MohanPublications Print Books Online store clik Here Devullu.com

తూర్పు గోదావరి జిల్లా తిరుగులేని విశేషాలు

నేను పుట్టిన మా......

తూర్పు గోదావరి జిల్లా తిరుగులేని విశేషాలు

అమలాపురం  అరటి తోటలు

కొత్తపేట కొబ్బరి తోటలు

అంబాజీపేట వంటాముదం

రావులపాలెం గోదావరి బ్రిడ్జి

రాజోలు రాజుల దర్జా

ముక్కామల పప్పుచెక్కలు

బెండమూర్లంక దోసకాయలు

ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జి

కోటిపల్లి నావల రేవు

అప్పనపల్లి  వెంకన్నబాబు

అయినవిల్లి వినాయకుడు

ముక్తేశ్వరం శివాలయం

ర్యాలి జగన్మోహన స్వామి

ముమ్మిడివరం బాలయోగి

మురమళ్ళ నిత్య శివపార్వతీ కల్యాణం

జగ్గన్నతోట ప్రభలతీర్థం

పుల్లేటికుర్రు చేనేత చీరలు

గంగలకుర్రు గంగా బొండాలు

వాడపల్లి వేంకటేశ్వర స్వామి

ద్రాక్షారామం భీమేశ్వరుడు

అన్నవరం సత్యనారాయణ స్వామి

వీరేగాక మాజిల్లా గ్రామదేవతలు….

తుని దగ్గర తలుపులమ్మ

పెద్దాపురం మరిడమ్మ

కాండ్రకోట నూకాలమ్మ

ఆత్రేయపురం పూతరేకులు

పసలపూడి గోదారి కథలు

రామచంద్రపురం పంటపొలాలు

తాపేశ్వరం మడత కాజా

మండపేట బెల్లం గవ్వలు

బొబ్బర్లంక కొబ్బరుండలు

తుని తమలపాకులు

కత్తిపూడి కరకజ్జం

బెండపూడి బెల్లం జీళ్ళు

జగ్గంపేట జాంపళ్ళు

ప్రత్తిపాడు జొన్నపొత్తులు

రాజానగరం సీతాఫలాలు

రాజమండ్రి రైలు బ్రిడ్జి

ధవళేశ్వరం ఆనకట్ట

కడియం పూలతోటలు

ద్వారపూడి బట్టల సంత

బిక్కవోలు సుబ్బారాయుడు

అనపర్తి చేపల చెరువులు

సామర్లకోట పంచదార ఫాక్టరీ

పెద్దాపురం పాండవుల మెట్ట

పిఠాపురం అత్తరు సెంటు

గొల్లప్రోలు పచ్చమిర్చి

కాకినాడ కోటయ్య కాజా

ఉప్పాడ పట్టుచీరలు

మామిడాడ మామిడి తాండ్ర

తాళ్ళరేవు తాటి తాండ్ర

ఏలేశ్వరం వంకాయలు

వడిశలేరు చేగోడి

అడ్డతీగెల పనసకాయలు

గోకవరం మామిడి తోటలు

మారేడుమిల్లి అడవుల అందాలు
ఇవేగాక, కళలకు కాణాచి,  కళాకారులకు పుట్టినిల్లు, మా కాకినాడ- రేలంగి, ఎస్వీ రంగారావు, అంజలీదేవి ఇక్కడి వారే. చదువుల తల్లి సరస్వతీ నిలయం- మా రాజమహేంద్రవరం
వీరేశలింగం,  పానుగంటి,  చిలకమర్తి,  మొక్కపాటి,  శ్రీపాద, వేదుల, దేవులపల్లి,  భమిడిపాటి, మునిమాణిక్యం వంటి లబ్ధప్రతిష్ఠులైన రచయితలు ఇక్కడి వారే. ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే. జయప్రద, రాజబాబు, అలీ ఇక్కడివారే.

ఇలాంటివి ఇంకా ఎన్నో మా తూ.గో.జి.సొంతం

తిరుగులేని తూ.గో.జి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list