MohanPublications Print Books Online store clik Here Devullu.com

అంతర్జాతీయ మహిళా దినోత్సవం_International Womens Day


అంతర్జాతీయ మహిళా దినోత్సవం International Womens Day Women Rights Womens Day BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Womens Day Celebrations


అంతర్జాతీయ మహిళా దినోత్సవం




మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమలగురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో, ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించినవిధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.

ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు.

చరిత్ర

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3; న్యూయార్క్లో ఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 [4][5] రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.[6][7] 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు[8] తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి.[6] వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు.[6] మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు..[3] అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.[6]



ఆస్ట్రియా లోని Builders Labourers Federation, మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది ).

1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు.[5] అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.[5][9] 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.[9][10]

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8).[3] ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు మరియు శాంతి' డిమాండుగా వ్యవహరించారు.[5] లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".[9]

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.[11] 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.[12]

అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.[13]

1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.[5]
భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది[14]. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు మరియు మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది[15].
యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపు

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవమునకు ఐక్యరాజ్య సమితి అధికారిక నేపధ్యములు
సంవత్సరం యుఎన్ థీమ్[16]
1996 గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
1997 మహిళలు మరియు శాంతి టేబుల్
1998 మహిళలు మరియు మానవ హక్కులు
1999 మహిళలపై హింసలేని ప్రపంచం
2000 శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
2001 మహిళలు మరియు శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
2002 నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు మరియు అవకాశాలు
2003 లింగ సమానత్వం మరియు లింగ సమానత్వం మరియు సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
2004 మహిళలు మరియు హెచ్.ఐ.వి / ఎయిడ్స్
2005 తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
2006 నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
2007 మహిళలు మరియు బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
2008 మహిళలు మరియు అమ్మాయిలు ఇన్వెస్టింగ్
2009 మహిళలు మరియు పురుషులు యునైటెడ్ మహిళలు మరియు అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా
2010 సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్
2011 మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్
2012 గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం మరియు ఆకలి నిర్మూలన
2013 ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం
2014 మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవం


2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.యస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ!

సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.[17] 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .[18] యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి 2011 ని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు.[17] రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు మరియు బాలికల సాధికారత", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.[19] ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు.[20] పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.

ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.commemorative coin.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు మరియు మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".
2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ “గ్రామీణ మహిళా స్వశక్తీకరణ –ఆకలి పేద రిక నిర్మూలన”ని థీమ్ గా ఎంచుకుంది. 2012 మహిళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్.సి. వారు, సైనిక దళాల్లో చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఐ.సి.ఆర్.సి. వారు, తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యులకి తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణినించారు. 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ మీద వేయబడిన గూగుల్ డూడుల్
2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

“ప్రమాణం చేసాక వెనుతిరగడం లేదు: మహిళలపై హింస నిర్మూలించడం కోసం పని చేద్దాం” అని 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ని యునిటేడ్ నేషన్స్ వారు ఏర్పరచుకున్నారు. " 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఐ.సి.ఆర్.సి. వారు (అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ) జైలులో మగ్గుతున్న మహిళల సమస్యల మిద ఉద్గాటించార.
2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

యునైటెడ్ నేషన్స్ "మహిళా సమానత్వమే అందరికీ హితం" అనే థీమ్ ని 2014 మహిళా దినోత్సవానికి ఎంచుకుంది.
2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవంరష్యన్ విప్లవానికి 2017 నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది. 1917 మార్చి 8 లో రష్యన్ మహిళలు బ్రెడ్డు కొరత గురించి సెయింట్ పీటర్స్బెర్గ్ వీధులలో నినదించారు. ఈ సంఘటనలు రెండవ సార్ నిచోలాస్ అభ్యంతరం వలన మార్చి 15న ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2017 మార్చి 8 నాటికి ఇవన్ని పుంజుకోవాలని యోచిస్తున్నారు. వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఫెమెన్ ముఖ్యమైనది. వారి ముఖ్య ఉద్దేశం మహిళల్ని ఉత్తేజితుల్క్ని చేయడం; సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం; ఒక విప్లవం లోకి తీసుకు రావడం.ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ మిద ఒక స్ట్రైక్ జరపాలని ప్రపంచంలో పలు యూనియన్లు నిర్ణయించాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list