MohanPublications Print Books Online store clik Here Devullu.com

అచ్యుతా అష్టకం-Atchuthastakam









అచ్యుతాష్టకం

భజనలు, హారతులు, సంకీర్తనలు మొదలైన వాటిలో తప్పని సరిగా ఉండే పంక్తుల్లో ఈ అచ్యుతాష్టకం లోని మొదటి శ్లోకము ఒకటి. ఆ శ్రీ కృష్ణుని దివ్యంగా స్తుతించే ఈ అష్టకంలో విష్ణును రామ, కృష్ణ అవతారములను, కృష్ణుని ఇష్ట సఖులను, సతులను, సౌందర్యాన్ని, ఆభరణములను, అలంకారాలను, మహిమలను, లీలలను వర్ణించారు, స్తుతించారు ఆది శంకరులు.

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||

మరణములేని వాడు, కేశిని సంహరించిన వాడు, రాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, శ్రీ హరి, లక్ష్మీ దేవిని ధరించిన వాడు, మాధవుడు, గోపికలకు వల్లభుడు, జానకీ పతి అయిన శ్రీరాముని భజిస్తున్నాను.

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||

మరణములేని వాడు, కేశిని సంహరించిన వాడు, సత్యభామకు పతి, లక్ష్మీ దేవిని ధరించిన వాడు, మాధవుడు, రాధచే ఆరాధింప బడిన వాడు, ఇందిరను (లక్ష్మీదేవిని) హృదయమున కలవాడు, సుందరమైన వాడు, దేవకీ తనయుడు, నంద కుమారుడు అయిన శ్రీ కృష్ణుని భజిస్తున్నాను.

విష్ణవే జిష్ణవే శంకినే చక్రిణే
రుక్మిణీ రాగినే జానకీ జానయే |
వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||

అంతటా యున్నవాడు (విష్ణువు), ఎల్లప్పుడూ జయము కలవాడు, శంఖ చక్రములు ధరించిన వాడు, రుక్మిణి మనోహరుడు, జానకి ఆత్మయైన వాడు, గోపికల వల్లభుడై వారిచే కొలువ బడిన వాడు, కంసుని సంహరించిన వాడు, ఉత్తముడు అయిన శ్రీ కృష్ణునికి నమస్కరిస్తున్నాను.

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంద హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||

హే కృష్ణ! గోవింద! రామా! నారాయణ! శ్రీ పతి! వసుదేవుని కుమారునిగా పేరుగాంచిన వాడ! శ్రీ నిధీ! అననతమైన ఆనందానికి ఆలవాలమా! మాధవా! ఎల్లప్పుడూ జయము కలిగే అధోక్షజా! ద్రౌపదీ మాన రక్షకా! నన్ను రక్షించుము.

రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||

రాక్షసులను శిక్షించే వాడు, సీతతో కలిసి శోభిల్లే వాడు, దండకారణ్యమును పునీతము చేసిన వాడు, లక్ష్మణునిచే అనుగమింప బడి, వానరులచే సేవించబడిన వాడు, అగస్త్యునిచే పూజించ బడినవాడు అయిన రాఘవునికి వందనములు.

ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా || 6 ||

ధేనుక మరియు అరిష్టకులను సంహరించిన వాడు, తనను ద్వేషించిన కేశి, కంసులను సంహరించిన వాడు, వేణువును వాయించే వాడు, పూతనను సంహరించిన వాడు, నదిలో క్రీడ అంటే ఇష్టపడే వాడు అయిన శ్రీ కృష్ణునికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.

విద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||

సుందర నయనములు కలవాడు, మెరుపులా వంటి వస్త్రములు ధరించిన వాడు, వర్ష కాలములోని మేఘముల వంటి రూపములో శోభిల్లిన వాడు, వనమాల హృదయ స్థానమున ధరించిన వాడు, ఎర్రని పాదములు కలవాడు అయిన శ్రీ కృష్ణుని భజిస్తున్నాను.

కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||

చిరు గజ్జెలు ధరించిన వాడు, నల్లని మేనితో మెరిసే వాడు, వికసించిన వదనము, మెలికలు తిరిగిన కేశములు కలవాడు, చెవులకు ధరించిన కుండలముల వెలుగుతో ప్రకాశించే బుగ్గలు కలవాడు, బంగారు హారములు, మెరిసే కంకణములు ధరించిన వాడు అయిన శ్రీ కృష్ణుని భజిస్తున్నాను.

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ||

ఫల శృతి:
ప్రేమతో, భక్తితో రచించబడిన ఈ సుందరమైన అష్టకము, అచ్యుతునికి ఎంతో ప్రియమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో పఠించిన వారు వేగముగా శ్రీ హరి సన్నిధిని చేరుదురు

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత
అచ్యుతాష్టకం సంపూర్ణం



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list