దేవుని ప్రేమపాత్రులు!
ఆత్మీయం
భక్తుల్లో నాలుగు వర్గాల వాళ్లుంటారు. కొందరు ఆర్తితో భగవంతుణ్ని కొలుస్తారు. వాళ్లు ముందు బాగానే బతికినా, కాల కర్మ వైపరీత్యం వల్ల అన్నీ పోగొట్టుకుంటారు. మళ్లీ వెనకటిలాగ జీవితంలో సుఖపడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తారు. మరికొందరు తమ ఆత్మస్వరూపాన్ని గురించిన జిజ్ఞాసతో భగవంతుణ్ని సేవిస్తారు. ఇంకా కొందరు, గర్భదరిద్రులుగా ఉండి, ఐశ్వర్యం కోరుకుంటారు.
వాళ్లూ భగవంతుణ్నే ఆశ్రయిస్తారు. మరికొందరు భగవంతుని నిష్కామంగా ప్రేమించి సేవిస్తారు. వాళ్లనే ‘జ్ఞానులు’ అంటాడు శ్రీకృష్ణుడు ‘‘ఈ నాలుగు రకాల వాళ్లూ నాకు భక్తులే. కాని అందరికన్నా ఈ చివర చెప్పిన ‘జ్ఞాని’ అంటే నాకు ఎక్కువ మక్కువ. వాడు నాకు ఆత్మ’’ అని తెలియజేశాడు పరమాత్మ. అంటే నిష్కామంగా భగవంతుని సేవించడమే జ్ఞానం. అటువంటి వారినే భగవంతుడు ప్రేమిస్తాడు.
వేరుశెనగ... గుడ్‌ఫుడ్
వేరుశనక్కాయల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి, 25.8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అవి శక్తినివ్వడంలోనూ, గాయాలు మాన్పడంలోనూ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో కార్పోహైడ్రేట్లు 13 – 16 శాతమే. వంద గ్రాముల్లో 16.1 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు చిరుతిండిగా నిర్భయంగా తినవచ్చు.100 గ్రాముల్లో 49.2 గ్రాములు కొవ్వుపదార్థాలే. వాటిల్లో మోనో–అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు 24.43 గ్రాములు, పాలీ–అన్‌శాచ్యురేటెడ్ 15.46 గ్రా‘‘, శాచ్యురేటెడ్ కొవ్వులు 6.28 గ్రాములు. కాబట్టి ఇది ప్రధానమైన శక్తివనరు.
వీటిల్లో విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. గర్భవతులకు మేలుచేస్తాయి. విటమిన్–బి3గా పరిగణించే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది.
అందంగా అల్లుకుంటుంది..
మన వాతావరణానికి అనువైన తీగల్లో అత్యంత మనోహరమైంది క్లీరోడెండ్రాన్ తీగ. ప్రకాశమంతమైన ఎరుపురంగు పూల గుత్తులతో, ముదురాకు పచ్చని పెద్ద పెద్ద ఆకులతో ఆకర్షణీయంగా ఉండే తీగ ఇది. దీన్ని ఫ్లేమింగ్ గ్లోరీ బోయర్ అని అంటారు. దీని శాస్త్రీయనామం క్లీరోడెండ్రాన్ స్ల్పెండెన్స్. పది నుంచి పదిహేను అడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ తీగ ఎప్పుడూ పచ్చగా, ముచ్చటగా ఉంటుంది. దీని ఆకులు ప్రస్ఫుటంగా కనిపించే ఈనెలతో, అండాకారంలో దట్టంగా ఉండి ఎర్రని పూల గుత్తులకు ఎంచక్కని జోడింపులాగా ఉంటాయి. ఈ పూలు చిన్నగా, ఐదు రెక్కలతో, గొట్టాల్లాంటి కాడలతో గుత్తుల్లో పూస్తాయి. ఈ తీగ సంవత్సరమంతా అడపాదడపా పూసినా చలికాలంలో ఇంకాస్త బాగా పూస్తుంది. హమ్మింగ్ పిట్టలూ, సీతాకోక చిలుకలూ ఈ పూల అందానికి ఫిదా అవుతుంటాయి.
సారవంతమైన నేల అవసరం... పూర్తి ఎండలో పెరిగే ఈ తీగ కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది కూడా. సారవంతమైన, తేమగా ఉండే నేల దీనికి అనుకూలంగా ఉంటుంది. పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎక్కువగా వేసుకోవాలి. కుండీలో అయితే వర్మికంపోస్టు, కోకోపీట్ ఎక్కువగా కలుపుకోవాలి. వాడేసిన టీ పొడి, కాఫీ పొడి మట్టి మిశ్రమంలో కలుపుతూ ఉంటే ఈ తీగ బాగా పూస్తుంది. పెద్ద పెద్ద చెట్ల మీదికి కాకుండా పందిళ్లు, కంచెల మీదికి పాకించుకోవడానికి అనువైన తీగ ఇది. దీనికి ఆధారం బలంగా ఉండేలా చూసుకోవాలి. స్తంభాలకు అల్లించినా చక్కగా ఉంటుంది. అంతేకాదు, ఆధారం ఇవ్వకుండా నేలమీద వదిలేస్తే అందమైన గ్రౌండ్‌కవర్‌లాగా పనిచేస్తుంది కూడా. ఏ స్థలానైన్నా పూర్తిగా కప్పేయడానికీ, కనబడకుండా అడ్డుగా వాడటానికీ ఈ క్లీరోడెండ్రాన్ తీగ చాలా అనువుగా ఉంటుంది.
వేగంగా పెరుగుతుంది... శీతాకాలంలో బాగా పూసే ఈ తీగను వర్షాకాలంలో కత్తిరిస్తే ఎక్కువ కొమ్మలతో పెరిగి నిండుగా పూస్తుంది. ఇది వరండాల్లో, బాల్కనీల్లో కూడా పెంచుకోవడానికి అనువైన తీగ. వేగంగా పెరుగుతుంది. కాబట్టి బాల్కనీ చిన్నగా ఉంటే క్రమం తప్పకుండా ఈ తీగను కత్తిరించుకోవడం మాత్రం మర్చిపోకూడదు. క్లీరోడెండ్రాన్ తీగ పెద్దగా శ్రద్ధ కోరుకోదు. చీడపీడల భయం కూడా తక్కువే. రసం పీల్చే పురుగులు, పిండి పురుగులు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఆకు కషాయాలు తరచూ వాడడం ద్వారా ఈ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు. నెలకోసారి 17:17:17 వంటి సమగ్ర ఎరువును కొద్దిగా వేస్తూ ఉంటే చక్కగా పూస్తుంది. అందమైన ఈ తీగ వేరు పిలకలను విడదీసి నేలంట్లూ, కొమ్మ కత్తిరింపుల ద్వారా సులువుగా ప్రవర్థనం చేయవచ్చు.
-బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్
ఓ థ్యాంక్స్.. మిమ్మల్ని మార్చేస్తుంది
కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు మనల్ని ముందుకు సాగనివ్వవు. ఏ పనీ చేయనివ్వవు. దాంతో ఆత్మవిశ్వాసం తగ్గి.. కుంగిపోతుంటాం. ఈ సమస్యను అధిగమించాలంటే.. ఆశావహ దృక్పథాన్ని పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం. ఎలాగంటే..
* మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని బయటకు కనిపించనీయకండి. వీలైనంతవరకూ చుట్టూ ఉన్నవారిని నవ్వుతూ పలకరించండి. నవ్వు ఎలాంటి వాతావరణాన్ని అయినా ఇట్టే సానుకూలంగా మార్చేస్తుంది. అప్పుడు మీ సమస్యలు కూడా మీకు చిన్నవిగా కనిపిస్తాయి.
* ఎప్పుడూ మీ బాధలూ, సమస్యల్ని తలచుకుని బాధపడకుండా మీకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడం అలవాటు చేసుకోండి. చుట్టుపక్కలవారికి ఆపద వస్తే నేనున్నా అంటూ మీ చేయి అందించండి. మీ సాయం తీసుకున్నవారు మీకు కృతజ్ఞతలు తెలిపినప్పుడు మీరు ఎన్నోరెట్లు సంతోషపడతారు. అది మీకు మానసిక స్థైర్యాన్నిస్తుంది. మీ సమస్యలు మీకు పెద్దవిగా అనిపించవు.
* ప్రతికూల ఆలోచనలు అదేపనిగా వేధిస్తుంటే.. మీరు అంతకు ముందు సాధించిన విజయాలూ, ఆనందాల్ని గుర్తుచేసుకోండి. వాటి తాలూకు సంతోషం మనసంతా నిండిపోతుంది.
* కొత్త విషయాలు నేర్చుకోవడం వల్లా ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, బొమ్మలు గీయడం, కొత్త ప్రదేశాలను సరదాగా చుట్టిరావడం... ఇవన్నీ కూడా మనల్ని సానుకూలంగా మార్చే పనులే.
కనుబొమ అందమా..
ఇటీవలే ఫెదర్, బార్బ్‌డ్ వైర్, డ్రాగన.. ఇలా కనుబొమకి సంబంధించిన ట్రెండ్స్ వచ్చి అలరించాయి. తాజాగా ‘బ్రో కర్వింగ్’ ట్రెండ్ హల్చల్ చేస్తోంది. ఈ ట్రెండ్‌లో కనబొమపై డార్క్ షాడో ఉండేట్లు బ్రష్‌తో షేడ్ ఇస్తారు. ఫ్లవర్స్, గ్లిట్టర్స్, స్టోన్స.. లాంటి కలర్‌ఫుల్ మెటీరియల్స్‌తో చక్కటి లుక్ ఇస్తే ఆ అందమే వేరంటున్నారు ఫ్యాషన ప్రియులు. పదిహేడేళ్ల ఓ మేకప్ ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ ఇనస్టాగ్రమ్‌లో వైరల్ అవుతోంది. ఈ బ్రో కర్వింగ్ ట్రెండ్‌ను ఫాలో అయ్యేవారు సెల్ఫీ తీసుకుని ఫొటోలను ఇనస్టాగ్రమ్‌లో అప్‌లోడ్ చేస్తూ మురిసిపోతున్నారు.
ఇవి తాగితే బరువు తగ్గుతారు
బరువు తగ్గడానికి చక్కటి పానీయం.. మంచినీళ్లు. ప్రతి రోజు శరీరానికి సరిపడే నీళ్లు తాగితే సహజంగానే మనలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. ప్రేవులు శుభ్రం అవుతాయి. తద్వార టాగ్జిన్ల సమస్య తప్పుతుంది. కొలెసా్ట్రల్ కూడా నియంత్రణలో ఉంటుంది. వర్కవుట్‌లు చేసే సమయంలో.. నీళ్లలోకి నిమ్మపండు పిండుకుని తాగితే మరింత కొవ్వు కరుగుతుంది.
డిన్నర్‌కు ముందు వెజిటబుల్ సూప్ తాగితే తక్కువ కేలరీలను పొందవచ్చు. అత్యధిక పోషకాలు లభించడంతో పాటు జీర్ణప్రక్రియలు మెరుగుపడతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.
శరీరంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నియంత్రణలో ఉంచే గుణం గ్రీన్‌టీ సొంతం. దీనివల్ల బరువు తగ్గే అవకాశం మెరుగవుతుంది. రోజుకు రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే మంచి ఫలితం లభిస్తుంది. దాంతోపాటు రోగనిరోధకశక్తి పెరిగి.. జబ్బులు దరి చేరవు.
మెటబాలిజాన్ని ఉరుకులెత్తించడంలో బ్లాక్‌కాఫీ ముందుంటుంది. కొవ్వును కూడా అత్యంత వేగంగా తగ్గించి.. కావాల్సినంత శక్తిని ఇస్తుంది కాఫీ. విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా క్యాలరీలను బర్న్ చేస్తుంది.
మెనోపాజ్ సమస్యల్ని అధిగమించలేమా?
జీవితమంతా చురుగ్గా, చలాకీగా ఉండాలనుకునే తత్వం నాది. నాకిప్పుడు 35 ఏళ్లు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా అస్తమానం మెనోపాజ్ గురించి చెబుతూ భయపెట్టే వాళ్లే. నా మట్టుకు నేను ఆ సమస్యల్ని అధిగమించే మార్గాలు తెలియకే వాటితో బాధపడుతున్నామని భావిస్తాను. నా మాటల్లో నిజం లేదంటారా?
- టి. ఊర్మిళ, ఖమ్మం
మీరన్నట్లు, మెనోపాజ్ సమస్యలు స్త్రీలందరికీ వచ్చేవేమీ కావు. ఎందుకంటే కొంత మంది స్త్రీలకు మెనోపాజ్ దాటినా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెద్దగా తగ్గిపోదు. క్యాల్షియం లోపమూ అంతగా ఉండదు. ఆ స్థితికి వారి శరీర శ్రమ, తీసుకునే ఆహారపానీయాలు, మొత్తంగా చూస్తే వారి జీవనశైలి కారణంగా ఉంటాయి. శరీర వ్యవస్థ పట్ట ఉండే ప్రత్యేక శ్రద్ధ ఎవరినైనా ప్రత్యేక వ్యక్త్తులుగా తీర్చిదిద్దుతుందనడంలో సందేహం లేదు.
మెనోపాజ్‌తో వచ్చే ప్రధాన సమస్య ఆస్టియోపొరోసిస్ అనే కీళ్ల వ్యాధి. దీనివల్ల క్యాల్షియం తగ్గిపోయి ఎముకలు పెళుసుబారతాయి. ఇది మధ్య వయసు వచ్చేనాటికి కీళ్ల సమస్యలు రావడానికి కారణమవుతుంది. వృద్ధాప్యం వచ్చేసరికి మనిషి ఎత్తు తగ్గిపోయి, వెన్ను వంగిపోవడం జరుగుతాయి. ఇవన్నీ క్యాల్షియం లోపాల పట్ల ఏమాత్రం జాగ్రత్తపడని వారికే ఎక్కువగా ఎదురవుతాయి.
మామూలుగా అయితే, పురుషుల్లోగానీ, స్త్రీలల్లో గానీ, 35వ ఏట నుంచే ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోవడం మొదలవుతుంది. వారిలో కొందరికి మెనోపాజ్‌కు చేరుకోగానే ఆ క్యాల్షియం తగ్గిపోవడం మరింత వేగవంతమవుతుంది. అందుకు కారణం శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గిపోవడమే కారణం. ఈ స్థితిని 60ఏళ్లు వచ్చినప్పటినుంచే ఎప్పటికప్పుడు ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ) పరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మేలు. దానివల్ల ఆ లోపాన్ని చక్కదిద్దుకునే అవకాశాలు ఉంటాయి.
మెనోపాజ్ వచ్చినా ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోకుండా ఉండాలంటే, శరీరానికి క్యాల్షియం అదనంగా అందేలా శ్రద్ధ వహించాలి. అందుకు క్యాల్షియం మాత్రలు కాకుండా, అదనంగా క్యాల్షియం లభించే ఆహారపానీయాలు తీసుకోవాలి. విటమిన్-డి లభించేందుకు ఉదయం ఎండలో రోజూ 45 నిమిషాలు గడపాలి. వీటన్నింటితో పాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవన్నీ మీరనుక్నుట్లు జీవితమంతా దృఢంగా, హుషారుగా ఉండడానికి తోడ్పడతాయి.
- డాక్టర్ పి. నీలిమ, గైనకాలజిస్ట్
పచ్చబొట్టేసిన..
ఎవరి పిచ్చి వారికి ఆనందం! పిచ్చి పీక్స్‌కి చేరితే ఎవరెన్ని చెప్పినా వారికి వినపడవు. బ్రిటన వాసి మాథ్యూ వెలనకి ట్యాటూలంటే ప్రాణం. ఎంత ప్రాణమంటే.. 2008 సంవత్సరంలోనే ఒంటినిండా ట్యాటూలు వేయించుకోవటానికి నలభైవేల యూరోలు ఖర్చుచేశాడు. ఆయన ఒంటి మీద మొత్తం 300 ట్యాటూలు ఉన్నాయి. కాదేదీ ట్యాటూకి అనర్హం అనిపిస్తుంది. ఆయన్ని చూస్తూనే. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మాథ్యూ తన పేరును ‘కింగ్ ఆఫ్ ఇంక్’ అని రాజ్యాంగబద్ధంగా పేరు మార్చుకున్నాడు. మరో షాక్ న్యూస్ ఏంటంటే.. తన శరీరాన్ని కాన్వా్‌సగా మార్చటానికి దేనికైనా వెనకాడలేదు. ఫలితంగా ఆసుపత్రిపాలయ్యాడు. ఇటీవల చేయిపైన ట్యాటూ వికటించి సర్జరీకి దారితీసింది. ఆసుత్రికి వెళ్లకుండా ఉంటే చేయిని కోల్పోయేవాడు. ‘కింగ్ ఆఫ్ ఇంక్’ అని చాలామంది అతన్ని పిలుస్తుంటే గతంలో సంతోషపడేవాడు. ఇపుడు బాధపడుతున్నాడు. ఈ 37 ఏళ్ల వ్యక్తిని జనాలు వింతగా చూడటంతో పాటు సమంగా అవకాశాలు కల్పించటం లేదని వాపోతున్నాడు. ఏదైనా గొడవ, నేరం.. చేస్తే ఇట్టే దొరికిపోతాను అంటూ బాధపడుతున్నాడు. ఒకప్పుడు శరీరం ట్యాటూలు వేసుకోవటానికే ఉందంటూ చెప్పిన ఇతగాడు అదే శరీరంలో వికటించే చర్యలను చూసి తెగ బాధపడుతున్నాడు. ఇందులో నీతి ఏంటంటే ఏదైనా శృతిమించితే విపరీత పరిణామాలు, సమస్యలు వస్తాయని అర్థం.
లగేజ్ సర్దుకోండిలా!
లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్! కానీ ప్రయాణమనగానే ఏం సర్దాలో, వేటిని వదిలేయాలో అర్ధం కాదు. కంగారులో అత్యవసరమైనవి వదిలేసి అనవసరపు చెత్తంతా సర్దేస్తాం. తీరా ఊరెళ్లాక ఆ మోతబరువు మోయలేక నానా అవస్థలూ పడతాం. అందుకే ఈ ప్యాకింగ్ టిప్స్ తెలుసుకుని ఇకనుంచీ హ్యాపీగా టూర్ ప్లాన్ చేసుకోండి.
ప్యాకింగ్ లిస్ట్: ఊరెళ్లటానికి రెండు రోజుల ముందే ఏఏ వస్తువులు ప్యాక్ చేయాలో లిస్ట్ రాసి పెట్టుకోవాలి. లిస్ట్ రాయటం పూర్తయ్యాక ఇంకోసారి చెక్ చేసి వాటిలో అనవసరం అనిపించిన వాటిని కొట్టేయాలి. మిగిలినవాటిని ఊరెళ్లే ముందురోజు ఒక్కొక్కటిగా సర్దేసు కోవాలి.
ఛార్జర్లు, కేబుల్స్: వీటిని సూట్‌కే్‌సలో అలాగే ఉంచేస్తే చిక్కులు పడి డ్రస్‌లకు చుట్టుకుపోతాయి. కాబట్టి ఇలాంటి వాటిని రోల్ చేసి జిప్ ఉన్న చిన్న బ్యాగ్‌లో సర్దేయాలి.
జ్యువెలరీ: బంగారు నగలు, చెవి కమ్మలు లాంటివి నలిగిపోకుండా ఉండాలంటే వాటిని ‘పిల్ కేస్’లో సర్దాలి. మాత్రలు మర్చిపోకుండా వేసుకునేందుకు ఉపయోగించే పిల్ కేస్‌లు సర్జికల్ షాప్స్‌లో దొరుకుతాయి.
లోదుస్తులు: లోదుస్తులు వెతుక్కోవటం చిరాకు పెట్టించే పని. ముఖ్యంగా ప్రయాణంలో ఉండగా ఇవి ఓ పట్టాన చేతికి దొరక్కుండా కోపం తెప్పిస్తాయి. ఈ చిరాకు తప్పాలంటే వీటిని ఓ పిల్లో కవర్‌లో సర్దాలి.
మడతపెట్టకుండా చుట్టాలి: సూట్‌కే్‌సలో బట్టలు మడతపెట్టి పెట్టడం మనకు అలవాటు. కానీ ఇలా సర్దితే ఆ డ్రస్‌లు ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తాయి. కాబట్టి దుస్తుల్ని చుట్టలా చుట్టి సర్ది చూడండి. ఎన్ని సర్దినా ఇంకా కొంత ప్లేస్ మిగిలి ఉంటుంది. ప్యాంట్, షర్ట్, అండర్ గార్మెంట్స్ వీటన్నిటినీ విడివిడిగా కాకుండా కలిపి ఒకే చుట్ట చుట్టడం మరో టెక్నిక్.
మెడికల్ కిట్: పొట్ట నొప్పికి, సాధారణ నొప్పులకు, దురదలకు మందులు తప్పకుండా తీసుకెళ్లాలి. తుమ్ములతో కూడిన అలర్జీ ఉంటే నాసల్ స్ర్పే వెంట తీసుకెళ్లాలి. అలాగే కొన్ని బ్యాండ్ ఎయిడ్స్, వాంతులను ఆపే టాబ్లెట్స్, బెణుకుల కోసం క్రేప్ బ్యాండేజ్‌లు వెంట తీసుకెళ్లటం మేలు. అయితే వీటన్నింటిని ఒకే జిప్ బ్యాగ్‌లో సర్దేసుకోవాలి.
ద్రువుని దీక్ష
అనగనగా ఉత్థానపాదుడు అనే రాజుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య పేరు సునీతి. ఇంకో భార్య పేరు సురుచి. సునీతి కొడుకు ధ్రువుడు. సురిచి కొడుకు ఉత్తముడు. ఒకరోజు సుఖంగా కూర్చుని ఉన్న సమయంలో ఆయన తొడపై ఉత్తముడు కూర్చున్నాడు. అప్పుడు ధ్రువునికి కూడా తండ్రి ఒళ్లో కూర్చోవాలని అనిపించింది. వెంటనే నాన్న దగ్గరికెళ్లి ‘‘నాన్నా... నేను కూడా నీ ఒళ్లో కూర్చుంటాను’’ అని అడిగాడు. కానీ ఉత్తముడు కూర్చోనివ్వలేదు. అక్కడే ఉన్న ఉత్తముని తల్లి సురిచి ‘ఎంతో తపస్సు చేస్తే గానీ నీకు ఆ భాగ్యం దక్కదు, పో..’ అని కఠినంగా మాట్లాడింది. దాంతో ధ్రువుడు ఏడుస్తూ వాళ్లమ్మ దగ్గరికెళ్లి జరిగినదంతా చెప్పాడు. కొడుక్కి జరిగిన అవమానాన్ని విని ఓదార్చింది. భగవంతుని దయ లేకపోవడం వల్ల నీకు ఈ అవమానం జరిగింది. మీ చిన్నమ్మ చెప్పిన మాట నిజమే. తపస్సు చేస్తే ఏమైనా లభిస్తాయి. వెళ్లి విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయి అని చెప్పింది. తల్లిమాట ప్రకారం ధ్రువుడు ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఒంటరిగా అడవుల్లో తిరుగుతున్న ధ్రువున్ని చూసి నారదమహర్షి జాలిపడి ‘ధ్రువుని దగ్గరకొచ్చి నీ పేరేంటి? ఎవరు నీవు? ఎక్కడికిలా బయలుదేరావు’ అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు తన సంగతంతా చెప్పాడు. నారదుడు ప్రేమగా ధ్రువుని తల నిమిరి నీకు తప్పకుండా విష్ణుమూర్తి దర్శనమవుతుంది అని ‘నమో భగవతే వాసుదేవాయ’ విష్ణు మంత్రాన్ని జపించమని ఉపదేశించాడు. ధ్రువుడు ఒక చెట్టు నీడన ఏకాగ్రతతో, పట్టుదలతో విష్ణు మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. నిష్ఠగా, తీవ్రంగా తపస్సు కొనసాగించాడు.
ధ్రువుని పట్టుదలకు, తపస్సుకు మెచ్చి మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శంఖు, చక్రాలతో అందంగా ఉన్న విష్ణువుని చూసి ఽధ్రువుడు పరమానందపడ్డాడు. విష్ణువు ప్రేమతో తన శంఖాన్ని ధ్రువుని బుగ్గకు అలా తగిలించాడు. వెంటనే ధ్రువునికి వేదరహస్యాలన్నీ అర్థమయ్యాయి. అమోఘమైన జ్ఞానం అబ్బింది. దాంతో ధ్రువుడు విష్ణు మూర్తిని చక్కగా స్తోత్రం చేశాడు. విష్ణువు సంతోషించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. విష్ణువును చూశాక ఇంతకంటే గొప్ప ఏముంటుందని ‘ఇంకేం వరం అక్కర్లేదు’ అన్నాడు. కానీ ధ్రువుడు ఎందుకు తపస్సు చేశాడో విష్ణువుకు తెలుసు కదా! అందుకే ‘నిన్ను నక్షత్ర మండలానికి అధిపతిని చేస్తాను’ అని విష్ణుమూర్తి వరమిచ్చాడు. ఆయన పేరుతోనే ధ్రువనక్షత్ర మండలం ఏర్పడింది. ఆ పదవి పొందాక ధ్రువుడు తిరిగి తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ధ్రువున్ని చూసి ఆ తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. తమ తప్పు తెలుసుకుని సురిచి,ఉత్తముడు క్షమించమని కోరారు. ధ్రువుడు వాళ్లవైపు ప్రేమతో చూస్తూ ‘మీ వల్లనే నేను తపస్సు చేశాను. విష్ణుమూర్తి దయను పొందాను’ అని కృతజ్ఞత చూపించాడు. దీక్ష, పట్టుదల ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ధ్రువుడు.
ఉబ్బసం నుంచి ఉపశమనమిలా!
ట చిన్న పిల్లల్లో కొందరు అప్పటిదాకా బాగానే ఉన్నట్లు కనపడతారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికే పాల ఉబ్బసం అని పేరు. అలాంటి వారికి ఛాతీ మీద, పొట్ట మీద ముందు ఆముదం రాయాలి. ఆ తర్వాత కాగుతున్న పాలల్లో గుడ్డను ముంచి, ఆ గుడ్డను పిండి రొమ్ము పైన పొట్టమీద కాపడం పెడితే ఉబ్బసం తగ్గిపోతుంది. ఇలా పూటకోసారి రెండు, మూడు సార్లు చేయాల్సి ఉంటుంది.
పొంగించిన ఇంగువ, మెత్తని ఉప్పు తీసుకుని కెండు చిటికెల తేనెతో కలిపి ఇస్తుంటే, పిల్లల కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది.
మారేడు పండ్ల గుజ్జు, కరక్కాయ పెచ్చుల చూర్ణం, ఈ రెండూ సమభాగాలుగా తీసుకుని వాటిని నూరి చిన్నచిన్న మాత్రలు చేసి, మంచినీళ్లలో పొద్దున సాయంత్రం ఇస్తూ ఉంటే కడుపు ఉబ్బరంతో పాటు విరేచనాలూ తగ్గుతాయి.
శిశువు పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వయసు వచ్చేవరకు నువ్వుల నూనె ఒంటికి రాసి నలుగు పిండితో స్నానం చేయిస్తుంటే, కండరాలు, ఎముకలు గట్టిపడటంతో పాటు శరీరం కాంతివంతమవుతుంది.
మీ పిల్లలు హాయిగా నిద్రపోతున్నారా?
కచ్చితమైన నిద్రవేళలు అనుసరిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువసేపు పడుకోగలరు. అలా కాకుండా పిల్లలు సరిగా నిద్రపోకపోతే రకరకాల సమస్యలు వాళ్లని చుట్టుముడతాయి. ఇలాంటి పిల్లలకు ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. ఆసక్తి ఉండదు. చదువులో వెనుకబడతారు. బడికి వెళ్లడానికి ఇష్టపడరు. డిప్రషన్‌కు లోనవుతారు. తొందరగా అసహనానికి గురవుతుంటారు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉంటుంది. నిద్రతోపాటు వ్యాయామాలు చేయకపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి లోపించడం వల్ల కూడా పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నిపుణులు చేసిన ఒక అధ్యయనంలో 5-9 సంవత్సరాల పిల్లలు నిబంధనలు బాగా పాటిస్తుంటే, 10-17 సంవత్సరాల మధ్యనున్న పిల్లలు నిబంధనలను పాటించడానికి ఇష్టపడటం లేదు. వారం రోజులూ నిర్దిష్ట వేళల్లో పడుకుంటే ఎక్కువ గంటలు పిల్లలు నిద్ర పోగలరు.
15 సంవత్సరాల వయసున్న పిల్లలు వారాంతాల్లో నిర్దిష్ట టైమ్‌లో పడుకుంటున్నారు గాని మిగతా రోజుల్లో అలా నిద్రపోవడం లేదు. 38.3 శాతం మంది పిల్లలు వారాంతంలో నిద్రవేళలను కచ్చితంగా పాటిస్తున్నారు కానీ వారంలోని మిగతా రోజుల్లో ఈ నిబంధనను అనుసరించడంలేదు. అధ్యయనకారులు 1600 మంది తల్లిదండ్రుల నుంచి సెల్ఫ్- రిపోర్టెడ్ డేటా సేకరించారు. 94 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లల్ని నిద్ర విషయంలో నిర్దిష్టవేళలను పాటించేలా ప్రోత్సహిస్తున్నట్టు చెపితే, 84 శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలకు నిర్దిష్టమైన నిద్రవేళలు కచ్చితంగా పాటించేట్టు చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి పిల్లల నిద్రవేళల విషయంలో తల్లిదండ్రులు ఒక కన్ను వేసి ఉంచాలి. లేకపోతే వాళ్ల బంగారు భవిష్యత దెబ్బతింటుంది.
కళ్లజోడును శుభ్రం చేయాలి ఇలా..
కళ్లద్దాలను శుభ్రం చేసేముందు.. మీ చేతుల్ని డిష్‌వాష్ లిక్విడ్‌తో కానీ, లోషన్ ఫ్రీ సోప్‌తో కానీ కడగాలి. లేకపోతే మీ చేతులకున్న మురికి అద్దాల లెన్స్‌ల మీద పడే అవకాశం ఉంది.
గోరువెచ్చని నీటితో కళ్లజోడును శుభ్రం చేయండి. దీనివల్ల అద్దాల మీద పడిన దుమ్ముధూళి తొలగుతుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోను వేడినీళ్లు వాడొద్దు. అలా చేస్తే కళ్ల అద్దాల్లోని లెన్స్‌ల మీదున్న కోటింగ్ దెబ్బతింటుంది.
అద్దాలపైన నీళ్లు చల్లినప్పుడు రెండు చుక్కల డిష్‌వా్‌షను ఉపయోగిస్తే మంచిది.
లెన్స్‌కు ఇరువైపులా వేళ్లతో మెల్లగా రుద్దాలి. నోస్‌పాడ్స్‌ను శుభ్రం చేయాలి. కొన్నిసార్లు కళ్లజోడు ఒంపుల వద్ద (చెవులవద్ద పెట్టుకునే ఒంపు) మురికితోపాటు క్రిములు పేరుకుని ఉంటాయి. వాటిని పూర్తిగా తొలగించాలంటే గోరువెచ్చని నీళ్లను వాడి డిష్‌వాష్ తో శుభ్రం చేయాలి.
శుభ్రం చేసిన వెంటనే.. కళ్లద్దాలను అటూఇటూ జాడించి.. నీళ్లు ఆరిపోయేలా చేయాలి.
అద్దాల షాపుల్లో దొరికే లింట్‌ఫ్రీక్లాతతోనే తుడవాలి. అప్పుడు మరకలు పడవు.
చాలామంది అద్దాలను టేబుల్ మీద బోర్ల పెడుతుంటారు. అలా చేస్తే గీతలు, మొండి మరకలు పడే అవకాఽశం ఉంది. వీలైనంత వరకు బాక్స్‌లోనే ఉంచుకోవాలి.
సమ్మర్ ప్యారడైజ్
కావలసినవి:
స్ర్టాబెర్రీ - ఐదు, యాపిల్, పైనాపిల్ - ఒక్కొక్కటి చొప్పున, ఐస్‌క్యూబ్స్ - మూడు.
తయారీ:
స్ర్టాబెర్రీ, యాపిల్, పైనాపిల్‌లను చిన్న ముక్కలుగా తరగాలి.
పండ్ల ముక్కలు, ఐస్‌క్యూబ్స్ జ్యూసర్‌లో వేసి గ్రైండ్ చేస్తే సమ్మర్ ప్యారడైజ్ రెడీ. ఇది వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. కొవ్వును కూడా కరిగిస్తుంది. అందుని డైట్ అనుసరిస్తున్న వాళ్లు ఈ జ్యూస్‌ను సిప్ చేసేయండి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565