ఏ ఏడాదిలో ఏముంది..?
కొత్త చిగుళ్లూ కోయిల పాటలూ షడ్రుచులతో స్వాగతం చెప్పే తెలుగువారి నూతన సంవత్సరం ఈ ఏడాది ‘విళంబి’ నామ సంవత్సరంగా మన ముందుకొచ్చేసింది. ఇంతకీ తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎందుకొచ్చాయో... వాటి అర్థమేంటో తెలుసా...
మనకు అరవై పేర్లతో అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అయితే, ఈ పేర్లు రావడానికి వెనుక ఓ కథ ఉంది. ఓసారి నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి అరవైమంది పుత్రులు జన్మిస్తారు. కానీ ఓ యుద్ధంలో ఆ కొడుకులందరూ మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి విష్ణువుని ప్రార్థించగా ‘నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు. అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని వరమిస్తాడు నారాయణుడు. అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. వీటిలో ఒక్కో పేరుకీ ఒక్కో ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. ఈ ఏడాది విళంబి నామసంవత్సరాన్నే తీసుకుంటే... విళంబి... అంటే దేనికీ లోటు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటారని అర్థం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565