MohanPublications Print Books Online store clik Here Devullu.com

పూర్వం కాలాన్ని ఎలా కొలిచేవారు_తెలుగు పుస్తకాలు_భక్తి పుస్తకాలు_time GranthaNidhi MohanPublications BhaktiPustakalu



పూర్వం కాలాన్ని ఎలా కొలిచేవారు ancient time clock in india Time clock in ancient india time clock sand clock Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI




పూర్వం కాలాన్ని ఎలా కొలిచేవారు


హిందూ ధర్మం ప్రకారం కాలం అనంతం. ఈ అనంత కాల ప్రవాహంలో కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. కాలాన్ని ఘనించేందుకు లెక్కలు ఏర్పరచడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న మనం అనుచరిస్తున్న కాలగణన పాశ్చాత్య పద్దతి. అయితే భారతీయులకు తమదైన ప్రాచీన కాలగణన పద్దతి ఉంది. దానిని పలు పురాణాల్లో ప్రస్తావించారు. చివరకు దానిని రోజు ఒకసారి గుర్తు చేసుకునేందుకు సంధ్యావదనంలో కూడా చేర్చారు. సంధ్యావదనం చేస్తే వారు సంకల్పంలో తామున్న ప్రదేశాన్ని గురించి వివరిస్తూ శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే ..ఆ తర్వాత తాము ఎక్కడ ఉన్నామన్న దానిని చెబుతారు. దీని అర్ధం మనం శ్వేత వరాహ కలపంలో వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నామని అర్ధం. అయితే కల్పం ఏమిటి, మన్వంతరం ఏమిటి, యుగం ఏమిటి అనేవి వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెల్సుకుందాం.

**ప్రాచీనుల కాలగణన ప్రకారం కల్పం అంటే బ్రహ్మ్మకు ఒక పగలు. కల్పాలు బ్రహ్మ్మకు ఒక పగలు, రాత్రి. 14 మన్వంతరాలు ఒక కల్పం. ప్రస్తుతం నడుస్తున్న శ్వేత వరాహ కల్పం బ్రహ్మ 51వ సంవత్సరంలోని ఒక కల్పం. దీనికి శ్వేత వరహా కల్పం అనే పేరు రావడానికి కారణంగా ఒక కధను ఉదాహరిస్తుంటారు. అది లింగోద్భవ కధ. విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరు గొప్ప అనే తగవు తీర్చడానికి అగ్ని స్తంభ రూపంలో ఏర్పడిన శివలింగం పైభాగం తెలుసుకోవడానికి బ్రహ్మ కింద ఉన్న మూలం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నా సమయంలో విష్ణువు శ్వేత వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడని కధ.

**మన్వంతరం.
పద్నాలుగు మన్వంతరాలు ఒక కలపమని తెలుసుకున్నాం. అ మన్వంతరానికి ఒక్కొక్క మనువు పాలకుడు. ఈ మానవులను బ్రహ్మ సృష్టిస్తాడు. మన్వంతరం అనే పేరే మనువు. అంతరాల కలయిక వాళ్ళ వచ్చింది. అంటే ఇది ఒక మనువు కాలపరిమితిని తెలిపేదని అర్ధం చేసుకోవచ్చు. ఒక్కొక్క మనువు తన పాలనా కాలంలో జీవ, జంతుజతులను సృష్టిస్తాడు. ఒక్కో మన్వంతరం ఆ మనువు జీవించిన కాలం ఉంటుంది. ఒక మనువు ఆయువు పూర్తయ్యాక బ్రహ్మ ఈ సృష్టి కార్యక్రమం కొనసాగేందుకు మరో మనువును సృష్టిస్తాడు. అప్పుడు విష్ణువు ఒకకొత్త అవతారాన్ని దాలుస్తాడు. అలాగే కొత్త ఇంద్రుడు, కొత్త సప్త ఋషులు నియమితులవుతారు. ప్రతికల్పం చివరలో భూమిమీద జీవజాతులు లయమైపోయే ప్రళయం వస్తుంది. ఆ ప్రలయానంతరం వచ్చే ప్రశాంత స్టితి బ్రహ్మకు రాత్రి. ఆతర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మ మల్లి సృష్టిని మొదలుపెడతాడు. ఒకపురానం ప్రకారం ఒక మన్వంతరం కాల ప్రమాణం నాలుగు యుగాలలోని సంవత్సరాలకు డెబ్బై ఒక్క రెట్లు. వీటికి అదనంగా కొన్ని సంవత్సరాలు కలుస్తాయి. మొత్తం భూమిమీద అవి 8,52,000 దివ్య సంవత్సరాలు లేదా 30,67,20,000 మానవ సంవత్సరాలు అవుతాయి. ఈకాలానికి 14 రెట్లు కాలం బ్రహ్మకు ఒకరోజు బ్రహ్మ జీవిత ప్రమాణం 100 బ్రహ్మ వర్షాలు. ఈ బ్రహ్మ వర్షాల గురించి తెలుసుకునేందుకు కొన్ని కాలమానాలు తెలుసుకోవలసి ఉంది. ఒకదేవ అహోరాత్రం.(అంటే దేవతలకు ఒక పగలు, రాతి) 360 దేవ అహోరాత్రులు ఒకదేవ వత్సరం. 12,000 దేవ వత్సరాలు ఒక చతుర్యుగం. (ఈ 12,000 దేవవత్సరాల్లో క్రుతయుగానికి చెందిన 4,800, తెత్ర్రాయుగానికి చెందిన 3,600, ద్వాపరయుగానికి చెందిన 2,400 ,కలియుగానికి చెందిన 1200 దేవ వత్సరాలు ఉంటాయి.) ఇవన్ని కలిపితే 12,000 అవుతాయి. ఈ 12,000దేవవత్సరాలను 360 రోజులతో గుణిస్తే 4,32,000 మానవ సంవత్సరాలు వస్తాయి. 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు ఒక కల్పం. బ్రహ్మకు 360 రోజులు ఒక బ్రహ్మ వర్షం. శ్వేత వరాహ కల్పంలోని 14మంది మనువులు వరుసగా స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షువ, వైవస్వత. సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్రా సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి.

**యుగం
యుగాలు నాలుగు. అవి కృత, తేత్రా, ద్వాపర, కలియుగాలు. కృతయుగం వ్యవధి 17,28,000 సంవత్సరాలు. తేత్రా యుగం వ్యవధి 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం వ్యవధి 8,64,000 సంవత్సరాలు. కలియుగం వ్యవధి 4,32,000 సంవత్సరాలు. ప్రతి యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి. ప్రస్తుతం కలియుగం ప్రధమ పాదంలో ఉన్నాం. కలియుగం ప్రవేశించి 5,100 సంవత్సరాలు పైగా గడిచింది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list