MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీశైలం.._Srisailam-MohanPublications

శివమయం.. మల్లికార్జున స్థావరం..
కైలాసమే నీ నివాసం.. స్వయంభూవై వెలసెనిచ్చట..


అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్యక్షేత్రం.. శ్రీశైలం..
ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ క్షేత్రంగా శ్రీశైల మహాక్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వారిద్దరూ స్వయంభూవులే! శ్రీశైల మహాక్షేత్రాన్ని భూమండలానికి నాభిస్థానంగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం
ఆచరించినా శ్రీశైలాన్ని స్మరిస్తూ-‘శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే’ అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో తెలియజేస్తూ సంకల్పం చెప్పుకుంటారు. అంతటి మహిమాన్వితమైనది ఈ క్షేత్రం!
స్థల పురాణం: ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్యకశిపుడికి సభామందిరంగా ప్రసిద్ధికెక్కింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సతీసమేతుడై మల్లికార్జునస్వామిని సేవించి సహస్ర లింగాల్ని ప్రతిష్ఠించారని పురాణగాథ. ద్వాపర యుగంలో పాండవులు ఈ స్వామిని సేవించారని ఇక్కడ ప్రతిష్ఠించిన
లింగాల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాక శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు, నాలుగు ఉపద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం తూర్పు ద్వారంగా, కడప జిల్లా సిద్ధవట క్షేత్రం దక్షిణ ద్వారంగా, మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపుర క్షేత్రం పశ్చిమ ద్వారంగా, ఇదే జిల్లాలోని
ఉమామహేశ్వర క్షేత్రం ఉత్తర ద్వారంగా స్కాంధపురాణంలో పేర్కొన్నారు. ఈ క్షేత్రానికి పుష్పగిరి క్షేత్రం(ఆగ్నేయ), సోమశిల క్షేత్రం(నైరుతి), సంగమేశ్వర క్షేత్రం(వాయువ్య), ఏలేశ్వర క్షేత్రం(ఈశాన్య) ఉప ద్వారాలుగా ఉన్నాయి.
క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, కదంబులు, తెలుగు చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చాళుక్య చోళులు, కాకతీయులు, కొండవీటిరెడ్డిరాజులు, విజయనగర రాజులు, ఛత్రపతి శివాజీ లాంటి ఎందరో రాజాధిరాజులు,
చక్రవర్తులు, మండలాధీశులు ఈ క్షేత్రాన్ని పాలించి, సేవించి ఆధ్యాత్మిక సేవలో తరించారు. ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శించిన... పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మోక్షప్రాప్తి సిద్ధించి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

శ్రీశైలంలో నిర్వహించే ప్రధాన పూజలు:
ఆర్జిత పూజల వివరాలు - ధర- ప్రవేశం
1. స్వామికి అభిషేకం - రూ.1500(ఉ.6-8) - (దంపతులు-ఒక్కరికి)
2. గర్భాలయంలో అభిషేకం - రూ.1000(ఉ.8,సా.6-8.30) - (దం-ఒ)
3. రుద్ర హోమం - రూ.1200(డిటో) (ఉ7.30-8.30) - (దం-ఒ)
4. లక్ష బిల్వార్చన - రూ.3116- (దం-ఒ) (ఈ సేవ చేసుకోవాలంటే ఆలయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది)
5. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం - రూ.2116 - (దం-ఒ) (ఈ సేవ చేసుకోవాలంటే ఆలయ అధికారులను సంప్రదించాలి)
అమ్మవారి ఆలయంలో సేవలు:
సేవల వివరాలు - ధర - ప్రవేశం
1. కుంకుమార్చన - రూ.350-500(శ్రీచక్రం వద్ద: ఉ.6-మ.1, సా.6-8.30) - (దంపతులు- ఒక్కరికి)
2. కుంకుమార్చన - రూ.150(ప్రాకారంలో.. ఉ.7.15,సా.6-8.30) - (దం-ఒ)
3. గౌరీ వ్రతం - రూ.300(ఉ.7.30) - (దం-ఒ)
4. చండీహోమం - రూ.1200(ఉ.9.30) - (దం-ఒ)
5. నవావరణపూజ - రూ.600(ఉ.6.30) - (దం-ఒ)
6. లక్ష కుంకుమార్చన - రూ.2116(శ్రీ చక్రం వద్ద 6-12.30) - (దం-ఒ)
7. సువర్ణ పుష్పార్చన - రూ.1000 - (దం-ఒ)
8. కల్యాణోత్సవం - రూ.1000(సా.7.15) - (దం-ఒ)
9. సర్వసేవాపథకం - రూ.5000(ఉ.4.30) - (దం-ఒ)
పరివార ఆలయాలు - ఇతర సేవలు
సేవ - ధర - ప్రవేశం
1. వృద్ధమల్లికార్జునుడికి అభిషేకం - రూ.200(ఉ.6-సా.6-8.30) - (దం-ఒ)
2. గణపతి అభిషేకం - రూ.300(ఉ.7) - (దం-ఒ)
3. గణపతి హోమం - రూ.350(ఉ.7-7.30) - (దం-ఒ)
4. మహామృత్యుంజయ హోమం - రూ.508(ఉ.8.30-9.30)
5. నవగ్రహ హోమం - రూ.508(ఉ.9.30-10)
6. చంద్రలింగాభిషేకం - రూ.316(ఉ.6.30,సా.6-8.30)
7. బాలారిష్ఠ నివారణపూజ - రూ.316(ఉ.9.30-10.30)
8. సర్పదోష నివారణపూజ - రూ.316(ఉ.10.30-11.30) - (దం-ఒ)
9. మహామృత్యుంజయాభిషేకం - రూ.1116(ఉ.11.30-1.30)
10. సహస్రలింగాభిషేకం - రూ.250(ఉ.6.30,సా.6-8.30)
11. సూర్యలింగాభిషేకం - రూ.250(ఉ.7)
12. గోపూజ - రూ.120
13. గోదానం - రూ.2516
14. నాగప్రతిష్ఠ - రూ.516
15. రథోత్సవం - రూ.520(సోమవారం రాత్రి 7 గంటలు)
16. వాహనసేవ - రూ.520(రా.7-7.30)
17. పల్లకీసేవ - రూ.210
18. ఏకాంతసేవ - రూ.120(రా.9.30)
ఆర్జిత సేవలు...
మల్లికార్జునస్వామి సర్వదర్శనానికి...
* సుప్రభాతసేవ - రూ.1000(శని, ఆది, సోమ) - ఒక్కరికి మాత్రమే
* సుప్రభాతసేవ - రూ.600(మంగళ,బుధ,గురు,శుక్ర) - ఒక్కరికి
* మహామంగళహారతి - రూ.600(శని,ఆది,సోమ) - ఒక్కరికి
* మహామంగళహారతి - రూ.200(మంగళ,బుధ,గురు,శుక్ర) - ఒక్కరికి
* శని, ఆది, సోమవారాల్లో... ప్రత్యేక దర్శనం రూ.500(ఒక్కరికి)(లింగదర్శనం ఉండదు. 4 లడ్లు ఉచితం) - (ఉ.5,6-8)
* అతిశీఘ్ర దర్శనం - రూ.100(ఒక్కరికి) - (ఉ.6,సా.6-8) - ఉచిత దర్శనమూ ఉంటుంది
* మంగళ, బుధ, గురు శుక్ర వారాల్లో...
ప్రత్యేక దర్శనం - రూ.100 - ఒక్కరికి మాత్రమే
అతిశీఘ్ర దర్శనం - రూ.50 - ఒక్కరికి మాత్రమే
ఉచిత దర్శనం ఉంది.
ఆలయ సమాచారం
భక్తుల రద్దీని బట్టి ఆలయ వేళలు కొనసాగుతాయి. శని, ఆది, సోమవారాల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరచి మంగళ వాయిద్యాలు, 4 గంటలకు సుప్రభాతసేవ, 5 గంటలకు మహామంగళ హారతి సేవ నిర్వహిస్తారు
మంగళ, బుధ, గురు శుక్రవారాల్లో ఉదయం 4.30 గంటలకు ఆలయాన్ని తెరచి 5 గంటలకు సుప్రభాతసేవ, 6 గంటలకు మహామంగళ హారతి సేవలు జరుగుతాయి. శ్రావణ, కార్తీక మాసాలతో పాటు ఇతర పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెల్లవారు జామున 1 గంట నుంచి
ఆలయాన్ని తెరచి దర్శనాలు, ఆర్జిత సేవలు కొనసాగిస్తారు.
ఉపాలయాలు...
* సాక్షి గణపతి - (ఉ.6-రా.9) - దర్శనం ఉచితం
* హఠకేశ్వరాలయం - (ఉ.6-రా9) - దర్శనం ఉచితం
* శిఖరేశ్వరాలయం - (ఉ.6-రా.9) - దర్శనం ఉచితం
ప్రయాణ సౌకర్యాలు..
శ్రీశైలం వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి విస్తృతమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీ శైలం సుమారు 213 కి.మీ.ల దూరంలో ఉంది. కారులో అయితే.. 4,5 గంటల్లోనే శ్రీశైలం చేరుకోవచ్చు. దట్టమైన అడవి.. అప్పుడప్పుడూ పలకరించే వివిధ వన్యప్రాణులతో.. ప్రకృతి అందాల మధ్య
ప్రయాణం బాగుంటుంది.
అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతోంది. ప్రైవేటు బస్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ వరకూ విమానంలో వచ్చి అక్కడి నుంచి లేదా బెంగళూరు నుంచి లేదా.. తిరుపతి నుంచి వచ్చేందుకు మంచి ప్రయాణ సౌకర్యాలు
ఉన్నాయి.
మరిన్ని వివరాలకు..
* శ్రీశైల దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్‌.నం: 08524-288885లో సంప్రదించొచ్చు.
* దేవస్థానం వసతి కార్యాలయం: 08524-288888, 287351
* పరిపాలనా భవనం: 08524-288881
* ఆలయ కార్యాలయం: 08524-288887
* ఫ్యాక్స్‌: 08524-287126

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list