MohanPublications Print Books Online store clik Here Devullu.com

త్రివిధ తపస్సులు-Tapassulu

ఆచరణ యోగ్యాలు 

త్రివిధ తపస్సులు

    భగవంతుడు దయామయుడు. సృష్టి,స్థితి,లయకారకుడు. అవ్యయుడు. సర్వమానవ్ఞలను సంసార సాగరం నుండి తరింపచేయుటకు భగవద్గీతలో కృష్ణభగవానుడు ఆచరణయోగ్యములైన మూడు తపస్సులను వివరించి సందేశాన్ని అందించారు. శరీర వాఙ్మనంబులను శుద్ధ మొనర్చుకొని నిత్య జీవితాన్ని తపోమయంగావించుకుని తరించాలని మార్గదర్శనం చేస్తూ, తపస్సు విశిష్టతలను పేర్కొనినాడు. పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగయోగాన్ని వివరిస్తూ ఇలా పలికారు.
శ్లోII దేవద్విజగురుప్రాజ్ఞ-పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ-శారీరం తప ఉచ్యతేII అనగా దేవతలను బ్రహ్మనిష్ఠులను, గురువ్ఞలను, జ్ఞానులను అంటే మహాత్ములైన బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగియుండుట, రుజుమార్గము కల్గియుండుట బ్రహ్మచర్యమును పాటించుట ఏ ప్రాణినీ హింసింపకుండుట శారీరక తపస్సుగా చెప్పబడినది. సాధకులు త్రివిధములైన తపస్సులను పరిశీలించి, నిర్మలంగా ఉండాలని తెలిపారు. ఆత్మానుభూతి తద్వారా లభిస్తుందని చెప్పారు. తపస్సు అంటే ఏమిటి అనే సందేహం రాకుండా ఇంద్రియాలలోని మలినములు బాగా తపింపచేసి వానిని తొలగింపచేయుటయే తపస్సు అంటూ అదియే మోక్ష హేతువ్ఞ అన్నారు. పరమార్థ సాధనలో ప్రధానమైనదన్నారు. తపస్సు అనగానే ఎవరూ భయపడవద్దని, సులభమైన సందేశాన్ని అందించాడు పరమాత్మ. సర్వులకును ఆచరణ యోగ్యములైన త్రివిధ తపస్సులను చక్కగా ఆచరించాలి అన్నారు.
శారీరక తపస్సులో ముందుగా పెద్దలను సేవించి, పూజించాలి అన్నారు. ఈ సేవ వలన పెద్దల అనుగ్రహము లభిస్తుందనీ అహంకారము, అభిమానము శమించుననీ బోధించారు. ఆధ్యాత్మ మార్గంలో సర్వేశ్వరుని సేవలో అనుగ్రహం కలిగి మాయ తొలగునన్నారు. పెద్దల సేవ, పూజ, వారిపట్ల వినయవిధేయతలను జూపుట వలన ఆశీర్వాదము లభిస్తుంది. వారి కటాక్షము ముముక్షువ్ఞలకు మిక్కిలి మేలు చేకూర్చగలదు. పెద్దలను సేవించుట వలన అహంకారం, గర్వం, అభిమానం శీఘ్రముగా శమించును. ముముక్షు వ్ఞలకు ఈ సాధన చాలా అవసరము. ద్విజులను పేర్కొంటూ ద్విజులనగా రెండవ జన్మ ఎత్తినవారు అనగా పుట్టుకతో వచ్చిన జన్మకాక, సంస్కారముచే సాధనచే వచ్చిన రెండవ జన్మ కలవారని భావం. అజ్ఞానమును ఛేదించి పాత శరీరము, మనస్సు పొందినవారని భావము. వారి జీవితము పూర్వ జీవితమువలె నుండదు. వారిలో బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ప్రాజ్ఞ అనే పదంలో ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు, జ్ఞాని అని అర్థము. బ్రహ్మ రూపమగు ప్రజ్ఞను, చిద్వస్తువ్ఞను తెలిసిన వారే ప్రాజ్ఞులు.
అట్టి వారిని మహనీయులను సత్కరించుట, పూజించుట కూడా ఒక తపస్సేనని పరమాత్మ తెలిపినాడు. శౌచం అనే పదాన్ని వివరిస్తూ మనశ్శుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి మూడును అవసరాలే. తన మనస్సు, తన శరీరము తానుండు చోటు మూడింటిని శుద్ధముగా ఉంచుకొనవలెను. మలిన శరీరం గలవారికి ఆరోగ్యం చెడి నిష్ఠకు, సాధనకు భంగము కలుగుతుంది. దైవమార్గమే గోచరింపదు. కావ్ఞన సాధకుడు కడుజాగరూకుడై శుచిత్వ మును లెస్సగా పొందాలి. ఊడ్చి శుద్ధము చేయుట ద్వారా పరిసరములను, స్నాన సాత్త్వికాహారాదుల ద్వారా శరీర మును మలిన సంకల్ప త్యాగము ద్వారా దైవసంకల్పములను చేయుట ద్వారా మనస్సును శుచివంతము కావించుకోవలెను.
ఆర్జవం విషయంలో రుజుత్వము, కుట్ర, కపటము, కుటిలత్వము లేకుండుట, పాము వలె వక్రత కలిగియుండు వాని యందు విషము (పాపము-అజ్ఞానము) ఉండియే ఉంటుంది. కావ్ఞన ఆలోచనలో, వాక్కులో, క్రియలో ఒకే విధమైన ప్రవర్తన కలిగియుండవలెను. శరీర వాఙ్మనంబులలో ఏకరీతి వర్తింపవలయును. వక్రవ్యవహారము మానవలెను. బ్రహ్మచర్యం అనుపదాన్ని వివరిస్తూ త్రికరణాలతో బ్రహ్మచర్యమును శీలించుట ఒక తపస్సుని తెలిపాడు. బ్రహ్మచర్యమనగా విషయదోషము, కామభావన, కామ వ్యవహారము లేకుండుట, బ్రహ్మ చర్యమును గూర్చి చింతించుట. అన్ని సాధనలకును బ్రహ్యచర్యము పునాది. కనుక గీతలో భగవానుడు ఈ విషయాన్ని పలుచోట్ల వివరించుట జరిగినది. దీని విషయంలో అశ్రద్ధ యుండరాదు. జూపరాదు. అశ్రద్ధ వ్ఞన్నచో మనుజుడు పరమార్థ మార్గమున ఉన్నతిని పొందలేదు. అధ్యాత్మ విషయంలో బ్రహ్మచర్యము కీలక స్థానమును పొందినది. అహింసను ప్రస్తావిస్తూ శరీర వాఙ్మనంబులచే ఏ ప్రాణికి నీ అపకారము చేయకుండుట. అజ్ఞానమును తొలగించుకుని జ్ఞానసముపార్జనముగావించుట ద్వారా ఆత్మహింసను త్యజించుటయే అహింసయగును. ఇది అహింస మహోన్నతమైన రూపమని దివ్యసందేశాన్ని సమాజానికందించిన పరమాత్మకు సకల జనులు కృతజ్ఞులుగా నుండి జీవన పరమార్థాన్ని గ్రహించాలి. జన్మలను చరితార్థం చేసుకోవడమే తపస్సుగా భావించి ఆనందమయులు గావాలి. అనుద్వేగకరం వాక్యం అనే శ్లోకంలో ఇతరుల మనస్సుకు బాధ కలిగింపనిదియు,
సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించునదియు నగు వాక్యమును, వేదాదుల అధ్యయనమును చేయుట, ప్రణవాది మంత్రములను జపించుట, వాచిక తపస్సు అనబడును. సత్యవాక్కు అయినప్పటికినీ పరుషంగ, అప్రియముగ పలుకరాదు. ఇతరులకు ప్రియముగ, హితముగ నుండవలయును. సత్వగుణమును, విశుద్ధమైన సత్వగుణమును ఆశ్రయించి మనస్సును నిర్మలంగా ఉంచుకొనవలయును. భక్తి, జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యమును పోగొట్టుకుని మనస్సును అనగా చిత్తమును వినిర్మలముగా జేయవలయును. ఇదియే మనః ప్రసాదము. మానసిక తపస్సు, ఈ ప్రసాదమును స్వీకరించినవాడు మరల బంధమును పొందనేఱడు. అంతఃకరణ వృత్తి ముఖము నందు ప్రతిబింబిస్తుంది. కావ్ఞన ముఖము సౌమ్యముగా వికాసముగాను నున్నచో దానిని బట్టి వృత్తి కూడా నిర్మలంగా, నిశ్చలంగా సౌమ్యముగా ఉన్నదని భావించవచ్చు. ఇట్టి సౌమ్య స్థితి కలిగియుండటయు మానసిక తపస్సేయగును. ”ఆత్మ వినగ్రహః అను దానిలో ఆత్మ అనుపదమునకు మనస్సని ఇంద్రియములని అర్థము. నిగ్రహం అని తెలుపక వినగ్రహమని చెప్పుటచే సామాన్య నిగ్రహం చాలదనియు, ఇంద్రియమనంబులను గ్రహించాలి. అలాగే భావసంశుద్ధి అగు పదములో పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి యుండవలెనని తెలిపారు. జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరము. ఆత్మానుభూతికి భావ నిర్మలత్వం కావాలి. కాన మనసు నందు, భావములందు దృశ్యదోషము, అపవిత్రత చేరనీయక కడు జాగరూకులై యుండాలని పరమాత్మ గీతలో సందేశము నొసంగి త్రివిధ తపస్సులను వివరించారు. సమాజం భగవానుని వాక్కులను స్వీకరించి ఆచరణ ద్వారా పునీతులు కావాలి. సత్‌ప్రవర్తనతో మెలగి ఆదర్శప్రాయులు కావాలి.

– రామమూర్తి


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list