MohanPublications Print Books Online store clik Here Devullu.com

స్వార్థపరుడు-మార్గదర్శకుడు-Swardaparudu Margadarshudu



కామెర్లవ్యాధికి కట్టడిగా...

కామెర్ల వ్యాధి చికిత్సగా ఈ కింద చూపిన వివిధ చిట్కాల్లో ఏదో ఒకదాన్ని పాటించవచ్చు.
25 మి. లీ. వేపాకు రసాన్ని, 6 గ్రాముల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
15 మి.లీ. నేల ఉసిరి రసంలో 6 గ్రాముల తేనె కలిపి రోజుకు రెండు సార్ల చొప్పున తీసుకోవచ్చు.
కరక్కాయ పలుపు చూర్ణం 3.గ్రా. తీసుకుని కాస్తంత బెల్లంతో రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
శుద్ధమైన నవసాగరం 180 మి. గ్రా., కటుక రోహిణీ చూర్ణం 1. గ్రా. కరక్కాయ పలుపు చూర్ణం 2. గ్రాములు కలిపి, రోజుకు రెండుసార్లు నీటితో కలిపి తీసుకోవాలి.
త్రిఫళాలు, తిప్పతీగె, అడ్డసరం ఆకు, కటుక రోహిణి చూర్ణం, నేలవాము వేపపట్ట, వీటన్నింటినీ సమభాగాలుగా తీసుకుని కషాయం కాచి, 15 నుంచి 30 మి. లీ. 15 గ్రాముల తేనెతో కలిపి రోజుకు రెండుసార్ల చొప్పున 15 నుంచి 30 రోజులు వాడితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది.
అయితే రోగిలో మగత లేదా అపస్మారక స్థితి వస్తే, వెంటనే ఆసుపత్రికి చేర్చాలి.
తినదగినవి: పాతబియ్యం అన్నం, పెసరకట్టు, చెరుకు రసం, మజ్జిగతో పాటు దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి పళ్ల రసాలు తరుచూ తీసుకోవచ్చు.
తినకూడనివి: ఉలవలు, బెల్లం, వంకాయ, నువ్వులు, మినుములు, ఆవాలు, పెరుగు, తాంబూలం, వెల్లుల్లి, దొండకాయ, కారం, ఉప్పు, పులుపు పదార్థాలు ఇవేవీ తీసుకోకూడదు.


పిత్తాశయంలో రాళ్లు మళ్లీ వస్తాయా?

నాలుగేళ్ల క్రితం పిత్తాశయంలో రాళ్లు తయారైనప్పుడు కొన్ని మందులు వాడటంతో అవి కరిగిపోయాయి. మొన్నీ మధ్య ఒకసారి పరీక్ష చేయించుకుంటే రాళ్లు మళ్లీ ఏర్పడినట్లు స్థానిక డాక్టర్‌ చెప్పారు. ఇలా మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడ టానికి గల కారణమేమిటి? ఒక సారి రాళ్లు కరిగిపోతే సమస్య శాశ్వతంగా తొలగిపోయినట్లు కాదా? మరోసారి రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి.
- పి. సుమలత, కరీంనగర్‌
మౌలికంగా, శరీరంలో జరిగే పైత్య రసం ఉత్పత్తిలో ఎక్కువ, తక్కువలు జరిగినప్పుడు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు పిత్తాశయంలో గానీ, పిత్తాశయాన్నీ, డియోడినమ్‌తో కలిపే పైత్యనాళంలోగానీ ఏర్పడవచ్చు. ఈ రాళ్లు కొలెసా్ట్రల్‌తో గానీ, పైత్యరసంలో అధికంగా ఉండే పిగ్మెంట్‌ మిశ్రమాలతో కూడా తయారవుతుంటాయి. సాధారణంగా, కాలేయం, పిత్త్తాశయంలోకి కొలెసా్ట్రల్‌ను అధికంగా విడుదల చేసినప్పుడు (స్థూలకాయుల్లో )లేదా కొలెసా్ట్రల్‌ను సొల్యూషన్‌ రూపంలో ఉండే డిటర్జెంట్‌ పదార్థాలను కాలేయం సరిపడా ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడుతుంటాయి.
ముఖ్యంగా, శరీరంలో కొలెసా్ట్రల్‌ అవసరానికి మించి తయారైనప్పుడు అవి పలుకులు పలుకులుగా ఏర్పడి, రాళ్లల్లా తయారవుతాయి. ఒక్కోసారి పిత్తాశయంలోని బ్యాక్టీరియా కూడా ఈ రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. ఎక్కువగా ఉపవాసం ఉండేవారిలో కూడా పిత్తాశయంలో పిత్తరసం నిలువ ఉండిపోయి ఆ తర్వాత అవి రాళ్లుగా మారతాయి. స్థూలకాయుల్లో, అధిక సంతానం కన్న స్త్రీలలో ఈ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. దీర్ఘకాలికంగా గర్భనిరోధక మాత్రలు వేసుకునే వారిలో కూడా రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా ఉండడానికి, సమస్యా కారకాలకు అతీతంగా ఉండడం, నీళ్లు రోజుకు నాలుగైదు లీటర్లకు తగ్గకుండా చూసుకోవడం, స్థూలకాయం ఉంటే తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు తక్కువ ఉండే ఆహారపానీయాలు తీసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను మళ్లీ రాకుండా నియంత్రించుకునే అవకాశాలు ఉంటాయి.
- డాక్టర్‌ పి. కుమార స్వామి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌



కొత్తరకం నూడుల్స్‌!

పేపర్‌తో రకరకాల ఆకృతులను తయారుచేసే కళ ఒరిగామి స్ఫూర్తిగా రకరకాల ఆకారాల్లోకి మారే కొత్తరకం నూడుల్స్‌ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, పేపర్‌ స్థానంలో ఇక్కడ పాస్తా షీట్‌ను ఉపయోగించి ఈ నూడుల్స్‌ను తయారుచేస్తారు. త్రీడీ ప్రింటింగ్‌లో ఈ షీట్‌ను ఉపయోగించి నూడుల్స్‌ను ప్రింట్‌ చేస్తారు. ఇలా ప్రింట్‌ చేసిన వాటిని వేడి నీటిలో, పాలతో కలిపి తినేయవచ్చు. ఒకసారి నీరు తగలగానే ఈ నూడుల్స్‌ తన ఆకారాన్ని మార్చుకుంటాయి. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర గడిపే సమయం ఆహ్లాదకరంగా ఉండటానికి ఈ నూడుల్స్‌ బాగా దోహదపడతాయి.


పిల్లలు పక్క తడుపుతున్నారా?

మూత్రాశయం మీద నియంత్రణ సాధించలేని పిల్లలు పక్క తడపటం సహజం. సాధారణంగా ఆరేళ్లలోపు పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. కొందరికి ఈ అలవాటు యుక్త వయసు వరకూ కొనసాగుతుంది. ఇందుకు తీవ్రమైన శారీరక, మానసిక అనారోగ్యాలేవీ కారణం కావు. పిల్లలు పక్క తడుపుతున్నారంటే వారికా అలవాటు పెద్దల నుంచి సంక్రమించిందని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరికీ వారి బాల్యంలో ఆ అలవాటుంటే పిల్లలకు కచ్చితంగా ఆ అలవాటు సంక్రమిస్తుంది. అయితే ఈ అలవాటు పెరిగేకొద్దీ వయసుతోపాటు మటుమాయమవుతుంది.
కానీ ఇలోగా ఈ అలవాటు వల్ల పిల్లలు ఆత్మ న్యూనతకు గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు పెద్దలు వారికి మానసిక భరోసా కల్పించాలి. పెద్దయ్యేకొద్దీ తగ్గిపోతుందని నచ్చ చెప్పాలి. ప్రతి రాత్రీ నిద్రకు ముందు పిల్లలని బాత్రూమ్‌కి వెళ్లే అలవాటు చేయాలి. పక్క తడిపే అలవాటు అసహజంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించటమే ఉత్తమం. పిల్లల్లో ఈ తేడాలు గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
పగటి వేళ కూడా మూత్రం విసర్జనతో దుస్తులు తడిపేసుకుంటున్నా..
మూత్ర విసర్జనతోపాటు మంట, నొప్పి ఉందని చెప్తున్నా
పాదాలు, కాలి గిలకలు వాస్తున్నా
ఏడేళ్లు దాటినా పక్క తడుపుతున్నా
ఆరు నెలలపాటు మానేసి హఠాత్తుగా పక్క తడిపినా
ఈ అలవాటుతోపాటు గురక పెడుతున్నా
అవసరానికి మించిన ఆకలి, దప్పిక ఉన్నా
రక్తపోటును నియంత్రించే అరటి పండు
రక్తపోటును అదుపులో ఉంచుకోవటం కోసం ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అనుసరించటం, జీవన శైలి మార్పులు, మందులు, వ్యాయామం... ఇలా ఎన్నో ప్రయతాలు చేస్తూ ఉంటాం. అయితే తీసుకునే ఆహారం కూడా రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఆహారంలో ‘అరటి పండు’ ఒకటి. రక్తపోటు ఉన్నవాళ్లకి వైద్యులు అరటి పండు తినమని సూచిస్తూ ఉంటారు. కానీ నిజానికి అరటి పండుకు అంత శక్తి ఉందా? అనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే అరటిపండు మన శరీరం మీద చూపించే ప్రఽభావం గురించి తెలుసుకునే ముందు మూత్రపిండాల పనితీరు గురించి తెలుసుకోవాలి.
మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడపోస్తూ అదనంగా ఉన్న ద్రవాల్ని విసర్జించేలా చేస్తూ శరీరంలో నీటిశాతాన్ని సమంగా ఉంచుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్‌ అంతా మన రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ ఉండిపోతే రక్తపోటు పెరిగిపోతుంది, తక్కువ ఉంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే! ఇలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చుతగ్గులకు గురికాకుండా కిడ్నీలు.. సోడియం, పొటాషియం అనే రసాయనాల మధ్య సమ తూకాన్ని పాటిస్తాయి. పొటాషియం ఎక్కువగా నీటిని కిడ్నీల్లోకి చేరవేస్తే, సోడియం నీటిని కిడ్నీల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది.
మనం ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోయి రక్తపోటు పెరిగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అలా నిల్వ ఉన్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. ఒక అరటి పండులో 422మి.గ్రా పొటాషియం ఉంటుంది. మనకు ఒక రోజుకి అవసరమైన 4,700 మి.గ్రా. ఇది పది శాతానికి సమానం. కాబట్టి రక్తపోటు ఉన్నవారు రోజుకో అరటిపండు తినటం మేలని వైద్యులు అంటున్నారు.
స్వార్థపరుడు-మార్గదర్శకుడు

ఇద్దరు స్నేహితులు ఎడారిలో ప్రయాణిస్తూ దారి తప్పిపోయారు. రోజులు గడుస్తున్నా వారికి గమ్యం తెలియ లేదు. వెంట తెచ్చుకున్న అన్నపానీయాలు అయిపోయాయి. ఆకలితో అలమటిస్తూ ఎడారిలో దొరికిన దుంపలు తింటూ ప్రయాణం సాగించారు. ఒకానొక రోజున దారిలో వారికి చాలా ఎత్తయిన రాతిగోడ కనిపించింది. ఆ గోడ వెనుక నుంచి జలపాతం శబ్దం, పక్షుల కిలకిలారావాలు వినిపించాయి. ఇద్దరూ సంతోషించారు. మళ్లీ బతుకు మీద ఆశలు చిగురించాయి వారికి. ఇద్దరు స్నేహితుల్లో ఒకడు ముందుగా గోడ ఎక్కుతానన్నాడు. రెండో వ్యక్తి అతనికి సహాయం చేశాడు. గోడ ఎక్కి చూడగా.. సుందరమైన జలపాతం, పక్షులు, చిన్న చిన్న జంతువులు, రక
రకాల పళ్ల చెట్లు కనిపించాయి.
గోడ కింద ఉన్న స్నేహితుడి గురించి ఆలోచించకుండా స్వార్థంతో అటువైపు దూకేశాడు మొదటి వ్యక్తి. గోడకు ఇటువైపు ఉన్న స్నేహితుడు ఆవేదనతో కుంగిపోయాడు. కాసేపయ్యాక తేరుకుని గోడ ఎక్కడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, గోడ ఎక్కలేకపోయాడు. తన స్నేహితుడి ప్రాణాలైనా నిలబడ్డాయనుకుని అక్కడ్నుంచి వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లాడు. ఎడారిలో తమలా దారి తప్పిపోయిన బాటసారులకు.. ఈ జలపాతం సంగతి తెలియజేయాలనుకున్నాడు. ముళ్ల చెట్లు, బండలు, రాళ్లు.. అన్నింటినీ సేకరించాడు. జలపాతానికి వెళ్లే దారిని సూచిస్తూ వాటిని క్రమపద్ధతిలో ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతంలో ఎవరైనా బాటసారులు కనిపిస్తే.. జలపాతానికి దారి చెబుతూ ఉండేవాడు. ఇతని మాటలు విని జలపాతానికి వెళ్లిన బాటసారులు తిరుగు ప్రయాణంలో.. కుండల్లో నీళ్లు, తినడానికి పళ్లు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. వాటిని జాగ్రత్తగా దాచుకుని.. అవసరానికి కాస్త భుజిస్తూ.. ఎడారిలో అందరికీ దారి చూపుతూ మార్గదర్శకుడిగా నిలిచాడు.
స్పైసీ స్వీట్‌ కార్న్‌ చాట్‌

తయారీకి కావలసినవి
స్వీట్‌ కార్న్‌- 250 గ్రాములు
నిమ్మరసం- అర స్పూన్
కారం - ఒక చిన్న స్పూన్
టొమాటోలు- 3
పచ్చిమిరపకాయలు- 3
తురిమిన కొబ్బరి- 3 టేబుల్‌ స్పూన్లు
తరగిన దోసకాయ- 1
ఉల్లిపాయ -1 (చిన్నముక్కలుగా తరగాలి)
బెంగుళూరు మిర్చి- 1
చాట్‌మసాలా- ఒక టేబుల్‌ స్పూన్
చక్కెర- చిటికెడు
ఉప్పు- రుచికి తగినంత
సేవ్‌, బూందీ- ఇవి రెండూ పావు కప్పు తీసుకోవాలి
తయారీ
ఒక పాత్రలో మొక్కజొన్నలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన దోసకాయ ముక్కలు, బెంగుళూరు మిర్చి, టొమాటా ముక్కలు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత అందులోకి తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. రుచికి తగినంత కారం వేసి, పచ్చిమిరపకాయ ముక్కలు, చాట్‌ మసాలా, పంచదార, నిమ్మరసం వేసి కలపాలి. వీలైతే కాస్త కొత్తిమీర వేసుకోవాలి.
తినేముందు వీటిలో సేవ్‌, బూందీలను వేసుకొని తినాలి.


‘అందాల’ పూలవాన

టాన్‌ సమస్య చాలామంది ఎదుర్కొంటుంటారు. దీనికి ఫ్లోరల్‌ ఫేస్‌ మాస్కులు బాగా పనిచేస్తాయి. మల్లెపూలు, మందారాలు, గులాబీలు, బంతి, తామర వంటి పూలతో ఫేస్‌ ప్యాకులు చేసుకుని ముఖానికి రాసుకుంటే టాన్‌ సమస్య పోతుంది. ఈ మాస్కులను ఇంటిపట్టునే తయారుచేసుకోవచ్చు. ఇవి సహజసిద్ధమైనవి కాబట్టి చర్మంపై ఎలాంటి దుష్పరిణామాలూ చూపవు.
పొద్దుతిరుగుడు పువ్వు ఫేస్‌ ఫ్యాక్‌
ఇందులో విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన, మృదువైన చర్మానికి విటమిన్‌-ఇ ఎంతో అవసరం కూడా. టొమాటోల్లోని లైకోపెనె చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వును మెత్తగా నూరి అందులో టొమాటో గుజ్జు, పచ్చిపాలను కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచి ఆ తర్వాత చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మందారం ఫేస్‌ ప్యాక్‌
ఈ ఫేస్‌ప్యాక్‌తో చర్మం ఎంతో మృదువుగా తయారవు తుంది. మొటిమలు, యాక్నెలాంటివి పోతాయి. కప్పు చల్లటి నీళ్లల్లో కొన్ని మందార పువ్వులు వేసి రాత్రంతా నాననివ్వాలి. మర్నాడు ఉదయం పూలను నీళ్లలోంచి తీసి మెత్తగా నూరాలి. మందార పువ్వులను నానబెట్టిన నీళ్లని ఒడగట్టి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా చేసిన మందార పూలల్లో మూడు టీస్పూన్ల ఓట్స్‌, రెండు చుక్కల టీట్రీ ఆయిల్‌ వేసి మందారం నీళ్లని ఇందులో కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని 15-20 నిమిషాలపాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
గులాబిపూల ఫేస్‌ ప్యాక్‌
గులాబిపూల ఫేస్‌ప్యాక్‌ అన్ని రకాల స్కిన్‌టైప్స్‌ మీదా బాగా పనిచేస్తుంది. టానింగ్‌ను పోగొడుతుంది. ఈ ప్యాక్‌ ముఖానికి రాసుకుంటే మంటగాని, దురదగాని ఉండదు. శాండల్‌వుడ్‌ పౌడర్‌లో గులాబిపూల గుజ్జు, కొబ్బరినీళ్లు పోసి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్‌ చే యాలి.

నిండైన ఆరోగ్యం మన చేతుల్లో!

నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలని అందరం కోరుకుంటాం. కానీ అందుకు తగిన జీవనశైలిని మాత్రం అలక్ష్యం చేస్తాం. అనారోగ్యాలు దరి చేరకుండా నాణ్యమైన ఆరోకరమైన జీవనం సాగించాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను ఆచరణలో పెట్టాలి. అవేంటంటే...
ప్రాథమిక ఆహారం: మానవాళి మనుగడ మొదలు ఎవరి భౌగోళిక స్థితి
గతులను బట్టి వారికి అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆహారం తినటం ఆనవాయితీగా వచ్చింది. అయితే మారుతున్న కాలంతోపాటు ప్రపంచీకరణ ఫలితంగా మన ఆహారపుటలవాట్లూ మారుతున్నాయి. కానీ వీటన్నిటినీ వదిలి తిరిగి మన పూర్వీకుల ఆహారపుటలవాట్లను అలవరుచుకోగలిగితే ఆహారం వల్ల ఆరోగ్యం పాడయ్యే దుస్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం కూరగాయలు, నట్స్‌, చేపలు, మాంసం.. వీటికి ప్రిజర్వేటివ్స్‌, ఫ్లేవరింగ్‌ ఏజంట్లు కలపకుండా వండుకుని తినాలి. సీజనల్‌ ఫ్రూట్స్‌ తినాలి.
నీరు పుష్కలంగా!: మన శరీరంలో మూడొంతుల స్థానాన్ని ఆక్రమించే నీరు ద్రావణం, ద్రావకం, పోషకాల వాహకం...ఇలా ఎన్నో రకాల విధులు నిర్వర్తిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచటంతోపాటు మలినాలను విసర్జింపజేస్తుంది. ఎనర్జీ లెవెల్స్‌, మానసిక అప్రమత్తతలను మెరుగ్గా ఉంచుతుంది. కాబట్టి మూత్రం నీరులా ఉండేందుకు సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
ఆలోచించి తినాలి: వేగవంతమైన జీవనశైలి వల్ల ఆహారం తీసుకునేటప్పుడు కూడా అదే వేగాన్ని అనుసరించటం సరికాదు. ఇలాంటి అలవాటు వల్ల అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకుంటాం. రుచిని గ్రహించలేకపోవటం తిన్నామనే తృప్తినీ మిగుల్చుకోలేం. దాంతో తక్కువ సమయంలో మళ్లీ తినాలనే కోరిక కలుగుతుంది. ఇది స్థూలకాయానికి, తద్వారా పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. కాబట్టి తినే ఆహారం మీద మనసు పెట్టాలి. ఆహారాన్ని బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినాలి.
తగినంత నిద్ర: మరుసటి రోజుకి సరిపడా శారీరక, మానసిక శక్తి సమకూరాలంటే కంటి నిండా నిద్ర పోవాలి. కాబట్టి పెందలాడే పడుకుని ఉదయాన్నే లేచే అలావాటు అలవరుచుకోవాలి. కంప్యూటర్‌, సెల్‌ ఫోన్‌, టీవీల సమయాన్ని రాత్రి 10 గంటలవరకే కుదించుకుని పడక చేరాలి. నిద్రలేమికి గురి కాకుండా రోజూ ఒకే సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి సన్నగిల్లి అనారోగ్యం దరి చేరుతుంది. కాబట్టి ఎంతో అరుదుగా తప్ప నిద్ర వేళల్ని మార్చుకోకూడదు.
నడక మంచిదే!: బ్రిస్క్‌ వాక్‌ వల్ల శరీరం, మెదడు రెండూ చేతనంగా తయారవుతాయి. తీవ్ర అనారోగ్యాలు, ఆందోళన, ఒత్తిడిలు తొలగి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 40 నిమిషాల నడక అవసరం. నడక వల్ల ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. దాంతో ఊపిరితిత్తులకు, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అంది అవి మెరుగ్గా పని చేస్తాయి. చమటతో ఒంట్లోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. ఆహారంతో శరీరంలోకి చేరే అదనపు కొవ్వు కరుగుతుంది.




మెడ మెరిపిద్దాం!
ముఖం తెల్లగా ఉన్నా... మెడా, గొంతు నల్లగా కనిపిస్తుంది కొందరికి. ఇలాంటివారు ఏవో ఒక క్రీంలు రాయడం కన్నా.. ఈ చిట్కాలు పాటించి చూడండి. చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది. 
పావుకప్పు కీరదోస గుజ్జు తీసుకుని మెడ చుట్టూ రాసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తరవాత గులాబీనీరు చల్లుకుని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే నలుపు తగ్గి.. మెడ దగ్గరి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. 
* బంగాళాదుంపను చక్రాల్లా కోసి మెడ మీద రుద్దుకుని కాసేపయ్యాక కడిగేయాలి. రెండురోజులకోసారి ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది. 
* గులాబీనీరూ, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కలపాలి. రాత్రిళ్లు పడుకునే ముందు దీన్ని మెడకు రాసుకుని మర్నాడు కడిగేయాలి. నెలరోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. 
* బాదంనూనె కూడా నలుపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్నానం చేసేందుకు అరగంట ముందు బాదంనూనెను గోరువెచ్చగా చేసి మెడ, గొంతుకు రాసుకోవాలి. రెండోరోజులకోసారి ఇలా చేయడం వల్ల నలుపు తగ్గడమే కాదు, చర్మం కూడా మృదువుగా మారుతుంది. 
* చర్మాన్ని తాజాగా ఉంచి, నలుపును తగ్గించడంలో చందనం కూడా కీలకంగా పనిచేస్తుంది. రెండు చెంచాల చందనంపొడిలో గులాబీనీరు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని మెడ చుట్టూ రాసి బాగా ఆరాక కడిగేయాలి. వారానికోసారి ఈ పూత వేసుకుంటే మార్పు కనిపిస్తుంది.

ఒక నగ చాలు
పొడవుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే కొంతమంది అమ్మాయిలు సగటు ఎత్తుకంటే మరికాస్త పొడవుగా కనిపిస్తారు. ఇలాంటివారు ఫ్యాషన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
* చాలామంది పొడవుగా ఉన్నాం కాబట్టి ఎత్తు చెప్పులు వేసుకుంటే మరికాస్త పొడవుగా కనిపిస్తాం అన్న ఉద్దేశంతో మరీ నేలకు కరుచుకుపోయేలా ఉండి ఏమాత్రం అందం చందం లేని ఫ్లిప్‌ఫ్లాప్స్‌ని వేసుకుంటారు. దానివల్ల నడక ఏమాత్రం బాగుండదు. కానీ ఓ పని చేయొచ్చు. ఎత్తులేని అందమైన కట్‌షూస్‌ కానీ కాన్వాస్‌ షూస్‌ని కానీ ప్రయత్నించవచ్చు. 
* పొడవుగా ఉండే వారికి వదులుగా ఉండే బ్యాగీ దుస్తులు ఏమాత్రం బాగుండవు. అలాని బిగుతుగా ఒంటికి కరుచుకుపోయేవి అసలే వద్దు. సరిగ్గా సరిపోయే దుస్తులే వేసుకోవాలి. 
* ఎక్కువ నగలు వేసుకోకూడదు. అలాని చేతికో, మెడకో అంటి పెట్టుకునేవీ బాగుండవు. పొడవుగా ఉండే ఒకే ఒక గొలుసు... లేదా పొడవాటి బ్యాగు అంటే పెద్ద సైజు రకాలని ఎంచుకోవాలి. ధరించిన నగలూ, షూస్‌ ఒకే రంగులో ఉన్నా కూడా మరీ ఎత్తుగా కనిపించరు. 
* జీన్స్‌ వేసుకుంటే అడుగున మడతపెట్టి ఉంటే కఫ్‌ తరహావి ప్రయత్నిస్తే మరీ పొడవుగా కనిపించరు.

రోజువారీ ఖర్చులకో పుస్తకం!
వచ్చే జీతంలో కొంత డబ్బు దాచుకోవాలని మనసులో ఉన్నా.. సాధ్యం కావడంలేదని కొందరు బాధపడితే, ఎంతోకొంత దాచేసి సంతృప్తి పడుతుంటారు మరి కొందరు. కానీ ఆదా అనేది ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరగాలి. వీలైనంత ఎక్కువగా పొదుపు చేసేలా చూసుకోవాలి. అదెలాగో చూడండి మరి. 
* ఐదారేళ్ల తరవాత మీరెంత డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారనేది రాసుకోండి. ఆ డబ్బును ఎన్ని విడతలుగా దాచాలనేది మీకో స్పష్టత తెచ్చుకుంటే మీకో అవగాహన వస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. 
* రోజువారీ ఖర్చుల వివరాలను కూడా ఓ పుస్తకం పెట్టుకుని రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెల గడిచాక దాన్నోసారి చూసుకుంటే.. వృథా ఖర్చులన్నీ తెలుస్తాయి. తరవాతి నెలలో దుబారా చేయకుండా ఉంటారు. అలా పెట్టాలనుకున్న ఖర్చు డబ్బును కూడా ఓ చోట దాచడం మొదలు పెట్టి చూడండి. ఎత్తు మడమల చెప్పులు లేదా మంచి డ్రెస్‌ కొనాలనుకున్నారు. వెంటనే చలో షాపింగ్‌ అనేయకండి. ఆ డబ్బును ఓ చోట దాచండి. బాగా అవసరం అనుకున్నప్పుడే కొనండి. లేదా ఆ డబ్బు పొదుపు చేసిన వారవుతారు. 
* స్నేహితులతో షాపింగ్‌ చేయడం, కలిసి హోటళ్లకు వెళ్లడం ఆనందంగా అనిపిస్తుంది. కానీ దానివల్ల తెలియకుండానే మీ డబ్బు ఖర్చవుతుంది. అందుకే ఓ పని చేయండి. అలా పార్టీలకు వెళ్లే సందర్భాలను పరిమితం చేసుకోండి. కుదిరితే బయట హోటళ్లలో కాకుండా ఇంట్లోనే సరదాగా గడపాలనే నియమాన్ని పెట్టుకుంటే.. ఎంతో డబ్బు పొదుపు అవుతుంది.

మెట్లే ఎక్కండి!
ఎక్కడికయినా వెళ్తే.. మెట్ల మార్గం ఎంచుకోవడం కన్నా.. లిఫ్ట్‌ గురించి ఆలోచిస్తాం. సులువుగా అనుకున్న చోటికి వెళ్లిపోవాలనుకుంటాం. కానీ కుదిరినప్పుడల్లా మెట్లెక్కేందుకు ప్రయత్నించండి. దానివల్ల లాభాలున్నాయ్‌ మరి. 
* మెట్లెక్కడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందట. రెండువేల మంది యువతులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోజులో కాసేపయినా మెట్లెక్కే వారిలో గుండెకు మేలు జరుగుతుందని తేలింది. 
* కెలొరీలు కూడా కాస్త ఎక్కువగానే కరుగుతాయి.దాంతో బరువును అదుపులో ఉంచుకోవడం సులువవుతుంది. కావాలనుకుంటే దీన్ని నడక, తాడాటతోనూ కలిపి చేసినా మంచిదే అంటారు నిపుణులు. 
* మెట్లెక్కడం వల్ల ఎముకలూ, కండరాలకూ మంచిది. అయితే నెమ్మదిగా కాకుండా.. కాస్త వేగంగా ఎక్కేలా చూసుకోవడం మంచిది. 
* రోజులో కనీసం పది నిమిషాలు మెట్లెక్కినా కూడా లాభం ఉంటుంది. మోకాళ్లకు కూడా మంచి వ్యాయామం అందించినవారవుతారు.

అమ్మకు డి!
కాబోయే అమ్మ కడుపులోని బిడ్డ బాగుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. మంచి పోషకాహారం, వ్యాయామం వంటివి అందులో కొన్ని. అయితే బిడ్డ పుట్టాక కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే డి విటమిన్‌ని తగినంతగా తీసుకోవాలని అంటున్నాయి తాజా అధ్యయనాలు. లండన్‌కు చెందిన కింగ్స్‌ కాలేజీ అధ్యయనం ప్రకారం గర్భిణిగా ఉండగా విటమిన్‌ డి మాత్రని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బిడ్డలో వ్యాధినిరోధక శక్తి లోపం రాకుండా ఉంటుందట. ముఖ్యంగా బాల్యంలో ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయనీ ఈ అధ్యయనాలు తెలిపాయి. మూడోనెల నుంచీ మొదలుపెట్టి డి3 విటమిన్‌ని క్రమంగా తప్పకుండా రోజువారీ అవసరాలకు సరిపడేంతగా తీసుకోవాలని చెబుతున్నారు అధ్యయనకర్తలు.

ఈ రుచులు వెరీ గుడ్డూ 
గుడ్డు ఎలా తీసుకున్నా బలవర్థకమే. చిన్నారుల నుంచీ పెద్దల వరకూ ఇష్టపడే గుడ్డుతో ఈసారి కాస్త భిన్నమైన రుచుల్ని ప్రయత్నిద్దామా..
పాన్‌ కేక్‌
కావల్సినవి: మెత్తగా వండిన అన్నం - కప్పు, గుడ్లు - మూడు, చక్కెర - అర చెంచా, ఉప్పు - తగినంత, నూనె - పావుకప్పు. 
తయారీ: ముందు గుడ్ల సొన ఓ గిన్నెలో తీసుకుని బాగా గిలకొట్టాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. పొయ్యిపై పెనం పెట్టి అది వేడయ్యాక కొంచెం నూనె రాసి ఈ మిశ్రమాన్ని చిన్న దోశలా వేయాలి. రెండువైపులా కాలాక తీసేయాలి. ఇలాగే మిగిలిన పిండీ చేసుకుంటే చాలు.
పనియారం
కావల్సినవి: ఇడ్లీ లేదా దోశ పిండి - రెండు కప్పులు, నూనె - అరకప్పు, ఆవాలు - అర చెంచా, మినప్పప్పు - చెంచా, అల్లం తరుగు - అరచెంచా, పచ్చిమిర్చి - ఒకటి, ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - రెండు పెద్దచెంచాలు, మిరియాలపొడి - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత, గుడ్లు - మూడు. 
తయారీ: గుడ్లసొన మిక్సీలో తీసుకుని నురగ వచ్చేలా చేసుకోవాలి. అందులో దోశ లేదా ఇడ్లీ పిండి వేసి కలపాలి. తరవాత అల్లం తరుగూ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలూ, కొత్తిమీర తరుగూ, మిరియాలపొడీ, తగినంత ఉప్పూ వేసి కలపాలి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు వేయాలి. అవి వేగాక ఈ తాలింపును గుడ్డు మిశ్రమంలో వేసి కలపాలి. గుంట పొంగనాల పెనంలో ఈ పిండిని కొద్దికొద్దిగా వేసి పొయ్యిమీద పెట్టాలి. అన్నింట్లో నూనె వేసి ఎర్రగా కాల్చి తీసుకుంటే చాలు.
సలాడ్‌
కావల్సినవి: గుడ్లు - నాలుగు (ఉడికించినవి), ఉడికించిన బంగాళాదుంపలు - రెండు, క్యారెట్‌ - ఒకటి (తురమాలి), ఆకుపచ్చ క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున, మిరియాల పొడి - చెంచా, చాట్‌మసాలా - అరచెంచా, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా. 
తయారీ: గుడ్లను నాలుగు ముక్కల్లా చేసుకోవాలి. ఓ గిన్నెలో కూరగాయ ముక్కలన్నింటినీ తీసుకుని బాగా కలపాలి. అందులో కోడిగుడ్డు ముక్కలతోపాటూ చాట్‌మసాలా, మిరియాలపొడీ, తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగు వేసి కలిపితే చాలు. సలాడ్‌ సిద్ధమైనట్లే.
కట్‌లెట్‌
కావల్సినవి: గుడ్లు - రెండు, (బాగా ఉడికించి ముక్కలుగా కోసుకోవాలి), పెద్ద బంగాళాదుంపలు - రెండు (ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చిదమాలి), ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి - ఒకటి(మెత్తగా చేసుకోవాలి), కరివేపాకు - ఒక రెబ్బ, పసుపు - అర చెంచా, కారం - ముప్పావు చెంచా, ధనియాల పొడి - చెంచా, గరంమసాలా - అర చెంచా, కొత్తిమీర తరుగు - పావుకప్పు, గుడ్డు - ఒకటి(ఉప్పు కలిపి గిలకొట్టుకోవాలి), బ్రెడ్‌పొడి - ముప్పావు కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా. 
తయారీ: బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, పచ్చిమిర్చి ముద్దా, కరివేపాకు తరుగూ, కాస్త ఉప్పూ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపూ, కారం, ధనియాలపొడీ, గరంమసాలా వేయాలి. అందులో చిదిమిన బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి. చేతికి నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ముద్ద తీసుకుని కాస్త వెడల్పుగా చేసి దీంట్లో గుడ్డు ముక్కను పెట్టి మూసేయాలి. ఇలా మిగిలినవీ చేసుకోవాలి. గిలకొట్టిన గుడ్డు సొనలో దీన్ని ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి. ఇలా చేసుకున్న వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి వేడి వేడిగా తింటే బాగుంటాయి.
జున్ను
కావల్సినవి: గుడ్లు- రెండు, వెన్నతీయని పాలు- ఒకటిన్నర కప్పు, వెన్నలేని పాలు - కప్పు, చక్కెర - అరకప్పు, మిరియాల పొడి- చెంచా, యాలకుల పొడి- అరచెంచా, కరిగించిన చాక్లెట్‌- పావుకప్పు. 
తయారీ: గుడ్ల సొనని ఓ గిన్నెలోకి తీసుకుని బాగా గిలకొట్టాలి. ఆ మిశ్రమంలోకి చక్కెరా, వెన్నతీయని పాలూ, వెన్నలేని పాలూ పోసి కలపాలి. దీన్ని ఓ గిన్నెలో తీసుకోవాలి. అయితే ఈ గిన్నె కుక్కర్‌లోకి పట్టేట్టుగా ఉండాలి. ఇప్పుడా గిన్నెని కుక్కర్‌లో పెట్టి పైన మిరియాలపొడీ, యాలకుపొడీ చల్లి మూతపెట్టి కూత లేకుండా అరగంట ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక చాకు పెట్టి తీసి చూడండి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక ఇవతలకు తీయాలి. దీనిపై కరిగించిన చాక్లెట్‌ రాస్తే సరిపోతుంది.

దేవుడికి సమర్పించినదే... నైవేద్యం
ఆత్మీయం
పండగరోజుల్లోనో, పూజలు చేసేటప్పుడో దేవుడికి నైవేద్యం పెట్టడం అలవాటు. నైవేద్యం పెట్టేటప్పుడు ఏ మంత్రాలు చదవాలో, ఏం చేయాలో తెలియకపోయినా... ఒక ఆకులో లేదా పళ్లెంలో వండిన పదార్థాలన్నింటినీ ఉంచి, దేవుడికి చూపించిన తర్వాతే భోజనం చేస్తారు. నైవేద్యం ఎందుకంటారు? మనం ఆహారం తినేటప్పుడు ‘ఇది నేను సంపాదించినది లేదా మా నాన్న సంపాదించినది లేదా నా భర్త సంపాదించినది’ అనే భావం తొంగి చూస్తుంటుంది. అదే ఆహారాన్ని భగవంతునికి సమర్పించడం వల్ల అహంకారం స్థానంలో వినమ్రత కలుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది.
‘నేను ఈ రోజున అన్నం తింటున్నానంటే, అది నీ కృప వల్లే తప్ప నా గొప్పతనం కాదు’ అనే సమర్పణ భావన, కృతజ్ఞతాభావం ఉంటాయి. భగవంతునికి సమర్పించిన దానిని వృథా చేయరాదన్న ఆలోచన కలుగుతుంది. మనం పుస్తకంలో లేదా పేపర్‌లో అక్షరాలు చదువుతాం... ఆ అక్షరాలు అక్షరాలుగా పేపర్‌లో లేదా పుస్తకంలో ఉంటాయి కానీ, అవి జ్ఞానంగా, జ్ఞాపకంగా మారి మన మెదడులో ప్రవేశిస్తాయి... అదేవిధంగా దేవుడు మనం పెట్టిన నైవేద్యాన్ని సూక్ష్మస్థితితో స్వీకరిస్తాడు... కానీ పదార్థాలు పదార్థాలుగా అలాగే ఉండిపోతాయన్నమాట. దానినే మనం పవిత్రమైన ప్రసాదంగా స్వీకరిస్తాం.


పనసతో ప్రయోజనాలెన్నో...
గుడ్‌ఫుడ్‌
పనస ఒక పవర్‌హౌజ్‌ లాంటిది. శక్తిని వెలువరించడంలో దానికి అదే సాటి. కొలెస్ట్రాల్‌ ఏమీ లేకుండా అత్యంత శక్తిని ఇచ్చే ఫ్రక్టోజ్‌ వల్ల ఈ శక్తి సమకూరుతుంది. పనస వల్ల ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని...
►పనస పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కావడం వల్ల అనేక రకాల క్యాన్సర్లకు స్వాభావిక నివారణిగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది.
►పనసలో మరెన్నో పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్‌), ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నాయి. కణంలో దెబ్బతిన్న డీఎన్‌ఏలను సైతం చక్కదిద్దగల సామర్థ్యం వాటికి ఉంది.
►పనసలో విటమిన్‌–ఏ పాళ్లు ఎక్కువ. అందుకే అది కంటికి మేలు చేస్తుంది. అదీగాక క్యాటరాక్ట్, మాక్యులార్‌ డీ–జనరేషన్, రేచీకటి వంటి అనేక కంటివ్యాధులను నివారిస్తుంది.
►థైరాయిడ్‌ గ్రంథికి వచ్చే జబ్బులను నివారించడంతో పాటు థైరాయిడ్‌ జీవక్రియలకు అవసరమైన కాపర్‌ను సమకూరుస్తుంది.
టాగ్లు: Cholesterol, Fruit fruit, కొలెస్ట్రాల్‌, పనస పండు


బ్యూటిప్స్‌
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ తలకు పట్టించినట్లయితే జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. అప్పుడప్పుడే తెల్లబడుతుంటే క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఈ రెండింటినీ కలుపుకోవడం సాధ్యం కానప్పుడు వంద గ్రాముల కొబ్బరి నూనెలో 50 మి.లీ నిమ్మరసం కలిపి మరిగించి నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని నిమ్మరసంలోని నీటిశాతం ఆవిరయ్యే దాకా వేడి చేయాలి. వేడయ్యేటప్పుడు చిటపట శబ్దం రావడం తగ్గిందంటే నీటిశాతం లేదని అర్థం.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list