
అనసూయ
శక్తి రూపం అంటే ప్రపంచాన్ని శాసించే మహోగ్రరూపం మాత్రమే అనుకుంటే
పొరపాటు. ఆలనా, పాలనా కలగలిసిన శక్తే స్త్రీ. ఆమెలోని సౌమ్యత వెనుక
లోకహితాన్ని కాంక్షించేంత గాంభీర్యం దాగుంటుంది. ఆమెలోని లాలిత్యం చాటున
లోకాల చీకట్లను పారద్రోలేంత వెలుగుంటుంది. స్త్రీలోని అన్ని కోణాలూ
స్వార్థానికి ఆవల ఉండే సరళీ ధ్రువాలు. ఆమెలోని ఆలోచనలు మంచిని మాత్రమే
సూచించే మహాద్భుతాలు. అలాంటి వారి వల్లనే జీవితాలూ, కుటుంబాలూ, సమాజాలూ,
దేశాలూ రూపుదిద్దుకుంటున్నాయి, రూపుదాల్చుతున్నాయి. ఆమె లేని సృష్టి
శూన్యం. ఆమెతోనే ఆది, అంతం. కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా,
స్నేహితురాలిగా ఆమె పోషించే పాత్రలు బాధ్యతల, ప్రేమల, ఆదర్శాలకు అపురూపాలు.
వీటన్నింటికీ ప్రతీక అయిన స్త్రీ అనసూయ. ఆమెను పతివ్రతగానే చరిత్ర
చెబుతుంది. కేవలం పతికి మాత్రమే కాదు, ప్రపంచానికి మంచి చేసిన మహాసాధ్వి
ఆమె!
ప్రమద్వర
దేవహుతీ, కర్ధముల కూతురు అనసూయ.
అత్రిమహర్షి భార్య. ఈ పరిచయం లోకమెరిగిన నామవాచకం మాత్రమే. అసూయ లేని అనసూయ
కోపమనేదే ఎరుగదు. భార్యగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే జ్ఞానశక్తిగా తన్ను
తాను మార్చుకుంది. అనావృష్టి వచ్చి లోకం అంతా అల్లకల్లోలం అయినప్పుడు
గంగానదీ తీరంలో ఘోరతపస్సు చేసి గంగానదీ నీటినీ ప్రజల పదాలకూ, వాటికలకూ
మరల్చి, ప్రకృతిని నీటితో తడిపి ఫల పుష్పాదులు చిగురించేలా చేసిన అసాధారణ
స్త్రీ శక్తి అనసూయ. లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్న మంచి మనసు అనసూయకే
సొంతం.
జీవితమే ఆలోచనల సంపూర్ణ రూపమైనప్పుడు ఎంతటి ఓర్పు కావాలి. ఎంతటి గాంభీర్యం కావాలి. అదంతా అనసూయతో నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది. అనసూయలోని మంచి గుణాలూ, ఆదర్శభావాలు మాత్రమే ఆమెను ఉన్నతంగా నిలబెట్టలేదు. ఆమె విశ్వ శ్రేయోదాయకమైన నిండైన ఆలోచన సృష్టికే వెలుగునిచ్చింది. ఆమె వారసత్వంగా స్త్రీ రుజుత్వం సాధించాలనీ అందువల్ల లోకమంతా మంచి జరగాలనీ ప్రపంచం కోరుకోవడంలో తప్పులేదు.
తన తపఃశ్శక్తితో పది రోజులను ఒకరోజుగా మార్చి లోక కళ్యాణకార్యానికి శ్రీకారం చుట్టింది. ఆమె అవసరం ఎక్కడున్నా ఒక్క క్షణమైనా ఆలోచించక ముందుండే అనసూయ నేటి తరానికీ ఆదర్శం. కేవలం ఒక్కరి జీవితం కోసం లోకాలను చీకట్లను చేసి అతలాకుతలం చేయరాదనీ కౌశికుని భార్యకు నచ్చజెప్పి సూర్యుణ్ని ఉదయించకుండా ఆపిన ఆమె శాపాన్ని విరమింపజేసిన అనసూయ ఆమెకూ నష్టం జరుగకూడదని ఆమె భర్తను తిరిగి బతికించింది. ఆమె జీవితంలో వెలుగు నింపడమే కాదు, లోకంలోని తమస్సునంతటినీ పారద్రోలింది.
త్రిమూర్తులను చిన్న పిల్లలను చేసి
ఆడించే అపారశక్తి, పాతవ్రత్యం ఆమె సొంతమే అయినా అణుకువలోనే జీవన సద్గతి
ఉందని చాటి చెప్పింది అనసూయ. ఒకనాడు అత్రి తపస్సుకై వెళుతూ నా కోసం నాతో
వచ్చి నువ్వు తపస్సు చేసుకుంటావా? లేదా నేనే ఒంటరిగా వెళ్ళనా? అని
అడిగినప్పుడు కుటుంబాన్ని మోసే రెండు చేతుల్లో ఒక్కటైనా దాన్ని మోయకపోతే
విచ్ఛిన్నమవుతుందనీ కుటుంబ పోషణకోసం తగిన ఏర్పాట్లు చేసి వెళ్ళమనీ, తాను
చూసుకుంటాననీ చెప్పిన మహా ఇల్లాలు ఆమె! రామునితో అడవులకు పయనమైన సీత
నిర్ణయాన్ని ఎంతో గౌరవించి, సీత తనను తాను ఆవిష్కరించుకునే ఆధారభూమికను తన
సూచనలతో అందించింది అనసూయ. ప్రతీ మగవాడి విజయం వెనకాల స్త్రీ
ఉండాల్సిందేననీ సీత ద్వారా తేల్చి చెప్పింది అనసూయ.
ఆదర్శాలు అందిపుచ్చుకునేవి కావు. సంస్కారంతో పుట్టుకొచ్చేవి. ఆలోచన కార్యరూపం దాల్చాలంటేనే తగిన సమయం, కృషీ.. వంటివి అవసరం అవుతాయి. జీవితమే ఆలోచనల సంపూర్ణ రూపమైనప్పుడు ఎంతటి ఓర్పు కావాలి. ఎంతటి గాంభీర్యం కావాలి. అదంతా అనసూయతో నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది.
అనసూయలోని మంచి గుణాలూ, ఆదర్శభావాలు మాత్రమే ఆమెను ఉన్నతంగా నిలబెట్టలేదు. ఆమె విశ్వ శ్రేయోదాయకమైన నిండైన ఆలోచన సృష్టికే వెలుగునిచ్చింది. ఆమె వారసత్వంగా స్త్రీ రుజుత్వం సాధించాలనీ అందువల్ల లోకమంతా మంచి జరగాలనీ ప్రపంచం కోరుకోవడంలో తప్పులేదు.
ఆదర్శాలు అందిపుచ్చుకునేవి కావు. సంస్కారంతో పుట్టుకొచ్చేవి. ఆలోచన కార్యరూపం దాల్చాలంటేనే తగిన సమయం, కృషీ.. వంటివి అవసరం అవుతాయి. జీవితమే ఆలోచనల సంపూర్ణ రూపమైనప్పుడు ఎంతటి ఓర్పు కావాలి. ఎంతటి గాంభీర్యం కావాలి. అదంతా అనసూయతో నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది.
అనసూయలోని మంచి గుణాలూ, ఆదర్శభావాలు మాత్రమే ఆమెను ఉన్నతంగా నిలబెట్టలేదు. ఆమె విశ్వ శ్రేయోదాయకమైన నిండైన ఆలోచన సృష్టికే వెలుగునిచ్చింది. ఆమె వారసత్వంగా స్త్రీ రుజుత్వం సాధించాలనీ అందువల్ల లోకమంతా మంచి జరగాలనీ ప్రపంచం కోరుకోవడంలో తప్పులేదు.
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
Digital Marketing Agency Bangalore