శీతలపానీయాలు
దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది.
కీర దోస లెమనేడ్
కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు
గార్నిషింగ్ కోసం: ఐస్ క్యూబ్స్ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా
తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి
♦ పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి ♦ వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి
♦ కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి.

పుచ్చకాయ అల్లం లెమనేడ్
కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను
తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి.
♦ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి
♦ ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి
♦ ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి
♦ సబ్జా గింజలు జత చేయాలి
♦ సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
కమలా – దానిమ్మ లెమనేడ్
కావలసినవి: చల్లటి గ్రీన్ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను; గార్నిషింగ్ కోసం – కమలా పండు చక్రం; ఐస్ – తగినంత
తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి నిమ్మరసం జత చేయాలి
♦ కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి
♦ ఇది మంచి డిన్నర్ డ్రింక్. సోడా బదులు ఈ లెమనేడ్ వాడటం ఆరోగ్యానికి మంచిది.
స్ట్రాబెర్రీ లెమనేడ్
కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు
తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి
♦ దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి
♦ ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ రసం వేసి బాగా కలపాలి
♦ ఐస్ జత చేసి గ్లాసులలో అందించాలి.

కొబ్బరి నీళ్ల లెమనేడ్
కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); ఐస్ క్యూబ్స్ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా
తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి
♦ నిమ్మ ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి
♦ పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి.

♦ నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది.
♦ నిమ్మలో ఉండే విటమిన్ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి.
♦ కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.
♦ తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
♦ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది.
♦ మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది.
♦ కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
♦ వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు.
♦ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565