MohanPublications Print Books Online store clik Here Devullu.com

హ్రీంకార మహాయజ్ఞ లఘు పూజ hreemkaara_mahayagnam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

హ్రీంకార మహాయజ్ఞ లఘు పూజ hreemkaara_mahayagnam  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu  |Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,RASIPALITALU,BHAKTI,LEELA,BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional,  NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU,KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja

హ్రీంకార మహాయజ్ఞ లఘు పూజ
శివశక్త్యాత్మకమైన 'హ్రీం' మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం. 
లలితా త్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది. 

మొదటిదైన వాగ్భవ ఖండములోని 5 బీజాలలో చివరి బీజం హ్రీం. రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం. అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి. 

త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశ దీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం. 

2013-2014 సంవత్సరాలలోని 18 నెలలలో శని, రాహు, కుజ గ్రహాల సంఘర్షణ ప్రభావం అధికంగా ఉంది. అందుచే ద్వాదశరాశుల వారికి చక్కని ఉపశాంతి పొందుటకై, 2013 ఫిబ్రవరి నుంచి 2014 అక్టోబర్ వరకు 18 మాసాలలో ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర రోజులలో హ్రీంకార మహాయజ్ఞాన్ని ఎవరికి వారు, వారి వారి గృహాలలో లఘు పద్దతిలో పూజ చేసుకొనుటకు ఉపయోగపడేలా దిగువ వివరాలను ఇవ్వటమైనది. 

(హ్రీంకార మహాయజ్ఞ పూర్తిస్థాయి పూజా పద్ధతి, వివరాలు 2013 ఉగాదినాటికి పుస్తకరూపంలో విడుదల అగును. కలశపూజల 2వ భాగం కూడా విడుదల అగును.) సామూహికంగా కూడా ఈ మహా యజ్ఞం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో గార్గేయ సిద్దాంతిగారి సారధ్యంలో ఓంకార మహాశక్తి పీఠ ఆధ్వర్యంలో జరుగును. ఇందులో పాల్గొనుటకు రుసుము ఏమి ఉండదు. కార్యక్రమ వివరాలు అతిత్వరలో తెలియచేయబడును. ఇదే పద్దతిని అగ్ని సాక్షిగా హోమ రూపంలో శ్రీనివాసగార్గేయ సిద్దాంతి గారిచే జరుపబడును. సర్వులు ఆహ్వానితులే.




పూజా పద్ధతి 
ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర రోజులలో మధ్యాహ్నసమయం లోపలే పూర్తి చేసుకోవాలి. ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అశౌచము వున్నవారు ఆచరించవద్దు. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు. 18 మాసాలలో ఎన్నిసార్లైననూ ఆచరించవచ్చు. 
గృహంలోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి. 
ఓ పీట వుంచి దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి. బియ్యంపైన త్రిభుజం, 16 బిందువులతో ఉన్న నలుచదర తెలుపు వస్త్రాన్ని పరవండి. 
దీపారాధన చేసుకోండి. పూజ పుష్పాలు మీకు నచ్చినవి. 
తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని పసుపుతో చేసిన గణపతిని తమలపాకులలో ఉంచి ప్రార్దించండి. ఇక్కడే ప్రధానంగా గమనించాల్సింది. 
ఈ రోజైతే ఆచరిస్తారో ఆనాటి తిధిని గుర్తించండి. ఆ తిథి దేవత ఎవరో... సంఖ్య ఏమిటో గమనించి... ఆ సంఖ్య బిందువుపైనే గణపతిని ఉంచండి. 
తిధులు, దేవతల పేర్లు, సంఖ్య వివరాలు కూడా దిగువన ఇవ్వబడినవి. 
ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 11 సోమవారం భారత కాలమాన ప్రకారం శుక్ల పాడ్యమి ఉదయం 10.45 వరకు ఉన్నది. ఆపై శుక్ల విదియ వచ్చును. 10.45 లోపల పూజ ప్రారంభించేవారు పాడ్యమి తిథి దేవత అయిన కామేశ్వరి అనగా 1వ బిందువుపై గణపతిని ఉంచాలి. 
10.45 తదుపరి పూజ ప్రారంభించేవారు విదియ తిధి దేవత భగమాలిని , సంఖ్య 2 కనుక, 2వ బిందువుపై గణపతిని ఉంచాలి. 
ఫిబ్రవరి 21 శుక్ల ఏకాదశి తిధి ఆరుద్ర నక్షత్రం. ఏకాదశి తిధి దేవత నీలపతాక. కనుక 11వ బిందువుపై గణపతిని ఉంచాలి. 
పూర్తి తిథి వివరాలు దిగువన ఇవ్వబడినవి. 

గణపతికి ధూప, దీపాలను ఇవ్వండి. నైవేద్యంగా బెల్లాన్ని నివేదించండి. అవకాశం ఉన్నవారు గణపతి పూజను పూర్తిగా ఆచరించవచ్చు.
గణపతి పూజ అనంతరం, గణపతికి ఉద్వాసన చెప్పి పూజా పీటకు ఈశాన్య భాగంలో ఉంచండి. 

................................................................................................................

శుక్ల పాడ్యమి, అమావాస్య తిధులకు దేవత - కామేశ్వరి, సంఖ్య 1

శుక్ల విదియ, బ.చతుర్దశి తిధులకు దేవత - భగమాలిని , సంఖ్య 2

శుక్ల తదియ, బ.త్రయోదశి తిధులకు దేవత - నిత్యక్లిన్నా, సంఖ్య 3

శుక్ల చవితి, బ.ద్వాదశి తిధులకు దేవత - భేరుండా, సంఖ్య 4

శుక్ల పంచమి, బ.ఏకాదశి తిధులకు దేవత - వహ్నివాసిని , సంఖ్య 5

శుక్ల షష్టి, బ.దశమి తిధులకు దేవత - మహావజ్రేశ్వరి , సంఖ్య 6

శుక్ల సప్తమి, బ.నవమి తిధులకు దేవత - శివదూతి, సంఖ్య 7

శుక్ల అష్టమి, బ.అష్టమి తిధులకు దేవత - త్వరితా, సంఖ్య 8

శుక్ల నవమి, బ.సప్తమి తిధులకు దేవత - కులసుందరి, సంఖ్య 9

శుక్ల దశమి, బ.షష్టి తిధులకు దేవత - నిత్యా , సంఖ్య 10

శుక్ల ఏకాదశి, బ.పంచమి తిధులకు దేవత - నీలపతాక, సంఖ్య 11

శుక్ల ద్వాదశి , బ.చవితి తిధులకు దేవత - విజయ, సంఖ్య 12

శుక్ల త్రయోదశి , బ.తదియ తిధులకు దేవత - సర్వమంగళా , సంఖ్య 13

శుక్ల చతుర్దశి , బ.విదియ తిధులకు దేవత - జ్వాలామాలిని , సంఖ్య 14

పూర్ణిమ, బ.పాడ్యమి తిధులకు దేవత - విచిత్రా, సంఖ్య 15

................................................................................................................


గణపతి పూజ తదుపరి

ధ్యానం 

శ్లో. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం 

సౌవర్ణాంభర ధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం 

వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం 

త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్రసంచారిణీమ్ 

లమిత్యాది పంచపూజ

లం పృధ్వీతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి నమః గంధం పరికల్పయామి 

(హ్రీం బీజాక్షరంపై గంధం ఉంచండి) 

హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి నమః పుష్పం పరికల్పయామి 

(హ్రీం బీజాక్షరంపై పుష్పం ఉంచండి) 

యం వాయుతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి నమః ధూపం పరికల్పయామి 

(హ్రీం బీజానికి ధూపాన్ని చూపండి)

రం వహ్నితత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి నమః దీపం పరికల్పయామి 

(హ్రీం బీజానికి దీపాన్ని చూపండి)

వం అమృతతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి నమః అమృతనైవేద్యం పరికల్పయామి 

(హ్రీం బీజానికి కొద్ది తేనెను నివేదించండి) 

సం సర్వతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి నమః తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి 

(హ్రీం బీజానికి తాంబూల సమర్పణ)

ఆపై దిగువ చెప్పినట్లు వస్త్రానికి నలువైపులా ఉన్న సంఖ్యల వద్ద దిగువ నామాలను పఠిస్తూ కుంకుమ, నేయితో కలిపిన అక్షతలను ఉంచండి. 

1వ సంఖ్య వద్ద ఓం అనంగకుసుమాయై నమః అంటూ అక్షతలను ఉంచండి 

2వ సంఖ్య వద్ద ఓం అనంగమేఖలాయై నమః అంటూ అక్షతలను ఉంచండి 

3వ సంఖ్య వద్ద ఓం అనంగమదనాయై నమః అంటూ అక్షతలను ఉంచండి

4వ సంఖ్య వద్ద ఓం అనంగమదనాతురాయై నమః అక్షతలను ఉంచండి

5వ సంఖ్య వద్ద ఓం అనంగరేఖాయై నమః అంటూ అక్షతలను ఉంచండి 

6వ సంఖ్య వద్ద ఓం అనంగవేగిన్యై నమః అంటూ అక్షతలను ఉంచండి

7వ సంఖ్య వద్ద ఓం అనంగాంకుశాయై నమః అంటూ అక్షతలను ఉంచండి

8వ సంఖ్య వద్ద ఓం అనంగమాలిన్యై నమః అంటూ అక్షతలను ఉంచండి

తదుపరి కలశాన్నిగంధ, కుంకుమలతో అలంకరించుకోండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) హ్రీం బీజంపై కలశాన్ని ఉంచండి. మంచి నీటిని కలశంలో పోయండి. 2 యాలకులను కలశములో వేయాలి. కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు ఉంచి, దానిపై పీచుతీసి అలంకరించిన కొబ్బరికాయను ఉంచాలి.

ఇక షోడశోపచారాలతో పూజను ప్రారంభించాలి.

ఉపచార పూజలలోని అన్ని శ్లోకాలను చదవలేని వారు ఓం శ్రీమాత్రే నమః అని భక్తితో ధ్యానించండి.

ధ్యానం

శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఈ శ్లోకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకాలలో రెండవది. ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

ఆవాహనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 169 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
ఆవాహనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

సింహాసనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
సింహాసనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

పాద్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

171 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
పాద్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

అర్ఘ్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

172 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
అర్ఘ్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

ఆచమనం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

173 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
ఆచమనం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

శుద్ధోదక స్నానం 
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

174 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
శుద్ధోదక స్నానం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి.)

వస్త్రం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 175 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
వస్త్రం సమర్పయామి, వస్త్రార్ధం పుష్పం సమర్పయామి ... 

అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

ఆభరణం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 176 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
ఆభరణం సమర్పయామి, ఆభరణార్ధం పుష్పం సమర్పయామి ... 

అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

శ్రీ గంధం లేక కుంకుమ 
(శ్రీ గంధం లేక కుంకుమ తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

177 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 
శ్రీ గంధం / కుంకుమ విలేపనం సమర్పయామి... అని చెప్పి గంధాన్ని లేక కుంకుమను కలశం మీదున్న కొబ్బరి కాయపై ఉంచండి. )

అక్షతాన్

శ్రీదేవి ఖడ్గమాలలోని 181 నామాలను పఠిస్తూ అక్షతలను కొబ్బరికాయపై ఉంచండి. ప్రతి నామానికి ముందు ఓం హ్రీం అని జోడించండి. 

ఉదాహరణకు 1వ నామం - ఓం హ్రీం త్రిపురసుందర్యై నమః

181వ నామం - ఓం హ్రీం మహా మహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞ్యై నమః 

చివరలో నమస్తే నమస్తే నమస్తే నమః అంటూ అక్షతలు వేయండి. 

తదుపరి అక్షతలను తీసుకొని లలితా త్రిశతిలోని అరవై హ్రీంకార నామాలలో దిగువ పేర్కొన్న 54 నామాలను అనులోమ విలోమ పద్దతిలో (పైనుంచి దిగువకు, దిగువ నుంచి పైకి) జపిస్తూ అక్షతలను భక్తితో కొబ్బరికాయపై ఉంచండి. 

1. ఓం హ్రీంకారరూపాయై నమః 

2. ఓం హ్రీంకారనిలయాయై నమః 

3. ఓం హ్రీంపదప్రియాయై నమః 

4. ఓం హ్రీంకారబీజాయై నమః 

5. ఓం హ్రీంకారమంత్రాయై నమః 

6. ఓం హ్రీంకారలక్షణాయై నమః 

7. ఓం హ్రీంజపసుప్రీతాయై నమః 

8. ఓం హ్రీంమత్యై నమః 

9. ఓం హ్రీంవిభూషణాయై నమః 

10. ఓం హ్రీంశీలాయై నమః 

11. ఓం హ్రీంపదారాధ్యాయై నమః 

12 . ఓం హ్రీంగర్భాయై నమః 

13 . ఓం హ్రీంపదాభిదాయై నమః 

14 . ఓం హ్రీంకారవాచ్యాయై నమః 

15 . ఓం హ్రీంకారపూజ్యాయై నమః 

16 . ఓం హ్రీంకారపీఠికాయై నమః 

17 . ఓం హ్రీంకారవేద్యాయై నమః 

18 . ఓం హ్రీంశిఖామణయే నమః 

19 . ఓం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమః 

20 . ఓం హ్రీంకారశశిచంద్రికాయై నమః 

21 . ఓం హ్రీంకారభాస్కరరుచ్యై నమః 

22 . ఓం హ్రీంకారాంభోదచంచలాయై నమః 

23 . ఓం హ్రీంకారకందాంకురికాయై నమః 

24 . ఓం హ్రీంకారైకపరాయణాయై నమః 
25 . ఓం హ్రీంకారదీర్ఘికాహంస్త్యె నమః 

26 . ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః 

27 . ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః 

28 . ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః 

29 . ఓం హ్రీంకారపంజరశుక్త్యై నమః 

30 . ఓం హ్రీంకారాఙ్గణదీపికాయై నమః 

31 . ఓం హ్రీంకారకందరాసింహ్యై నమః 

32 . ఓం హ్రీంకారాంబుజభృంగికాయై నమః 

33 . ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః 

34 . ఓం హ్రీంకారతరుమంజర్యై నమః 

35 . ఓం హ్రీంకారమూర్తయే నమః 

36 . ఓం హ్రీంకారశౌధశృంగకపోతికాయై నమః 

37 . ఓం హ్రీంకారదుగ్ధాభ్ధిసుధాయై నమః 

38 . ఓం హ్రీంకారకమలేన్దిరాయై నమః 

39 . ఓం హ్రీంకారమణిదీపార్చిషే నమః 

40 . ఓం హ్రీంకారతరుశారికాయై నమః 

41 . ఓం హ్రీంకారపేటకమణయే నమః 

42 . ఓం హ్రీంకారాదర్శబింబికాయై నమః 

43 . ఓం హ్రీంకారకోశాసిలతాయై నమః 

44 . ఓం హ్రీంకారాస్థాననర్తక్త్యె నమః 

45 . ఓం హ్రీంకారశుక్తికాముక్తామణయే నమః 

46 . ఓం హ్రీంకారబోధితాయై నమః 

47 . ఓం హ్రీంకార మయసౌవర్ణస్తంభ విద్రుమ పుత్రికాయై నమః 

48 . ఓం హ్రీంకారవేదోపనిషదే నమః 

49 . ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః 

50 . ఓం హ్రీంకారనందనారామనవ కల్పకవల్లర్యై నమః 

51 . ఓం హ్రీంకార హిమవద్గంగాయై నమః 

52 . ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః 

53 . ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై నమః 

54 . ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః 

తదుపరి పై 54 నామాలను కింది నుంచి పైకి మరో మారు జపించండి.

తదుపరి మీకిష్టమైన 21 పుష్పాలతో దేవి సప్తశతిలోని దిగువ తెల్పిన శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకాన్నిభక్తితో పఠిస్తూ ఒక్కో పుష్పాన్ని విశ్వాసంతో కొబ్బరికాయపై ఉంచండి. )

1. ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా 

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 

2. ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

3. ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

4. ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

5. ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

6. ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

7. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

8. ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

9. ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

10. ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

11. ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

12. ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

13. ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్దారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

14. ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

15. ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

16. ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

17. ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

18. ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

19. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

20. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

21. ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 

ధూపం 
( శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 178 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ధూపమాఘ్రాపయామి... అని చెప్పి అగరుబత్తీలను చూపండి. ) దీపం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 179 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దీపం దర్శయామి, దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ... అని చెప్పి తమలపాకుతో నీటిని చల్లండి ) నైవేద్యం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 180 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
నైవేద్యం సమర్పయామి... అని చెప్పి మీరు చేసిన ఏదేని తీపి నైవేద్యాన్ని ఇతర ఫలాలు గాని, కొబ్బరికాయ మొదలైన వాటిని నివేదించండి. ) తాంబూలం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 181 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
తాంబూలం సమర్పయామి... అని చెప్పి తాంబూలాన్ని కలశం ముందు ఉంచండి. ) నీరాజనం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 182 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దివ్య మంగళ నీరాజనం సమర్పయామి... అని చెప్పి కర్పూర హారతిని ఇవ్వండి. ) మంత్రపుష్పం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 183 వ శ్లోకంలోని మొదటి లైన్ ను చూడండి.
" ఓం శ్రీ శివా శివశక్త్యైకరూపిణీ లలితాంబికా " అనే పంక్తిని భక్తితో చదువుతూ .... 
పుష్పాన్ని తీసుకొని దివ్య మంత్ర పుష్పం సమర్పయామి... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. ) 

చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తి, విశ్వాస, నిర్మలత్వంతో ఆత్మప్రదక్షిణ చేయండి. చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి. పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి. రెండవ రోజున కలశంపైనున్న కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా స్వీకరించండి. హ్రీం వస్త్రాన్ని తదుపరి పూజ కోసం భద్రపరచండి. వస్త్రం కింద ఉన్న బియ్యాన్ని మీ ఆహార అవసరాలకై వినియోగించండి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list