MohanPublications Print Books Online store clik Here Devullu.com

అనేకత్వంలో ఏకత్వం-Anekattavam Ekattavam


విద్యుత్ ఆదా చేద్దామిలా!
విద్యుత్ వినియోగం తగ్గించుకోవడం కష్టమేమీ కాదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని జాగ్రత్తలు ఇవి...
విద్యుత్పత్తి కోసం సోలార్‌ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలి.
ఇళ్లలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని అందిస్తోంది.
సోలార్‌ ప్యానెల్స్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత మీ ఇంటి అవసరాలకు పోగా మిగిలినట్లయితే గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు. దీనికి గ్రిడ్‌ మీకు డబ్బులు చెల్లిస్తుంది.
ఒక్క యూనిట్‌ సోలార్‌ పవర్‌ 820 గ్రాముల కార్బన్‌డయాక్సెడ్‌ ఉద్గారాలను తగ్గిస్తుంది.
తక్కువ విద్యుత వినియోగం కోసం ఇంటిలో కాంపాక్ట్‌ ఫ్లోరొసెంట్‌ ల్యాంప్స్‌ను వినియోగించాలి. ఇవి 70 శాతం తక్కువ విద్యుతను ఉపయోగించుకుంటాయి.
ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తులు కొనేముందు వాటి స్టార్‌ రేటింగ్స్‌ను గమనించండి. ఎక్కువ స్టార్స్‌ ఉన్న ప్రోడక్ట్స్‌ మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎనర్జీ సేవింగ్‌ మోడ్‌లో పెట్టాలి. గది వాతావరణం చల్లగా అయినపుడు ఏసీ ఆటోమెటిక్‌గా ఆఫ్‌ అవుతుంది. దీనివల్ల విద్యుత ఆదా అవుతుంది.
సాధారణ సీలింగ్‌ ఫ్యాన్‌లు 60 నుంచి 90 వాట్ల విద్యుత్ ను ఉపయోగించుకుంటాయి. అదే ఎనర్జీ ఎఫిసియెంట్‌ రకాలు 28 వాట్ల విద్యుతను మాత్రమే తీసుకుంటాయి. వీటిని వాడటం వల్ల దీర్ఘకాలంలో విద్యుత బిల్లులో చాలా తేడా కనిపిస్తుంది.
పాత ఫ్రిజ్‌ వాడుతున్నట్లయితే వాటి స్థానంలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఉన్న కొత్త ఫ్రిజ్‌ను తీసుకోండి. కొత్త ఫ్రిజ్‌లు అతి తక్కువ విద్యుతతో పనిచేస్తుంటాయి.
వేడిగా ఉన్న పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. గది ఉష్ణోగ్రత వచ్చే వరకు బయట పెట్టి తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఇంట్లో వెలుతురు సరిపడా వచ్చేలా చూసుకోవాలి. పగటి వేళల్లో లైట్ల వినియోగం ఉండకుండా కిటికీలు, డోర్స్‌ తెరిచి ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

భావోద్వేగాలను గుర్తించే రిస్ట్‌బ్యాండ్‌ 
మానవ భావోద్వేగాలను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా మూర్ఛ వ్యాధి విరుచుకుపడే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ఇందుకోసం ఓ వినూత్న పరికరాన్ని తయారుచేశారు. ఒత్తిడి, ఆందోళన తదితర భావోద్వేగాలను ఈ పరికరం ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. దీంతోపాటు మీ మూడ్‌ ఎలా ఉందనే విషయాన్ని ఈ రిస్ట్‌బాండ్‌ ద్వారా ఇతరులు తెలుసుకోవచ్చు. పెయిన్‌ కిల్లర్‌ మాత్రల ప్రభావాన్ని కూడా దీంతో గుర్తించవచ్చు. చేతి గడియారంలా ఉండే ఈ పరికరంలోని సెన్సర్లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. దీంతో మూర్ఛ వచ్చే ప్రమాదాన్ని దాదాపు 96 శాతం కచ్చితంగా అంచనా వేయవచ్చు.


అనేకత్వంలో ఏకత్వం
ఒక ఆలయంలో అద్దాల మండపం ఉండేది. ఆ గది నాలుగు దిక్కుల్లో పెద్ద పెద్ద అద్దాలు బిగించారు. గదిలోకి ఎవరొచ్చినా.. పదుల సంఖ్యలో ప్రతిబింబాలు దర్శనమిచ్చేవి. ఒకానొక రోజున ఒక కుక్క ఆ గదిలోకి ప్రవేశించింది. ఎదురుగా ఉన్న అద్దంలో మరో కుక్క ఉండటం గమనించి.. ఆగ్రహానికి గురైంది. అద్దంలోని కుక్క కూడా అలాగే ఆవేశపడుతుండటం చూసింది. తను మొరిగితే.. అద్దంలో ఉన్న కుక్క కూడా మొరిగినట్టు కనిపించింది. గది నాలుగు దిక్కులూ చూస్తే.. ప్రతి అద్దంలోనూ కుక్క ప్రతిబింబం ఉంది. అవన్నీ కుక్కలే అని భావించి.. వాటిని బెదరగొట్టడానికి మొరిగింది. ప్రతిబింబాలూ అలాగే స్పందిచాయి.
కోపం ఆగక.. వేగంగా పరుగెత్తుతూ ఒక్కో అద్దంపై దాడి చేయడం మొదలుపెట్టింది. తీవ్రగాయాలై.. గదిలోనే పడి మరణించింది. కాసేపటికి ఆ గదిలోకి ఆలయ పూజారి వచ్చాడు. రక్తం మడుగులో పడి ఉన్న కుక్కను చూశాడు. పనివారిని పురమాయించి శునకం కళేబరాన్ని ఆలయానికి దూరంగా పాతి పెట్టండని చెప్పాడు. వాళ్లు అలాగే చేశారు. గది నుంచి బయటకు వెళ్తూ.. వెళ్తూ.. పూజారి అద్దాల వంక చూశాడు. గాలికి చెదిరిపోయిన జుట్టును సరి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుక్కకు ప్రాణసంకటంగా మారిన అద్దాలు.. పూజారికి మాత్రం జుట్టు సరిదిద్దుకోవడానికి ఉపయోగపడ్డాయి.
జ్ఞాన లేమి కారణంగా... అద్దాల్లో కనిపించిన కుక్కలన్నీ తన ప్రతిబింబాలని గ్రహించలేకపోయింది. తన నాశనం తానే కొని తెచ్చుకుంది. ప్రపంచంలో ఒకే ఆత్మవస్తువు, దైవ వస్తువు భిన్న భిన్న ఉపాధులలో ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన రోజు... అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించగలుగుతాము.

కుసుమాలు తాకగనే.. 
పూల గుసగుసలు వింటే మనసు పరవశిస్తుంది. అవే పూలను సౌందర్య సాధనాలుగా ఎంచుకుంటే నగుమోము నిగనిగలాడుతుంది. కుసుమాలు తాకగనే... మెరిసేను కాదా మీ మేను! కావాలంటే ట్రై చేసి చూడండి.
తామరపువ్వు ఫేస్‌ ప్యాక్‌
ఈ పువ్వులో లినోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మాన్ని నున్నగా చేస్తుంది. తామర పువ్వు ఫేస్‌ ప్యాక్‌ చర్మంపై ఉన్న రంధ్రాలను సాగకుండా బిగుతుగా ఉంచుతుంది. తామరపువ్వు రెక్కలను మెత్తగా పేస్టులా చేయాలి. లేదా వాటిని నీళ్లల్లో ఉడికించి వడగట్టాలి. ఆతర్వాత కొద్దిగా పసుపు, శెనగపిండి మిశ్రమానికి తామరపువ్వు రెక్కల గుజ్జు లేదా నీటిని కలిపి పేస్టులా చేయాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ను పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆతర్వాత ముఖానికి రాసుకుని 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
మల్లెపూల ఫేస్‌ ప్యాక్‌
మల్లెపూలు చర్మానికి ఎంతో చల్లదనాన్నిస్తాయి. అంతేకాదు చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి కూడా. మల్లెపూలల్లో మంచి పరిమళం దాగుంటుంది. చల్లటి పెరుగు, కలబంద జ్యూసులను మల్లెపూల గుజ్జులో కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖంపై రాసుకుని 20 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. చర్మం ముడతలు పడకుండా, టాన్‌ రాకుండా ఉండాలంటే నిత్యం మల్లెపూల ఫేస్‌ ప్యాక్‌ వాడితే మంచిది.
బంతిపూల ఫేస్‌ ప్యాక్‌
బంతిపూల ఫేస్‌ ప్యాక్‌ యాంటి-బాక్టీరియల్‌. యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటిసెప్టిక్‌ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ మచ్చలను పోగొడుతుంది. స్కిన్‌ టానింగ్‌ను నివారిస్తుంది. మొదట బంతిపూలను మెత్తగా నూరాలి. ఆ గుజ్జులో పచ్చిపాలు కలిపి ఒక గాజు కప్పులో పోసి రాత్రంతా నాననివ్వాలి. ముఖానికి ఈ ప్యాక్‌ను రాసుకునేముందు అందులో 4 లేదా 5 చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
మడమ నొప్పికి మందు
ఏ అవయవం పనితీరు పైనైనా మన దృష్టి పడుతోందీ అంటే ఆ అవయంలో ఏదో సమస్య ఉందని అర్థం. ఎవరైనా మడమల్నీ, పాదాల్నీ తరుచూ చూసుకుంటూ, ఆవైపు, ఈ వైపు నొక్కుకుంటున్నారూ అంటే నిరంతరంగా, ఏదో బాధ వేధిస్తోందని ఇట్టే గ్రహించవచ్చు.. అయినా శరీరంలో కళ్లూ, కాళ్లూ సరిగా లేనిదే అడుగైనా ముందుకు వేయలేం కదా! మడమనొప్పులు ఉన్నవారి పరిస్థితే ఇది. ఈ సమస్య రావడానికి గల కారణాల్లోకి వెళితే....
నడిచే విధానం సరిగా లేకపోయినా, వాడే చెప్పులు సరియైునవి కాకపోయినా, ఎత్తుపల్లాల్లో నడుస్తున్నప్పుడు అడుగులు సరిగా వేయలేకపోయినా మడమ నొప్పులు వస్తాయి. ఇవే కాకుండా, స్థూలకాయం ఉన్నా, వాత సంబంధిత వ్యాధులున్నా, ధాతుక్షయం జరిగినా మడమనొప్పులు వస్తాయి. రోజూ కనీసంగానైనా నడవలేకపోయినా, అతిగా నడిచినా కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి సమస్యకు అదేపనిగా మందులు వాడకుండా, గృహవైద్యంతో బయటపడే ప్రయత్నం చేయవచ్చు.
శొంఠిని శుభ్రపరిచి చూర్ణం చేసి ఉంచుకోవాలి. అందులోంచి 5 గ్రాముల శొంఠి చూర్ణాన్ని, 100 మి. లీటర్ల నీళ్లల్లో కలిపి, అవి 50 మి.లీటర్లు అయ్యేదాకా బాగా కాచి, అలా తయారైన కషాయాన్ని వడగట్టి అందులో 15 మి. లీ ఆముదం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు నొప్పి పూర్తిగా తగ్గేవరకు తాగాలి.
నిమ్మకాయలను రెండు ముక్కలుగా కోసి, పెనం పైన వేడి చేసి, మడమల మీద కాపడం పెట్టాలి
పైన చెప్పినవి పాటించడంతో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, ఇటుక ముక్కలను నిప్పుపై కాల్చి, ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే కొంత ఉపశమనం లభిస్తుంది.
మోముపై రంగుల కళ..
ఫ్యాషన్ లో అందంతో పాటు కూసింత ఫన ఫ్లేవర్‌ ఉంటే ఫ్యాషన ప్రియులు తెగ ఇష్టపడతారు. తాజాగా ‘పామ్‌ పామ్‌ మేకప్‌ ట్రెండ్‌’ ఇనస్టాగ్రామ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దూదిలాంటి చిన్న రంగుల బాల్స్‌ ముఖంపైన అతికించుకోవటమే పామ్‌ పామ్‌ మేకప్‌ ట్రెండ్‌ ప్రత్యేకత. పసుపు, నీలం, ఎరుపు, తెలుపు.. ఇలా మల్టీకలర్స్‌ ఉండే చిన్నటి దూది బాల్స్‌ని స్టిక్టర్స్‌లాగా ముఖం మీద అతికించుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ను పాపులర్‌ మేకప్‌ ఆర్టిస్టులు కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇనస్టాగ్రమ్‌లో పామ్‌పామ్‌

చిరాకా.. నిద్రలేదేమో!
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంతో పాటు హాయిగా నిద్రపోయినప్పుడే సొంతమవుతుంది. అలాంటిది కంటినిండా నిద్రపోకపోతే.. కొన్ని సమస్యలు తప్పవు. ఇంతకీ అవేంటంటే.. 
ఆరు గంటలూ, అంతకంటే తక్కువ సమయం నిద్రపోయినవారిలో గుండె జబ్బులూ, కీళ్లనొప్పులూ ఎక్కువనీ, వయసు పైబడినట్లు కనిపిస్తారనీ అధ్యయనాలు చెబుతున్నాయి. 
* ఎనిమిది గంటలు నిద్రపోయేవారితో పోల్చినప్పుడు ఏడు గంటలూ, అంతకంటే తక్కువ నిద్రపోయేవారిలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని హార్వర్డ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఎన్ని పనులున్నా ప్రతిరోజూ ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోవాలి. హాయిగా నిద్రపోవడం వల్ల మన రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. 
* కంటి నిండా నిద్రపోవడం వల్ల బరువు కూడా తగ్గుతామని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమితో బాధపడేవారు ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడంతో బరువు పెరుగుతారు. క్రమంగా వూబకాయం దరి చేరుతుంది. 
* నిద్రా, ఒత్తిడీ.. ఈ రెండూ మన గుండె, రక్తప్రసరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. నిద్ర పోవడం వల్ల ఒత్తిడి స్థాయులు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంటే.. సరిగ్గా నిద్రపోని వారిలో అధికరక్తపోటు సమస్య ఉంటుంది. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ స్థాయులపై కూడా నిద్ర తన ప్రభావాన్ని చూపి.. ఆ సమస్యను పెంచుతుంది. 
* నిద్ర రూపంలో ఏడెనిమిది గంటలు విశ్రాంతి తీసుకున్నప్పుడు చిరాకూ, అలసటా వంటివి చాలామటుకూ తగ్గుతాయి. నిద్రలేమి వల్ల మీలో నిరాశ నిస్పృహలతోపాటు ఆందోళన కూడా పెరుగుతుంది. తరచూ అలసటకూ, అసహనానికీ గురవుతుంటే దానికి నిద్రలేమి కూడా ఓ కారణమని తెలుసుకోండి.

ఆ పిచ్చిగీతలే.. పాఠాలు
మనం చిన్నారుల ముద్దు ముద్దు మాటలు వింటూ మురిసిపోతాం. వారి బుడి బుడి అడుగులకు వేలుపట్టుకుని చేయూతనిస్తాం. ఎదిగేకొద్దీ ఎలా ఉండాలో తెలియజేస్తాం. అయితే ఎప్పుడూ మనమే కాకుండా.. ఈసారి వాళ్లనుంచీ ఎంతో కొంత నేర్చుకుందామా. అవునా? నిజమా? అనుకుంటున్నారా! ఇది చదవండి. 
ఒకటి నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారుల్ని నిశితంగా చూస్తే..బొమ్మల కోసం తోటి చిన్నారులతో ఎలా పోట్లాడతారో తెలుస్తుంది. ఎదుటివారిని పట్టుకుని లాగేస్తారు. కింద పడేస్తారు... ఆ బొమ్మే కావాలని పేచీ పెడతారు. అయితే ఇదంతా కాసేపే. ఆ తర్వాత కాసేపటికే చక్కగా కలిసిపోయి ఆడుకుంటారు. అవసరమైనప్పుడు మన ఉద్వేగాలను బయటి పెట్టి ఆ తర్వాత అందరితో కలిసిపోవాలనే చెప్పే చిన్నారుల మొదటి పాఠం అది. 
* లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా చిన్నారులు ఒకచోట స్థిమితంగా ఉండరు. పడుతూ లేస్తున్నా, ఎగిరి గంతేస్తున్నా వారి శక్తిస్థాయిలు ఏ మాత్రం తగ్గవు. ఆ ప్రేరణతో మీరు రోజంతా ఉత్సాహంగా ఉండండి. 
* చిన్నారులు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. వారు ఏదైనా గీయగలరు. ఆడగలరు. పాడగలరు. రోజంతా ఆ పనుల్లో మమేకం అవుతారు. వారి నుంచి స్ఫూర్తి పొందండి. ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా చేసిన అంశాలను ఓ చోట రాసుకోండి. ఏమీ లేవా! ఇప్పటి నుంచైనా కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పనులు చేయడం నేర్చుకోండి. వాటిని సదా కొనసాగించండి.
పక్కా ప్రణాళిక ఉందా..
కాలేజీలు మొదలయ్యాయి. చదువుకు సంబంధించి కావచ్చు, మరొకటి కావచ్చు.. విద్యార్థులు ఎన్నో ప్రణాళికలు వేసుకోవడం ఈ సమయంలో సర్వసాధారణం. ఈసారి వాటిని పక్కాగా ఆచరణలో పెట్టాలంటే.. ఇప్పటి నుంచే వాటికో రూపం ఇవ్వండి. 
ప్రణాళిక: ముందుగా మీకున్న సబ్జెక్టులు ఏంటో? వేటికి ఎంత సమయం కేటాయించుకోవాలో ఓ అంచనా వేసుకోండి. మొదటి రోజు నుంచీ చదువుకి సరైన సమయం కేటాయించగలిగితే చివర్లో ఒత్తిడి ఉండదు. ఒక తెల్లఛార్టుపై రోజువారీ ప్రణాళికతో పాటు వార, నెల వారీ లక్ష్యాలనూ రాసుకోండి. దానిలోనే స్నేహితుల కోసం కేటాయించే సమయం, ఇంటర్నెట్‌, సరదాలు, షికార్లు.. వంటివన్నీ కూడా ఉండాలి.
ఆచరణ: ప్రణాళిక వేసుకోవడంతోనే పనులు అయిపోవు. అసలు సమస్య ఆచరణలోనే ఉంటుంది. ప్రణాళికకు తగినట్టే.. మీ దినచర్యను ఆచరిస్తున్నారో లేదో చూసుకోండి. ఉదాహరణకు ఇంటర్నెట్‌కి వాడుకోవాల్సిన సమయం గంటైతే మీరు మరో పావుగంట అదనంగా తీసుకున్నారనుకునుకోండి. మర్నాడు పావుగంట కుదించండి. ఇలా సర్దుబాట్లు చేసుకుంటే.. ఒత్తిడి ఉండదు. హాయిగా మీ లక్ష్యాన్నీ మీరు చేరుకోగలరు.
సమీక్ష: ప్రణాళిక వేసుకుంటున్నాం ఆ సమయాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం అని మురిసిపోకండి. దానివల్ల మీరెంత శాతం ప్రయోజనాన్ని పొందుతున్నారో గమనించుకోండి. చదువుకు కావచ్చు, మరోదానికి కావచ్చు... మీకు ఎక్కువ సమయం అవసరం అనుకుంటే.. ఆ విధంగా సర్దుబాటు చేసుకోవడం కూడా ముఖ్యమే.

కీరదోస తింటే... పాంక్రియాస్‌ పనిచేస్తుంది!
గుడ్‌ఫుడ్‌
కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు ఎండాకాలంలో దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపేస్తుంది. కాబట్టి ఏడాదంతా తినవచ్చు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం. ఇందులోని ‘ కె’ విటమిన్‌ ఎమకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరును మెరుగుపరిచి అల్జీమర్స్‌ (మతిమరుపు) సమస్యను నివారిస్తుంది.
కీరదోస ... గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో లద్దెపురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్‌ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.
ఆ బద్ధకం... అనారోగ్య కారకం...
యోగా
ఆసనాలతో పరిష్కారం
ధనురాసనం
నేలపై బోర్లాపడుకుని మోకాళ్ళని వంచి చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి కాలి చీలమండలాన్ని పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మోకాళ్ళని పైకెత్తుతూ రెండు కాళ్ళని, ఛాతీని పైకెత్తాలి. పొట్ట మాత్రమే నేలను తాకుతూ ఉంటుంది. శరీరం బరువు మొత్తం పొట్ట మీద ఉంటుంది. శరీరం ధనుస్సు మాదిరిగా ఉంటుంది. ముందు కాళ్ళను పైకెత్తుతూ, ఛాతీని పైకెత్తితే నడుము మీద ఒత్తిడి పడదు. కాళ్ళను పైకెత్తే క్రమంలో మోకాళ్ళను ఎడంగా ఉంచాలి. అప్పుడు ఆసనంలోకి వెళ్ళటం తేలిక అవుతుంది. సాధ్యమైనంత సేపు ఆసనంలో ఉండి నెమ్మదిగా ఛాతీ నేలకు ఆనించి తర్వాత కాళ్ళను నేలకు ఆనించి నిదానంగా బయటకు రావాలి.
1. భుజంగాసన (కోబ్రా పోజ్‌)
బోర్లా పడుకుని మకరాసనంలో చేతులు మడచి కుడిచేయిని ఎడమ చేతిమీద ఉంచాలి. చేతుల మీద గడ్డం ఆనించి తలకొంచెం లిఫ్ట్‌ చేసేట్లు ఉంచాలి. పాదాల మధ్య 2 లేదా 3 అడుగుల దూరం, కాలి బొటన వేళ్ళు భూమికి దగ్గరగా ఉంచితే పొత్తి కడుపు భాగం, తొడలు పూర్తిగా భూమికి ఆని విశ్రాంతి కలుగుతుంది. పాదాలు రెండు కలిపి, అరచేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచి శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని తలను పైకి లేపాలి. చేతులు బలంగా నేలకు నొక్కుతూ మోచేతులు ఓపెన్‌ చేస్తూ ఛాతీని వీలైనంత పైకి లేపాలి. బొడ్డు కింద భాగం నేలమీద పూర్తిగా ఆనేలా బొడ్డు నుంచి పై భాగాన్ని వీలైనంత పైకి లేపే యత్నం చేయాలి. (ఇది పూర్తి భుజంగాసన స్థితి). ఇలా కష్టం అన్పిస్తే మోచేతుల నుండి ముందు భాగం వరకూ చేతులు నేల మీద శరీరం ఇరువైపులా ముందుకు ఉంచి తల, ఛాతీ పైకి లిఫ్ట్‌ చేసే అర్థ భుజంగాసన ఎంచుకోవాలి.
1ఎ) భుజంగాసన: పూర్తి భుజంగాసన స్థితిలో ఉన్నప్పుడు తల కుడివైపు తిప్పి కుడి భుజం మీదుగా వెనుక పాదాలను మళ్ళీ తలను ఎడమవైపుకు తిప్పి ఎడమ భుజం మీదుగా వెనుక పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట ఛాతీభాగాలను, గడ్డాన్ని నేలమీదకు తీసుకు రావాలి. శ్వాస తీసుకుంటూ తల, ఛాతీ పైకి లేపి, శ్వాస వదులుతూ నేల మీదకు మకరాసనంలో విశ్రాంత స్థితికి రావాలి.
2. సర్పాసన (స్నేక్‌ పోశ్చర్‌)
మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండి, గడ్డం నేలపై ఆనించి చేతులు వెనుక ఇంటర్‌లాక్‌ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండూ నేలకు గట్టిగా నొక్కుతూ, ఇంటర్‌లాక్‌ చేసిన చేతుల్ని గట్టిగా పుష్‌ చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. చేతులు వేరే వాళ్లు గుంజుతున్న అనుభూతి కలిగేలా ప్రయత్నించాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ క్రిందకు రావాలి. ఇలా 3/ 5 సార్లు రిపీట్‌ చేయవచ్చు.
3. శలభాసన (గ్రాస్‌హోపర్‌)
బోర్లా పడుకుని నేలమీద గడ్డం సపోర్ట్‌గా ఉంచి పాదాలు దగ్గరకు చేర్చి మోచేతులు రెండూ పొట్ట కిందకు తీసుకువెళ్ళి అరచేతులు భూమి మీదకు గట్టిగా ప్రెస్‌ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా గాలిలోకి పైకి లేపే ప్రయత్నం చేయాలి. శ్వాసవదులుతూ నెమ్మదిగా కాళ్ళు రెండూ కిందకు దించాలి. మధ్యలో శ్వాస తీసుకుని వదిలే ప్రయత్నం చేయకుండా సాధారణ శ్వాస తీసుకుంటూ తేలికగా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి వెనుకకు రావాలి. పూర్తి ఆసనస్థితిలో ఉన్నప్పుడు తొడలు మోకాళ్లు కూడా భూమి మీద ఆనకుండా పైకి లేపి ఉంచాలి. పూర్తి ఆసన స్థితిలోకి రావడం కష్టంగా ఉన్నట్లయితే ఒక కాలు ఒకసారి, ఆ తర్వాత రెండో కాలుని పైకి (మోకాళ్ళ దగ్గర మడచి) తీసుకువెడుతూ ఫ్రీ చేసుకోవాలి. తరువాత శలభాసన వేరు వేరుగా రెండు కాళ్ళతో సాధన చేసి కొంచెం రిలాక్స్‌ అయ్యి అప్పుడు పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేయాలి.
జాగ్రత్తలు: గర్భిణులు, రుతుస్త్రావంలో ఉన్న స్త్రీలు చేయరాదు. పెప్టిక్‌ అల్సర్‌తో బాధపడేవాళ్లు, హెర్నియా సమస్య ఉన్నవాళ్లు పూర్తి స్థాయిలో ఈ ఆసనం చేయకపోవడం మంచిది.
అనేక ఆరోగ్యసమస్యలకు మూలకారణం మలబద్ధకం. తగినంత పీచుపదార్థాలు, రాత్రిపూట తేలికైన ఆల్కలైజింగ్‌ ఫుడ్, ఫ్రూట్‌ సలాడ్స్‌ తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ వల్ల పెద్ద ప్రేగులో కదలికలు మందగించి, గ్యాస్‌ ఏర్పడి మల విసర్జనకు అవరోధం కలిగిస్తుంది. దీన్ని పెద్దగా పట్టించుకోకపోతే పైల్స్, ఫిషర్, ఫిస్టులా, కోలన్‌ క్యాన్సర్‌ రావచ్చు.
దీని నివారణకు ఆహార అలవాట్లలో మార్పుతో పాటు యోగాసనాలు ఉపకరిస్తాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు కనీసం 3 నెలలకు ఒకసారి శంఖ ప్రక్షాళన క్రియ చేయాలి. అంటే గోరువెచ్చని నీటిలో కొంచెం ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి (4 – 5 లీటర్లు) తాగాలి. ముందుగా ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీటిని తాగి కటిచక్రాసనం, పాద హస్తాసనం, భుజంగాసనం... ఆసనాలను రిపీటెడ్‌గా చేస్తూ (10 నిమిషాల పాటు) మళ్ళీ నీళ్లు తాగుతూ మళ్ళీ ఆసనాలు రిపీట్‌ చేస్తూ ఇలా 3 లేదా 5 రౌండ్స్‌ చేయాలి. ఇలాచేస్తే పెద్ద ప్రేగులో ఉన్న మలం (గ్యాస్‌తో కూడిన మలం) కదిలి మొత్తం పేగు ఖాళీ అయ్యి చివరకు తాగిన నీళ్లు కూడా వచ్చేస్తాయి. ఈ ప్రక్రియలో ఉదరం, చిన్న పేగు, పెద్ద పేగులు శుభ్రపడతాయి. ఆ రోజు మధ్యాహ్న భోజనంలో తేలికగా జీర్ణం అయ్యే కిచిడీ వంటివి తీసుకోవాలి. రాత్రికి పండ్లు, కూరగాయల సలాడ్‌ తీసుకోవాలి.
ఇలా చేయడం కష్టమనిపిస్తే శరీర బరువుకి తగినట్లుగా (70 కిలోల బరువుకు 70 మి.లీ)వంట ఆముదం ఉదయం 3 గంటలకు గోరువెచ్చగా తాగాలి. విరేచన ప్రక్రియ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. టొమాటో రసం ఒకటి లేదా రెండు లీటర్లు రెడీగా ఉంచుకుని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 200 మి.లీ. తాగుతూ ఉండాలి. రెండు గంటలలో విరేచనప్రక్రియ పూర్తవుతుంది. మలబద్దకం తగ్గడానికి ఉపకరించే ఆసనాలివే...
ఎ.ఎల్‌.వి కుమార్‌ ట్రెడిషనల్‌
యోగా ఫౌండేషన్‌

సమన్వయం: సత్యబాబు


1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list