శ్రీ కంచి కామకోటి పీఠ ఆస్థాన సిద్ధాంతి
గంటల పంచాంగము
Sri Kanchi Kamakoti Peeta Asthana Sidhanti
Gantala Panchangam
Author: Lakkavarjhula Subrahmanya Sidhanti
online......
For Printed Books: Contact
Mohan Publications
Door No 29-6-1A, opp:ajantha hotel,
Kotagummam Rajahmundry, 533101,
Cell: 9032462565,
Andhra Pradesh.
వేదమున విధించబడిన నిత్యశ్రౌతస్మార్తాది సకల సత్కర్మానుష్ఠానమునకు తగిన కాలము నిర్ణయించుట జ్యోతిశ్శాస్త్రపు ముఖ్యప్రయోజనము. జటిల గణిత సాధ్యమైన తిధివార నక్షత్ర యోగకరణాదుల నిర్ణయము బహు ప్రాచీన కాలము నుండి అట్టి గణనము నందు నిష్ణాతులైన మన పంచాంగకర్తలు చేయుచూ వచ్చుచున్నారు. కాగా కొన్ని పంచాగముల యందు గ్రహణాది ప్రత్యక్ష గోచరములు కూడా తప్పిపోయెడి పొరపాట్లు దొర్లుచున్నవి. ఇట్టి ప్రమాదములను హరించుటకు తగు నిర్ణయములు తీసుకొనుటకు దోహదముగా శ్రీమఠం పరాపర గురువుల కాలము నుండి సదస్సులు జరుగుచున్నవి.
గత అయిదు సంవత్సరములుగా ఈ సదస్సుకు వచ్చి చర్చలలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న శ్రీ దైవజ్ఞ యల్. సుబ్రమణ్య సిద్ధాన్తి గారు 2008 నుండి శ్రీ కంచి కామకోటి పీఠ పరిపాలిత కాల నిర్ణయ పంచాగమును వెలువరించుచున్నారు. ఇందలి నిర్ణయములన్నియూ శ్రీమఠమునందు నిర్వహింపబడు పంచాంగ పండిత సదస్సు నందు ఆమోదింపబడినవిగా ఉన్నాయి.
విలంబ నామ సంవత్సరమునకు కూడా ఇదే విధముగా పంచాంగము వెలువరించబోతున్నారని తెలుసుకొని ఎంతో సంతసించినాము.
ఆస్తికులందరూ ఈ పంచాగమును తమ అనుష్ఠానములలో ఉపయోగించుకొని ఫలితములను పరిపూర్ణముగా పొందగలరు.
- జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామిగళ్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565