MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాలసర్ప దోషం_kalasarpadosam

కాలసర్ప దోషం
కాలసర్ప దోషం సాదారణ మానవులపై ప్రభావం చూపించదు.
       కాలసర్ప దోషం ప్రపంచాన్ని ,దేశాన్ని,రాష్ట్రాన్ని,సంస్ధని,అదికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది.వారు పరిపాలించేచోట సరియైన సమయంలో వర్షాలు పడక పంటలు సరిగా పండక ,ఆర్దికవ్యవస్ధ దెబ్బతిని,కోట్లాటలు,అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు. పరిపాలనాధ్యక్షుకుడికి,పాలనా వ్యవస్ధపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది.
పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు.

గ్రహాలలో రాహుకేతువుల గురించి చరిత్ర పరిశీలిస్తే.. క్షీరసాగర మధన సమయంలో అమృతం తాగబోయిన రాహువు అనే రాక్షసుని శ్రీహరి తన యొక్క సుదర్శనంతో చీల్చివేయడంతో మొండెం క్రింద భాగం, మొండెం పై భాగం రాహు కేతువులు అయిరి.
 
కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు. మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు. అసలు దోష శాంతి ఏమిటి?  రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు. మరి కాలసర్పదోషమే ప్రధాన కారణంగా జరిగే నష్టాలు ఏమిటి అని పరిశీలిస్తే పంచాంగ గణిత ఫలితాంశాలు చెప్పే గ్రంథాలలో ‘్ధ్వజేపురోవర్తిని పృష్ఠ సంనే్థ విధుంతుదే మధ్య గతా గ్రహేంద్రాః/ తారాబిధా నాస్త్విహ కాల సర్వస్సస్యావనీ పాల వినాశహేతు’ గ్రంథాంతరం ‘అగ్రేకేతు రథో రాహుః సర్వే మధ్యగతా గ్రహః యోగోయం కాల సర్పాభ్యో నృపసస్య వినాశకృత్’ ఇలాగ కాలసర్ప దోషం జరిగే కాలంలో రాజులకు (పాలకులకు) అలాగే పంటలకు నాశనం కలుగును అని చెప్పబడినది. అందువలన కాలసర్ప దోషం కాలంలో దేశారిష్టము అనే అంశం సరిఅయినది. అంతే గాని వ్యక్తిగత జాతకాలకు లేదు అనేది స్పష్టముగా తేలిన విషయము.

దేశారిష్ట యోగము వున్నప్పుడు దేశము లోని ప్రజలు అందరూ వారి వారి శక్తిని అనుసరించి తగిన పరిహారములు చేయడం వలన ఆ ప్రాంతమును పరిపాలకులకు సమస్యలు తీరి జనులకు శిఖము కలుగును అని శాస్త్ర వచనము.              -P.S.R.Krishna 9849252017






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list