కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగే ప్రతి అంశం భక్తకోటికి అమితాసక్తికరమైనదే.స్వామి వారి పూజలు ,కైంకర్యాలు ,ప్రసాద నివేదనలు అన్ని ఆగమశాస్త్రం ప్రకారమే సాగుతుంటాయి.జగద్రక్షకుడైన శ్రీవారికి నిత్యం ఎన్నో రకాల ప్రసాదాలు నివేదిస్తుంతున్నారు.బొజ్జాసనం ప్రకారం
ఆలయంలో ఘంట మోగుతున్న సమయంలో ఉదయం
బాలభోగం ,మధ్యాహ్నం రాజభోగం ,రాత్రికి శయన భోగం సమర్పిస్తారు.ఇలా ప్రతి పూట స్వామికి అనేకానేక ప్రసాదాలు స్వామివారికి ఆరేగింపు చేస్తున్నారు.స్వామి వారి ప్రసాదాలను ఎవరు వండాలి ?ఎలా వండాలి?ఎవరు నివేదించాలి ?ఎంత పరిమాణంలో తయారు చెయ్యాలి ? అనే ఆశక్తికర అంశాలతో శ్రీవారి ప్రధాన అర్చకులు ఎ.వి.రమణదీక్షితులు "ది సెక్రెడ్
పుడ్ ఆఫ్ గాడ్ "పేరిట పుస్తకాన్ని రచించారు.ఆంగ్లలో రాసిన ఈ గ్రంధాన్ని ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందచేసారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565