MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ సత్యనారాయణ వ్రతము_Sri Satyanarayana vratam

సత్యనారాయణ వ్రతము, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.

వ్రత ప్రాశస్త్ర్యము

కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వారు ఇటుల తెలిపెను.

కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించితిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది సంతానసౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును.

అంతట వ్రత విధానమును తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపెను.

వ్రత సామాగ్రి

పసుపు

కుంకుమ

తమలపాకులు

పోకచెక్కలు

అరటిపళ్ళు

నారికేళములు కొబ్బరికాయలు

మటప అలంకరణకు తువ్వాళ్ళు

మామిడి ఆకులు

దీపసామాగ్రి

పూజా సామాగ్రి

బియ్యము

కలశము

పంచామృతాలు

సత్యనారాయణ స్వామి ప్రసాదము

చిల్లర నాణెములు

వ్రత విధానము

" దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా
యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "

దేవాలాయమున, నదీతీరమున, గోశాలలో, తులసీవనమున చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది.


కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు మరియు కొబ్బరితో కూడిన కలశమునుకు రవికెల గుడ్డను చుట్టి మద్యమున ఉంచవలెను.


పసుపుతో వినాయకుని సిద్దము చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యమునందు తూర్పుదిక్కుగా ఉంచవలెను.


వినాయకపూజ నంతరము తమలపాకుపై బియ్యము పోసి సత్యనారాయణుని బంగారు,వెండి,రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ మూడు లేక ఐదు కొబ్బరి కాయలను వక్కలు,పూలు,అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను.అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారాయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.


పమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా కాలక్షేపము చెయ్యవలెను.

వ్రత కథ మొత్తము ఐదుభాగములుగా ఉండును. ప్రతీ కథానంతమున నారికేళసమర్పణ ఆచారము.వ్రత కథలు


మొదటి వ్రత కథ


ఒకానొక సమయమున నైమిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని శౌనకాది మునులు ఇటుల అడిగినారు "మహానుభావా.. దేని చేత మనుషులు తమ కోరికలననుభవించి, మోక్షమును పొందగలరు?" అందులకు సూత మహర్షి

శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,ఈ వ్రతమును ఏ రోజునైనను చేసి, వ్రతానంతరము తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను. ఈ వ్రతము చేసిన వారు మోక్షమును పొందెదరని మహావిష్ణువు నారదునకు తెలిపెను.

కనుక జనులారా, సత్యనారాయణ వ్రతము చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను. ఇది మొదటి వ్రత కథ.

రెండవ వ్రత కథ


కాశీ పట్టణమందు ఒక బీద బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునికి ఒక రోజు ఏమీ భిక్ష లభింపక విచారముతోనుండగా, సత్యనారాయణస్వామి ఒక ముదుసలి బ్రాహ్మణవేషములో వచ్చి నాయనా నీ బాధ ఏమి అడిగాడు. అంతట ఆ ముసలి బ్రాహ్మణుడు, సత్యనారాయణవ్రత విశేషము తెలిపి అదృశ్యుడాయెను. అంతట బీద బ్రాహ్మణుడు రేపే ఈ వ్రతము చేసెదనని నిశ్చయించుకున్నవాడై మరుసటి దినము నిత్యకృత్యములు నెరవేర్చి "స్వామీ! ఈ రోజు లభించిన బిక్షతో నీ వ్రతము చేసెదను" అని పలికి భిక్షాటనకు బయలుదేరెను. ఆనాటి వేళావిషయమున అతనికి విశేషమైన భిక్ష లభించెను. పిమ్మట లభించిన భిక్షతో ఆ బ్రాహ్మణుడు వ్రతము చేసెను. వ్రతమహిమ వలన సమస్తసంపదలు కలిగినవి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతీ మాసము సత్యనారాయణస్వామి వ్రతము చేసెను. ఆ బ్రాహ్మణుడు ఒకానొక ఏకాదశినాడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొనువాడు వచ్చి వ్రతమంతయూ చూచి వ్రత మహిమ తెలుసుకొన్న వాడై, తను కూడా తరువతిదినమునాడు వ్రతము చేసెదనని పలికెను. తరువాతిదినమున, కట్టెలమ్మగా మిక్కిలి విశేషముగా ధనము లభించింది.ఆ ధనముతో ఆ నాడు వ్రతము చేసినవాడై అనతికాలమునందు ధనవంతుడయ్యెను. సత్యనారాయాణ వ్రత విశేషము వల్ల బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కథ.కోరిన కోర్కెలు తీర్చే

                          అన్నవరం సత్యదేవుడు
అన్నవరం సత్యదేవుడిని దర్శించినా, సత్యనారాయణుడి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయనీ.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి "అన్నవరం సత్యదేవుడి"గా భక్తులచే పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు. భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతంకంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్చమైన నెయ్యి, ఎర్ర గోదుమలతో తయారుచేసే ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవాళ్ళు ఎప్పటికీ ఆరుచిని మరచిపోలేరు.
అన్నవరం (ఆంగ్లం Annavaram) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామం లోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గం లో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లో శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. అన్నవరం లో రత్నగిరి పర్వత శ్రేణి కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం వున్నది.
అన్నవరం - పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము, కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు.
పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.ప్రధాన ఆలయం రథాకారం లో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాల తో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి.
ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్థులలో నిర్మింపబడింది.క్రింది భాగం లో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగం లో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులు గా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.
1970 లో ఈ ఆలయంపై పిడుగు పడగా ఆలయానికి బీటలు ఏర్పడ్డాయి. విమాన గోపురం వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. సుమారు నాలుగు కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయాన్ని పునర్ నిర్మించారు. పునర్ నిర్మిగం తర్వాత స్వామి వారి విగ్రహాని పూర్తిగా దర్శించుకునే అవకాశం ఏర్పడింది. ఇంతకు ముండు గర్బాలయం ఇరుకుగా ఉండేది. ఇప్పుడు విశాలంగా వున్నది. ప్రధాన ద్వారానికూడ పెంచారు. దిగువన వున్న యంత్రాలయాన్ని కూడ విశాలంగా తీర్చి దిద్దారు. శిఖరాలను స్వర్ణ మయం చేశారు. కలశాలకు బంగారు తాపడం చేశారు. ఇలా ప్రస్తుత అన్నవర దేవుడు స్వర్ణ కాంతు లీనుతు దర్శనమిస్తున్నాదు.
-------------++అన్నవరం++----------
కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం- శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి. ‘అన్న’వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణస్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం. పాదాలు దర్శించుకొని.. మెట్లపైగా పైఅంతస్తుకు వెళితే శ్రీసత్యనారాయణస్వామి మహేశ్వరుడు.. అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివ-కేశవులు, అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు!
ఇక్కడ రోజూ సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయడం తెలుగు ప్రజల సంప్రదాయ. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఆ మేరకు ఇక్కడ రోజూ సత్యదేవ వ్రతాలు, తిరుమల తరహాలో.. నిత్య కల్యాణాలు జరుగుతుంటాయి.
క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం
తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కి.మీ.ల దూరంలోని రత్నగిరి పర్వతంపై 1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామపెద్దలకు వివరించగా.. అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.
దర్శన వేళలు
ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.
ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు
* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
* సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి
* వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.
విశేషాంశాలు.. పరిసరాల్లోని ఉపాలయాలు: కొండదిగువున ఘాట్‌రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం ఉన్నాయి. అన్నింటిలో దర్శనం ఉచితం. అలాగే ఇక్కడున్న పంపా జలాశయంలో నౌకా విహారం... ఫలభా యంత్ర(సన్‌ డయల్‌) సందర్శన పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. దూరప్రాంత భక్తులు ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో తమ బంధువులు... సన్నిహితుల కోసమని తీసుకెళ్తుంటారు.అన్నవరం శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్యపూజల సమయాలు:* రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ
* 5 గంటలకు ధూపసేవ
* ఉదయం 7 గంటలకు బాలభోగం
* 7.30 గంటలకు బలిహరణ
* ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ చతుర్వేద పారాయణలు
* మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
* సాయంత్రం 6 గంటలకు ధూపసేవ
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ దర్బారు సేవ
* రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ ఏకాంత సేవ
పూజల్లో పాల్గొనేందుకు రుసుముల వివరాలు:* పౌర్ణమికి నిర్వహించే ప్రత్యంగిర హోమంలో పాల్గొనేందుకు రూ.558
* స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఘనాపాఠీల ఆశీర్వచనానికి రూ. 558
* పవళింపుసేవలో పాల్గొనేందుకు.. రూ. 50
* స్వామివారి శాశ్వత కల్యాణం(పదేళ్లు మాత్రమే) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 10వేలు
* శ్రీ స్వామివారి వ్రతం(పదేళ్లు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 7 వేలు
* స్వామివారి శాశ్వత నిత్యపూజ(పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 500
ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు:రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ శ్రీ స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదల్చిన భక్తులు రూ. 1,000 రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజాసామగ్రి సమకూరుస్తుంది. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీ ప్రసాదం అందజేస్తారు.
* శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం(ప్రతి నెలా ముఖ నక్షత్రం రోజున)రూ. 3,000 టిక్కెట్‌పై అనుమతిస్తారు.
* రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. రూ. 116 రుసుం చెల్లించాలి.
* శ్రీ సత్యనారాయణస్వామివారి మూలవరులకు స్వర్ణపుష్పార్చన. 108 బంగారు పుష్పాలతో పూజచేసి ప్రసాదం అందిస్తారు. దీనికి రూ. 3 వేలు రుసుముగా చెల్లించాలి.
ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి రూ. 558 చెల్లించాలి.
ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు: చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి.
* చైత్ర బహుళ షష్టి నుంచి అమావాస్య వరకూ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు.
* ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
వసతి, భోజన సౌకర్యం వివరాలు: రత్నగిరిపైన.. అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు.. కాటేజ్‌లు... సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా రూ. 150 నుంచి గరిష్ఠంఆ రూ. 3వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.
రవాణా సౌకర్యం: కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.
ఆన్‌లైన్‌ సేవలు: దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. మరిన్ని వివరాలకు... ఫోన్‌ 08868-238163 నంబర్లలో దేవస్థానం అధికారులను సంప్రదించవచ్చు.
1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం