MohanPublications Print Books Online store clik Here Devullu.com

శరీరత్రయం_Sariratryam


శరీరత్రయం 
శరీరత్రయం (3 శరీరాలు) = (1) స్ధూల శరీరం (2) సూక్ష్మ శరీరం (3) కారణ శరీరం 
(1) స్ధూల శరీరం :- కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు చెవులు, చర్మం 
(2) సూక్ష్మ శరీరం :- 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు - వీటితో కూడి ఉన్నది సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు.
5 కర్మేంద్రియాలు : వాక్కు, కాళ్ళు, చేతులు, గుదము, జననేంద్రియాలు
5 జ్ఞానేంద్రియాలు : కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక
5 ప్రాణాలు : ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
4 అంతఃకరణాలు : మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
5+5+5+4 = 19
(3) కారణ శరీరం :- నీ నిజస్వరూపాన్ని (ఆత్మను) నీకు తెలియకుండా చేసేది అగ్రహణం, దేహేంద్రియాలే నేను అని విపరీతంగా భావించేట్లు చేసేది అన్యధాగ్రహణం - అజ్ఞానం. ఈ అజ్ఞానాన్నే కారణ శరీరం అన్నారు. ఈ స్ధూల, సూక్ష్మ శరీరాలు నీకు రావటానికి కారణమైనది ఈ కారణ శరీరం (అజ్ఞానం). ఈ అజ్ఞానం పోతే నీ సమస్త దుఃఖాలకు కారణమైన స్ధూల, సూక్ష్మ శరీరాలు ఇక రావు - జన్మలుండవు.
ప్రతి జీవికి స్థూల సూక్ష్మ కారణ దేహాలనే మూడు శరీ రాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాలతో, పంచకర్మేం ద్రియాలతో, కంటికి స్పష్టంగా కనిపించే, అస్థి మాంస మజ్జ రక్తమయ శరీరమే స్థూల శరీరం.
సంకల్ప వికల్పాలతో మనస్సుగా, నిశ్చయాత్మక మైన బుద్ధిగా, స్మరణమాత్రమైన చిత్తంగా, భోగించే అహమ్‌గా, కంటికి కనిపించకపోయినా, నిరంతరం అనుభూతమయ్యే, ఆంతరిక శరీరమే సూక్ష్మ శరీరం. స్థూల శరీరమే నేను, సూక్ష్మ శరీరమే నేను, అన్న భ్రాం తికి కారణమైన మూలాజ్ఞానమే కారణ శరీరం. అం దరూ స్థూల శరీరాన్ని, కొందరే సూక్ష్మ శరీరాన్ని, మరి కొందరే కారణ శరీరాన్ని పరికిస్తూ ఉంటారు.స్థూల శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉం చుకోవాలని అధికులు ఆరాటపడు తూనే ఉంటారు. స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయిస్తూ ఉంటారు. నిర్మాలిన్య సాధ నాల్ని సౌందర్య సాధనాల్ని పరిమళ ద్రవ్యాల్ని వాడు తూనే ఉంటారు. వైద్యుల్ని ఆరోగ్యానికై సంప్రదిస్తూనే ఉంటారు.
ఈ స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయించక పోతే, అది మాలిన్యంతో దుర్గంధ భరితం అవుతుంది. అట్టి వారిని చూసి సభ్యసమాజం ముక్కు మూసుకుం టుంది. స్థూల శరీరానికి ఎలా మాలిన్యాలు ఉన్నాయో, అలానే సూక్ష్మ శరీరానికీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మాలిన్యాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీ రాన్ని మాలిన్య రహితంగా వినిర్మలంగా ఉంచుకోవా లని ఆరాటపడే వారు చాలా అరుదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list