ఒక రాశి... ఒక శ్లోకం..!
ఒక్క ఆధ్యాత్మిక అంశాల్లోనే కాదు వ్యాపార అభివృద్ధికైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా అందుకు తగిన శ్లోకాన్ని పఠించాలనుకుంటాం. దాని గురించి చర్చిస్తాం. ఆదిశంకరాచార్యుల నుంచి స్వామీ వివేకానంద వరకూ శ్లోకాల గొప్పతనాన్ని వేనోళ్ల చాటినవారే. అయితే ఎన్నో వేల శ్లోకాల్లో జాతకరీత్యా ఈ ఏడాది ఏ రాశివారు ఏ శ్లోకాన్ని జపించాలో క్లుప్తంగా...
జ్యోతిష సంప్రదాయంలోనూ హిందువుల దైనందిన ఆచారవ్యవహారాల్లోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మానవుల స్థితిగతులు, భవిష్యత్తు తదితర వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుందనే విశ్వాసమే ఇందుకు కారణం. అందుకే నిత్య జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇల్లు... ఇలా ఏ విషయంలోనైనా సమస్యలు ఎదురైనప్పుడూ లేదా జాతకరీత్యా ఆటంకాలు ఏర్పడతాయన్న సందేహం వచ్చినప్పుడూ ఆయా గ్రహాల అనుగ్రహం పొందడానికి సంబంధిత శ్లోకాలను పఠిస్తారు. జపాలూ, హోమాలూ మొదలైన క్రతువులను నిర్వహిస్తారు. అయితే ఈ విళంబినామ సంవత్సరంలో పన్నెండు రాశులవారు ఏ గ్రహానికి సంబంధించిన జపం చేయాలో, తద్వారా ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
ఈ అయిదు రాశులకూ...
వృషభం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారికి ఈ సంవత్సరం శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ రాశుల వారు శని శ్లోకాన్ని పఠిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశివారు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, మనసు నిలకడగా ఉంటుంది. కన్యా రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి, కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారికి ఏలినాటి శని ప్రభావం తగ్గడంతోపాటు సంపద వృద్ధి చెంది, ఆటంకాలు తొలగుతాయి.
శ్లోకం: నీలాంజన సమాభాసం ।
రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం ।
తం నమామి శనైశ్చరం ।।

శక్తి కారకం...
మేష, మిథున, కర్కాటక, మీన రాశులవారు ఈ ఏడాది అంతా కుజ ధ్యానం చేయాలి. మేష రాశివారికి ఆర్థిక సమస్యలు, అపార్థాలకు తావులేకుండా ఉండేందుకు ఈ శ్లోకాన్ని పఠించాలి. మిథున రాశివారు ఈ శ్లోకాన్ని జపించడం వల్ల దాంపత్య విషయాల్లో గొడవలు సర్దుకోవడంతోపాటు సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. కర్కాటక రాశివారికి అదృష్టాన్నీ ధనాన్నీ పెంపొందించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. కలహ నివృత్తికీ, అదృష్టప్రాప్తికీ కుజ శ్లోకం ఉపకరిస్తుంది.
శ్లోకం: ధరణీగర్భ సంభూతం ।
విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం ।
తం మంగళం ప్రణమామ్యహం ।।
రాహు శ్లోకం...
సింహరాశిలో పుట్టిన వారు లేదా నామ నక్షత్రం ప్రకారం సింహరాశిలో ఉన్న వారూ ఈ సంవత్సరం మొత్తం రాహువుని ధ్యానిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆకస్మికంగా ఎదురయ్యే ఇబ్బందులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ పొందడంతోపాటు మనశ్శాంతిగా కాలం గడవడానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది.
శ్లోకం: అర్ధకాయం మహావీరం ।
చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం ।
తం రాహుం ప్రణమామ్యహం ।।
గురు కృప కోసం

తులా రాశివారికి జన్మ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే లభిస్తాయి. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాల్లోని బృహస్పతి శ్లోకాన్ని పఠిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వృద్ధి, మనోబలం చేకూరడంతోపాటు ఎంచుకున్న రంగంలో ఉన్నతిని సాధించడానికి ఈ శ్లోకం కొంత తోడ్పడుతుంది.
శ్లోకం: దేవానాంచ రుషీనాంచ ।
గురుంకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం ।
తం నమామి బృహస్పతిం ।।
ఆరోగ్యం కోసం...
జాతక రీత్యా కుంభ రాశివారికి ఈ ఏడాది తిరుగులేని కాలం. ఆయురారోగ్యం, ఐశ్వర్యం సిద్ధించడానికి ఈ ఏడాది రవి శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది.
శ్లోకం: జపాకుసుమ సంకాశం ।
కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం ।
ప్రణతోస్మి దివాకరమ్ ।।

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565