MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

జగదానందకారక సాంగ్ | శ్రీ రామ రాజ్యం తెలుగు సినిమా సాంగ్స్ | బాలకృష్ణ | ఇళయరాజా granthanidhi mohan publications bhaktipustakalu

జగదానందకారక సాంగ్ |
 శ్రీ రామ రాజ్యం తెలుగు సినిమా సాంగ్స్ | 
బాలకృష్ణ | ఇళయరాజారామ కథను వినరయ్యో..!

రామ కథ వింటే ఎంత మధురమూ.. ఎన్నిసార్లు విన్నా.. ఎన్నిసార్లు చదివినా.. తనివి తీరదు..ఈ కథను ఒక్కో పండితుడు ఒక్కోలా రాశారు..వాల్మీకి రామాయణం.. తులసీదాస్ రామచరితామానస్.. ఇలా ఎందరో కవులు.. రామకథను విశేషంగా వర్ణించారు.. ఎవరు ఎలా రాసినా.. కొన్ని సన్నివేశాలు ఒకేలా రాయబడ్డాయి.. దాంతో అవి మాత్రమే అందరికీ సుపరిచితంగా వెలుగులోకి వచ్చాయి.. అయితే కథలో కొన్ని తెలియని సంగతులు కూడా ఉన్నాయండోయ్.. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ విషయాలేంటో తెలుసుకోండి.. 
-సౌమ్య పలుస

వీణ.. రావణ..రావణుడికి పరిచయం అక్కర్లేదు. అసురుడు.. క్రూరుడు.. రాక్షస గణానికి చక్రవర్తి రావణుడు. పది తలల కారణంగా అతనిని చూసి భయపడేవాళ్లు. రాక్షసులకు.. దేవుళ్లు శత్రువులంటారు. కానీ రావణుడు పరమ శివభక్తుడు. వేదపారంగతుడు. పైగా రావణుడు వీణ వాయిద్యకారుడు. దీన్నే ఆయన పతాకంపై గుర్తుగా ఉంచుకున్నాడు. 


లక్ష్మణుడు.. గుడకేష్..పద్నాలుగేళ్ల వనవాసంలో సీతారాములకు తోడుగా వెళ్లాడు లక్ష్మణుడు. ఈ మొత్తం కాలంలో నిద్ర పోకుండా ఉన్నాడు. అందుకే అతనికి గుడకేష్ అని పేరు వచ్చింది. అయితే అన్నావదినలను సరిగా చూసుకోవడానికి తనకు నిద్ర అవసరం లేదని, తాను నిద్రపోకుండా వరమిమ్మని దేవతను కోరాడు. అప్పుడు అతనికి బదులుగా ఎవరైనా నిద్రపోతే తనకు నిద్ర అనేదే లేకుండా వరమిస్తానని దేవదేవి చెప్పిందట. అలా లక్ష్మణుడి భార్య ఊర్మిళ 14యేండ్ల కాలం మొత్తం నిద్రావస్థలోనే ఉంది. లక్ష్మణుడు ఇలా 14యేండ్లు నిద్రపోకపోవడానికి కూడా ఒక కారణం ఉందట. రావణుడి కుమారుడైన మేఘనాథుడు మరణించాలంటే.. ఎవరైనా 14యేండ్లు నిద్రపోకుండా ఉన్నవారి చేతిలోనే హతమయ్యే వరాన్ని కోరాడు. అలా లక్ష్మణుడి చేతిలో మేఘనాథుడి మరణం సంభవించింది.


అటవీ ప్రాంతంలో..పద్నాలుగేండ్ల పాటు వనవాసం చేశారని తెలుసు. కానీ వాళ్లు తిరిగిన అటవీ ప్రాంతంలో సంచరించారని విన్నారు. ఇంతకీ ఆ ప్రాంతం పేరు.. దండకారణ్యం. ఇది దాదాపు 35, 600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదట. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ అడవి విస్తరించింది. ఈ అటవీ ప్రాంతం మొత్తం రాక్షసుల నిలయంగా మారింది. దండక అంటే శిక్ష.. అరణ్య అంటే అటవీ ప్రాంతం. అందుకే రాక్షసులను శిక్షించడానికే ఈ అరణ్యాన్ని ఎంచుకున్నాడట శ్రీరాముడు. 


విభీషణుడి సహాయంతో..రామరావణ యుద్ధానికి విభీషణుడి కారణంగానే తొందరగా ఒక ముగింపుకొచ్చింది. అప్పటిదాకా సీత చనిపోయిందనే భ్రమలో ఉండేలా చేస్తాడు రావణుడు. కానీ విభీషణుడు రావణ మాయ గురించి అర్థమయ్యేలా చెబుతాడు. అలాగే రావణుడిని ఎలా సంహరించాలో కూడా తెలుపుతాడు. అయితే విభీషణుడు రాముడి దగ్గరకు రావడానికి ఒక కారణం ఉంది. సీతను ఎత్తుకొచ్చాక రాముడు జాడ వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు రావణుడు మంత్రులను సమావేశ పరిచి ఏం చేయాలో అడుగుతాడు. దానికి విభీషణుడు సీతను వదిలిపెట్టి.. రాముడితో వైరం వద్దంటాడు. దాంతో కోపగించుకున్న రావణుడు విభీషణుడిని రాజ్యబహిష్కారం చేస్తాడు. అలా బయటకు వచ్చిన విభీషణుడు రాముడిని కలిసి రావణున్ని సంహరించేలా చేస్తాడు. 

సీతా స్వయంవరం..సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచిన వాళ్లకే సీతనిచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు జనకుడు. ఈ ధనుస్సుకు ఎన్నో శక్తులు ఉంటాయి. అలాంటి ధనుస్సును అవలీలగా పక్కకు జరుపుతుంది జానకి. ఆమె శక్తియుక్తులకు సమ ఉజ్జీనే భర్తగా రావాలనుకుంటాడు జనకుడు. అందుకే ఆ విల్లు ఎక్కుపెట్టిన వారికే సీతనిచ్చి వివాహం చేస్తానంటాడు. అలా ఎందరో రాజులు ఆ ధనుస్సును ఎత్తలేక చతికిలబడుతారు. రాముడు ఆ ధనుస్సును విరిచి సీతను చేపడుతాడు. అయితే శివుడు మంచి విలుకాడు. ఆయన ధనుస్సు పేరు పీనాక. ఆ ధనుస్సునే జనుకుడు పొందుతాడు. 


ఇంద్రుడి అసూయ..రావణుడి తమ్ముడు కుంభకర్ణుడి గురించి మనకు తెలుసు. ఆరునెలలు నిద్రావస్థలో ఉండి ఒకరోజు నిద్ర లేస్తాడు. ఆ రోజు కావాల్సినంత భుజించి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు. కుంభకర్ణుడిది మంచి వ్యక్తిత్వం. అయితే అతడు యజ్ఞయాగాదులు చేసి బ్రహ్మను వరం కోరాలనుకుంటాడు. అయితే ఆ సమయంలో ఇంద్రుడు అసూయతో సరస్వతీ దేవిని ప్రార్థిస్తాడు. కుంభకర్ణుడి పలుకును మార్చేలా చూడమంటాడు. ఆమె తథాస్తు అంటుంది. అలా ఇంద్రాసన అని పలికే బదులు నిద్రాసన అని వరమడుగుతాడు కుంభకర్ణుడు. ఆ వరం కారణం చేతే నిద్రావస్థలో ఉండిపోయాడు కుంభకర్ణుడు. 


లక్ష్మణ రేఖ లేదు..రామాయణాన్ని మలుపు తిప్పే ఘట్టం.. సీత గీత దాటడం. మారీచుడు జింక రూపంలో వస్తాడు. అది చూసి ఇష్టపడుతుంది సీత. ఆమె కోరిక మేరకు దాన్ని తీసుకురావడానికి వెళతాడు రాముడు. కానీ కాసేపటికి రాముని గొంతుతో మారీచుడు.. సీత.. లక్ష్మణ అంటూ పిలుస్తాడు. రాముడు ఆపదలో ఉన్నాడేమోనని భావించిన సీత వెంటనే లక్ష్మణుడిని వెళ్లమంటుంది. కానీ సీతను ఒంటరిగా వదిలి వెళ్లనని చెబుతాడు లక్ష్మణుడు. దాంతో ఆగ్రహిస్తుంది సీత. అయితే లక్ష్మణుడు గుడిసె చుట్టూ గీత గీసి ఆ గీత దాటవద్దని చెబుతాడు. ఎవరైనా ఆ గీత దాటి లోపలికి వస్తే మసి అయిపోతారని చెబుతాడు. అయితే వాల్మీకి రామాయణంలో, రామ్‌చరితామానస్‌లో ఈ ఘట్టమే లేదట. 


మోక్షం కోసం..రావణుడికి చనిపోతానని ముందే తెలుసు. ఎంతకంటే.. తను ఎంతో క్రూరత్వంగా, రాక్షసత్వంతో ప్రవర్తించాడు. ఎంతోమందిని హింసించాడు. కాబట్టి ఈ పాపాల నుంచి మోక్షం పొందాలంటే దేవుడి చేతిలో మరణించాలని భావించాడు. రాముడు మనిషి కాదు.. దేవుడని నమ్మాడు కాబట్టి ఎవరు ఏమి చెప్పినా రావణుడు పట్టించుకోలేదు. కచ్చితంగా రాముడి చేతిలో మరణిస్తాడని తెలిసి యుద్ధానికి పూనుకున్నాడు. అలా చనిపోయి విష్ణుపథాన్ని చేరుకోవాలనుకున్నాడు. 


సరయూ నదీలో..రాముడు భువి విడిచి దివికి వెళ్లడానికి తనకు తాను జలసమాధి చేసుకున్నాడు. అది ఎక్కడో తెలుసా? సరయూ నదిలో. సీత తన తల్లి అయిన భూదేవి గర్భంలోకి తిరిగి వెళ్లిపోయింది. మళ్లీ ఎలాంటి పరీక్షలను ఎదుర్కోవాలో అని భావించి భూదేవిని తన దగ్గరకు తీసుకెళ్లమని కోరింది. కొడుకైన కుశుడు తల్లిని కాపాడాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ సీతాదేవి ఉండలేదు. ఎంతో ప్రేమమూర్తి అయిన సీతాదేవిని వదులుకున్నందుకు బాధపడుతూ రాముడు సరయూ నదీలో జలసమాధి అయ్యాడు. 


రామసేతు నిర్మాణం..లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. దానికోసం రావణుడు వానర సైన్యాన్ని సహాయం కోరాడు. ఆ వానర సైన్యం లంకకు వారధి కట్టింది. దానిపేరే రామసేతు. నిజంగానే సముద్ర గర్భంలో ఈ రామసేతు ఉందని నాసా కూడా ఈ మధ్యే ఒప్పుకొన్నది. దీన్ని నాసా వాళ్లు ఆడమ్స్ బ్రిడ్జ్‌గా పేర్కొన్నాడు. దాదాపు 1, 750, 000 సంవత్సరాల క్రితం రామ కథ జరిగింని పురాణాలు చెబుతున్నాయి. ఇంచుమించు రామసేతు నిర్మాణం కూడా అప్పుడే జరిగి ఉండొచ్చని నాసా అంచనా. ఈ లెక్కన చూస్తే రామకథ నిజంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. 30కి.మీల మేర ఈ నిర్మాణం బ్రిడ్జి ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం