భద్రాధీశునికి భక్తుడొనరించిన కైంకర్య శుభవార్తతో మిత్రులందరికీ శుభోదయం
దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం.
భద్రాద్రి దేవస్థానం విశ్రాంత ఈవోగా ఉన్న వి.రామకృష్ణంరాజు ప్రోత్సాహాంతో రామయ్యకు స్వర్ణ భద్రకవచాన్ని తయారు చేయించేందుకు బెంగుళూరుకు చెందిన రంగరాజు, శ్రీదేవి దంపతులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వారు అత్యంత భక్తిప్రపత్తులతో స్వర్ణ భద్రకవచాన్ని రూపొందించి ఇటీవల భద్రాద్రి దేవస్థానం అధికారులకు లాంఛనంగా అందజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల భద్రాచ లం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన కె. ప్రభాకర శ్రీనివాస్ వారంలో ఒక రోజు అంతరాలయంలోని మూలవరులకు స్వర్ణ భద్రకవచ ధారణ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమం లో ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565