అతిగా ఆహారం తినడం, జంక్ ఫుడ్, వేపుళ్లు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం, పొగతాగడం, మద్యం సేవించడం... వంటి అనేక రకాల కారణాల వల్ల మన లివర్ చెడిపోతుంటుంది. దీంతో ఆ భాగం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపడంలో విఫలం చెందుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడతాం. అయితే కింద సూచించిన ఆహారం తినడం ద్వారా లివర్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. తద్వారా శరీరంలో ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోవు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
garlic
1. వెల్లుల్లి
రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే చాలు. దాంతో లివర్ సురక్షితంగా ఉంటుంది. లివర్ ఎప్పటికప్పుడు శుభ్రం అవుతుంది. వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.
vitamin-c-fruits
2. నిమ్మ జాతి పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్, కివీ లాంటి విటమిన్ సి ఉన్న పండ్లు తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను క్లీన్ చేస్తాయి. తరచూ ఈ పండ్లను తింటుంటే లివర్ సమస్యలు రావు. రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగినా చాలు. లివర్ క్లీన్ అవుతుంది.
beetroot-carrot
3. బీట్‌రూట్, క్యారెట్
బీట్‌రూట్, క్యారెట్‌లలో ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి.
green-tea
4. గ్రీన్ టీ
క్యాటెకిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రం చేసి లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తాయి. రోజూ గ్రీన్ టీ తాగితే లివర్ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
green-leaf-vegetables
5. ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తాయి. తద్వారా లివర్ పనితనం మెరుగు పడుతుంది.
avocado
6. అవకాడోలు
శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్‌కు గ్లూటాథియోన్ అనబడే సమ్మేళనం అవసరం అవుతుంది. అయితే ఆ సమ్మేళనం ఎక్కువ మోతాదులో కావాలంటే అవకాడోలను తినాలి. దీంతో గ్లూటాథియోన్‌ను లివర్ గ్రహించి తద్వారా శరీరంలో ఉన్న వ్యర్థాలను వెంట వెంటనే బయటకు పంపుతుంది.
apples
7. యాపిల్స్
యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ లివర్‌కు సహాయ పడుతుంది. ఇది లివర్ మెరుగ్గా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. దీంతో వ్యర్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి వెళ్లిపోతాయి.
olive-oil
8. ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల శరీరం ప్రత్యేకమైన లిపిడ్ సమ్మేళనాలను తయార చేసుకుంటుంది. అవి వ్యర్థాలను గ్రహించి బయటకు పంపుతాయి. దీంతో లివర్‌పై భారం తగ్గుతుంది. తద్వారా లివర్ క్లీన్ కూడా అవుతుంది.
millets
9. రాగులు, సజ్జలు, జొన్నలు
రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ఆహార పదార్థాలను తరచూ తినాలి. దీంతో లివర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగిస్తుంది.
walnuts
10. వాల్‌నట్స్
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు సహాయం చేస్తాయి. దీంతో లివర్ శుభ్రం అవడమే కాదు, మరింత మెరుగ్గా వ్యర్థాలను బయటకు పంపుతాయి.
turmeric
11. పసుపు
లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పసుపు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్ వేడి పాలలో 1/4 టీస్పూన్ పసుపు కలుపుకుని తాగినా చాలు. లివర్ శుభ్రం అవుతుంది. విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565