MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోవేదన_govedana



గోవేదన
అమలుకాని చట్టాలు
రాజ్యాంగంలోని 48వ అధికరణంలోని ఆదేశిక సూత్రాలు గోరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, ఈ తరహా జంతుజాతుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాయి. గోవధను గట్టిగా ప్రతిఘటించడంతో పాటు వాటి దూడలను పరిరక్షించాలని ఈ సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవే కాకుండా పాలు ఇచ్చే ఏ జంతుజాలాన్ని వధించకూడదని ఆదేశిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గోరక్షణకు సంబంధించి ఈ మార్గదర్శక సూత్రాలు జారీచేశారు. 1950లో పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రభుత్వాలు, 1954లో గుజరాత్ ఇందుకు సంబంధించి శాసనాలు తెచ్చాయి. 1955లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లు చట్టాలు తెచ్చాయి. ఆ తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటకల్లో కూడా చట్టాలు వచ్చాయి. గోవధతో పాటు ఇతర జంతువుల వధను నిషేధిస్తూ దాదాపు 24 రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చినా వాటిని సరైన రీతిలో అమలుచేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. మానవాళికి కామధేనువు. దీని శరీరంలోని ప్రతి భాగం పూజనీయమే. సమస్త దేవతల

లోనే కొలువుదీరి ఉంటారన్న నానుడి అక్షర
మద్రాస్ హైకోర్టు స్టే
పశుగణాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం ఈ మొత్తం వ్యవహారాన్ని ఆసక్తికర మలుపు తిప్పింది. నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలంటూ ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని అటు కేంద్రాన్ని ఆదేశించింది. ఏ రకమైన ఆహారం తినాలన్నది ఆయా వ్యక్తుల ఇష్టాయష్టాలపై ఆధారపడే అంశమని, అది అతడి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని కూడా స్పష్టం చేయడం గమనార్హం.సత
గోవధను నిషేధించాలన్న
ఆలోచన ఈనాటిది కాదు. ఎందరో హిందూ రాజులు ఈ నిషేధాన్ని శాశ్వతంగా మార్చేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. వారికి అప్పట్లోనే ఎన్నో హిందూ సంస్థలు మద్దతును అందించాయి. దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో
బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్ వంటి మహానాయకులు గోవధపై పూర్తి నిషేధాన్ని విధించాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రానంతరం ఇందుకు సంబంధించి గట్టి ప్రయత్నం జరగకపోయినా ఈ నిషేధ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి పూజనీయ గోమాతను రక్షించి ఆ సంతతిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ గోవధ నిషేధంపై గట్టి డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో అమలుచేసింది కూడా. రెండు ప్రధాన జాతీయ పార్టీలు గోవధకు వ్యతిరేకం కాబట్టి
ఈ దిశగా ముందుకు వెళ్లడమన్నది
పెద్ద సమస్యేమీ కాదు.
1966లో భారీ ఉద్యమం
ఇది చాలామందికి తెలియని విషయం. గోవును మనం ఎంతగా పూజిస్తున్నామో దాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతగా పాటుపడుతున్నామో తెలియజేసే అంశం. 1966లోనే గోవధ నిషేధానికి సంబంధించి పెద్ద ఉద్యమమే జరిగింది. అప్పట్లో వేలాదిమంది సాధువులు గోవధను నిషేధించాలని, ఇందుకు జాతీయ స్థాయిలో చట్టాన్ని తీసుకురావాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అప్పట్లో శంకరాచార్య ఇందుకోసం నిరాహారదీక్ష కూడా చేశారు. ఆ ఉద్యమం ఎంత తీవ్రంగా మారిందంటే దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతలు స్తంభించిపోయింది. పోలీసు కాల్పుల్లో అనేకమంది మరణించారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు. అప్పటి హోంమంత్రి గుల్జారీలాల్ నందా దీని పర్యవసానంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.ం. అలాంటి గోమాతను అన్నివిధాలుగా పరిరక్షించుకోవడంలోనే, దాని సంతతిని పెంపొందించడంలోనేటు మానవీయత
పరిఢవిల్లుతుంది. మన పురాణాలు,
ఇతిహాసాల్లో గోవుల పూజనీయతకు
సంబంధించి ఎన్నో ఉదంతాలు,
దృష్టాంతాలు ఉన్నాయి. వర్తమాన భారతం గోరక్షణను బాధ్యతగా స్వీకరించాలి. 1966నాటి ఉద్యమం తరహాలో గోమాత సంరక్షణ జాతి చైతన్యాన్ని మరోసారి
రేకెత్తించాలి. అప్పుడే కేంద్రం తీసుకొచ్చిన తాజా చట్టానికి అర్థం, పరమార్థం.
హిందూ ధర్మంలో అత్యంత పూజ్యనీయమైన, విశిష్టమైన లక్షణాలు కలిగిన సాధు జంతువు ఆవు. ఇటీవలి కాలంలో గోవధకు సంబంధించి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పూజనీయ సాధు జంతువును పరిరక్షించుకోవాల్సిన అగత్యం, అవసరం మరింతగా కనిపిస్తోంది. పురాణాల్లోనూ, రామాయణ భారతాల్లోనూ ఆవుకు సంబంధించి ఎన్నో విశిష్టమైన ఉదంతాలున్నాయి. గోవులతోనే బాల్యాన్ని గడిపాడు కాబట్టే శ్రీకృష్ణుడికి గోపాలుడు అనే పేరు వచ్చింది. అదేవిధంగా పురాణాల లోతుల్లోకి వెళితే దేవతలే పూజించిన పూజనీయ జీవిగా ఆవు మనకు కనిపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం మానవాళి వినియోగానికి ఉపయోగపడే జంతువు ఏదైనా ఉందంటే అది గోమాతేనని స్పష్టంగా చెప్పవచ్చు. భారతదేశంలో దాదాపు 300 మిలియన్ల పశుగణాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అత్యధిక స్థాయిలో పశు మాంసాన్ని ఎగుమతి చేస్తున్న దేశం కూడా భారతదేశమే. ఇక వినియోగంలోకి వస్తే ప్రపంచంలో ఐదవ అతి పెద్ద దేశం. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ గతంలో ఎన్నడూ లేని విధంగా గోరక్షణ ఉద్యమం ప్రభంజనంలా మారింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గోరక్షక బృందాలు ఏర్పడి వాటిని కాపాడటం కోసం గట్టి ప్రయత్నాలనే చేపట్టడం మొదలుపెట్టాయి. అదేవిధంగా గోమాంస నిషేధం కూడా అమలులోకి రావడంతో వీటి పరిరక్షణకు గాను గోశాలలు వెలిశాయి. అనేక ప్రభుత్వాలు గోవధను నిషేధించడమే కాకుండా దాని పరిధిలోకి ఎద్దులను, ఆబోతులను కూడా తీసుకువచ్చాయి. హర్యానా ప్రభుత్వమైతే ఇందుకు సంబంధించి ఒక శాసనానే్న తీసుకువచ్చింది. ఆవిధంగా దేశంలో బలపడుతున్న గోరక్షణ ఉద్యమం నేపథ్యంలో గోమాతకు సంబంధించిన పౌరాణిక, చారిత్రక, వర్తమాన ప్రాధాన్యతలను తెలుసుకోవడం, ఆ విషయంలో సరైన అవగాహనను ఏర్పరచుకోవడం అన్నది ఎంతైనా అవసరం. బిడ్డకు తల్లిపాలు తర్వాత అత్యంత శక్తినిచ్చేది ఆవుపాలేనన్న విషయం తెలిసిందే. ఒక దశ వరకూ బిడ్డను తన సొంత పాలతో సాకే తల్లి, ఆ దశ దాటిన తర్వాత ఆవుపాలే పట్టిస్తుంది. అందుకు కారణం ఆవు పాలు తల్లిపాలకు మించిన స్థాయిలో బలాన్ని ఇవ్వడమే. ఇటీవలి కాలంలో పాల పొడి మొదలైనవి వచ్చినప్పటికీ తల్లిపాలకు మించిన స్థాయిలో బిడ్డకు శక్తినిచ్చేది ఆవుపాలేనన్న విషయంలో దశాబ్దాల భారతీయ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. మిగతా ఏ రకమైన పాలను బిడ్డకు ఇవ్వడానికి తల్లి సందేహిస్తుందేమో కానీ ఆవుపాలను మాత్రం ఆనందంగా పట్టిస్తుంది. ఇందుకు కారణం పోషక విలువలతో పాటు ఔషధ విలువలూ పుష్కలంగా ఉండటమే. ఇంతటి పూజనీయమైన, పవిత్రమైన సాధు జంతువును వధించి, మాంసం కోసం భక్షించడమంటే ఎంతమాత్రం క్షంతవ్యం కాని పని.
భారతదేశం హిందూ దేశం కావడం, 80 శాతం పైగా ప్రజలు హిందువులే కావడం వల్ల పూజ్యనీయ గోమాత వధను వ్యతిరేకించడం అన్నది, నిషేధించాలని డిమాండ్ చేయడమన్నది ఎంతైనా సమంజసమే. ఇటీవలి కాలంలో గోవధ అత్యంత తీవ్రమైన వివాదంగా మారడం, చాలా రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్యగా కూడా పరిణమించిన నేపథ్యంలో గోమాతను మనం ఎందుకు సంరక్షించుకోవాలి అన్న స్పృహతో పాటు ఈ సాధు జంతువు వల్ల కలిగే అనేకానేక ప్రయోజనాలను మననం చేసుకోవడం అవసరం. గోవధను నిషేధించాలని ప్రధానంగా డిమాండ్లు తలెత్తడానికి కారణం గోమాత హిందువులకు మతపరమైన సాంప్రదాయకమైన అనిర్వచనీయ అనుబంధం ఉండటమే. దేవతలకు గోమాత పూజనీయం కావడమే. తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గోమాతలోని ప్రతి భాగమూ అనేకమంది దేవతల కూడలే. అందుకే హిందూ సంప్రదాయంలో గోవును పూజించడమన్నది ఓ ఆచారంగా వస్తోంది. మన పురాణాల్లో ఇందుకు సంబంధించి ఎన్నో కథలు, దృష్టాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆవు పాలలో చతుస్సముద్రాలు ఉంటాయన్నది పురాణాల సారాంశం. అంటే ఏ జంతువులో లేని విశిష్టత ప్రత్యేకత గోవుకు ఉంది. అంతేకాదు, దీని సర్వాంగాలూ అత్యంత పవిత్రం, పరమ విశిష్టం అని వేదపండితులు చెబుతారు. వేద సారాన్ని పరికిస్తే హిందూ సంప్రదాయంలో గోవు ఎంతటి విశిష్ట జీవో అర్థమవుతుంది. గోవు నుదురు, కొమ్ములు.. ఇలా ప్రతి భాగమూ దేవతల ఆస్థానమే. అందుకే చాలా ఆలయాల ముందు మనకు ఆవు కనిపిస్తుంది. దాన్ని పూజించిన తర్వాత భక్తులు లోపలకు వెళ్లడమూ ఆనవాయితే. గోవు నుదురు, కొమ్ముల భాగంలో పరమ శివుడు కొలువుతీరి ఉంటాడన్నది నానుడి. అందుకే ఆ కొమ్ముల మీద జల్లిన నీళ్లను సేవిస్తే త్రివేణి సంగమంలో స్నానమాచరించినంత పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. అలాగే మన పురాణాలు, ఉపనిషత్తులను కూడా పరిశీలిస్తే గోవుకున్న ప్రాధాన్యత మనకు స్పష్టమవుతుంది. అలాగే చరిత్ర లోతుల్లోకి వెళ్లినా ఆనాటి రాజులు, రారాజులు గోవును ఎంతగా పూజించారో స్పష్టమవుతుంది. మతమూ, సంప్రదాయంతో ముడివడిన సాధుజంతువుగా గోమాత పూజనీయ స్థానాన్ని భారత ఇతిహాసాల్లోనూ, వర్తమాన చరిత్రలోనూ సంతరించుకుందన్నది ఎంతైనా నిజం. వేలాది సంవత్సరాలుగా హిందూ రాజులే కాకుండా హిందూయేతర రాజులైన బాబర్, హైదర్ అలీ, రంజిత్‌సింగ్ వంటివారు సైతం గోవును పూజనీయ ప్రాణిగా భావించిన విషయం చరిత్ర చెబుతోంది. ఇదంతా గతం కావచ్చు. గతాన్ని వర్తమానానికి వర్తింపజేసుకోవడం వల్లే విజ్ఞతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి
అర్థవంతమైన ఆలోచనలతో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. గోవునే ఎందుకు వధించకూడదు? ఇతర జంతువులకు ఆ నిషేధం ఎందుకు వర్తించదు? అన్న డిమాండ్లు సైతం పుట్టుకొస్తున్నాయి. ఆమాటకొస్తే ఏ జంతు వధనైనా నిషేధించడం ఎంతైనా అవసరం. ఎందుకంటే జంతువులకు పూర్తికాలంపాటు జీవించే అవకాశం కల్పించడమన్నది ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతిలో ప్రతి జీవికీ ప్రాణం పోయే వరకు జీవించే హక్కు, అధికారం ఉంది. మధ్యలో దేని జీవితాన్ని హరించే అధికారం ఎవరికీ లేదు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో గోవధ నిషేధంతో మొదలైన ఉద్యమం అంతిమంగా అన్ని రకాల జీవ, జంతుజాతుల వధను నిషేధించే దిశగా ప్రభుత్వాలు అడుగు వేయడానికి దారితీసే అవకాశం లేకపోలేదు. గోమాతకు సంబంధించినంతవరకు దానివల్ల కలిగే ఉపయోగాలు అనంతం, అనిర్వచనీయం. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమే కాకుండా, సేద్యానికి ఉపయోగపడటమే కాకుండా ఆవు వల్ల మానవాళి అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతోంది. ఆవు పాలతో కోటానుకోట్ల మందికి జీవనోపాధి లభిస్తోంది. అలాగే ఆ జంతువుకు సంబంధించిన ప్రతి అవయవాన్ని ఏదోవిధంగా దాని మరణానంతరం కూడా మనిషి ఉపయోగించుకోవడమన్నది ఎంతో విశిష్టమైనదే. ఏ జంతువైనా మరణించిన తర్వాత నిరుపయోగంగా మారుతుందేమో కానీ ఆవు అలా కాదు. దానిలోని ప్రతి భాగమూ మనిషికి నిరంతరం ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆవు పేడ అనేక రకాలుగా క్రిముల నివారణకు ఎరువుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పల్లెటూర్లలో నిర్మించి ఇళ్ల పైకప్పులకు సైతం ఆవుపేడను అద్దుతారు. గోబర్‌గ్యాస్ కర్మాగారాలకే కాకుండా అనేక రకాలుగా కూడా ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది. ఆవు పేడ కోహినూర్ వజ్రం లాంటిదంటూ ఓ కోర్టు కేసులో గుజరాత్ ప్రభుత్వం అభివర్ణించడం, అందుకు సుప్రీంకోర్టు కూడా అభినందించడం ఇందుకు తార్కాణం. చాలా దేశాల్లో ఆవులను పెంచడం కేవలం మాంసం కోసమే అయినప్పటికీ, దానివల్ల కలిగే పర్యావరణ ప్రమాదాలను ఆయా దేశాలు విస్మరిస్తున్నాయన్నది వాస్తవమే. దీనివల్ల పర్యావరణ పరమైన చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హిందువులకు గోమాతతో సాంప్రదాయకమైన, భావోద్వేగభరితమైన సంబంధం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిగా చూడటం, విడదీయడం అసాధ్యమేనని కూడా చరిత్ర చెబుతున్న సత్యం. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గోవును అత్యంత పవిత్రమైన జీవిగా పరిగణిస్తారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో గోవులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వాటిని కొట్టినా, తరిమికొట్టినా నేరమే. ఇలా గోవులు రోడ్లమీద నడుస్తుంటే వాటిని పూజనీయ భావంతో ప్రజలు నమస్కరించడం, దాని గంగడోలును స్పృశించి కళ్లకు అద్దుకోవడం ప్రతి ఒక్కరికీ అనుభవైకవేద్యమే.
అందుకే ఓ కవి - వినరా వినరా నరుడా - అంటూ ఆవును మన కళ్లకు కట్టాడు. దానివల్ల ఎంతగా ఉపయోగం ఉంటుందో అక్షరమక్షరం ఒళ్లు కదిలించేలా రచించాడు. ఇలాంటి పవిత్రమైన జీవినా మనం వధిస్తున్నాం? ఇలాంటి జీవినా మనం కబేళాలకు అమ్ముకుంటున్నాం? అన్న భావననూ ఆ పాట ద్వారా కలిగించాడు. ఈ పరిస్థితి ఒక్క గోవుకే కాదు. ఏ జంతువుకీ రాకూడదు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు గోమాంసం, గోవధను నిషేధిస్తూ చట్టాలు తెచ్చినప్పటికీ అవి ఆశించిన రీతిలో అమలుకాకపోవడం వల్ల ప్రస్తుతమిది ఓ పెద్ద సమస్యగా మారింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన చట్టం ఉండటం, కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలు తమకు అనుగుణంగా మార్చడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రభుత్వాలైతే ఉన్న చట్టంలోని గోవధ నిషేధ నిబంధనలను మార్చడం, రద్దుచేయడం వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. గోవధకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన చట్టాన్ని తెస్తే తప్ప అమలులో గందరగోళం తొలగిపోదు. ఇందుకు ఏకైక మార్గం జాతీయ గోవధ నిరోధక బిల్లును తీసుకువచ్చి తద్వారా ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల శాసనాలను రద్దుచేయడమే ఏకైక మార్గం.
ఆలస్యమైనా కేంద్ర ప్రభుత్వం గోవధ నిషేధాన్ని అమలులోకి తెచ్చే దిశగా బలమైన అడుగులే వేసింది. ఇందుకు సంబంధించి కఠినమైన నిబంధనలతో ఒక శాసనానే్న తీసుకువచ్చింది. ఇది రాష్ట్రాల హక్కులు, అధికారాలకు సంబంధించి కొంత గందరగోళానికి దారితీసినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో కఠినమైన నిబంధనలు చేర్చడం వల్ల గోవధ నిషేధం కచ్చితంగా అమలుకాగలదన్న ధీమా కూడా వ్యక్తమవుతోంది. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో గోవులు, దూడలు, ఎద్దులు, ఆబోతులు, ఒంటెలను వధించడాన్ని శిక్షార్హమైన నేరంగా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, బీహార్ తదితర రాష్ట్రాలు పరిగణించాయి. ఇందుకు పాల్పడేవారికి జైలుశిక్షతో పాటు కఠినమైన జరిమానాను విధిస్తామని హెచ్చరించాయి.
పశుగణాలను వధించడం కోసం విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్లు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం, ఇలాంటి కృత్యం ఎంతటి హేయమైన నేరమో స్పష్టం చేస్తోంది. కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వీటిని విక్రయించాలని చట్టం చాలా స్పష్టంగా పేర్కొంది. ఇప్పటివరకు గోపరిరక్షణ అనేది మాటల్లోనే జరిగినా, తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావడం, ఈ మూగజీవుల పరిరక్షణకు, వాటి సంతతిని పెంపొందించడానికి ఎంతైనా దోహదం చేసేదే. ముఖ్యంగా ఆవులతో వ్యాపారం చేసే వర్తకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ జారీకావడం ముదావహం. కేరళ, ఈశాన్యంలోని కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ గోవధ చట్టం అమలుకు ముందుకొచ్చాయి. భారత్ చట్టాల్లోని అనేక లోపాల కారణంగా పశుగణాల అక్రమ రవాణా అన్ని రాష్ట్రాల్లోనూ పేట్రేగుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి గోవుల బదిలీపై నిషేధం లేకపోవడమే. దీన్ని స్మగ్లర్లు అన్ని విధాలుగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ట్రక్కుల్లోనూ, రైళ్లల్లోనూ వీటిని రవాణా చేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసమని పేరుకు చెప్పుకున్నా కబేళాలకు వీటిని తరలించడమేనన్నది చెప్పకనే చెప్పే వాస్తవం. ఈ లోపాలన్నింటినీ సరిదిద్దుతూ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు గట్టిగా నడుం బిగిస్తే తప్ప గోసంరక్షణకు పూర్తిస్థాయి మద్దతు లభించే అవకాశం ఉండదు. ఆదినుంచీ మనిషికి తోడుగా, నీడగా ఉండే గోమాతను గతించిన తర్వాత తన ప్రతి అవయవాన్ని మనిషి కోసమే ధారదత్తం చేస్తున్న ఈ మూగజీవిని వధించడమన్నంత అవివేకం, అమానుషం మరొకటి ఉండదు. గోరక్షణతోనే జగతి రక్షించబడుతుంది. మనం చుట్టూ ఉండే పర్యావరణం అనేక కోణాల్లో సమతుల్యతను సంతరించుకుంటుంది. ఈ భావనను మాటల్లో కాకుండా చేతల్లో కనబరిస్తేనే మనసా, వాచా, కర్మేణా అనుసరిస్తేనే గంగిగోవు పాలు గరిటెడైనను చాలన్న నానుడికి మరింత సార్థకత ఏర్పడుతుంది.
ఆవులుంటే రోగాలు రావు
ఆవు చల్ల: ఆవు పాలను తోడుపెట్టి బాగా చిలికిన మజ్జిగ వగరు రుచిని కలిగి ఉంటాయి. అందువలన షుగరు వ్యాధిలోనూ, స్థూలకాయంలోనూ ఆవు చల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కడుపులో ఎసిడిటీని పేగుపూతనీ తగ్గిస్తుంది. గేదె మజ్జిగ కన్నా తేలికగా అరుగుతాయి. అమీబియాసిస్ వ్యాధిలో ఆవు పెరుగు ఎక్కువ మేలుచేసేదిగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. లివర్ వ్యాధుల్లో ఇవ్వదగినవి. వేసవి కాలం త్రాగటానికి అనుకూలంగా ఉంటాయి. చలవ చేస్తాయి. మూత్ర పిండాల్లో రాళ్ళున్న వారికి ఆవు చల్ల మంచివి.
ఆవు నెయ్యి: గేదె నెయ్యి ఎన్ని మోసాలకు గురవుతున్నదో ఆవు నెయ్యి కూడా కల్తీకి గురవుతోంది. కల్తీలేని ఉత్తమమైన దాన్ని ఎంచుకోగలిగితే, ఆవు నెయ్యి సౌమ్యంగా పనిచేస్తుంది. శరీరానికి బలసంపన్నతనిస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, ఎలర్జీ వ్యాధుల్లో ఇది మేలుచేస్తుంది. వెన్నని కాచిన తాజా నెయ్యి ఉత్తమ గుణాలను కలిగి ఉంటుంది. విష దోషాలను హరించే గుణం దీనికుంది.
ఆవు పాలు: అన్నిరకాల శరీరతత్వాల వారికీ అనుకూలంగా ఉంటాయి. అతిగా వేడీ చెయ్యవు. అతిగా చలవా చెయ్యవు. సమశీతలంగా ఉంటాయి. విష దోషాల హరంగా ఉంటాయి. తల్లి పాలతో సమాన గుణాలను కలిగి ఉంటాయి కాబట్టి చంటి బిడ్డలకు అనుకూలంగా ఉంటాయి. కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, వాత వ్యాధులున్న వారికీ, ఆపరేషన్లు అయిన వారికి ఆవు పాలు మేలుచేస్తాయి. గర్భాశయానికి ఆవుపాలు టానిక్ లాగా ఉపయోగపడతాయి.
ఆవు పెరుగు: ప్రాణప్రదమైంది. తాపాన్ని తగ్గిస్తుంది. బలకరం. శరీర కాంతిని పెంచుతుంది. వేసవి కాలంలో రాత్రిపూట వేడి అన్నంలో ఆవుపాలు కలిపి నాలుగు మజ్జిగ చుక్కలు వేసి తోడుపెట్టిన అన్నాన్ని ఉదయానే్న తింటే అమిత చలవ చేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తినిస్తుంది.
ఆవు మూత్రం: నొప్పుల్నీ, వాపుల్నీ తగ్గిస్తాయని వస్తాదులు అప్పటికప్పుడు పట్టిన ఆవు మూత్రంలో ఉప్పు కలిపి త్రాగేవాళ్ళట. ఆవు మూత్రంలో సోడియం, పొటాషియం లాంటి 24 రకాల లవణాలున్నాయి. ఈ లవణాల్లో బంగారానికి సంబంధించిన లవణాలు (గోల్డ్‌సాల్ట్స్)కూడా ఉన్నాయని చెప్తారు. మూత్రంలో వైద్య ప్రయోజనాలకు ఉపయోగించే ద్రవ్యాల్ని యూరో కైనేజ్ అంటారు. ఇది కేన్సర్ మీద కూడా పనిచేస్తుందని చెప్తారు. వారానికి ఒకసారి నిర్దేశిత మోతాదులో గోమూత్రాన్ని తీసుకుంటే కేన్సర్ కణాలను అదుపుచేస్తుందని, సూక్ష్మజీవులు లేని స్వచ్ఛ పాత్రలో పట్టుకుంటే విష దోషాలు కలిగించదనీ, అందులోని యూరియా వెంటనే రక్తంలోకి చేరకుండానే విసర్జించబడ్తుందనీ గోమూత్ర నిపుణులు చెప్తున్నారు.
ఆవుల మల మూత్రాలు, పాలు పెరుగు, వెన్న వగైరా ద్రవ్యాలకు చెప్పిన గుణాలు కేవలం భారతీయ సంతతికి చెందిన ఆవులలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఈ నేలమీద ఆవుకు అంత పవిత్రత, ప్రాధాన్యత! ఇంచుమించు ప్రతి దేవతకూ ఏదో ఒక జంతువుతో అనుబంధం ఉంది. కానీ వాటికి వేటికీ లేని ప్రాధాన్యత ఆవుకు మాత్రమే ఉండటానికి కారణాలను పరిశీలించాలి.
కొన్ని రకాల మొక్కల్లో బంగారం స్వల్ప మాత్రంలో ఉన్నట్టే భారతీయ గోసంతతి మలమూత్రాల్లోకూడా బంగారం ఉంటుంది. దాని పరిమాణం చాలా స్వల్పం కావచ్చు. కానీ అది విలువైనదే! ఆవు గాల్‌బ్లాడర్ (చేదుకట్టు అంటారు)ని వేరుచేసి ఎండిస్తే అందులోని బైల్ పదార్థం ఎండి పలుకులుగా మారుతుంది. ఈ పలుకుల్ని గోరోచనం అంటారు. ఇది లివర్ కేన్సర్‌పైన కూడా సత్ఫలితాలివ్వగల శక్తివంతమైన ఔషధం. థైరాయిడ్ లాంటి వ్యాధుల్లో దీనికి గొప్ప వైద్య ప్రయోజనాలున్నాయి.
- డా. జి.వి. పూర్ణచందు
- బి. రాజేశ్వర ప్రసాద్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list