నిద్ర పట్టడం లేదా..?
ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకోండి..!
నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆందోళన, ఇతర సమస్యలు... ఇలా కారణాలు ఏమున్నా నేడు చాలా మందిని నిద్రలేమి సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో టైముకు సరిగ్గా నిద్రించకపోవడం వల్ల అది ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే అలా అనారోగ్యాల బారిన పడకుండా కింద ఇచ్చిన విధంగా ఆయా మొక్కలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు. దాంతో మీ ఇంట్లో ఉండే గాలి పరిశుభ్రం అవడమే కాదు, రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది. ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!
1. అలోవెరా (కలబంద)...
కలబంద మొక్క మనకు ఆరోగ్య పరంగా ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మొక్కను బెడ్ రూంలో పెట్టుకుంటే దాంతో రాత్రి పూట ఈ మొక్క నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దీంతోపాటు మొక్కలో ఉండే పలు ఔషధ గుణాలు గాలి ద్వారా మన శరీరంలోకి చేరతాయి. ఈ క్రమంలో మనకు చక్కని నిద్ర వస్తుంది. అంతేకాదు, స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది. దీనికి నీళ్లు కూడా పెద్దగా అవసరం లేదు.

2. లవంగం మొక్క...
లవంగం మొక్కను బెడ్ రూంలో పెట్టుకుంటే దాని నుంచే వచ్చి సువాసనకు మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు, దాని వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు దూరమవుతాయి. చిన్న పిల్లలకు ఈ మొక్క నుంచి వచ్చే గాలి ఎంతో మంచిదట.
sleep-plants

3. మల్లె మొక్క...
మల్లె పూల నుంచి పరిమళం ఎలా వస్తుందో అందరికీ తెలిసిందే. అయితే అదే మొక్కను బెడ్ రూంలో పెట్టుకుంటే దాంతో రాత్రి పూట ఆ మొక్క నుంచి వచ్చే సువాసనను ఓసారి పీలిస్తే చాలు, మైమరిచి నిద్రపోతారు. మల్లె మొక్క నుంచి వచ్చే గాలిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి.
4. ఇంగ్లిష్ ఐవీ ప్లాంట్...
ఈ మొక్కను బెడ్ రూంలో పెట్టుకుంటే పరిసరాల్లో ఉన్న గాలి శుభ్రమవడమే కాదు, రాత్రి పూట ఆ గాలికి చక్కగా నిద్ర పడుతుంది కూడా. నాసా సైంటిస్టులు దీన్ని ధ్రువీకరించారు. ఈ మొక్క నుంచి విడుదలయ్యే గాలి వల్ల పరిసరాల్లో ఉన్న గాలి 94 శాతం స్వచ్ఛంగా మారుతుందట. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి, నిద్ర సరిగ్గా పట్టని వారికి ఈ మొక్క మంచి మందు.

5. స్నేక్ ప్లాంట్...
ఈ మొక్కను చాలా మంది ఇంటి ఆవరణలో అలంకరణ కోసం వాడుతారు. అయితే ఈ మొక్కను బెడ్ రూంలో పెట్టుకుంటే దాంతో రాత్రి పూట ఆ మొక్క నుంచి విడుదలయ్యే గాలికి చక్కని నిద్ర పడుతుంది. రాత్రి పూట ఆక్సిజన్‌ను వదిలే మొక్కల్లో ఇది కూడా ఒకటి. ఈ క్రమంలో స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆరోగ్యం కొని తెచ్చుకున్నట్టే..! పరిసరాల్లో ఉండే గాలిని ప్యూరిఫై చేయడంలో ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది.
PLANTS FOR GOOD SLEEP , HEALTH BENEFITS , HEALTH TIPS , HEALTH PROBLEMS , SLEEP PROBLEMS ,
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565