MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఎదిగిన కొద్దీ ఒదగాలి!-Development of Life



ఎదిగిన కొద్దీ ఒదగాలి!

పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయతలపెట్టాడు. యాగానికి పదిహేను రోజుల ముందు.. సోదరులను, కౌరవులను, కృష్ణభగవానుణ్ణి, ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరారు ధర్మరాజు. సభకు హాజరైనవారంతా.. ‘దానిదేం భాగ్యం ధర్మరాజా! మీరు ఏం చెబితే అది చేస్తామ’ని ప్రకటించారు. భీముడికి భోజనాల విభాగం చూసుకోమని చెప్పాడు. కర్ణుడికి దానధర్మాలు చూసుకోవాల్సిందిగా కోరాడు. ఆదాయ, వ్యయాల విషయాలన్నీ దుర్యోధనుడికి అప్పగించాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు ధర్మరాజు. ఇంతలో శ్రీకృష్ణుడు లేచి.. ‘ధర్మరాజా! అందరికీ అన్ని పనులు చెప్పేస్తున్నావు. మరి నామాటేమిటి?’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు.. ‘పరమాత్మా! నీవు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ. మీ సాన్నిథ్య బలంతో యాగం నిర్విఘ్నంగా సాగిపోతుంది’ అని బదులిచ్చాడు. అయినా కృష్ణుడు ఒప్పుకోలేదు. తనకేదైనా పని అప్పగించాల్సిందేనని పట్టుబడ్డాడు. దైవంగా కొలిచే కృష్ణ పరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక ధర్మరాజు తికమకపడ్డాడు. ధర్మజుడి ఇబ్బంది గ్రహించిన కృష్ణుడు.. ‘ధర్మరాజా! యాగానికి వచ్చే మునులు, రుషుల పాదాలు కడిగే బాధ్యత నాద’ని చెప్పాడు. ధర్మరాజు విస్తుపోయాడు. అన్నట్టుగానే యాగంలో తపస్సంపన్నుల పాద సేవ చేశాడు కృష్ణుడు. రాజసూయ యాగం పూర్తయిన తర్వాత అగ్రపూజ అందుకున్నాడు. ఎంత వాడైనా ఒదిగి ఉండాలనే సత్యాన్ని ఈ దృష్టాంతం ద్వారా లోకానికి చాటిచెప్పాడు శ్రీకృష్ణుడు.


క్లౌడ్‌ ఎగ్‌.. ఇది ట్రెండీ ఫుడ్‌!
ఇన్ స్టాగ్రమ్‌లో ఫ్యాషన్స్ తో పాటు ఫుడ్‌ కూడా వైరల్‌ అవుతుంటుంది. తాజాగా ‘క్లౌడ్‌ ఎగ్‌’ ఇన్ స్టాగ్రమ్‌లో పాపులర్‌ ఫుడ్‌. ఈ ట్రెండీ ఫుడ్‌ వైరల్‌ అవుతోంది. ఇంతకీ క్లౌడ్‌ ఎగ్‌.. ఏంటా అని కంగారు పడకండి.. అది మేఘాల్లా అనిపించే కోడిగుడ్డు ఆమ్లెట్‌. కోడిగుడ్డులోని తెల్లసొన, పచ్చసొనను వేరుచేయాలి. ఆ తర్వాత తెల్లసొనను పెనంపై మేఘంలాగా ఉడికించాలి. మధ్యలో పచ్చసొన పోయాలి. దీనినే క్లౌడ్‌ ఎగ్‌ అంటున్నారు. దీన్ని తయారు చేశాక.. క్లౌడ్‌ ఎగ్‌ రెడీ అంటూ ఇన్ స్టాగ్రమ్‌లో ఫొటోలను పోస్ట్‌ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. కొందరు పుట్టగొడుగుల్లా, కాలిఫ్లవర్‌ ఆకృతిలో ఇలా ఆమ్లెట్‌ ఎలా తయారు చేసినా తెల్లసొన మేఘాల్లాగా కనిపించేట్లు తయారు చేస్తున్నారు.



జుట్టు రాలిపోకుండా...
మర్రి ఊడల్ని చూస్తే జెడలు వేళ్లాడుతున్నట్లే ఉంటాయి. ఈ సామ్యం, ఒక రకంగా, మనిషి జుట్టుకూ, మర్రిచెట్టుకూ ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ఎందుకంటే, జట్టును ఏపుగా పెంచడంలోనూ, జుట్టు రాలిపోకుండా కాపాడటంలోనూ మర్రి అద్భుతంగా పనిచేస్తుంది. మర్రి ఆధారంగా గృహవైద్య ఔషధం తయారుచేసుకోవడం చాలా తేలిక కూడా. .
మర్రి చెట్టు ఊడల్ని 500 గ్రాముల పరిమాణంలో తీసుకుని, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చీల్చి ఎండబెట్టాలి. వాటిని ఎంత సన్నగా చీలిస్తే, అంత తొందరగా ఎండుతాయి. అలా ఎండిన వాటిని చూర్ణం చెయ్యాలి. ఆ చూర్ణాన్ని 250 గ్రాములు తీసుకుని ఒక కేజీ స్వచ్ఛమైన కొబ్బరినూనెతో గానీ, నువ్వుల నూనెతో గానీ కలిపి వారం రోజుల పాటు రోజూ ఎండబెట్టాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని గుడ్డలో వడగట్టి నూనె పూర్తిగా దిగేవరకు ఉంచాలి. అలా తయారైన నూనెను రోజూ రాత్రిపూట పడుకునే వేళ మాడుకు పట్టించాలి. అలా 6 మాసాలు చేస్తే జుట్టు ఇంక ఊడదు. పైగా ఏపుగా పెరుగుతుంది.
కాకపోతే ఈ నూనెను వాడటానికి ముందు జటిలమైన ఇతర వ్యాధులేమైనా ఉంటే సరియైున వైద్యం తీసుకుని తగ్గించుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన ఇతర వ్యాధులేమీ లేనప్పుడే ఈ ఔషధ తైలం బాగా పనిచేస్తుంది.

ఆరోగ్యమైన గోళ్లకు...
గోళ్లు పసుపుపచ్చగా ఉంటే అవి ఆరోగ్యకరంగా లేవని అర్థం. అలాంటి గోళ్ల వల్ల చేతులు కూడా అందంగా కనిపించవు. గోళ్లు నాజూగ్గా... ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని హోమ్‌ రెమెడీలున్నాయి. అవే ఇవి..
ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మరసం పోసి అందులో వేళ్ల అంచుల్ని పది నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే గోళ్లకున్న పసుపురంగు పోతుంది. వేళ్లు నాజూగ్గా తయారవుతాయి.
ఒక గిన్నెలో కొద్దిగా నీరు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. అందులో కొన్ని నిమిషాలపాటు వేళ్లను నాననిచ్చి తర్వాత నీళ్లతో వాటిని శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే కూడా గోళ్లకున్న పసుపురంగు పోతుంది.
పోషకాహారలోపం కూడా ఇందుకు ఒక కారణమే. అందుకే రోజూ మాంసం, పాల ఉత్పత్తులు, ధాన్యాలు, పళ్లు, కూరగాయలు తినాలి.


కీళ్ల నొప్పుల్ని తగ్గించే ఫైబర్‌ ఫుడ్‌!
పెద్దవారు కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. ఫైబర్‌ ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, ఆపిల్‌, గింజలు, ఓట్స్‌.. లాంటి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. టఫ్స్‌ యూనివర్శిటీ ఇన్‌ బోస్టన్‌ వారు తాజాగా ఓ సర్వే చేశారు. యాభై ఏళ్లు పైబడిన 4796 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరిలో స్త్రీ, పురుషులిద్దరూ ఉన్నారు. ఫైబర్‌ కంటెంట్‌ తక్కువగా తీసుకున్నవారిలో కీళ్లనొప్పులతో బాధపడుతున్నారని తేలింది. మొత్తానికి యాభై ఏళ్లకు పైబడిన వారు.. ప్రతిరోజూ 22.4 గ్రాములు ఫైబర్‌ను మహిళలు తీసుకోవాలి. పురుషులైతే 28 గ్రాములు తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

వాటా ఇమ్మంటే స్పందించడం లేదు

మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్నగారికి మా అత్తగారి ద్వారా సంక్రమించిన 90 సెంట్ల భూమి ఉంది. ఇది మా ఊరు పక్కనే ఉంది. అయితే గత 15 ఏళ్లుగా ఆ భూమిని సాగుచేయడం లేదు. మా అన్నయ్య చనిపోయాడు. ఆయన భార్య ఉద్యోగం చేస్తోంది. మా తమ్ముడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. నేను పోలియోతో ఒక కాలు పనిచేయకుండా పోయిన అంగ వికలుడిని. నాకు పెళ్లయ్యింది. కానీ సంతానం కలగలేదు. నాకు ఏ రకమైన ఆదాయమూ లేదు. మాకున్న ఆ 90 సెంట్ల భూమి ఖరీదు దాదాపు 40 లక్షల దాకా పలుకుతోంది. ఆ భూమిలో నాకు నా భాగం పంచివ్వమని అడిగితే మా వదిన, మా తమ్ముడు ఏమాత్రం స్పందించడం లేదు. నాకు ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. నాకు న్యాయంగా రావలసిన ఆ 30 సెంటిమెంట్ల భూమి నాకు రావడానికి, అవసరమైతే ఆ భూమిని నేను అమ్ముకోవడానికి మార్గమేమిటో తెలియచేయండి.
-వై. వీరారెడ్డి, వింజమూరు

మీ అత్తగారి ద్వారా మీ నాన్న గారికి 90 సెంటిమెంట్ల భూమి సంక్రమించినట్లుగా రాశారు. కానీ, ఏ రకంగా ఆ భూమి సంక్రమించిందో మీరు ఆ వివరాలేమీ రాయలేదు. ఒకవేళ రివెన్యూ రికార్డులలో ఈ భూమికి సంబంధించి పట్టాదారు కాలమూ, సాగుచేయు వారి కాలమూ ఎవరి పేరున నమోదు అయి ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీ అత్తగారి పేరే అందులో నమోదై ఉన్నట్లయితే, మీ అత్తగారికి వారసులెవరూ లేనట్లయితే, లేదా మీ నాన్నగారికి రిజిస్టర్డ్‌ దస్తావేజు ద్వారా దాని బదలాయింపు జరిగినట్లు మీ వద్ద ఏ ఆధారమూ లేనట్లయితే ఆ విషయాలు తెలియచేస్తూ మీ వదిన, తమ్ముడు ఇద్దరికీ ఒక అడ్వొకేటు ద్వారా మీరు ఆ 90 సెంట్ల భూమిని పంచి, మీకు రావలసిన 30 సెంట్లను మీకు ఇవ్వవలసిందిగా కోరండి. ఒకవేళ వారు మీ కోరికను మన్నించి ముందుకు రాన ట్లయితే, రిజిస్టర్‌ ఆఫీసులో ఆ 90 సెంట్ల భూమి ధర ఎంత ఉందో తెలిపే ఆ మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ సంపాదించండి. ఆ తరువాత మొత్తం భూమిని విభజించి మీకు రావలసిన 30 సెంట్ల భూమిని మీకు
స్వాధీన పరచమని కోరుతూ ఆ దావా వేయండి. ఇకపోతే మీరు ఆ భూమిని మీరు సాగుచేయకపోయినా, ఆ భూమిపై మీకున్న యాజమాన్యపు హక్కులు హరించబడవు. చట్టపరంగా మీ వాటా మీకు వస్తుంది. ఆ తర్వాత అవసరమైతే ఆ భూమిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా మీకు ఉంటుంది.
- టి. ఎల్‌. నయన్‌కుమార్‌, న్యాయవాది

పనస తొనలు కొబ్బరిపాల షేక్‌

కావలసినవి: పనస పండు తొనలు - పావుకిలో లేదా పనస ముక్కల తరుగు - ఒకటింబావు కప్పులు, చిక్కటి కొబ్బరి పాలు - 200 మిల్లి లీటర్లు(దాదాపు ఒక కప్పు), బెల్లం పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - అరకప్పు లేదా సరిపడా, ఐస్‌క్యూబ్స్‌ - ఎనిమిది, పనసతొనల తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు (అలంకరణకు), జీడిపప్పు పలుకులు - కొన్ని (అలంకరణకు).
తయారీ:
పనస తొనల నుంచి గింజలు తీసి తరగాలి. తరిగిన ముక్కల్ని బ్లెండర్‌ జార్‌లో వేయాలి.
కొబ్బరిపాలు, బెల్లం పొడి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
తరువాత ఐస్‌క్యూబ్స్‌, నీళ్లు పోసి మరొకసారి బ్లెండ్‌ చేయాలి.
చిక్కగా వద్దనుకుంటే అందులో మరికొన్ని నీళ్లు కలపొచ్చు. పైన జీడిపప్పు పలుకులు, సన్నగా తరిగిన పనస తొనల తరుగులతో అలంకరించి తాగితే టేస్టీగా ఉంటుంది.



ఎండల్లో మెరిసే చర్మానికి...

వేసవిలో సన్‌ టాన్‌ తెగ ఇబ్బంది పెడుతుంది. టాన్‌ వల్ల చర్మం కమిలిపోయినట్టు అవుతుంది. దాంతో కొన్ని డ్రస్‌లు వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా అనిపించడం ఆలస్యం టాన్‌ పోగొట్టేందుకు రసాయనాలతో కూడిన బ్లీచ్‌లు వాడతారు. అవి కొందరికి పడక సమస్య తీవ్రమవుతుంది. ఇటువంటి సమస్య ఎదురవ్వకూడదంటే ఇంట్లో లభించే సహజసిద్ధమైన బ్లీచింగ్‌ ఏజెంట్స్‌ను వాడాలి. వీటిని వారానికి మూడుసార్లు వాడితే చర్మం మెరిసిపోతుంది. టాన్‌ దూరమవుతుంది.
సమ్మర్‌ ఫేషియల్‌ బ్లీచ్‌
కావలసినవి: పాలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టాన్‌ అయిన భాగాలపై పూసి పావు గంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. జిడ్డు చర్మం వాళ్లకి ఇది చక్కటి బ్లీచ్‌.
తేనె, పెరుగులతో క్లెన్సర్‌
కావలసినవి: పెరుగు - నాలుగు టేబుల్‌స్పూన్లు, తేనె - రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీ: ఈ పదార్ధాలన్నీ బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా ఉండాలంటే మొక్కజొన్న పిండి కొద్దిగా అందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మూడు నిమిషాలు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.

ఒక్కో నగరం ఒక్కో గుబాళింపు. ఒక్కో ప్రాంతం ఒక్కో రుచి. మన దేశంలో ఏ నగరానికి ఆ నగరం సొంత ఫ్లేవర్‌తో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆ సిటీలకు వెళ్లినప్పుడు తప్పక టేస్ట్‌ చేయాల్సిన ఫుడ్‌లను చూద్దాం..

ఢిల్లీ
దేశానికే కాదు.. భిన్నరుచులకూ రాజధాని. అక్కడి భిన్న సంస్కృతుల మేళవింపు ఆహారవైవిద్యంలోను కనిపిస్తుంది. ఢిల్లీకి వెళితే చోలే బచూర్‌ (పూరీ, శెనగల కర్రీ), ఛాట్స్‌, బటర్‌ చికెన్‌, రజ్మాచావ్లా, పరోటా తినకుండా వెనక్కి రాలేము. రాజధాని వీధుల్లో అడుగడుగునా పంజాబీ డాబాలు, స్ట్రీట్ ఫుడ్‌ సెంటర్లు నోరూరిస్తాయి. బెంగాళీ మార్కెట్‌, చాందినీచౌక్‌లలో అయితే చెప్పనక్కర్లేదు. రకరకాల రెసిపీలు రా రమ్మని పిలుస్తాయి. డాబాలు, రెస్టారెంట్లు, హైఎండ్‌ కేఫ్‌లు ఢిల్లీ ప్రత్యేకత.

అమృతసర్‌
స్వర్ణదేవాలయం, వాఘా సరిహద్దులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ వెంటనే అమృతసర్‌లోని హోటళ్లలో అమృతమయమైన ఆహారపదార్థాల్ని ఓ పని పట్టక తప్పదు అనిపిస్తుంది. అడుగడుగునా కనిపించే పంజాబీ డాబాల్లో ఫుడ్‌లవర్స్‌ రుచులతో పోటీపడి తింటుంటారు. అమృతసర్‌ నుంచి వెనక్కి వచ్చేలోపు ఓ రెండు కిలోలు బరువు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేసర్‌ ద దాబా, అమృతసరీ కుల్చాస్‌ బాగా ఫేమస్‌. ఈ సిటీకి వెళ్లినప్పుడు ఎన్నితిన్నా సరే.. వేడి వేడి జిలేబీలు తినందే.. సంతృప్తి ఉండదు. ఇక, చిక్కటి లస్సీ తాగితే అక్కడే తాగాలి. రోటీలు, కర్రీలు తిన్న తరువాత.. చల్లటి క్రీము వేసిన లస్సీతో ‘ఆహా’ అనిపిస్తుంది.

లక్నో
అతిథులకు రాజభోజన నగరం. గలౌటీకబాబ్‌, కోర్మాస్‌, పరోటాలతో పాటు షీర్‌మాల్‌ అదరహో రుచులు. శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరికీ సమంగానే రెసిపీలు దొరుకుతాయిక్కడ. మరీ ముఖ్యంగా చౌక ధరల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. గొర్రె మాంసంతో వండే తుండె కి కబాబ్‌ రుచి చూడందే
నగరం దాటరు.

కోల్‌కతా
బెంగాలీ స్వీట్లకు ఎంత క్రేజ్‌ ఉందో.. ఈ తీర ప్రాంత చేపలకూ అంతే పేరుంది. కోల్‌కతాలో లభించే కలినరీ డిలైట్స్‌ జాబితా చాలా పెద్దది. రసగుల్లా, సందేశ్‌ తింటే ఇక్కడే తినాలి. తీపి ప్రియులు మహా ఇష్టంగా తినేది ఈ రెండింటినే! బెంగాలీలు సహజంగా స్వీట్లు ఎక్కువగా తింటారు. కోల్‌కతాకు వచ్చిన పర్యాటకులు కూడా వీటిని ఆస్వాదిస్తుంటారు. కర్జూర, కొత్త బెల్లంలతో తయారుచేసే స్వీట్ల కోసం ఎగబడతారు జనం. పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంతం కనక.. చేపలు పుష్కలం. హల్సా, భేట్కి చేపల కూరలకు మరే వంటా సాటి రాదు.

ఇండోర్‌
మధ్యప్రదేశ్‌ ఫుడ్‌ క్యాపిటల్‌ అని చెప్పొచ్చు. బంగారు నగలకు ప్రసిద్ధి చెందినట్లే.. రుచికరమైన రెసిపీలకు పెట్టిందిపేరు. నగరంలో స్వీట్‌హౌ్‌సలు అడుగడుగునా కనిపిస్తాయి. గులాబ్‌జామ్‌, రబ్దీ, కలకండ, మాల్‌పాస్‌.. నోరూరిస్తాయి. స్థానికులు ఎక్కువగా కచోరీలు, సమోసాలు, టిక్కీలను ఎంజాయ్‌ చేస్తుంటారు.

ముంబయ్‌
ఆర్థిక రాజధానిలో నివశించే సామాన్యుల ఫేవరెట్‌ వడాపావ్‌, మసాలా టీ. ఈ రెండింటితోనే సామాన్య ముంబయి వాసులు రోజును నెట్టుకొస్తారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కొత్తగా ముంబయికి ఎవరు వెళ్లినా.. వడాపావ్‌ తినందే ఉండలేరు. ఎక్కడ చూసినా ఇవే స్టాళ్లు సందడి చేస్తాయి. ముంబయికర్ల ఆహార సంస్కృతిలో వడాపావ్‌ ప్రధాన భాగం. బయట తిరిగే జనాల్లో సగం మంది స్ట్రీట్ ట్‌ఫుడ్‌ మీదే ఆధారపడతారు. సాయంత్రం అయితే పానీపూరీ బండ్లతో రోడ్లన్నీ కిటకటలాడతాయి. పానీపూరీ, బేల్‌పూరీని ముంబయి వాసులు ఇష్టంగా తిన్నంతగా మరే సిటీ వాసులూ తినరు.

చెన్నై
మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై గురించి చెప్పేదేముంది. అల్పాహారాన్ని కూడా పసందైన విందులా ఆరగించవచ్చు. దోశ, ఇడ్లీ, సాంబార్‌, రకరకాల చట్నీలు ఇక్కడ దొరికినట్లు మరెక్కడా దొరకవు. రుచికరమైన రసం లేనిదే మద్రాసువాసులు భోజనం చేయరు. ఘుమఘుమలాడే మద్రాసు ఫిల్టర్‌ కాఫీ.. ఒక్కసారి తాగితే చాలు. ఆ సంతృప్తే వేరు.
చూశారుగా! ఈ సారి ఈ నగరాలకు టూర్లు వెళితే.. అక్కడ దొరికే పాపులర్‌ ఫుడ్‌ను టేస్ట్‌ చేయండి.



అతిగా తినేస్తే ఎలా?
సన్నగా మారేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం ప్రయోజనం కనిపించడం లేదంటారు చాలామంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకుని చూడండి.
నాలుగు గంటలకోసారి: బరువు పెరుగుతామనే ఉద్దేశంతో చాలామంది రోజులో రెండుసార్లు మాత్రమే తింటారు. కానీ దానివల్ల శరీరంపై ఒత్తిడి పడి.. కార్టిసాల్‌ హార్మోను అతిగా విడుదలై.. తగ్గాల్సిన బరువు ఇంకా పెరుగుతారు. అందుకే.. ప్రతి నాలుగు గంటలకోసారి ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
అతిగా వద్దు: మంచి పదార్థాలనీ ఆరోగ్యానికి మేలు చేస్తాయనీ కొన్నింటిని అతిగా తినేస్తున్నారేమో గమనించుకోండి. ముఖ్యంగా మేలుచేసే కొవ్వుపదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాటిల్లో పోషకాలే కాదు.. కొవ్వుశాతం కూడా ఉంటుందని మరవకూడదు.
పిండి పదార్థాలు తినొచ్చు: సన్నబడాలనగానే చాలామంది చేసే మొదటి పని పిండిపదార్థాలున్న ఆహారాన్ని మానేయడం. అది పొరపాటు. శరీరం చురుగ్గా ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి అందాలన్నా పిండిపదార్థాలు ముఖ్యం. కాబట్టి వాటినీ తీసుకోవాలి. అయితే ఏవి పడితే అవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలు అంటే.. బ్రౌన్‌రైస్‌, క్వినోవా, తృణధాన్యాలు.. వంటివి తీసుకుంటే మంచిది.
వ్యాయామం అయ్యాక: ఎంతో కొంత తినాలి. ముఖ్యంగా ఓ పండూ లేదా పండ్లరసం, కప్పు ఓట్స్‌ వంటివి ఎంచుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంపై పడిన ఒత్తిడి కొంతవరకూ తగ్గుతుంది.
మాంసకృత్తులు అందేలా: మాంసకృత్తులున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది అంటారు నిపుణులు. అలాగని అన్నీ కాకుండా.. టోఫూ, బీన్స్‌, పాలూ, గుడ్డు.. ఇలాంటివి తినాలి. కెలొరీలు కరిగి సన్నగా మారొచ్చు.
చక్కనమ్మ ఇలా చిక్కింది!
ఫిట్‌నెస్‌
లో ఫ్యాట్‌.. హై ఫైబర్‌

ఐశ్వర్య ఆహారానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అస్సలు తినరు. జంక్‌ ఫుడ్‌ను డైనింగ్‌ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఫ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్, వేపుళ్లుకు చాలా దూరం. ఫైబర్‌ ఉన్న ఆహారాన్నే ఇష్టపడతారు. ఉడకబెట్టిన కూరగాయలు, తాజా పళ్లను తీసుకుంటారు. వంట చేయడమంటే వల్లమాలిన ప్రేమ ఐశ్వర్యకు. అందుకే తనకు కావల్సింది తనే వండుకుంటారు. బయటి ఫుడ్‌ను ఇష్టపడరు.
ఒకేసారి కపుడునిండా భోజనం చేయడం కన్నా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తింటుంటారు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగుతారు. అలాగే డీహైడ్రేట్‌ కాకుండా ఉండడానికి పళ్లరసాలు, పళ్లు తీసుకుంటుంటారు. ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం, తేనె కలిపిన గ్లాసుడు వేడినీళ్లు తాగుతారు.
పవర్‌ యోగా
వ్యాయామం విషయానికి వస్తే జిమ్‌లో గంటలు గంటల వర్కవుట్స్‌ కన్నా 45 నిమిషాల పవర్‌ యోగా పట్లే ఆమెకు మక్కువ ఎక్కువ. బ్రిస్క్‌ వాక్‌ లేదా జాగింగ్‌తో వార్మప్‌ అవుతారు. క్రంచెస్, పుషప్స్, పులప్స్‌ వంటి తేలికపాటి ఎక్సర్‌సైజులు చేస్తారు. సూర్య నమస్కారాలతో యోగా మొదలుపెడతారు. ఇవీ ఐశ్వర్య బచన్‌ అందం, చందం, నాజూకుదనం వెనక ఉన్న రహస్యాలు!
ఐశ్వర్య రాయ్‌... పేరు వింటే చాలు పోతపోసిన అందం కనిపిస్తుంది. ఓ సన్నజాజి తీగ గుర్తొస్తుంది. అలాంటి ఐశ్వర్య బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఒళ్లు చేసి బొద్దుగా తయారైంది. ఈ చక్కనమ్మ ఎప్పుడు చిక్కి మునుపటి రూపానికి వస్తుందా అని వెయ్యికళ్లతో వెయిట్‌ చేశారు. అన్నట్టుగానే అమాంతం బరువు తగ్గి కొత్త మెరుపుతో మిలమిలలాడింది ఈ వెండితెర వేలుపు! ఆ స్లిమ్‌నెస్‌... ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందాం..!
యువతులకు హెల్త్‌ యోగా
యోగా
దేహం... ఆరోగ్యం... రెండూ ఎప్పుడూ మనకు కొత్త కొత్త పరీక్షలు పెట్టి మనల్ని పాస్‌ చేయిస్తూనే ఉంటాయి. కానీ మహిళలకు ప్రకృతి నెలనెలా పెట్టే పరీక్ష పాస్‌ కావడం చిన్న సంగతి కాదు. పళ్లబిగువున రోజుల్ని దాటించాల్సిందే. అంత కష్టం వద్దు... ఈ యోగాసనాలను ప్రాక్టీస్‌ చేస్తే ఆ పరీక్షను స్మూత్‌గా గట్టెక్కవచ్చు.
చక్రాసనం
నిర్వచనం
ఈ ఆసనం వేసినప్పుడు దేహం చక్రంలా కనిపిస్తుంది. అందుకే దీనికి చక్రాసనం అని పేరు.
చేసే విధానం
ముందుగా వెల్లకిలా పడుకొని రెండు చేతులు ఇరువైపుల ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద వంచి రెండుపాదాలను పిరుదుల వద్దకు తీసుకోవాలి. మడమలు పిరుదులకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు రెండు అరచేతులను తలకి ఇరువైపులా నేల పైన ఉంచాలి.శ్వాస పూర్తిగా తీసుకొని శరీరబరువు పూర్తిగా రెండు చేతులు రెండు పాదముల పైన ఉంచి శరీరాన్ని పైకి లేపాలి. ఈ స్థితిలో ఛాతీ, నడుము పైకి లేపబడి తలక్రిందకు వ్రేలాడుతూ ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు వంగకుండా అరచేతులు, పాదాలు నేలను తాకి ఉంటాయి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి. ప్రతిరోజు ‘3’ సార్లు చేయాలి.
ఉపయోగాలు
ప్రధానంగా మెన్‌స్ట్రువల్‌ ప్రాబ్లమ్స్‌ పోతాయి. రెస్పిరేటరీ సిస్టమ్‌ యాక్టివ్‌ అవుతుంది. బ్యాక్‌పెయిన్‌ తగ్గుతుంది. చెస్ట్‌ ఎక్స్‌పాండ్‌ అవుతుంది. లంగ్స్‌ కెపాసిటీ పెరుగుతుంది. థైరాయిడ్‌ మరియు శ్వాస సంబంధిత రోగాలు పోతాయి. హ్యాండ్స్, షోల్డర్స్, నీస్, థైస్, రిస్ట్‌ స్రెంగ్తెన్‌ అవుతాయి. స్టమక్‌ స్ట్రెచ్‌ అవడం వలన అబ్డామిన్‌ మజిల్స్‌ స్ట్రెంగ్తెన్‌ అవుతాయి. ఇన్‌డైజేషన్, గ్యాస్ట్రిక్, కాన్‌స్టిపేషన్‌ సమస్యలు పోతాయి.వాయిస్‌ ఇంప్రూవ్‌ అవుతుంది. తొడల పైన క్రొవ్వు కరుగుతుంది. ముఖ కాంతి పెరుగుతుంది. స్పైన్‌ ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుంది.
చేయకూడనివాళ్లు
హైబీపీ ఉన్నవారు, మైగ్రేన్‌ ఉన్నవారు, బ్రెయిన్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వారు చేయరాదు. అధికబరువు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, భుజాల నొప్పులు ఉన్నవారు, కన్ను, ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
అనంతాసనం
అనంత పద్మనాభుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉన్న మరో పేరు. శేషశయ్య మీద పవళించిన విష్ణుమూర్తిని పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి అనంతాసనం అని పేరు.
ఎలా చేయాలి?
నేల మీద ఎడమవైపు తిరిగి పడుకుని ఎడమ అరచేతిలో తలను ఉంచి విశ్రమించాలి. కుడిచేతిని కుడివైపు శరీరం పైన తిన్నగా(ఫొటోలో ఉన్నట్లు) ఉంచాలి.శ్వాస పూర్తిగా తీసుకుని కుడికాలిని నిటారుగా పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. కుడిచేతిని పైకి లేపి కుడికాలి వేళ్లను చేతితో పట్టుకోవాలి. ఎడమకాలిని చక్కగా నేల మీద చాచి ఉంచాలి.ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ వైపు కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు!
రుతుక్రమ సమస్యలు, మలబద్దకం తగ్గి పోతాయి. మోకాళ్లు, తొడలు, భుజాలు, మెడ కండరాలు శక్తిమంతం అవుతాయి.శరీరానికి రెండు వైపులా ఉన్న కొవ్వు తొలగిపోయి నడుము సన్నబడుతుంది.శ్వాసకోశ వ్యవస్థ శక్తిమంతం అవుతుంది.
జాగ్రత్త!
స్పాండిలోసిస్‌ ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

దంపతుల మధ్య షేరింగ్‌ ఉందా?
సెల్ఫ్‌ చెక్‌
పండ్లు... ఆటవస్తువు... పుస్తకాలు... బట్టలు... వీటిని చిన్నప్పుడు ఒకే ఇంట్లో ఉన్న పిల్లలు పంచుకోవటం సహజం. తల్లిదండ్రుల ప్రేమను కూడా పిల్లలు పంచుకోవాల్సిందే! కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పిల్లలు పెద్దవారవటం పెళ్లి చేసుకుని భార్య/భర్తగా మారటం సహజం. ఇప్పుడు లైఫ్‌పార్ట్‌నర్‌తో ప్రతి ఒక్కటీ షేర్‌ చేసుకోవలసి ఉంటుంది. ‘‘మా ఆయన బంగారం, మా శ్రీమతి పంచదార’’ ఇలాంటి డైలాగులను అనిపించుకోవాలంటే మీ భార్య/భర్తతో అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా ఉండాలి. మీ దంపతులు మ్యారీడ్‌ లైఫ్‌ని ఎలా షేర్‌ చేసుకుంటున్నారు? ఇచ్చిపుచ్చుకోవటంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉంటున్నారా? ఇది తెలుసుకోవటానికి ఒకసారి సెల్ఫ్‌చెక్‌ చేసుకోండి.
1. మీ దంపతులు మీ అనుభవాలన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకుంటారు. చాలా పర్సనల్‌ విషయాలు కూడా మినహాయింపు కాదు.
ఎ. అవును బి. కాదు
2. ఇప్పుడు పూర్తి చేస్తోన్న క్విజని కూడ ఇద్దరూ కలసి పూర్తి చేస్తారు. ‘ఎ’, ‘బి’ లు టిక్‌ చేసేటప్పుడు నిజాయితీగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
3. పిల్లల్ని పెంచటంలో మీ బాధ్యతల నిర్వహణలో తేడాలు రానివ్వరు.
ఎ. అవును బి. కాదు
4. బ్యాంకులో మీ దంపతులకు జాయింట్‌ ఎకౌంటులు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల్లో మీ మధ్య విభేదాలు రావు.
ఎ. అవును బి. కాదు
5. ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్‌ విషయంలో ఇద్దరూ సంప్రదించుకుని బాధ్యతలు పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. పిల్లలపై ఇద్దరూ ఒకేరకమైన ప్రేమను చూపుతారు.
ఎ. అవును బి. కాదు
7. ఇంటిపనులు మీరు చేయాలంటే, మీరు చేయాలని పంతాలకు పోరు. సమయాన్ని అనుసరించి ఇద్దరూ పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. ఖాళీ సమయాన్ని ఎవరికి వారుగా గడపకుండా ఇద్దరు కలసి ఉండేలా ప్లాన్‌ చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
9. మీ అభిరుచులు, వైఖరులు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయని చెప్పగలరు. లేకున్నా ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
10. మీ భార్య/భర్తను కోపగించుక్ను సందర్భాలు చాలా తక్కువ.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు వస్తే మీ దంపతులు అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని కలిగి ఉంటారు. భార్య/భర్త నుంచి ఎంత ఆశిస్తారో అంత ఇవ్వటానికి వెనకాడరు. మీలా మీ లైఫ్‌పార్ట్‌నర్‌ కూడా ఉంటే మీ సంసారం ఆనంద సాగరమే. లైఫ్‌పార్ట్‌నర్‌ నుంచి సహకారం లేకపోతే, వారిని ప్రేమతో జయించటం మీ చేతుల్లోనే ఉంటుంది. ‘బి’లు ఎక్కువ వస్తే జీవితభాగస్వామితో అరమరికలు లేకుండా ఉండడం మీకు చేతకావట్లేదనే అర్థం. కష్టసుఖాలను పంచుకుంటే ఎంత సంతోషం కలుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు మీరున్న దానికి భిన్నంగా ప్రయత్నించి చూస్తే తేడా మీకే తెలుస్తుంది.

ఉన్న ఊరూ... కన్నతల్లీ!
ఆత్మీయం
రావణసంహారం పూర్తయిన తర్వాత లంకలో ప్రవేశించారు రామలక్ష్మణులు. రావణుడు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు లక్ష్మణుడు. మనసులోని మాటను అన్నగారితో చెప్పాడు. రావణ రాజసౌధం సామాన్యమైంది కాదు. అంతా మణిమయమే. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు.
మనం ఇప్పుడు అలా ఆలోచించగలుగుతున్నామా? మన దేశం అంటే మనకు అంత గౌరవం ఉందా అసలు? మనవాళ్లెవరైనా అమెరికాలో ఉన్నారంటే మనకెప్పుడు అవకాశం వస్తుందా, మనమెప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తాం. ఎంతసేపూ పొరుగుదేశాలను పొగడటం, స్వదేశాన్ని తెగడటం... లక్ష్మణుడి వంటి తమ్ముడో అన్నో మనకూ ఉంటాడు. అలాంటి సలహా ఇచ్చే మేనమామలూ, బాబాయిలూ, బావమరుదులూ ఉండనే ఉంటారు. వాళ్లు సలహా ఇచ్చేవరకూ మనం స్థిమితంగా ఉండగలమా అసలు! అవతలి వాడు వెళ్లి ఎంత సంపాదించాడు, మనం వెళ్లక ఏమి కోల్పోయాం అనేదే అహరహం ఆలోచన. జన్మభూమిలో ఉండటం, కన్నతల్లి వద్ద ఉండటం కన్నా మించిన స్వర్గం మరొకటి ఉండదని అనుకోం. రాముడిని ఆదర్శంగా తీసుకుందాం... ఆయనలా ఆలోచిద్దాం.





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list