైదుష్యం యెంత గొప్పదీ అంటే, అభినవ ఖగోళ శాస్త్రం కూడా అందులో ఒక బిందువే. అంత అపారమైంది భారతీయుల జ్ఞానం " అని తన మనోగతాన్ని విశిదీకరించి చెప్పేరు.

అంతర్జాతీయ విఖ్యాతి చెందిన ఖగోళ శాస్త్ర అచార్యుడు, నోబెల్ అవార్డు గ్రహీత #చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం శిష్యుడు, "కాస్మోస్" (విశ్వం) టీ వీ ధారావాహికం (సీరియల్) నిర్వాహకుడు, ఖగోళ శాస్త్ర అచార్యుడు కార్ల్ సాగన్, హిందూ (భారతీయ) విశ్వాంతరాళ శాస్త్రానికి (కాస్మాలజీ) కి కేటాయించిన శీర్షికలో ఇలా వివరించారు - హిందూ కాస్మాలజీ అద్బుతమేమిటంటే ఇది ప్రపంచంలొనే అతి బృహత్ పరిమాణం గల ప్రపంచ కాల మానాన్ని అందించింది. ఇది నేటి అధునాతన సాంకేతిక కాస్మాలజీ (విశ్వశాస్త్రం) కి అనుగుణంగా ఉంది. భూమి #వయస్సు సుమారు #4.6 బిల్లియన్ యేళ్ళు; ఇది " భారతీయ కాస్మొలాగికల్ సైకిల్ సిధ్ధాంతా"నికి అనుగుణంగా ఉంది.

సాగన్ తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ " నాకు తెలిసినంత పరిదిలో ఇంత సరైన, భూమి యొక్క ఇంతటి బృహత్ కాల ప్రమాణాలు పేర్కున్న ఉదంతాలు యెక్కడా చూడలేదు " అని విశ్లేషించి చెప్పారు. ఇక భారతీయ వైజ్ఞానికుల పరిణితి యేపాటిదో ప్రాజ్ఞులైన పాఠకులే నిర్ణయించుకోవాలి.

సాగన్ ఇంకా ఇలా విశిదీకరించారు - " పశ్చిమ దేశాలలో జన బాహుళ్యానికి ఈ విశ్వం కొన్ని వేల సంవత్సరాల కిందట ఆవిద్భవించిందని నమ్మకం. కాని నిజానికి ప్రపంచంలో అద్బుత సాంప్రదాయం గల హిందూ భావన (కాన్సెప్ట్) ప్రకారం విశ్వం కొన్ని బిలియన్ల్ల యేళ మనుపు మొదలయ్యిందని స్పష్టంగాం చెప్పాయి ".

భారతీయ విశ్వశాస్త్రం ప్రకారం, విశ్వాంతరాళం - సృష్టి, స్థితి, లయ, కారక చక్రం, అంటే విశ్వం మొదలు నుంచి అంతం వరకు నిరాఘాటంగా సాగుతున్న కాలచక్రం స్వరూపాన్ని కూలంకషంగా వివరించారు - భారతీయ కాలజ్ఞానులు.
బ్రహ్మాది కాలం - హిందూ సంవర్గమాన (లాగరతమిక్) గణ పరిమాణం (యూనిట్స్ ఆఫ్ స్కేల్)

బ్రహ్మాది కాల పట్టిక - హిందూ సంవర్గమాన గణ పరిమాణం సుమారు 2500 సంవత్సరాల నుండి వ్యవరాహంలో ఉంది. ఇది:

బ్రహ్మ కాలం – 10 to the power of 22 (dito)(అనగా 10 పక్కన 22 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అంట సంఖ్య) మిగిలినవి కుడా అలాగే అన్వయుంచుకోవాలి.
బ్రహ్మ రోజు – 10**17
మన్వంతరం – 10**16
మహాయుగం – 10**14
సంవత్సరం
ఆయనం
రుతువు
మాశం
పక్షం
నక్షత్ర అహొరాత్రి
ఘటి - 24 నిమిషాలు
విఘటి - 24 శెకండ్లు
ముహూర్త
క్షణం – 100
లీక్షక - 10**-1అనగా( ఒకటి లో 10 వంతు )
లవ – 10**-3 అనగా( ఒకటి లో 1000 వ వంతు )
రేణువు – 10**-5
త్రుటి – 10**-7 ( అనగా ఒకటి లో  1,00,00,000 వంతు)

నిత్యం మాట్లాడే భాషలో కూడా ఈ శబ్ధ ప్రయోగాలు జరుగూతూనే ఉనాయి. " ఒక్క క్షణం ఆగు ", " ఈ ఘడియో, ఆ ఘడియో రావాలి "; " తృటిలో తప్పిపోయిందోయి " వంటివి కొన్ని ఉదాహరణలు. 2 1/2 ఘడియలు - ఒక గంట 60 ఘడియలు - "అహోరాత్రి"; 24 గంటలు; 8 ప్రహరాలు - 1 అహోరాత్రి; కాబట్టి ఒక " ప్రహరా " సుమారు మూడు గంటలు; 1 ఘడియ - అంతే 24 నిమిషాలు; విఘటి అంటే సుమారు 24 క్షణాలు (సెకండ్లు) లేదా 6 ప్రమాణాలు.

" తృటి " అన్నిటికన్నా #అతితక్కువ కాలమాన కొలత. ఒక చాంద్ర మాన సంవత్సరంలో సుమారు 350 రోజుల, 30 ఘడియలు (అంటే 12 గంటలు) ఉన్నాయి.

ప్రపంచంలో మరి యే సంస్కృతి 4000 వేల యేళ్ళకు మించి మానవ చరిత్ర చెప్ప లేక పోయింది. భారతీయ విజ్ఞానవేత్తలు 4,000 సంవత్సరాలకు మునుపే అపారమైన గణాంకాలు చేసి, 311 ట్రిలియన్ యేళ్ళ భూగోళ ఆది నుంచి అంతం, తదనుగుణ కాలమానాలు ప్రకటించారు. ఇంత విస్తృతంగా గణాంకాలను రూపొందించేందుకు అద్బుతమైన మేదస్సు, సంఖ్యా శాస్త్ర విద్వత్తు, గణిత పద్ధతుల పాండిత్యం, సాధనా ప్రతిభ ఖగోళ, క్షేత్ర గణిత శాస్త్ర అవాగాహన దోహద పడ్డాయి.
+++++++++++++++++++++++++
ఇందులో నిజా నిజాలు ఎంత వరకో  పెద్దలకు తెలియాలి. నేను విషయం చదవడానికి బాగుంది అని సేకరించాను. ఇకా ఏమైనా వివరణ లు వున్ననూ  తెలుపగలరు. కాని ఏది ఏమైనా మన పెద్దల మేధాశక్తి మాత్రం అనన్య సామాన్యం . అది తెలుసుకోవడం లోనే వుంది మహద్భాగ్యం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list