వెన్నెముక
చికిత్స- వ్యాయామమే కీలకం
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మూలంగా దెబ్బతిన్న ఎముక తిరిగి కోలుకోవటం దాదాపు అసాధ్యం. అందువల్ల సమస్యను వీలైనంత త్వరగా నిర్ధరించి, చికిత్స తీసుకోవటం చాలా అవసరం. దీంతో ఎముక మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు ఫిజియోథెరపీ, వ్యాయామాలు, మందుల వంటివి బాగా ఉపయోగపడతాయి.
ఫిజియోథెరపీ: వెన్ను బిర్రబిగుసుకోవటానికి విశ్రాంతి పెద్ద శత్రువు. ఎందుకంటే కదలికలు తగ్గినకొద్దీ కీళ్లు బిగుసుకుపోవటం ఎక్కువవుతుంది. చురుకుగా ఉండటం, బాగా కదిలేలా చూసుకోవటమే దీనికి మంచి మందు. అందుకే చికిత్సలో ఫిజియోథెరపీ, వ్యాయామాలే చాలా కీలకం. రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం చేయటం అవసరం. నొప్పులు ఎక్కువున్నా మందులు తీసుకుంటూనైనా వ్యాయామాలు ఆరంభించాలి. కొందరు యువకులు వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. కదలికలన్నీ బాగానే ఉంటున్నాయి కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. వెన్నెముక గడకర్రలా తయారయ్యాక చేసేదేమీ ఉండదని గుర్తించాలి. వీరికి ఈత, యోగ బాగా ఉపయోగపడతాయి. వీలైతే నడక వంటి ఇతరత్రా వ్యాయామాలూ చేయొచ్చు. ఒకసారి ఫిజియోథెరపీ తీసుకొని, వ్యాయామాలను నేర్చుకున్నాక ఎవరికివారు ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద బరువులు ఎత్తటం, బాక్సింగ్, ఫుట్‌బాల్ వంటి ఒంటికి దెబ్బలు తగలటానికి ఆస్కారం గల వ్యాయామాలు చేయకూడదు.
నొప్పి మందులు: ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు బాగా ఉపయోగపడతాయి. మొదట్లో రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అప్పటికి వ్యాయామాల ప్రభావం మొదలవుతుంది. కొంతకాలానికి వ్యాయామమే మందుగా పనిచేస్తుంది. నొప్పి తగ్గుతూ వస్తుంది. తర్వాత క్రమంగా నొప్పి మందులు మానెయ్యొచ్చు. అయితే నొప్పి మందులను సొంతంగా కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. లేకపోతే కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు.
నొప్పి ఒకటే కావొచ్చు. అది నడుంలోనే ఉండొచ్చు! కానీ అన్ని నడుంనొప్పులూ ఒకటి కాదు. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడో, అడ్డదిడ్డంగా కూచోవటం వల్లనో తలెత్తే నొప్పి వేరు. ఇది విశ్రాంతి తీసుకుంటే తగ్గొచ్చు. కానీ ఒంట్లోనే పొడసూపే సమస్యలతో తలెత్తే నొప్పి వేరు. అలాంటిదే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది విశ్రాంతితో తగ్గదు సరికదా.. మరింత ఎక్కువవుతుంది! వెన్నెముకలోని పూసలను క్రమంగా దెబ్బతీస్తూ.. చివరికి వెన్నెముకను గడకర్రలానూ మార్చేస్తుంది. తలపై బరువేదో మోస్తున్నట్టుగా మెడనూ, నడుమునూ ముందుకు వంగిపోయేలా చేసేస్తుంది. దీంతో ప్రతి కదలికా భారమై.. రోజువారీ పనులు సైతం చేసుకోలేక.. పక్కలకు చూడాలన్నా శరీరం మొత్తాన్ని తిప్పాల్సిన దుస్థితికి తీసుకెళ్తుంది. దీని ఆనవాళ్లు యవ్వనదశలోనే మొదలైనా పోల్చుకోలేకపోవటం పెద్ద సమస్య. ఇది దీర్ఘకాల జబ్బు కావటం.. దీనిపై అంతగా అవగాహన లేకపోవటం మరో సమస్య. మామూలు నడుమునొప్పిగా కొందరు.. వయసుతో పాటు వచ్చే మార్పుగా మరికొందరు భావిస్తూ చేజేతులా సమస్యను తీవ్రం చేసుకుంటున్నారు. కానీ తొలిదశలోనే గుర్తించి, చికిత్స తీసుకుంటే.. వ్యాయామాల వంటివి ఆరంభిస్తే దీన్ని చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు. అందరిలా హాయిగానూ గడపొచ్చు. అందుకే బిర్రబిగుసుకునే ఈ వెన్ను సమస్యపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్
నిటారుగా నిలబడతాం. ముందుకు వంగుతాం, పక్కలకు తిరుగుతాం. ఇలాంటి పనులన్నింటినీ మనం చాలా తేలికగా, అలవోకగా చేస్తున్నామంటే అదంతా వెన్నెముక చలవే. వెన్నెముకలోని పూసలు సున్నితంగా, మృదువుగా కదలటం వల్లనే. మన తల నుంచి కటి భాగం వరకూ పూసలు పూసలుగా.. ఒక దండలా ఉంటుంది వెన్నెముక. ఒక్కో వెన్ను పూసా ఒక్కో ఎముక అనుకోవచ్చు. వీటి మధ్య మందంగా, ధృడంగా ఉండే రబ్బర్ల వంటి డిస్కులుంటాయి. వీటికి అతుక్కొని ఉండే కండరబంధనాలు (లిగమెంట్లు), స్నాయువులు (టెండన్లు) పూసలు కదిలినా పక్కలకు తొలగిపోకుండా స్థిరంగా పట్టి ఉంచుతాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సరిగ్గా వీటి మీదే దాడి చేస్తుంది. వెన్నెముకలో వాపు ప్రక్రియ (స్పాండిలైటిస్) మూలంగా పూసలు ఒకదాంతో మరోటి అతుక్కుపోవటం (యాంకిలోజింగ్) దీనిలోని ప్రత్యేకత. ముందుగా వాపు ప్రక్రియ తలెత్తిన చోట ఎముక క్షీణిస్తుంది. దీంతో శరీరం అక్కడ కొత్త ఎముకను వృద్ధి చేసి మరమ్మతు చేయటానికి ప్రయత్నిస్తుంది. ఇది నిరంతరం కొనసాగుతూ రావటం వల్ల పూసలు ఒకదాంతో మరోటి కలిసిపోతాయి. అంటే ఇటుకల మధ్య సిమెంటు వేస్తే గట్టిపడినట్టుగా అయిపోతాయన్నమాట. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ- పూసలన్నీ అతుక్కుపోయి వెన్నెముక వెదురుబొంగులా (బ్యాంబూ స్పైన్) తయారవుతుంది కూడా. దీంతో కదలికలు తగ్గిపోవటం, నడుంనొప్పి వంటివన్నీ బయలుదేరతాయి. ఇది ఒక్క వెన్నెముకతోనే ఆగిపోదు. మోకాలు, మోచేయి, పాదాల్లోని కీళ్లపైనా ప్రభావం చూపుతుంది. కొందరిలో కంటి సమస్యకూ దారితీయొచ్చు.
నడుంనొప్పి తొలి లక్షణం
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తొలి లక్షణం నడుంనొప్పి. ముఖ్యంగా పొద్దున లేస్తూనే తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. ఈ నొప్పి 45 నిమిషాల నుంచి గంట వరకూ అలాగే ఉంటుంది! దీని బారినపడ్డవాళ్లు వెంటనే పక్క మీది నుంచి లేవలేరు కూడా. శరీరం కాసేపు కుదురుకున్నాకే లేస్తుంటారు. మామూలుగా నడవటానికి దాదాపు గంట సేపు పట్టొచ్చు. రాత్రిపూట పడుకున్న తర్వాత కూడా నొప్పి వేధించొచ్చు. దీంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున మెలకువ వచ్చేస్తుంటుంది. వీరికి పడుకొని పక్కలకు దొర్లటమూ సాధ్యం కాదు. నడుము కదలికలు కష్టం కావటం వల్ల చేతులను పక్కవైపులకు ఆనించి, వాటి సాయంతో నెమ్మదిగా కదులుతుంటారు. పిరుదుల్లో మార్చి మార్చి నొప్పి కనబడటం మరో ప్రత్యేకత. కొద్దిరోజులు ఎడమ పిరుదులో నొప్పి వేధిస్తే.. కొన్నాళ్లకు కుడి పిరుదులో నొప్పి తలెత్తుతుంది. కొందరిలో రెండు పిరుదుల్లోనూ నొప్పి ఉండొచ్చు.
ఎంతిసైటిస్: ఎముకతో స్నాయువులు కలిసేచోట వాపు తలెత్తటం (ఎంతిసైటిస్) మరో ముఖ్య లక్షణం. దీంతో చాలామందిలో మడమల వద్ద ఎకిలిస్ టెండన్‌లో నొప్పి పుడుతుంది. మోకాలు, మోచేతి స్నాయువుల్లోనూ వాపు తలెత్తొచ్చు. ఒకోసారి పక్కటెముకలకు అంటుకునే స్నాయువులు, కండర బంధనాలతోనూ ఒకరకమైన ఛాతీనొప్పి రావొచ్చు. దీంతో శ్వాస తీసుకోవటమూ కష్టమవుతుంది. చాలామంది దీన్ని గుండెనొప్పిగానూ పొరపడుతుంటారు.
కంటి వాపు: యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితుల్లో కనుగుడ్డు మధ్యపొరలో వాపు (యువిఐటిస్) కూడా తలెత్తొచ్చు. దీంతో కళ్లు ఎర్రబడటం, నీరు కారటం, నొప్పి, చూపు మసకబారటం వంటివి మొదలవుతాయి. నిర్లక్ష్యం చేస్తే శుక్లాలకూ దారితీయొచ్చు. అరుదుగా చూపు కూడా పోవచ్చు.
ఇతర లక్షణాలు: బరువు తగ్గటం, నిస్సత్తువ, కొద్దిపాటి జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టటం వంటివీ ఉండొచ్చు. ముఖ్యంగా తొలిదశలో ఇలాంటివి కనబడుతుంటాయి.

ఇది మామూలు నడుం నొప్పి కాదు!
మామూలుగా మనం చూసే చాలా నడుంనొప్పులు డిస్కులకు సంబంధించినవే. కావటానికి నడుంనొప్పే అయినా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వాటికి చాలా భిన్నం. ఉదయం నిద్ర లేచాక వెన్నెముక ఎంతసేపు బిగసుకుంటోదనే దాన్ని బట్టి వీటి మధ్య తేడాను తేలికగానే గుర్తించొచ్చు. లేచాక అరగంట కన్నా తక్కువసేపుంటే డిస్కు సమస్యగానూ.. ముప్పావుగంట కన్నా ఎక్కువసేపు బిగుసుకుపోతుంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌గానూ అనుమానించొచ్చు

పిరుదుల్లో ఆరంభం!
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ప్రధానంగా నడుం, మెడలపై ప్రభావం చూపినప్పటికీ.. ఇది పిరుదుల వద్దే ఆరంభమవుతుంది. కటి ఎముకలోని సాక్రమ్, ఇలియమ్ మధ్యలోని సాక్రోఇలియాక్ కీళ్లలో వాపు తలెత్తటం దీనికి మూలం. అనంతరం నడుము భాగంలోని వెన్నెముక.. అక్కడ్నుంచి ఛాతీ దగ్గర.. తర్వాత మెడ దగ్గరి పూసలు.. ఇలా ఒకదాని తర్వాత మరోటి ప్రభావితమవుతాయి. అయితే కొందరికి సాక్రో ఇలియాక్ కీలులో మొదలై నేరుగా మెడ దగ్గరి పూసల్లోనే సమస్యకు దారితీయొచ్చు. కొందరికి మోకాళ్లు, మోచేతులు, పాదాల్లోని పెద్ద కీళ్లు సైతం ప్రభావితమవుతుంటాయి.
పురుషుల్లోనే ఎక్కువ
నిజానికి కీళ్లవాతం సమస్యలు ఆడవారిలోనే ఎక్కువ. కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మహిళల్లో కన్నా పురుషుల్లో 9 రెట్లు అధికం. ఇది సాధారణంగా 20-45 ఏళ్ల మధ్యలో మొదలవుతుంది. 45 ఏళ్ల తర్వాత రావటం చాలా అరుదు. ఇది లోలోపలే నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. అందుకే చాలామంది జబ్బు మొదలైన 10-20 ఏళ్ల తర్వాత గానీ గుర్తించరు. కొందరు వయసుతో పాటు ఇలాంటి మార్పులు వస్తున్నాయని పొరబడి, నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా. జబ్బు తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవటమూ దీనికి కారణమే. ఇది ఒకొకరిలో ఒకోలా ఉంటుంది. కొందరిలో తీవ్ర దశకు చేరితే.. మరికొందరికి తొలిదశ లక్షణాలతోనే ఆగిపోవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కనబడకపోనూవచ్చు.

జీవనశైలి మార్పులతో మేలు
* యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితులు క్యాల్షియం, విటమిన్ డితో కూడిన పదార్థాలు మరింత ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఖర్జూరం, అంజీరా వంటి ఎండుఫలాలు.. బాదం, అక్రోట్ల వంటి గింజపప్పులు ఎంతో మేలు చేస్తాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువును అదుపులో ఉంచుకోవటం, పొగ అలవాటుకు దూరంగా ఉండటం ఉత్తమం. మెడను విరవటం, గట్టిగా మర్దనలు చేయటం తగదు. ముందు నుంచే దిండు సైజు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మరీ గట్టిగా, మరీ మెత్తగా లేని పరుపులు వాడుకోవాలి. వీరికి ప్రమాదాల్లో కుదుపులకు ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకొస్తుంది?
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువుతో దీనికి బలమైన సంబంధం ఉంటుండటం మాత్రం నిజం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బారినపడ్డ 90% మందిలో ఈ జన్యువు కనబడుతుండటమే దీనికి నిదర్శనం. అయితే హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువు ఉన్నా కూడా జబ్బు రావాలనేమీ లేదు. ఈ జన్యువు ఉన్నవారిలో కేవలం 2% మందికే వచ్చే అవకాశముంది. కాబట్టి జన్యువు ఉండటంతో పాటు నడుంనొప్పి, కీళ్లనొప్పులు, ఉదయం పూట శరీరం బిగుసుకుపోవటం వంటి లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందనీ చెప్పలేం. ఎందుకంటే హెచ్‌ఎల్‌ఏ బి27 తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం 50 శాతమే. ఒకవేళ పిల్లల్లో జన్యువు ఉన్నా కూడా జబ్బు వచ్చే అవకాశం 15 శాతమే కావటం గమనార్హం. పేగుల్లో ఇన్‌ఫెక్షన్, మూత్ర ఇన్‌ఫెక్షన్ల వంటి ఇతరత్రా అంశాలు కూడా దీన్ని ప్రేరేపించొచ్చు.
నిర్ధరణ-పరీక్షలు
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తీవ్రమైతే చూడగానే గుర్తుపట్టొచ్చు. వీరిలో శరీర భంగిమ బాగా మారిపోతుంది. నడుము ముందుకు వంగిపోయి, గూని వచ్చినట్టుగా ఉంటారు. మెడను అటూఇటూ సరిగా తిప్పలేరు. పక్కకు చూడాలంటే శరీరం మొత్తాన్ని తిప్పి చూస్తారు. ముందుకు వంగి పాదాలను చేత్తో తాకటమూ సాధ్యం కాదు. బాసింపట్టు వేసుకొని కూచోవటం (సుఖాసనం) సాధ్యం కాదు. వీటిని బట్టి చాలావరకు దీన్ని సులభంగానే గుర్తించొచ్చు. అయితే అందరిలోనూ ఇలాంటి లక్షణాలే ఉండాలనేమీ లేదు. అందువల్ల రక్తపరీక్ష, జన్యుపరీక్ష, ఎక్స్‌రేల వంటి వాటి ద్వారా సమస్యను నిర్ధరిస్తారు. వీరికి ఈఎస్‌ఆర్, సీఆర్‌పీ ఎక్కువగానూ.. హిమోగ్లిబిన్ తక్కువగానూ ఉంటుంది. జన్యుపరీక్షలో హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువు ఉంటే బయటపడుతుంది.
* ఎక్స్‌రే: ఇందులో కండరబంధనాలు, స్నాయువులు గట్టిపడటం.. వెన్నుపూసలు, కీళ్ల మధ్య ఖాళీ పూడుకుపోవటం వంటివి తెలుస్తాయి. సాక్రో ఇలియాక్ కీళ్లు గట్టిపడితే సమస్య తొలిదశలో ఉందని అర్థం. అదే తీవ్రదశకు చేరుకుంటే కీళ్లు పూర్తిగా పూడుకుపోతాయి. ఏమాత్రం ఖాళీ కనిపించదు. కొన్నిసార్లు ఎక్స్‌రేలో తేడా కనబడకపోయినా లక్షణాలు ఉండొచ్చు. ఇలాంటివారికి ఎంఆర్‌ఐ చేసి పరిశీలిస్తారు. అవసరమైతే ఐసోటోప్ బోన్‌స్కాన్ కూడా చేస్తారు.
* యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితులు క్యాల్షియం, విటమిన్ డితో కూడిన పదార్థాలు మరింత ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఖర్జూరం, అంజీరా వంటి ఎండుఫలాలు.. బాదం, అక్రోట్ల వంటి గింజపప్పులు ఎంతో మేలు చేస్తాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువును అదుపులో ఉంచుకోవటం, పొగ అలవాటుకు దూరంగా ఉండటం ఉత్తమం. మెడను విరవటం, గట్టిగా మర్దనలు చేయటం తగదు. ముందు నుంచే దిండు సైజు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మరీ గట్టిగా, మరీ మెత్తగా లేని పరుపులు వాడుకోవాలి. వీరికి ప్రమాదాల్లో కుదుపులకు ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకొస్తుంది?
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువుతో దీనికి బలమైన సంబంధం ఉంటుండటం మాత్రం నిజం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బారినపడ్డ 90% మందిలో ఈ జన్యువు కనబడుతుండటమే దీనికి నిదర్శనం. అయితే హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువు ఉన్నా కూడా జబ్బు రావాలనేమీ లేదు. ఈ జన్యువు ఉన్నవారిలో కేవలం 2% మందికే వచ్చే అవకాశముంది. కాబట్టి జన్యువు ఉండటంతో పాటు నడుంనొప్పి, కీళ్లనొప్పులు, ఉదయం పూట శరీరం బిగుసుకుపోవటం వంటి లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందనీ చెప్పలేం. ఎందుకంటే హెచ్‌ఎల్‌ఏ బి27 తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం 50 శాతమే. ఒకవేళ పిల్లల్లో జన్యువు ఉన్నా కూడా జబ్బు వచ్చే అవకాశం 15 శాతమే కావటం గమనార్హం. పేగుల్లో ఇన్‌ఫెక్షన్, మూత్ర ఇన్‌ఫెక్షన్ల వంటి ఇతరత్రా అంశాలు కూడా దీన్ని ప్రేరేపించొచ్చు.
నిర్ధరణ-పరీక్షలు
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తీవ్రమైతే చూడగానే గుర్తుపట్టొచ్చు. వీరిలో శరీర భంగిమ బాగా మారిపోతుంది. నడుము ముందుకు వంగిపోయి, గూని వచ్చినట్టుగా ఉంటారు. మెడను అటూఇటూ సరిగా తిప్పలేరు. పక్కకు చూడాలంటే శరీరం మొత్తాన్ని తిప్పి చూస్తారు. ముందుకు వంగి పాదాలను చేత్తో తాకటమూ సాధ్యం కాదు. బాసింపట్టు వేసుకొని కూచోవటం (సుఖాసనం) సాధ్యం కాదు. వీటిని బట్టి చాలావరకు దీన్ని సులభంగానే గుర్తించొచ్చు. అయితే అందరిలోనూ ఇలాంటి లక్షణాలే ఉండాలనేమీ లేదు. అందువల్ల రక్తపరీక్ష, జన్యుపరీక్ష, ఎక్స్‌రేల వంటి వాటి ద్వారా సమస్యను నిర్ధరిస్తారు. వీరికి ఈఎస్‌ఆర్, సీఆర్‌పీ ఎక్కువగానూ.. హిమోగ్లిబిన్ తక్కువగానూ ఉంటుంది. జన్యుపరీక్షలో హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువు ఉంటే బయటపడుతుంది.
* ఎక్స్‌రే: ఇందులో కండరబంధనాలు, స్నాయువులు గట్టిపడటం.. వెన్నుపూసలు, కీళ్ల మధ్య ఖాళీ పూడుకుపోవటం వంటివి తెలుస్తాయి. సాక్రో ఇలియాక్ కీళ్లు గట్టిపడితే సమస్య తొలిదశలో ఉందని అర్థం. అదే తీవ్రదశకు చేరుకుంటే కీళ్లు పూర్తిగా పూడుకుపోతాయి. ఏమాత్రం ఖాళీ కనిపించదు. కొన్నిసార్లు ఎక్స్‌రేలో తేడా కనబడకపోయినా లక్షణాలు ఉండొచ్చు. ఇలాంటివారికి ఎంఆర్‌ఐ చేసి పరిశీలిస్తారు. అవసరమైతే ఐసోటోప్ బోన్‌స్కాన్ కూడా చేస్తారు.
చికిత్స- వ్యాయామమే కీలకం
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మూలంగా దెబ్బతిన్న ఎముక తిరిగి కోలుకోవటం దాదాపు అసాధ్యం. అందువల్ల సమస్యను వీలైనంత త్వరగా నిర్ధరించి, చికిత్స తీసుకోవటం చాలా అవసరం. దీంతో ఎముక మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు ఫిజియోథెరపీ, వ్యాయామాలు, మందుల వంటివి బాగా ఉపయోగపడతాయి.
ఫిజియోథెరపీ: వెన్ను బిర్రబిగుసుకోవటానికి విశ్రాంతి పెద్ద శత్రువు. ఎందుకంటే కదలికలు తగ్గినకొద్దీ కీళ్లు బిగుసుకుపోవటం ఎక్కువవుతుంది. చురుకుగా ఉండటం, బాగా కదిలేలా చూసుకోవటమే దీనికి మంచి మందు. అందుకే చికిత్సలో ఫిజియోథెరపీ, వ్యాయామాలే చాలా కీలకం. రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం చేయటం అవసరం. నొప్పులు ఎక్కువున్నా మందులు తీసుకుంటూనైనా వ్యాయామాలు ఆరంభించాలి. కొందరు యువకులు వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. కదలికలన్నీ బాగానే ఉంటున్నాయి కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. వెన్నెముక గడకర్రలా తయారయ్యాక చేసేదేమీ ఉండదని గుర్తించాలి. వీరికి ఈత, యోగ బాగా ఉపయోగపడతాయి. వీలైతే నడక వంటి ఇతరత్రా వ్యాయామాలూ చేయొచ్చు. ఒకసారి ఫిజియోథెరపీ తీసుకొని, వ్యాయామాలను నేర్చుకున్నాక ఎవరికివారు ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద బరువులు ఎత్తటం, బాక్సింగ్, ఫుట్‌బాల్ వంటి ఒంటికి దెబ్బలు తగలటానికి ఆస్కారం గల వ్యాయామాలు చేయకూడదు.
నొప్పి మందులు: ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు బాగా ఉపయోగపడతాయి. మొదట్లో రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అప్పటికి వ్యాయామాల ప్రభావం మొదలవుతుంది. కొంతకాలానికి వ్యాయామమే మందుగా పనిచేస్తుంది. నొప్పి తగ్గుతూ వస్తుంది. తర్వాత క్రమంగా నొప్పి మందులు మానెయ్యొచ్చు. అయితే నొప్పి మందులను సొంతంగా కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. లేకపోతే కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు.
సల్ఫసలజైన్, మిథట్రక్సేట్: ఇవి కీళ్లవాతానికి దారితీసే మూల కారణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి. వీటి వాడకం ఆరంభించిన రెండు, మూడు నెలల తర్వాత పూర్తి ప్రభావం కనబడుతుంది. సల్ఫసలజైన్‌ను ఉదయం, సాయంత్రం 1 గ్రాము మోతాదులో ఇస్తారు. మిథట్రక్సేట్‌ను వారానికి ఒకసారి మాత్రమే.. అదీ 15-25 మి.గ్రా. మోతాదులో ఇస్తారు. మిథట్రక్సేట్‌తో దుష్ప్రభావాలు తలెత్తకుండా పాటు ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణకు ప్రయత్నించేవారు మూడు నెలల ముందుగానే మిథట్రక్సేట్ మానెయ్యాల్సి ఉంటుంది.
స్టిరాయిడ్లు: కీళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన నొప్పితో బాధపడేవారికి ఇంజెక్షన్ల రూపంలో నేరుగా కీళ్లలోకి ఇస్తారు. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇవి ఎంథెసైటిస్‌కు కూడా బాగా ఉపయోగపడతాయి. అరుదుగా కొందరికి స్టిరాయిడ్ మాత్రలు ఇవ్వాల్సి రావొచ్చు.
బయలాజికల్స్: ఇవి సజీవ కణాల నుంచి ఉత్పత్తి చేసే ప్రోటీన్ అణువులు. చాలా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయివి. కాకపోతే ఖరీదు ఎక్కువ. ఇటీవలి కాలంలో కాస్త చవకగానూ లభిస్తున్నాయి. వీటి రాకతో కీళ్లవాతం చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇవి వాపుప్రక్రియను ప్రేరేపించే టీఎన్‌ఎఫ్, ఇంటర్‌ల్యూకిన్-17 అనే సైటోకైన్లను అడ్డుకుంటూ.. వెన్నెముక బిగుసుకుపోవటాన్ని, కీళ్లవాపును తగ్గిస్తాయి. యాంటీ టీఎన్‌ఎన్‌ఎఫ్ మందుల్లో ఇన్‌ఫ్లిక్సిమాబ్, ఎటనొర్‌సెప్ట్, అడలి మాబ్, గొలిముమాబ్, సెరటొలిజుమాబ్ అని ఐదు రకాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా సెకిక్యునిమాబ్ అనే యాంటీ ఐఎల్-17 యాంటీబాడీ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బయలాజికల్స్ మాదిరిగానే పనిచేసే ఎటాసెప్ట్, ఇన్‌ఫ్లిమాబ్, ఎగ్జిమ్షియా వంటి బయోసిమిలర్లు కూడా వస్తున్నాయి. వీటి ఖరీదూ తక్కువే.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565