1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.
2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితముగా చదవాలి.
3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి.
4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి.
మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానముగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా లభిస్తుంది
++++++++++++++++++++
రుక్మిణీ కల్యాణం పఠన ఫలితం!
యుక్త వయసులోకి అడుగు పెట్టిన అమ్మాయిలు తమ వివాహాన్ని గురించి ఎన్నో కలలు కంటూ వుంటారు. తమ కల్యాణం వైభవంగా జరగాలనీ, అందగాడు .. మంచి మనసున్నవాడు భర్తగా లభించాలని కోరుకుంటూ వుంటారు. తమ వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని ఆశిస్తూ వుంటారు. ఇక వివాహమై కొన్ని కారణాల వలన భర్తకి దూరంగా వుండేవాళ్లు వుంటారు. అలాంటి వాళ్లు తమ మధ్య గల మనస్పర్థలు తొలగిపోయి తాము ఒకటిగా కలిసిపోయే క్షణాల కోసం ఎదురుచూస్తుంటారు.
ఇక యువకులు కూడా తమకి తగిన కన్య లభించాలని భావిస్తుంటారు. తమని అర్థం చేసుకునే అర్థాంగి రావాలని ఆశిస్తుంటారు. అలాంటి వాళ్లంతా 'రుక్మిణీ కళ్యాణం' గ్రంధాన్ని చదువుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీ కృష్ణుడిపై రుక్మిణీదేవి మనసు పారేసుకోవడం .. తనకి ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి పీటలపై కూర్చోవలసి రావడం .. దాంతో ఆమె శ్రీ కృష్ణుడికి కబురు చేయడం .. సమయానికి ఆయన వచ్చి ఆమెను ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడం జరిగింది. అలాంటి 'రుక్మిణీ కల్యాణం' గ్రంధాన్ని చదవడం వలన ఇష్టపడిన వారితో వివాహం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
Video Links:-
1) https://youtu.be/yd7aQobpJrU
2) https://youtu.be/AucqyMUvtBY
3) https://youtu.be/pZOCdDMjOfU
4) https://youtu.be/k0WLQvvEE_8
5) https://youtu.be/YaZ4YnrE9wo
6) https://youtu.be/wioB0jWovmU
7) https://youtu.be/jR1tskmMqy8
8) https://youtu.be/Df7kYbRHmh4
---------------------------------------------------
---------------------------------------------------
గోదాశ్రీరంగనాథులు
ఆది దంపతుల ఆదర్శ జీవనం!
తెలుగువారికి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైంది. ఎన్నో విశేషాల సమాహారం ఈ పర్వదినం. ఒక్కరోజు కాదు మూడు నాలుగు రోజులు ఇంటిల్లపాదీ ఉల్లాసంగా జరుపుకునే పండుగ ఇది. అల్లుళ్లను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆదరించే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైంది. కొత్త అల్లుడైతే ఆ ఆదరణ.. మర్యాదలు ఇక చెప్పనక్కరలేదు. అందువల్ల దీన్ని అల్లుళ్ల పండుగగా చెబుతారు.
తెలుగువారు అల్లుణ్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణునిగా భావించి కన్యాదానం చేయడం వివాహ సంప్రదాయం. ఈ భావన మనసులో కలగగానే గోదాదేవి.. విష్ణుచిత్తుల గాథ మదిలో మెదులుతుంది. గోదాదేవి ఎంతగా శ్రీరంగనాథుని వలచిందో ఆ రంగనాథుడు కూడా అంతగా వరించి పరిణయమాడిన దివ్యగాథ ఇది. భార్యాభర్తలు ఎలా ఉండాలో ఆదర్శంగా చాటిన దివ్యదంపతులు గోదాశ్రీరంగనాథులు. నిత్యజీవితంలో ఎలా మసలుకోవాలో చిన్నచిన్న అంశాలను కూడా ఆచరించి చూపారు.
ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా మనసువిప్పి చక్కగా మాట్లాడుకునే వాతావరణమే చాలామంది భార్యాభర్తల విషయంలో అరుదైపోతోంది. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో దొరికే కొద్దిపాటి సమయాన్ని కూడా టీవీలు, సెల్‌ఫోన్లు మింగేస్తున్నాయి. ఇక పిచ్చాపాటీకి తీరికెక్కడిది! పోనీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలైనా మాట్లాడుకుంటున్నారా? అంటే అదీ అనుమానమే! భార్యాభర్తలు ఎలాంటి సంకోచాలు.. దాపరికాలు లేకుండా హాయిగా మాట్లాడుకుంటే ఆ ఉల్లాసమే వేరుగా ఉంటుంది. శ్రీమహాలక్ష్మి విషయంలో నారాయణుడు ఎలా ఉన్నాడో చూడండి!
అపూర్వ నానారసభావ నిర్భర
ప్రబుద్ధయా ముగ్ధ విదగ్ధ లీలయా
క్షణాణువత్ క్షిప్త పరాది కాలయా
ప్రహర్షయన్తం మహిషీం మహాభుజమ్
పరమాత్మ ఏ పని అయినా సరే అది లక్ష్మీదేవికి ఆనందమయంగాను, అనురాగ జనకంగాను పరిణమించాలనే తాపత్రయంతోనే చేస్తాడు. ఏమాత్రం అవకాశం చిక్కినా అమ్మవారి సాన్నిధ్యంలోనే గడుపుతాడు. చతుర సంభాషణలు...హాస్యోక్తులు.. శృంగారపు సుద్దులు.. వీరత్వాన్ని చాటే ధీరగంభీర లీలలు.. ఇలా మాట్లాడుతుంటే అమ్మవారికి ఎంత కాలమైనా సరే ఒక్క క్షణంలా గడిచిపోతుంది. అంత చాతుర్యంగా ఆనందంగా దంపతులు గడపాలన్నదే ఇక్కడి బోధ.
‘యస్త్వయా సహ స స్వర్గః నిరయో యస్త్వయా వినా’ నీతో ఉంటే అదే నాకు స్వర్గం.. నీతో లేకుంటే అదే నాకు నరకం! అని ఈ భావన ఇద్దరిలో ఉన్ననాడు ఆ దాంపత్యం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అనుభవైకవేద్యమే అవుతుంది.
స్వామి ప్రతి గాథనూ ఒక బోధగా భావించి మనసుకు పట్టించుకు నిరంతరం మననం చేసుకోవాలి. బాగా జీర్ణమయ్యాక ఆచరణలోకి తీసుకురావాలి.
శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః
అంగీకారిభిరాలోకైః సార్థయన్తై్య కృతోంజలిః
ఇంతటి సృష్టికార్యాన్ని నిర్వర్తించి నారాయణుడు ఒక్కసారి లక్ష్మీదేవి వైపు చూస్తాడు. భర్త చేసిన పనికి లక్ష్మీదేవి తన కడగంటి చూపుతో అంగీకారాన్ని తెలుపుతుంది. అపుడు నారాయణుడు తను చేసిన పని భార్యకు సంతోషాన్నిచ్చిందని తృప్తిపొందుతాడు. ఇవాళ సమాజంలో ఎంతమంది భార్యభర్తలు ఇలా ఉంటున్నారు? ఆయన చేసే పని ఆమెకు తెలియదు. ఆమె చేసే పని ఏమిటో ఆయనకు చెప్పదు. పొరపాటుగా తెలిసినా అందులో లోపాలు వెదకడానికే సమయం సరిపోతుంది తప్ప మెచ్చుకోళ్లు ఇంకెక్కడ! అలాకాక ఎవరు చేసినా ఆ పనిని భాగస్వామి మెచ్చుకుంటే ఎదుటివారికి ఎంతటి తృప్తి! నారాయణుడే భార్య మెచ్చుకోలుకు అంత పొంగిపోయాడంటే మానవమాత్రులం మనమెంత! అలా అని లోపాలు చెప్పొద్దని కాదు. ఉచితానుచితాలు అనుసరించి చెబితే అది గ్రాహ్యమే అవుతుంది.
అల్లుని ప్రవర్తన అటు తల్లిదండ్రులకే కాదు అత్తమామలకూ గర్వకారణం కావాలని శ్రీరంగనాథుని దివ్యచరిత తెలుపుతోంది. పరమాత్మనే అల్లునిగా పొంది విష్ణుచిత్తులు పన్నిద్దరు ఆళ్వారుల్లో ‘పెరియాళ్వారు’ గా ప్రసిద్ధి పొందారు. అల్లుని వైశిష్ట్యం సొంత ఇంటికే కాదు అత్తింటికి కూడా పేరు ప్రఖ్యాతులు తెస్తుందని ఈ గాథలోని విశేషం. పర్వదినాలన్నీ చాంద్రమానం ప్రకారం చేసుకునే తెలుగువాళ్లం ‘సంక్రాంతి’ పండుగ విషయంలో సౌరమానాన్ని అనుసరించడం విశేషం.
- మాధురి
How to get a PDF copy of this book..? Thanks
ReplyDelete