ఆన్‌లైన్‌లో ఆదాచేయండిలా..
ఇంటర్నెట్‌డెస్క్: ఇప్పటికీ మనం ఇంటి అవసరాల కోసం దగ్గరల్లో ఉన్న షాపునకు కావాల్సిన వస్తువులు వెళ్లి తెచ్చుకుంటాం. మన కళ్లతో చూసి, పట్టుకొని నాణ్యంగా ఉందా పరిశీలించుకొంటే అదో సంతృప్తి. అయితే బిజీ వాతావరణం, స్మార్ట్‌గా పనిచేసుకోవాలనుకోవడం, ఆన్‌లైన్‌లో ఆకట్టుకొనే ఆఫర్లు డిజిటల్ కొనుగోళ్ల వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. షాపింగ్ వెబ్‌సైట్లు, బ్యాంకులు, వ్యాలెట్‌లు వినియోగదారుల పనిని సులభతరం చేస్తున్నాయి. కొన్ని చిట్కాలు పాటించడం ఆన్‌లైన్‌లో షాపింగ్‌లో కూడా ఖర్చులు అదుపులో ఉంచుకొనే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.
ధరల పోలిక: మొదట మనం కొనాలనుకుంటున్న వస్తువు ధర షాపింగ్ సైట్లలో ఎలా ఉందో పరిశీలించుకోవాలి. మనకు ఎంత ధర కావాలో దానికి అనుగుణంగా ప్రైస్ అలర్ట్‌లు పెట్టుకోవాలి. దాంతో కావాల్సిన ధరలో కొనాలనుకున్న వస్తువు లభిస్తుంది అనుకున్న తరవాతే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. వాటితో పాటు ఒక్కోవస్తువు ధర ఎంతుందో పోల్చి చెప్పే వెబ్‌సైట్లు చాలానే అందుబాటులో ఉన్నాయి.
వస్తువు సమీక్ష: కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువు ధర ఆకట్టుకొనేలా ఉండొచ్చు. అయితే ఒకసారి ఆ ఉత్పత్తికి సంబంధించిన సమీక్షను పరిశీలించుకోవడం ఉత్తమం. అన్నిసార్లు షాపింగ్ సైట్లలో ఉండే రివ్యూలనే నమ్మడానికి లేదు. కొన్ని వైబ్‌సైట్లు ప్రొడక్ట్ రివ్యూను కూడా ప్రచురిస్తాయి. వాటితో పాటు బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసుంటే వారి అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆ వస్తువు తొలిసారి తయారు చేసినప్పుడు ఏ ఫీచర్లు ఉన్నాయి.. ఆ తర్వా వాటిలో ఏమైనా మార్పలు చేశారా? అనేది పరిశీలించుకోవాలి. దాన్ని బట్టి ధరల్లో మార్పులుంటాయి.
ట్రాక్ ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్స్: ఆఫర్లు గురించి సరిగా తెలుసుకోకపోతే ఎక్కువ ధరలు వెచ్చించే అవకాశం ఉంటుంది. వీటిని అదుపులో ఉంచడానికి ఖర్చులను వెల్లడించే యాప్‌ను వినియోగిస్తే ఇంకా మంచిది. వీటిని పరిశీలించడం వల్ల ఒక వస్తువును ఏ సమయంలో కొంటే సరైన ధరకు వస్తుందో తెలుసుకొనే అవకాశం ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ధరల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చు.
క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్: రోజువారి కొనుగోళ్ల కోసం లేదా ప్రత్యేక రోజుల్లో కొనుగోళ్ల కోసం ప్రతి షాపింగ్ వెబ్‌సైట్ క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ల కోసం బ్యాంకులతో అనుసంధానం అవుతుంది. దీనికింద కొనుగోళ్ల చేపట్టేముందు వెబ్‌సైట్‌లో ఉన్న నియమనిబంధనలు ఒకసారి పరిశీలించాలి. ఒకవేళ క్యాష్ బ్యాక్ ఉన్నట్లయితే ఎన్నిరోజుల్లో అది మన ఖాతాలో జమ అవుతుందో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ వస్తువుకు సంబంధించి చాలా ఆఫర్లు ఉన్నాయని తెలిస్తే అందులో ఏది లాభసాటిగా ఉంటుందో పరిశీలించుకొని కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.
కార్డులపై రాయితీ, వ్యాలెట్ ఆఫర్లు : పండగ, ప్రత్యేకమైన రోజుల్లో వివిధ రకాల బ్యాంకు కార్డులు, మొబైల్ వ్యాలెట్లకు సంబంధించిన ఆఫర్ల గురించి ఈ-మెయిళ్లు, మెసెజ్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి. వీటిలో క్యాష్ బ్యాక్, ప్రొడక్ట్ డిస్కౌంట్లు గురించి వివరాలతో పాటు కొన్ని సైట్లలో కొంటే వచ్చే పాయింట్ల గురించి వివరాలు ఉంటాయి. అనువైన వాటిని గుర్తించడానికి ఫిల్టర్లు, లేబుళ్లను ఉపయోగించుకోవాలి.
చెక్ ఫర్ ఫ్రీ డెలివరీ: ఒక వస్తువును ఆన్‌లైన్ కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతతోపాటు డెలివరీ వ్యవస్థ ఎలా ఉందో కూడా పరిశీలించుకోవాలి. కొన్ని సంస్థలు ఉచితంగా కూడా డెలివరీ చేస్తుంటాయి. ముందుగా చెల్లించిన దాన్ని బట్టి కూడా డెలివరీ చేసే సంస్థలు ఉంటాయి. వ్యాపారంలో నెలకొన్న పోటీతత్వం కారణంగా సంస్థలు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వాటిని పరిశీలించుకోవడంతో పాటు రవాణాలో ఆ సంస్థకున్న రేటింగ్‌ను కూడా పరిశీలించుకోవాలి.
సోషల్ నెట్‌వర్కింగ్: అన్ని సైట్లకు ట్విటర్, ఫేస్‌బుక్ పేజ్‌లు ఉంటాయి. వాటిలో ప్రొడక్ట్ కు సంబంధించి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవచ్చు. చాలామంది తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు తక్కువ ధరలకు అదే ప్రొడక్ట్ ఎక్కడ లభిస్తుందో కూడా వివరిస్తారు.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565