1967- 68 ప్రాంతములలో పరమాచార్యుల వారు ఆంధ్రదేశమున విజయ యాత్ర చేశారు.
ఆ సందర్భమున ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక భక్తుని యింట ౩ రోజులుండి భిక్ష చేసి అనుగ్రహించారు.
ఆ తరువాత వారి కుమార్తె వివాహ విషయికముగా తలెత్తిన ధర్మ మీమాంసను పరిష్కరించి వివాహానికి ఆశీస్సులు పలికారు.
ఆ గృహస్తుడు ఎవరోకాదు. మా మామగారే. తర్వాత అనేక పర్యాయములు కంచి వెళ్ళి ఆచార్య సన్నిధిలో గడప గలుగుట నా అదృష్టంగా భావిస్తున్నాను.
పరమాచార్యులనుగ్రహించిన అనుభూతిని నలుగురితో పంచుకో వాలన్న సంకల్పం కలిగింది.
ఆ స్ఫూర్తి తోనే ఆదిశంకర విరచిత కొన్ని ముఖ్య స్తోత్రాలను, పరమాచార్యులు, శంకరభగవత్పాదులు, కంచికామాక్షి, వివాహ వ్యవస్త గురించి వ్యాసాలను జోడించి చిన్న సంకలనం భక్తులకు అందించటం జరిగింది.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565