అంతరంగంలోకి తొంగిచూడడమే మార్గం!
మీరు ఇంతవరకు జీవితంలో పడిన శ్రమ అంతా ఒక్కదాని గురించే. మీరు మంచి ఉద్యోగం కోసం వెతికినా, వ్యాపారం ప్రారంభించినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, వీటన్నిటి వెనకా ఉన్న ఒకే ఒక్క కోరిక: ‘ఆనందం’. కానీ, ఈ ప్రయత్నంలో ఎక్కడో ఒకచోట జీవితం సంక్లిష్టమైపోయింది. ఈ భూమి మీద మీరు, మరే ఇతర ప్రాణిగా పుట్టినా, జీవితం ఎంతో సరళంగా ఉండేది. మీ అవసరాలన్నీ శారీరకమై ఉండేవి. కడుపు నిండితే ఆ రోజు గొప్పరోజు అని లెక్క. మీరు మీ పెంపుడు కుక్కనుగాని, పిల్లిని గాని గమనించండి. ఆ పూటకు వాటి కడుపు నిండితే చాలు, అవి ప్రశాంతంగా ఉంటాయి. కానీ, మీరు మనిషిగా ఈ భూమ్మీద పడిన తర్వాత, అన్ని విషయాలూ మారిపోతాయి. కడుపు ఖాళీగా ఉంటే ఒకే సమస్య: ఆకలి. కడుపు నిండితే? వంద సమస్యలు. మన మనుగడే ప్రశ్నార్థకమైనపుడు మన జీవితాల్లో అదే పెద్ద సమస్య. ఒకసారి ఆ అవసరం తీరితే, అది పెద్ద విషయమేమీ కానట్టనిపిస్తుంది. మనిషికి అతని మనుగడకు అవసరమైనవి సమకూరడంతో జీవితం ముగిసిపోదు, జీవితం అక్కడి నుండే మొదలవుతుంది. అసలు దానితోనే ప్రారంభమవుతుంది.
ఈ రోజుల్లో, అంటే మన తరంలో, మన ముందర తరాల వారికంటే, మన మనుగడకు అవసరమైనవన్నీ ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతున్నాయి. మీరిప్పుడు సూపర్ మార్కెట్‌కు వెళ్ళి ఒక సంవత్సరానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోగలరు. అది మీరు గడప దాటి బయటకి కాలు పెట్టకుండా కూడా చేసుకోగలరు. మానవ జీవిత చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా సాధ్యపడలేదు. ఒక వంద సంవత్సరాల క్రిందట రాజులకీ మహరాజులకీ కూడా దొరకని వస్తువులు ఇపుడు సామాన్యునికి అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రహం మీద జీవించిన మనుషులందరిలోకీ మన తరమే ఎంతో సుఖమైన జీవితం గడపగలుగుతున్నది. కానీ, మనం ఇప్పటివరకు జీవించిన వాళ్ళలో, ఎక్కువ ఆనందంగా ఉన్నవాళ్ళమూ, జీవితాన్ని ఎక్కువగా జీవించిన వాళ్ళమూ, ఎక్కువ ప్రశాంతతగలిగిన వాళ్ళము మాత్రం కాదు.
ఇలా ఎందుకు జరుగుతోంది? మన చుట్టూరా ఉన్న వాటిల్లో లోపాలనన్నిటినీ సరిదిద్దగలిగాం. ఇక ఏ మాత్రం చక్కదిద్దినా ఈ భూమి మిగలదు అన్నంతగా. కానీ వెయ్యి సంవత్సరాల క్రిందటి మన పూర్వీకులకన్నా మనం ఏమంత ఎక్కువ ఆనందంగా లేము. ఇవేవీ జరగటం లేదంటే, ఎక్కడ పొరపాటు ఉందో అని వెనుతిరిగి చూసుకోవలసిన సమయం కదా? మనం వేసుకున్న ప్రణాళికలు మనల్ని గమ్యానికి చేర్చకపోయినా, వాటినే అంటి పెట్టుకుని ఎన్నాళ్ళు వేళ్లాడతాం? ఇది మనలో సమూలమైన మార్పులను తీసుకురావలసిన సమయం.
-ప్రేమాశీస్సులతో, సద్గురు
మ్యాంగో శాఫ్రాన్ లస్సీ
కావలసినవి:
మామిడిపండు గుజ్జు - ముప్పావుకప్పు, పెరుగు - ఒక కప్పు(కొవ్వు తక్కువ ఉన్నది), పంచదార లేదా తేనె - ఒక టేబుల్‌స్పూన్, కుంకుమపువ్వు తీగలు - రెండు చిటికెలు, బాదం పలుకులు - మూడు టేబుల్ స్పూన్లు, పాలు - మూడు టేబుల్ స్పూన్లు (గోరువెచ్చని+చల్లటిపాలు కలిపి), ఐస్‌క్యూబ్స్ - కొన్ని.
తయారీ:
రెండు టేబుల్ స్పూన్ల గోరు వెచ్చని పాలలో కుంకుమపువ్వు తీగలు కొన్ని నిమిషాలు నానబెట్టాలి.
బ్లెండర్‌లో మామిడి గుజ్జు, పెరుగు, చల్లటిపాలు పోసి అన్నీ బాగా కలిసిపోయేలా గ్రైండ్ చేయాలి.
అందులో బాదం పలుకులు, తేనె లేదా పంచదార, కొన్ని ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేస్తే మ్యాంగో శాఫ్రాన్ లస్సీ రెడీ.
మసాలా చాయ్
కావాల్సిన పదార్థాలు :
అల్లంపేస్టు : అరస్పూను
చెక్క, లవంగాలు, యాలకలు : ఒకస్పూను
నిమ్మరసం : అరస్పూను
టీ పొడి : రెండుస్పూన్లు
తులసి, పుదీనా ఆకులు : పది
తేనె లేదా పంచదార : ఒక స్పూను
ఎలా చేయాలి?
ఒక్క నిమ్మరసం తప్ప పైన చెప్పిన వాటన్నిటినీ.. రెండు గ్లాసుల వేడి నీటిలోకి వేసి.. మరగనివ్వాలి. మంచి సువాసన వెదజల్లే వరకు ఉండాలి. ఆ తరువాత నిమ్మరసం కలిపి.. తేనె లేదంటే పంచదారలతో కలిపి తాగొచ్చు. మసాలా టీ తాగితే జలుబు, దగ్గులకు ఉపశమనం కలుగుతుంది. పాలు లేకుండా తాగడం వల్ల కొవ్వు సమస్యకు దూరం కావొచ్చు. ఉదయం, సాయంత్రం పూట తాగితే తక్షణ ఎనర్జీ వస్తుంది.
మిరియాలతో అజీర్తి దూరం
అతి చవకగా లభించే మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్తి సమస్యలకు ఇవి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. కాసిన్ని మిరియాలు నోటిలో వేసుకుంటే గొంతునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మిరియాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. 5గ్రాముల మిరియాల పొడిని ఒక కప్పు మజ్జిగతో కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. పేగులలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కావడానికి మిరియాలు సహాయపడతాయి. జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఆహారం నిలువ ఉండకుండా చూస్తాయి.
మిరియాల పొడిని అల్లం రసంతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మిరియాలు, అల్లం కలిపి తయారుచేసిన చట్నీ తీసుకుంటే శరీరం పునరుజ్జీవం పొందుతుంది.
ఆకలి లేని వారికి మిరియాలు దివ్యౌషధం. మిరియాలతో చేసిన డికాషన్‌ను తీసుకుంటే ఆకలి పుడుతుంది. మిరియాల పొడిని, ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఆకలి కలుగుతుంది. మిరియాల రసం తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
రాళ్లలో ఉన్న ‘అందం’..
వజ్రాలు, రత్నాలు, క్రిస్టల్స్ వంటి విలువైన స్టోన్ జువెలరీ వ్యక్తుల స్టేట్‌సనే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి. అందుకే ఇటీవల కాలంలో బ్యూటీ ఉత్పత్తుల్లో వీటి ఇంగ్రెడియెంట్స్ కలిపి ఆడవాళ్ల అందానికి మరింత మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో విలువైన స్టోన్‌గా పరిగణించే క్రిస్టల్స్ చర్మ సౌందర్యాన్ని పరిరక్షిస్తాయి. మహిళల అందాన్ని పెంచే ఫేషియల్ క్రీమ్స్‌లో సైతం క్రిస్టల్ పీసెస్, క్రిస్టల్ స్టోన్స్‌లను పదార్థాలుగా వాడుతున్నారు. వీటిల్లో చర్మానికి సాంత్వన నిచ్చే గుణం ఉంది. క్రిస్టల్స్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపేస్తాయి. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతెందుకు మైక్రోడెర్మాబ్రాసన్‌లో కూడా క్రిస్టల్స్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. వీటివల్ల యాక్నే మచ్చలు పోతాయి. రఫ్‌గా ఉండే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. క్రిస్టల్స్ కణాలపై బాగా పనిచేయడం వల్ల చర్మ కాంప్లెక్సన్‌లో కూడా మార్పు వస్తుంది. చర్మంలో మెరుపు కనపడుతుంది. క్రిస్టల్స్‌లోని ఒక రకమైన రోజ్ క్వార్ట్జ్ పొడి చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని సుతిమెత్తగా ఉండేలా చేస్తుంది. రూబీ క్రిస్టల్స్ చర్మంపైనున్న మృతకణాలను పోగొట్టి మెరిసేలా చేస్తుంది. డైమండ్స్ కూడా చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. వజ్రాల పొడి బ్యూటీ ఉత్పత్తుల్లో వాడడం వల్ల చర్మం ముడతలు పడదు. మిస మిసలాడే యవ్వనపు చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది.
స్విమ్మింగ్‌పూల్‌కు వెళుతున్నారా?
పల్లెటూర్లలో అయితే నదులు, వాగుల్లో పడి సమయంతో పనిలేకుండా ఈత కొట్టొచ్చు. కానీ నగరాల్లో ఈత కొట్టడానికి స్విమ్మింగ్‌పూల్ తప్ప మరో మార్గం లేదు. స్విమ్మింగ్‌పూల్‌కు వెళుతున్నట్లయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
స్విమ్మింగ్ పూల్ పరిశుభ్రత విషయం తేలిగ్గా తీసుకుంటే అనేక రకాలైన రోగకారక బ్యాక్టీరియాలు వృద్ధి చెంది, ఆరోగ్యాన్ని పాడుచేసే అవకాశం ఉంది. కాబట్టి ఈతకు వెళ్లే వారు ఆరోగ్య సంరక్షణలో చాలా శ్రద్ధ తీసుకోవాలి.
స్విమ్మింగ్‌పూల్‌లో క్లోరినేషన్ ప్రక్రియ చేస్తుంటారు. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో క్లోరిన్ స్విమ్మింగ్‌పూల్‌లో కలపడం వల్ల ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదముంది. కాబట్టి సరియైున మోతాదులో క్లోరినేషన్ చేశారా? లేదా? అన్న విషయాలు తెలుసుకోవాలి.
నీటిలో పిహెచ్ సరిస్థాయిలో ఉందో లేదో గమనించడం చాలా ముఖ్యమైన అంశం. పీహెచ్ స్థాయి 7.2-7.8 మధ్యలో ఉండాలి. నీటిలో తెల్లటి స్ర్టిప్‌ను పెట్టి నీటి గుణాన్ని పరిశీలించవచ్చు. ఒక నిమిషం పాటు తెల్లటి స్ర్టిప్‌ను నీటిలో ముంచి దాని రంగు గమనించాలి. అది కనక రంగు మారినట్టయితే పిహెచ్ లెవెల్లో తేడా ఉందని గ్రహించాలి.
స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగేముందు తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈత పూర్తయ్యాక కూడా తప్పనిసరిగా మంచి నీటితో స్నానం చేయాలి. అప్పుడే చర్మ సమస్యలు దరిచేరవు.
మరిచిపోయిన మాత్రలను మళ్లీ వేసుకోవచ్చా?
నాకు ఆరేళ్లుగా మధుమేహం ఉంది. సొంత వ్యాపారంలో రోజూ బాగా బిజీగా ఉంటాను. అందుకే ఎంత గట్టిగా అనుకున్నా, మధ్య మధ్య ఒకరోజు మాత్రలు వేసుకోవడం మరిచిపోతుంటాను. ఈ విషయాన్ని నా సన్నిహిత మిత్రుడొకరికి చెబితే, ‘అందులో ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు. ఏ రోజు షుగర్ మాత్ర వేసుకోవడం మరిచిపోతామో.. ఆ మరుసటి రోజు రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది’ అన్నాడు. వినడానికి ఇది చాలా సౌలభ్యంగానే ఉంది కానీ, శాస్త్రీయంగా ఇది సబబేనా కాస్త తెలియజేయండి.
- పి. మంజుల, ప్రకాశం జిల్లా
షుగర్ మాత్రలు వేసుకునే విషయంలో ఎంతమాత్రం సడలింపులు ఉండవు. మరిచిపోకుండా ఎలా ఉండాలా అనే విషయంలో మరింత శ్రద్ధ వహించాలేగానీ, ఈ రోజు వేసుకోవాల్సిన మాత్రను రేపు వేసుకునే వెసులుబాటు గురించి ఆలోచించకూడదు. రెండు రోజుల మాత్రల్ని ఒకే రోజు వేసుకోవడం వల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ. కొందరు మోతాదును మించి తిన్న రోజున రెండు మాత్రలు, మామూలుగా తిన్న రోజున ఒక్క మాత్ర.. ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ విధానం కూడా నష్టకార కమే. మామూలుగా ఏ రోజు మాత్రలు ఆ రోజుకే కాకుండా, ఈ రోజు వేసుకున్న మాత్ర ప్రభావం కొంత రేపటికి, ఇవాళ్టి, రేపటి మాత్రల ప్రభావం కొంత ఎల్లుండికి, ఇలా కొంత కొంతగా కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమం ఎంతో ప్రయోజనకరం కూడా. అందుకు విరుద్ధంగా ఒక్కో రోజు వేసుకోవడం మానేస్తే, ఆ క్రమమంతా అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే కచ్ఛితంగా, ఏ రోజు మాత్రలు ఆ రోజునే వేసుకుంటూ ఉండాలి. ఇటీవలే మధుమేహం ఉన్నట్లు తేలి ఎవరైనా కొత్తగా మాత్రలు వేసుకోవడం మొదలెట్టారనుకోండి. తొలి రోజు వేసుకున్న మాత్రల ప్రభావం ఒంటి మీద వెంటనే కనిపించదు. వరుసగా మూడు రోజుల పాటు వేసుకుంటే గానీ, దాని ప్రభావం తెలియదు. అందువల్ల ఒక రోజు వేసుకుని పెద్ద ప్రభావమేదీ కనిపించడం లేదని మానేయడమో, మందులు మార్చే ప్రయత్నమో చేయకూడదు.
- డాక్టర్ సూర్యనారాయణ, ఫిజీషియన్
నవ్వండి.. నిద్రపోండి
ఒత్తిడి వల్ల కంగారూ, ఆందోళన, తలనొప్పి వంటివే కాదు.. జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. బరువు నియంత్రణలో ఉండదు. దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులూ తప్పకపోవచ్చు. అందుకే ఎప్పటిప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి.
* మొదట ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఓ చోట రాసుకోవాలి. వాటిని ఓ క్రమపద్ధతిలో తగ్గించుకుంటూ వెళ్లాలి.
* ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు మనం ఆరోగ్యంతో ఉండాలి. అంటే మానసికంగా, శారీరకంగా. అందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని దాన్నొక అలవాటుగా చేసుకోండి.
* ధ్యానం ఎలాంటి ఒత్తిడినైనా తగ్గిస్తుంది. రోజులో ఓ పదినిమిషాలు ఇందుకోసం కేటాయించండి.
* మీరు తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. దాంతో మీకు ఎదురయ్యే ఏ రకం ఒత్తిడినైనా సమర్ధంగా ఎదుర్కోగలరు.
* కలతలు లేని నిద్ర మీ శరీరానికి, మెదడుకు ఆరోగ్యాన్నిస్తుంది. మనసుకీ హాయిగా అనిపిస్తుంది. అందుకే బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు హాయిగా నిద్రపోయేలా చూసుకోవాలి.
* మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు అనిపిస్తాయి. కాబట్టి అన్నివేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే సరదాగా మాట్లాడేవారితో గడిపినా కూడా ప్రయోజనం ఉంటుంది.
* తోటపని చేయడం, లేదా మొక్కల మధ్య గడపడం వల్ల కూడా ఒత్తిడి సులువుగా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
పిల్లలు తినడం లేదా!
చిన్నారులు ఆటలకే పరిమితం అవుతారు తప్ప తిండి మీద ధ్యాస పెట్టరు. కొందరికైతే అస్సలు ఆకలి వేయదు. మరి అలాంటి చిన్నారుల విషయంలో ఏం చేయాలో తెలుసా!
* పిల్లలు సాయంత్రాలు కనీసం గంట ఆరుబయట ఆడుకునేలా చూడాలి. కుదిరితే మీతోపాటూ వ్యాయామానికీ తీసుకెళ్లాలి. దానివల్ల ఆకలిని పెంచే హార్మోన్లు సమతుల్యమవుతాయి. బాగా ఆకలీ వేస్తుంది.
* ఉదయం పూట చిన్నారులకు నూనె పదార్థాలు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు వృద్ధి అవుతుంది. దానివల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. కడుపునిండా తింటారు.
* ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. కొద్దికొద్దిగా తినిపించడం అలవాటు చేయాలి. దాంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అదనపు కొవ్వు కూడా పేరుకునే ప్రమాదమూ ఉండదు.
* చిన్నారులు చిప్స్ వంటి జంక్ పదార్థాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. అందువల్ల కూడా ఆకలి వేయదు. వాటికి బదులు అరటి పండ్లూ, రాగి జావా, ఓట్స్, నువ్వులూ, పల్లీ చిక్కీలూ, పండ్ల రసాలు ఇస్తుండటం మంచిది. ఇవి త్వరగా జీర్ణమై ఆకలిని పెంచుతాయి.
* సాధ్యమైనంత వరకూ కుటుంబ సభ్యులంతా కలిసి తినడానికి ప్రణాళిక వేసుకోవాలి. తినే సమయంలో కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ.. నవ్వుకుంటూ తింటూ ఉంటే ఆహారం మీద నుంచి దృష్టి మళ్లుతుంది. హాయిగా తింటారు.
* పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం ఇవ్వడం సరికాదు. వాళ్లకి నచ్చే పదార్థాలను పలు రకాలుగా ప్రయత్నించి.. వైవిధ్యంగా అలంకరించి పెడితే ఇష్టంగా తింటారు. అలాంటివి చూసినప్పుడు ఆకలీ కలుగుతుంది.
వ్యాయామానికీ ఓ లెక్కుంది!
రోజూ వ్యాయామం చేసే వాళ్లు ఎక్కువగా తినాలి.. క్రంచెస్ చేస్తుంటే గనుక తిన్నా, తినకపోయినా పొట్ట దగ్గర కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇలాంటి అభిప్రాయాలు నిజమేనా? వ్యాయామం వెనుక వాస్తవాలు ఏంటి?
క్రంచెస్ వ్యాయామాలు చేసినా కడుపునిండా తినాలి తప్ప పొట్ట మాడ్చుకోకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతుంది. దానివల్ల మనం తిన్నదంతా చక్కగా జీర్ణమై శరీరంలో కెలొరీలు పేరుకుపోకుండా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసినప్పుడు అయినా సరే ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి.
* సంగీతం వింటూ చేసే వ్యాయామం ఎక్కువ ఫలితాలనిస్తుందని నమ్ముతారు చాలామంది. నిజమే సంగీతం వింటూ చేయడం వల్ల వ్యాయామంతో త్వరగా విసుగురాదు. వ్యాయామ ఫలితాలు పెద్దగా కష్టం లేకుండానే అందుతాయి.
* ముందు స్ట్రెచింగ్‌లు చేసి అప్పుడు వ్యాయామం చేయాలనుకుంటారు చాలామంది. నిజమే కానీ స్ట్రెచింగ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదు. అలా చేస్తే కండరాలు పట్టేస్తుంటాయి. వార్మ్ అప్, స్ట్రెచింగ్ రెండూ వేర్వేరు వ్యాయామాలు. వార్మ్‌అప్‌లని నిపుణుల ఆధ్వర్యంలో నేర్చుకుని అప్పుడు సొంతంగా చేయండి.
ఇంటిప్స్
కార్పెట్‌లను వాడని రోజుల్లో మడతపెట్టి లోపల పెట్టకూడదు. చాప చుట్టినట్లు రోల్ చేయాలి. మడతపెడితే ఆ మడతలు అలాగే నిలిచిపోతాయి. మళ్లీ పరిచినప్పుడు చక్కగా పరుచుకోకుండా... ఆ మడతల దగ్గర కార్పెట్ పైకి లేస్తుంది. కార్పెట్‌ను వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసేటప్పుడు ఒకటే వైపుకి స్ట్రోక్స్ ఇవ్వాలి. అప్పుడే ఫర్ అంతా ఒకే దిశలో ఉండి డిజైన్ చక్కగా కనిపిస్తుంది.
వాక్యూమ్ క్లీనర్‌ని ఎటుపడితే అటు దిశమారుస్తూ క్లీన్ చేస్తే డిజైన్ షేప్ అవుట్ అవుతుంది. నీటిలో ఉతికి ఆరిన తర్వాత పరిచేటప్పుడు ఫర్‌ని పొడి బ్రష్‌తో స్మూత్‌గా రుద్దాలి.
దైవచింతన అంటే సమాజ సేవే!
ఆత్మీయం
నేడు సమాజం ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది. తమకున్న జ్ఞానాన్ని సమాజానికి అందివ్వాలనే ఉద్దేశ్యంతో పరిశోధకులు, శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూ కృషి చేయడం వల్ల, నేడు విద్య లేనివారు సైతం సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అంతంతమాత్రం చదువుకున్నవారు సైతం కంప్యూటర్ ఇంటర్‌నెట్ లాంటి అత్యాధునిక విజ్ఞానాన్ని అనుభవించడమే కాక, ఆకాశయానాలు సైతం చేస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలను, వింతలు, విడ్డూరాలను ఇంటిలోనే ఉండి టీవీల ద్వారా వీక్షిస్తున్నారు.
అకాల మృత్యువును సైతం జయించగలిగే ఆరోగ్య విధానాన్ని రూపొందించుకోగలుగుతున్నారంటే ఇదంతా విజ్ఞానవేత్తల జ్ఞానసంపదే. జ్ఞానసంపదకు మూలం దైవచింతనే. ఎందుకంటే, దైవచింతన వల్లే ఏకాగ్రతను, స్వీయనియంత్రణను సాధించగలుగుతున్నారు. దైవచింతన లేనివారు ఇవన్నీ సాధించగలగడం లేదా అంటే సాధించగలరు. అయితే తాము అది సమాజసేవలో భాగంగా చేస్తున్నామనుకుంటారు. సమాజ సేవ అంటే మానవ సేవ అంటే మాధవ సేవే కదా! దైవచింతన లేనివారిని కూడా దేవుడు అభినందిస్తాడు. ఆయనకు తన పర భేదం లేదు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565