MohanPublications Print Books Online store clik Here Devullu.com

పాలు,అపోహలు,వాస్తవాలు _ WhenMilkVapourized




పాలు వేడి చేస్తున్నప్పుడు

పొంగిపోతే దేనికి సంకేతం..?!
శుభశూచకమా-అశుభమా..?

రుగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలిస్తున్నట్టు భావిస్తారు. కొన్ని సార్లు అవి నిజం కావచ్చు, కొన్ని సార్లు మనం వాటిని విస్మరించాలి. 
అప్పుడప్పుడు, పాలని స్టవ్ మీద పెట్టి ఎదో ఆలోచనలో పడిపోవడం చాలా సహజం. కాసేపటికి తేరుకుని గమనించి స్టవ్ ఆపేసరికి పాలు కాస్తా పాడయిపోతాయి. కొన్ని పాలు స్టవ్ చుట్టూ పడిపోయి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో కొన్ని రకాల విశ్వాసాలుంటాయి. వాటిని అంధవిశ్వాసాలని కొందరంటారు. భారతీయలు ఇటువంటి కొన్ని విషయాలను కొన్నిటికి శకునాలుగా భావిస్తారు. ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురవడం, కళ్ళు అదరడం, బల్లి అరవడం, అద్దం పగిలిపోవడడం లేదా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా వెనుకనుండి పిలవడం వంటివి కొన్నిటికి శకునాలుగా భావిస్తారు. జీవితంలో భాగంగా ఇటువంటి నమ్మకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జరుగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలిస్తున్నట్టు భావిస్తారు. కొన్ని సార్లు అవి నిజం కావచ్చు, కొన్ని సార్లు మనం వాటిని విస్మరించాలి. మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచిక? మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా? ఈ విషయంలో కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.. ఉదాహరణకు: గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారం ఉంది. అందులో భాగంగా పాలు చిందుతాయి. కొంతమంది పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం: వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిక్కును శుభసూచికగా భావిస్తారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు తద్వారా అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. పెళ్లిరోజుకు ముందు గాని లేదా వెనుకగాని పాలు చిందితే: మరోవైపు, పెళ్లిరోజుకు ముందు గాని లేదా వెనుకగాని పాలు చిందటాన్ని శుభపరిణామంగా భావించరు. రాబోయే దురదృష్ట సంఘటనలకు సంకేతంగా పాలు చిందడాన్ని భావిస్తారు. పాలు చిందడం దేనికి సంకేతం: కాబట్టి, మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాల గురించి తెలుసుకునేటప్పుడు మీకు రెండు వైపుల కథలూ వినబడవచ్చు. అయితే, సాధారణంగా, పాలు చిందడం శుభపరిణామాలకి సంకేతంగానే చెప్పుకుంటారు. పాలు, సమృద్ధికి, సంపదకు సంకేతం: పాలు, సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే, శుద్ధికి ప్రతీక పాలు. పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలతో తయారు చేసిన నేతిని వాడతారు.
పాలు చిందడం అదృష్టానికి సంకేతం: పాలు చిందడం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతారు. అంత మాత్రాన మీరు ఒక్క రోజులో ధనవంతులు అయిపోతారని కాదు. కాకపోతే, అదృష్టం మీ వెంట ఉందని సంకేతం. కొంత ధనం మీ వద్దకు వస్తుందని: మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని నమ్మకం. కొంత ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచిక. పాలు పొంగితే డబ్బులు పొంగుతాయి: పాలు పొంగితే డబ్బులు పొంగుతాయని అంటారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచికగా పాలు పొంగడాన్ని భావిస్తారు.
సూచన: కాబట్టి ఒకవేళ, పొరపాటున పాలు గనక పొంగితే, కంగారుపడకండి. దీనిని శుభసూచికంగానే భావిస్తారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list