ఏ వంట వండాలబ్బా?
యూట్యూబ్‌లోనో, మ్యాగజైన్‌లోనో ఏదైనా వంటకం చూసి తయారుచేయాలనుకుంటే అందులో వాడే ఏదో ఒక పదార్థం మన దగ్గర లేక ఆగిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ సారి https://thecookbookapp.com ‘కుక్‌బుక్’ యాప్ ప్రయత్నించి చూడండి. మీ దగ్గర ఏయే పదార్థాలున్నాయో అందులో నమోదు చేస్తే వాటితో ఏ వంటకం చేయొచ్చో చెబుతుందా యాప్. కనీసం మూడు పదార్థాలున్నా కూడా వివిధ రకాల వంటలూ, వాటి తయారీ విధానాన్ని కూడా చూపిస్తుంది. దీంట్లో ఉన్న మరో అదనపు సౌకర్యం ‘రెసిపీ స్కానింగ్’. ఏదైనా పుస్తకంలో వంటకం చూసినప్పుడు దాన్ని ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే అందులో ఉన్న పదార్థాలూ, తయారీ విధానం వివరిస్తుంది. దాన్ని ఒక మెసేజీ రూపంలోకి మారుస్తుంది. అంతేకాక... మనం ఎంత మందికి వంట చేయాలనుకుంటున్నామో చెప్తే దానికి తగ్గట్లుగానే కావల్సిన పదార్థాల కొలతలు కూడా దీనిద్వారా తెలుసుకోవచ్చు.
https://thecookbookapp.com
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565