MohanPublications Print Books Online store clik Here Devullu.com

మానస సరోవరం_Manasasarovaramదేవతల నిలయం .. మానస సరోవరం

జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ముఖ్యంగా హిందువ్ఞలు కనీసం ఒక్కసారైనా దర్శింపదగిన, దర్శింపవలసిన ప్రదేశాలు అత్యం త పావనమైన బ్రహ్మమానస సరోవరము మరియు కైలాస పర్వత దర్శనం.వృత్తిరీత్యా, యాత్రాపరంగా అనేక దేశాలను దర్శించిన మాకు ఎక్కడా అభించని అనుభూతి, ప్రశాంతత ఈ యాత్ర ద్వారా లభిస్తాయి. ఆధ్యాత్మికంగాను, ప్రకృతి రామణీ యతకుగాను ప్రపంచంలో అత్యంత మాన్యత కలిగిన పర్వత రాజమే అతి ఎత్తయిన కైలాసపర్వతం (5,200 మీటర్లు) మరియు బ్రహ్మమానససరోవరము (4,558 మీటర్లు). కైలాస యాత్రలో మొదటి ఘట్టము బ్రహ్మమానస సరోవర దర్శన ము. ఈ ప్రదేశాన్ని దేవతల నిలయంగాను శ్రద్ధాళులు భావి స్తారు. ఇది కైలాస మానససరోవరంగా కూడా పిలువబడు తుంది. స్వచ్ఛమైన నీటితో సుమారు 300 అడుగుల లోతు, 320 చ.కి.మీ. పరిధితో హిమవత్పర్వతాల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సు ఇది. సరోవరంలోని నీరు నీలిరంగు లో ఉండి,
బ్రహ్మకమలములతో మరియు రాజహంసలతో మనసుకు ఆహ్లాదాన్ని అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగి స్తుంది. రాజహంసల దర్శనము పుణ్యప్రదమని అవి అందరికీ కనబడవని చెపుతుంటారు. అయితే పరిక్రమ కాలి నడకన కాకుండా టయోటా వ్యానులో చేసుకోవచ్చు.
నిండుపున్నమి రాత్రి సరస్సు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చందమామ సరస్స నీటిపై బంతిలా తేలియాడే దృశ్యాన్ని మధ్య రాత్రి 2 గంటల సమయంలో వీక్షించవచ్చు. తారలన్నీ ఒక్కొక్కటి సరస్సులో స్నానం చేస్తుంటాయి. దేవతలు తారలరూపంలో రాత్రిపూట స్నానమాచరిస్తారని ప్రతీతి. మర్నాడు ఉదయం యజ్ఞ కార్యక్రమము, లక్ష్మీపూజ, లలితా సహస్రనామము కావించాము. మానసనరోవరము నుండి కైలాస పర్వతము ప్రస్ఫుటంగాకనిపిస్తుంది. ఒకవైపు హిమవత్పర్వతాలతో, మరో వైపు కైలాస పర్వతంతో మానససరోవరం మధ్యలో ఉంటుం ది. అయితే ఈ పర్వతాలన్నీ వాతావరణం అనుకూలంగా ఉంటేనే కన్పిస్తాయి. మేఘాలు కమ్మినప్పుడు, మంచు కురిసి నప్పుడు కన్పించవ్ఞ. ఈ ప్రదేశంలో క్షణాలలో వాతావరణం మారిపోతుంది. మేము అక్కడ గడిపిన నాలుగురోజులు ఎండ గా ఉన్నందున మాకే ఇబ్బందికలుగలేదు. జూన్‌ నుండి సెప్టెం బరు వరకే సరస్సు నీటి మంచు కురిసినప్పుడు కన్పించవు. ఈ ప్రదేశంలో క్షణాలలో వాతావరణం మారిపోతుంది. మేము అక్కడ గడిపిన నాలుగు రోజులు ఎండగా ఉన్నందున మాకే ఇబ్బంది కలుగలేదు.జూన్‌ నుండి సెప్టెంబరు వరకే సరస్సు నీటి రూపంలో ఉంటుంది. మిగిలిన నెలలో నీరు ఘనీభవి స్తుంది.
అష్టపది దర్శనం:
మానససరోవరం నుండి 40 కి.మీ.ల దూరంలో నంది ఆకారంలో ఉన్న కొండ ఎదురుగా ఉన్న దక్షిణ కైలాస పర్వతముఖమే అష్టపది. వ్యానుద్వారా అక్కడి వరకు వెళ్ళి కాలినడకన అష్టపది దర్శనము చేసు కోవచ్చు. కైలాసపర్వతం చుట్టూ పరిక్రమ చేసినపుడు కూడా ఇది కన్పిస్తుంది. కైలాస పర్వత పరిక్రమ ప్రారంభం లో బేస్‌ క్యాంప్‌ (మేము బసచేసిన ప్రదేశము) పేరు దార్చెన్‌ (4,560 మీటర్లు). పరిక్రమ: యాత్రలో అత్యంత ప్రధానమైన ఘట్ట మిది.
డార్చెన్‌ సమీపంలోని తార్బోచే అనే ప్రదేశంలో ఉన్న కట్టడాన్ని యమద్వారమంటారు. ఇక్కడ నుంచే కైలాస పరిక్రమ ప్రారంభమౌతుంది. మూడురోజులు సాగే ఈ ప్రయాణం అత్యంత క్లిష్టతరమైనదిగా ఉంటుంది. గుర్రాలపైనా లేదా కాలినడకన సాగే ఈ ప్రయాణం జీవితంలో మరపు రానిది. గుర్రాల పైన వెళ్ళనా దాదాపు సగం దూరం కాలినడ కన వెళ్ళాల్సి ఉంటుంది.
మొదటిరోజు 14 కిమీ. గుర్రాలపైన ఎగుడుదిగుడు మార్గాలగుండా మరియు రాళ్ళతో కూడిన లాచూనదిలో నుండి ఉత్తర కైలాసశిఖరం చేరుకుంటాం. దారి లో కైలాసానికి పశ్చిమదిశలో పాము పడగలా ఉన్న ఓ వింతైన పర్వతశిఖరం కనిపిస్తుంది. దీనిని రావణశిఖరం అంటారు.
మొదటిరోజు పరిక్రమ ఆరుగంటలు సాగుతుంది. ఆ రాత్రి బస డేరాపూర్‌ అనే గ్రామంలో ఇక్కడి నుండి కైలాసపర్వతం ఈశాన్యభాగం బోర్లించిన వెండిగిన్నెలా తళతళా మెరుస్తూ మైమరపిస్తుంది. జీవితంలో మరపురాని రెండవరోజు పరిక్రమ: అత్యంత కష్టతరమైన 22 కి.మీ.ల మార్గాన్ని డోల్మాలా పర్వతము పై భాగానికి చేరుకు న్నాం. ఇది 5,200 మీ. ఎత్తులో ఉంటుంది. ఇదే ప్రపంచంలోని అతి ఉన్నతమైన స్థలము. దీనినే పార్వతీదేవి స్థలంగా కూడా పిలుస్తారు. రెండు చేతులలో ఊతకర్రలతో నడవాల్సి వస్తుంది. కుడివైపున దాదాపు 500 అడుగుల లోతులో గౌరీకుండ దర్శనభాగ్యం లభిస్తుంది. మా వెంబడి ఉన్న నేపాలీ సహాయకుడు అందులో నుండి తెచ్చిన తీర్ధాన్ని తాగినవెంబడే శరీరంలోని అలసట పోయి ఉత్తేజం కలిగిస్తుంది. ఒకవైపు మహోన్నత పర్వతశ్రేణులు, మరోవైపు జలపాతాలు ఈ కష్టతరయాత్రలోని శ్రమను మరపింప చేశాయి. శివనామస్మరణగావిస్తూ ఆ అతిచల్లటి వాతావరణంలో అతి క్లిష్టమైన మార్గంలో పది కిలోమీటర్ల నడక సాగించవచ్చు. శివస్థలము, గౌరీకుండము, తారాదేవి శిల శివ్ఞణ్ణి వివాహం చేసుకునేందుకు గౌరీదేవి తపస్సు చేసిన స్థలాలు కనుక పౌరాణికంగా ఎంతో ప్రధానమైనవి.
మూడోరోజు పరిక్రమ:
చివరిరోజు 8 కి.మీ. గుర్రాలమీద ప్రయాణం చేసి 4 కి.మీ.లు వ్యానులో దార్చెన్‌ మార్గంగా తిరిగి మానససరోవరం చరుకోవచ్చు. ఇక్కడి నుండి తిరుగు ప్రయాణం ప్రారంభమవ్ఞతుంది. ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? దాదాపు 15 రోజులపాటు సాగే ఈ యాత్రను మే-సెప్టెంబరు మధ్యకాలంలోనే చేయాలి. ఇందుకుగాను చైనాదేశపు వీసా అవసరము. ప్రస్తుతము కైలాస మానససరోవరము టిబెట్టులో ఉన్నందున కనీసంరెండు నెలల ముందే ప్రముఖమైన టూరు ఆపరేటర్స్‌ ద్వారా వీసా కొరకు దరఖాస్తు చేసుకోవాలి. వైద్యపరీక్షలు చేయించుకొని మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. మానసికంగాను, శారీరకం గాను సంసిద్ధత అవసరము.
శ్వాసకోశ సమస్యలు, అత్యధిక రక్తపోటు (బిపి) లాంటి తీవ్రసమస్యలు ఉన్నవాళ్ళు కైలాస పర్వత పరిక్రమ చేయడం సమంజసంకాదు. కాని మానస సరోవరం వరకు రోడ్డు మార్గంగాగాని వాయుమార్గంగా గాని వెళ్ళవచ్చు. హైదరాబాదు నుండి ఘాట్మండు (నేపాల్‌ రాజ ధాని) చేరుకోవాలి. ఢిల్లీ ద్వారా సరాసరి వాయు మార్గము న్నది. అక్కడి నుండి కొడారి (నేపాల్‌ బార్డరు)లో చైనా వీసా తీసుకొని న్యాలం అనే ప్రదేశానికి చేరుకోవాలి. దీని ఎత్తు 3,750మీ. ఇక్కడ రెండు రోజులపాటు ఉంచుతారు. సముద్ర మట్టం నుండి ఎత్నై ప్రదేశాలకు వెళతాం కనుక ఆ వాతావర ణానికి అలవాటు కావడానికి అలా చేస్తారు. అక్కడి నుండి సాగా మార్గంగా డోంగ్వా అనే స్థలాన్ని చేరుకోవచ్చు.
నేపాల్‌ బోర్డర్‌ నుండి మానససరోవరం దాకా సుగమమైన రోడ్డు మార్గమున్నది. ఈ యాత్ర చేయాలంటే ధైర్య సాహసాలకన్న మనోనిబ్బరం అతి ముఖ్యమైనది. యాత్రకు రెండు నెలలకు ముందు శారీరక వ్యాయామము. నడక, యోగా, ప్రాణాయా మము లాంటివి చేయడం అత్యవసరం. ఈ యాత్రకు ముందుగాని, తర్వాతగాని ఖాట్నండులోని శ్రీపశుపతి నాథ దేవాలయం, శ్రీశేషనారాయణ దేవాలయం, స్వయంభూనాథ దేవాలయం, భక్తపూర్‌ పాటన్‌లలోని దేవాలయ సముదాయాలు దర్శింపదగినవి. కొందరు టూర్‌ ఆపరేటర్లు మనోకామనాదేవి ఆలయం, ముక్తినాథ్‌ యాత్ర కూడా జతచేస్తారు. వీటి కోసం ఆదనంగా వారం రోజులు అవసరం ఉంటుంది. ఖాట్మండు నుండి కైలాస మానససరోవర మార్గం దాదాపు 1,000కి.మీ. దాకా ఉంటుంది. అయితే ఈ మార్గమంతా దట్టమైన వృక్ష సంపదతో జలపాతాలతో, నదులతో కూడి కనువిందు చేస్తుంది. టిబెట్‌లో ప్రవేశించగానే భౌగోళిక పరిస్థితులు మారిపోతాయి. ఇసుక తన్నియలు, పర్వతాలు, మైదా నాలు, బ్రహ్మపుత్రానది దాదాపు మానససరోవరం దగ్గర వరకు ప్రవహిస్తుంది. వృక్షసంపద లేదు. ప్రాణవాయువ్ఞ తక్కువ. కనిష్ఠ ఉష్ణోగ్రతలుంటాయి. కావలసిన వస్తు వ్ఞలు, దుస్తుల వివరాలు టూర్‌ ఆపరేటర్స్‌ నుండి తెలు సుకుని తగిన ఏర్పాట్లు చేసుకొని యాత్రకు సంసిద్ధులై ఉండడం అతి ముఖ్యము.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం