జలదానం
జలపాతాన్ని వీక్షిస్తే మనసు మురుస్తుంది... నదిని తిలకిస్తే మది నాట్యమాడుతుంది... సముద్రం ఒడ్డున సేదతీరితే హృదయ సంబరం అంబరాన్ని తాకుతుంది. పిల్లకాలువ పక్క నుంచి వెళ్తుంటే.. చిలిపితనం పరవళ్లు తొక్కుతుంది. వానలు వెల్లువై.. వాగులు, వంకలు పొంగిపొర్లితే.. నీటిపై వలపు వసంతమై ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. నీరు, మనిషి మధ్య పెనవేసుకున్న అవ్యాజమైన అనురాగ బాంధవ్యమిది.
నీటికి, మనిషికి జన్మజన్మల అనుబంధం ఉంది. మన శరీరంలో డెబ్బయ్ శాతానికిపైగా నీరే ఉంది. ఎక్కడ నీటి గలగలలు ఉంటే.. అక్కడ జీవన సంగీతం మధురిమలతో సాగిపోతుంది. మనిషి స్వయం కృతాపరాధం వల్ల ఆ జలగీతంలో అపశ్రుతి దొర్లితే.. సమాజం పరిస్థితి రసాభాసై పోతుంది. ఇంతటి అపురూప బంధాన్ని అజాగ్రత్తతో, నిర్లిప్తతతో, నిర్లక్ష్యంతో తెంచుకుంటే చివరకు మిగిలేది ఏమిటి? అంతులేని ఆవేదన... ఆక్రందన.
‘ధర్మో రక్షతి రక్షితః’ అంటారు. నీరూ ధర్మం వంటిదే! నీటిని రక్షించుకుంటే.. ఆ నీరే మనల్ని రక్షిస్తుంది. ఏ సమాజానికైనా సర్వకాల సర్వావస్థల్లో వర్తించే జలసూత్రమిది.
శివాజ్ఞ తెలుసా?
‘భవంతీ ప్రాణిసః అస్మాత్ భవః’ ఎవరి కారకశక్తి వల్ల ప్రాణులు ఆవిర్భవిస్తున్నాయో, ఆ దివ్య స్వరూపుడే భవుడని వేదవాక్కు. అలాంటి భవుడైన శివాంశతో ఆవిష్కారమైన నీటిని ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఐశ్వర్య కారకుడైన ఈశ్వరుడు సృష్టించిన జలనిధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఇదే శివాజ్ఞ.
సనాతన ధర్మం ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా భావిస్తుంది. అందులో ముఖ్యభాగమైన జలనిధుల్ని, జలాశయాల్ని, నదీనదాల్ని ప్రత్యక్ష దేవతలుగా ఆర్ష సంప్రదాయం ఆరాధిస్తుంది. జీవజాలానికి జలనికేతనాలైన నదులు చేస్తోన్న నదీమతల్లుల అనితర సాధ్యమైన సహాయానికి కృతజ్ఞతగా కుంభమేళాల్ని, పుష్కరాల్ని నిర్వహిస్తున్నాం. దేశంలో ఉన్న పన్నెండు ముఖ్యనదులకు ఏటా పుష్కరోత్సవాలను కొనసాగిస్తూ జల వనరులపై మనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాం. జల నిధుల విలువ, వాటిని సంరక్షించుకోవాల్సిన విధానం, జల వనరులను కలుషితం కాకుండా చూసుకోవాలనే విషయాలను సైన్స్ మాత్రమే కాదు వేదాలూ నొక్కివక్కాణించాయి...
* ‘‘ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్పురుషః’’
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, దాని నుంచి జలం, అందులో నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటి నుంచి అన్నం ఉద్భవించాయి. ఆ అన్నం నుంచి మానవుడు పుట్టాడని తైత్తిరియోపనిషత్తు వివరించింది.
‘‘ఆపఃపునస్తు పృథ్వీమ్, పృథ్వీపూతా పునాతుమామ్’’
అని వేదవాక్కు. నీరు భూమిని పరిశుభ్రం చేస్తుంది. అంటే పవిత్రీకరిస్తుంది. భూమికి వైశిష్ట్యం నీటి వల్లే ఏర్పడింది. సౌరకుటుంబంలో భూమి మీద మాత్రమే పుష్కలంగా నీరుంది. ఆ నీరు ఘన, ద్రవ, వాయు రూపాల్లో భూవాతావరణంలో లభ్యమవుతోంది. అందుకే భూమిపైన మాత్రమే జీవుల మనుగడ కొనసాగుతోంది. కాబట్టి జీవ జాలానికి నీరే ముఖ్య ఆధారమైంది.
* నింగి, నేల, నీరు, నిప్పు, గాలి.. ఈ ఐదింటినీ పంచభూతాలుగా అభివర్ణిస్తారు. వీటిలో దేని ప్రాధాన్యం దానిదే. అయితే ఈ ఐదింటిలో నీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. రుద్వేదం పదో మూలంలో ఉన్న 75వ సూక్తంలోని మొదటి రుక్కులో జలస్తుతి, నదీ స్తోత్రాలు ఉన్నాయి. నదీ ప్రాశస్త్యాన్ని, జల వైభవాన్ని, వేద వాఙ్మయం విశదీకరించింది. అష్టదిక్పాలకుల్లో వరుణుడు జలాధిదేవత. వరుణుడు సముద్ర రూపమైన భగవంతుడని, సర్వత్రా వ్యాపించి ఉన్నాడని ‘అఘమర్షణ సూక్తం’ పేర్కొంది. ‘హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థంమే దేహి యాచితః’.. తలపై బంగారు కొమ్ము ఉన్న వరుణుడు సులభ ప్రసన్నుడు.
* వరుణుడి ద్వారా లభించిన జలాన్ని కాలుష్యమయం చేయకూడదని వేదం సూచించింది. ‘యదసాం క్రూరం యదమేధ్యం యదశాంతం తద పగద్ఛతాల్’.. దుఃఖానికి కారకమయ్యేది, పవిత్రం కానిది, ప్రశాంతతను భగ్నం చేసేది ఏదైనా సరే.. జలం నుంచి పరిహరించుగాక అని వేద సూక్తం అకాంక్షించింది. ‘తన అనుగ్రహం ద్వారా లభించిన నీటిని సద్వినియోగం చేసుకొని, దేవలోకంలో ఉండే అమృతంతో సమానమైన నీటి విషయంలో మానవుడు విచక్షణాయుతంగా వ్యవహరించాలి. జీవజాలం జలంతో సుభిక్షంగా వర్ధిల్లుతూ ప్రఫుల్లితం కావాలి’ అని వరుణదేవుడి మంగళాశాసనాల్ని వరుణసూక్తం వ్యక్తీకరిస్తుంది.
* ‘‘ఆపోవా ఇదగ్ం సర్వమిత్యామ్నాయ ప్రమాణతః జలదేవాన్నసంభూతః అన్నం బ్రహ్మేతి చశ్రుతిః’’
మనిషి బతకాలంటే అన్నం కావాలి. ఆహార సృష్టికి ప్రధాన ఆధారం నీరే. అంతెందుకు నీటి నుంచే జీవం ఉద్భవించింది. అందుకు సంకేతంగా, శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యరూపం నుంచి జల సంబంధమైనదే. మానవ జీవనక్రమ పరిణామ వికాసం నీటిలోని మత్స్యరూపం నుంచి కొనసాగిందన్న విషయాన్ని దశావతారాలు ఆవిష్కరిస్తున్నాయి.
* ‘‘చరాచర జగద్భీజం జలమేవ నసంశయః కిం పునర్చహునోక్తేన జలాధిక్యం వదామ్యహమ్’’
చరాచర జగత్తుకు హేతువు నీరే! జగత్తు ఆవిర్భావానికి తొలి బీజం నీటి నుంచే ఆరంభమైంది. అందుకే నీరు మనిషికి పుట్టిల్లులాంటిది. జన్మ ప్రదేశమైన నీటి విషయంలో మనిషి ఎప్పుడూ గౌరవ భావాన్ని ప్రదర్శించాలి. మక్కువ చూపాలి. జల సంరక్షణలో, వినియోగంలో సర్వదా జాగ్రత్త వహించాలి.
* గంగాధరో హరస్వోపి విష్ణురంబోధిమందిరః బ్రహ్మా జల సంభూతః తస్మాత్ సర్వాధికం జలం
లయకారుడైన శివుడు తన శిరస్సుపై గంగను ధరించాడు. స్థితికారుడైన విష్ణువు సముద్రాన్నే తన నివాస స్థలంగా చేసుకొన్నాడు. సృష్టికారకుడైన బ్రహ్మ.. నీటి నుంచి ఆవిర్భవించిన కమలంలో పుట్టి.. అక్కడే నివసిస్తున్నాడు. కాబట్టి త్రిమూర్తులకు అత్యంత ప్రియమైన జలం... ఈ సమస్త సృష్టిలో ప్రశస్తమైనది, సర్వోత్కృష్టమైనదని ఉపనిషత్తు చెప్పిన మాట.
* ‘ఉదకం నారాయణ స్వరూపం’ అంటారు. నారాయణుడు అంటేనే జలంలో సదా కొలువుదీరి ఉండే భగవత్ చైతన్య రూపుడని అర్థం చెబుతారు. ఇక శివుడ్ని భవుడు అంటారు. ‘నమో భవాయచ రుద్రాయచ’ అంటూ రుద్రం పరమేశ్వరుణ్ని కీర్తించింది. పరమశివుడు అష్టమూర్తులుగా ఈ జగత్తు అంతా ఆవరించి ఉన్నాడనీ, ముల్లోకాలకు భవుడే అధినాయకుడని అధర్వణ వేదం స్తుతించింది. శివుడి అష్టమూర్తులలో ‘భవుడు’ జలాధిష్ఠాన దేవత. అందుకే ఆయన్ని జలేశ్వరుడిగా శివసహస్రనామం ప్రస్తావించింది. వర్షం వల్ల ఏర్పడే నదీ జలాల్లోనూ, సముద్ర జలాల్లోనూ భవుడు నెలకొని ఉంటాడనీ, సర్వజీవులకు ప్రాణకారక శక్తి భవుడేనని శతరుద్ర సంహిత పేర్కొంది.
* మన సంస్కృతిలో నీటిపై ఎప్పటికీ ఆరాధనా భావమే ఉంది. ఏ నదిలో స్నానం చేస్తున్నా.. చివరికి నూతి గట్టున స్నానం చేస్తున్నా.. అన్ని నదుల జలాలూ మన సన్నిధికి తరలి రావాలని సంకల్పం చేసుకుంటాం. కలశం చేతిలో ఉంచుకొని..
నేలలో నీటి మూటలు దాచేయండి... నీటికి, మనిషికి జన్మజన్మల అనుబంధం ఉంది. మన శరీరంలో డెబ్బయ్ శాతానికిపైగా నీరే ఉంది. ఎక్కడ నీటి గలగలలు ఉంటే.. అక్కడ జీవన సంగీతం మధురిమలతో సాగిపోతుంది. మనిషి స్వయం కృతాపరాధం వల్ల ఆ జలగీతంలో అపశ్రుతి దొర్లితే.. సమాజం పరిస్థితి రసాభాసై పోతుంది. ఇంతటి అపురూప బంధాన్ని అజాగ్రత్తతో, నిర్లిప్తతతో, నిర్లక్ష్యంతో తెంచుకుంటే చివరకు మిగిలేది ఏమిటి? అంతులేని ఆవేదన... ఆక్రందన.

అనగనగా ఒక కాకి. దానికి దాహం వేసింది. ఓ కుండ దగ్గరికి వెళ్లింది. నీళ్లు అడుగున ఉన్నాయి. కాకి ఉపాయంగా గులకరాళ్లు తెచ్చి కుండలో వేసింది. నీళ్లు పైకొచ్చాయి. కాకి కడుపు నిండా నీళ్లు తాగి ఎంచక్కా ఎగిరిపోయింది. ఈ కథ చిన్నతనంలో ఇష్టంగా చదువుకున్నాం కదా. కాకి తెలివి తేటలకు మురిసిపోయాం కూడా! ఈ కథ ఎలాంటిదంటే దాహం వేసినపుడు బావి తవ్వడం లాంటిది. ఈ కథకు కొనసాగింపు కూడా ఉంది. ఈసారి రెండు కాకులకు దాహం వేసింది. అదే కుండ దగ్గరికి వచ్చాయి. కుండలో నీళ్లు లేవు. నిండా గులకరాళ్లు ఉన్నాయి. కాకులు ఆ కుండను ఎలాగోలా పగలగొట్టాయి. అందులోని రాళ్లను భూమిపై చిన్న గుంట చుట్టూ ఓ పద్ధతి ప్రకారం పేర్చాయి. చుట్టూ మట్టిని చేర్చి ఆనకట్టలా అమర్చి పైకి ఎగిరిపోయాయి. వర్షాకాలం వచ్చింది. ఆ రాతి గుంట నీటితో నిండింది. ఆ రెండు కాకులే కాదు, ఎన్నో పక్షులు అక్కడికి వచ్చి తమ దాహార్తిని తీర్చుకున్నాయి. రెండు కాకుల తెలివిని మనుషులు అలవర్చుకోవాలి. మబ్బులో నీళ్లను చూసి ముంత ఒలకబోసుకుంటే ఒరిగేదేం ఉండదు. నీటి విషయంలో ముందుజాగ్రత్త అవసరం. ప్రతి వర్షపు చినుకునీ ఒడిసిపట్టాలి. భూమిలో దాచుకున్న నీటి మూటలే.. నీటి ఊటలై రేపటి తరాల అవసరాలకు అక్కరకొస్తాయి. నీటి వృధాను అరికట్టి పొదుపుగా వాడుకుంటే.. భవిష్యత్తు మనదే! జలమే ఆలంబనగా జయజయధ్వానాలతో జలకేతనాన్ని ఎగురవేద్దాం. గలగల సవ్వడులతో జలగీతాన్ని ఆలపిద్దాం.
‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు’
గంగ నుంచి కావేరి వరకు అన్ని నదుల జలాలూ మన చెంతకు రావాలని, మన పెన్నిధి కావాలని విన్నవించుకుంటాం. కొళాయి నీళ్లతో స్నానం చేసినా.. ఈ శ్లోకాన్ని పఠించి సర్వనదుల్లో స్నానం ఆచరించిన అనుభూతి చెందుతాం. అలాంటి పుణ్యనదుల్ని కలుషితం చేసి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చడం ఎంత వరకు సబబు. మన అకృత్యాలకు ఆ నదీమతల్లులు ఎంత క్షోభిస్తాయి. ఓవైపు నదులను పాడుచేస్తూ.. మరోవైపు వాటిని కీర్తిస్తే.. మన సంకల్పసిద్ధి నెరవేరుతుందా! నదుల్ని సుజల స్రవంతులుగా, స్వచ్ఛయుత వాహినులుగా ఉంచడమే నదులపై మనం చూపే అసలైన కృతజ్ఞత.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
Digital marketing agency in Delhi