MohanPublications Print Books Online store clik Here Devullu.com

గ్రీన్ టీ_GreenTEA


గరం.. గరం.. గ్రీన్ టీ!


అలసిపోయినప్పుడు టీ మనకు చక్కటి ఊరటనిస్తుంది.. నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు ఆలంబనగా మారుతుంది.. అలాంటి టీల్లో గ్రీన్ టీ ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది.. దీనితో లాభాలు మెండు అని చాలామంది అభిప్రాయం.. కానీ ఈ టీ మోతాదు ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.. ఇదిగో వీరు అస్సలు వాటి జోలికే పోవద్దట. ఇంతకీ ఎవరు వారు? ఎందుకు తీసుకోకూడదు?

చక్కెర వ్యాధిగ్రస్తులు..


మీకు గ్రీన్ టీ అంటే ఇష్టమా? ఒక కప్పు వరకైతే ఫర్వాలేదు. అంతకుమించి తాగితే మీలో చక్కెర స్థాయిని పెంచే గుణం ఈ గ్రీన్‌టీలో ఉంటుందట. దానివల్ల మైకం, ఆందోళన, గుండెల్లో మంటలు ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే మీరు గ్రీన్ జోలికి వెళ్లకపోవమే మంచిదట. 


గర్భవతులకు..


తల్లి కాబోయే వారు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవద్దట. 10 మి.గ్రా. గ్రీన్ టీ తీసుకునే స్త్రీ లేదా పురుషుల్లో సంతానోత్పత్తి అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ కెఫిన్ కలిగిన మరేదైనా తీసుకోవాలంటే వైద్యుడి సలహా తప్పనిసరి. 

గుండె సమస్యలు..


మాకు గుండె సంబంధిత సమస్యలున్నాయా? అయితే మీరు దీని వాసన కూడా చూడకండి. గ్రీన్ టీలో ఉండే ఫిల్టర్ చేయబడిన కెఫిన్ హృదయ స్పందన పై ప్రభావం చూపి క్రమరహితం చేస్తుంది. గుండె కండరాల మీద కూడా ఈ కెఫిన్ ప్రభావం ఉంటుందట. 

బీపీ ఉన్నవాళ్లు..


కొందరికి చీటికి మాటికి కోపం వచ్చి విరుచుకు పడుతారు. అంటే.. వాళ్లకి హైబీపీ ఉన్నట్లే! ఇలాంటి వాళ్లు ఆకుపచ్చ టీ తాగరాదు. ఇది ఆడ్రినలిన్ రష్ ఇస్తుంది. అంటే గుండెకి పంపింగ్‌ని వేగవంతం చేస్తుందన్నమాట. కాబట్టి వీరు గ్రీన్ టీ తాగకుండా ఉండండి. 

చిన్న పిల్లలకు..


గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వుల శోషణను నిరోధిస్తాయి. ఐతే వీటి మీద మరిన్ని అధ్యయనాలు ఇంకా జరగాల్సి ఉందట. ఇంకొక వైపు కెఫిన్ కారణంగా పిల్లల పెరుగుదల తగ్గుతుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పెరిగే సమయంలో వారికి గ్రీన్ టీ ఇవ్వకండి. 


రక్తహీనత..


రక్తహీనతతో బాధపడే వాళ్లు గ్రీన్ టీ తాగొద్దని 2001లో ఒక అధ్యయనం చెబుతున్నది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే.. శరీరంలో ఐరన్ లోపాన్ని కలిగి ఉంటే.. ఆహార పదార్థాల నుంచి ఐరన్ శోషణను తగ్గిస్తుంది. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమి..


కంప్యూటర్లు, ఫోన్లతో కుస్తీ పట్టే జీవులకు నిద్ర అనేది బంగారమై పోతుంది. ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే కెమికల్స్ మెదడుపై ప్రభావం చూపి మిమ్మల్ని నిద్రపోకుండా చూస్తాయి. కాబట్టి నిద్రలేమి ఉన్నవాళ్లు కూడా ఈ టీని ముట్టకూడదు. 


ఎలాంటి జాగ్రత్తలు?


-ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే.. 
శరీరాన్ని శుభ్రం చేస్తుందని నమ్ముతారు. కానీ అది పొరపాటు. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని 
డైల్యూట్ చేసి సమస్యకు కారణమవుతుంది. 
-గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలన్నీ పొందాలంటే.. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తర్వాత గంట నుంచి రెండు గంటల 
మధ్యలో తీసుకోవాలి. 
- గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, థియనైన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. కానీ పాలల్లో ఉండే ప్రొటీన్స్, క్యాలరీలు, చక్కెరలో ఉండే ఫ్లవనాయిడ్స్ నెగెటివ్ రియాక్షన్‌కి కారణమవుతాయి. కాబట్టి చక్కెర, 
పాలు కలపకపోతే అందులోని ప్రయోజనాలన్నీ పొందవచ్చు. 
- భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తీసుకోరాదు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపి పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది. 
- గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్‌ని పెంచి కాలేయంపై 
దుష్ప్రభావం చూపుతాయి. సౌమ్య పలుస





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list