శ్రీవీరభద్రస్వామిదేవాలయం రాయచోటి
#శ్రీవీరభద్రస్వామిదేవాలయం
రాయచోటి కడపజిల్లా ఆంద్రప్రదేశ్
రాయలేలిన రతనాలసీమే రాయచోటిగా
నేడు వెలుగొందుతుంది రాయల కాలంలో రాచోటి ప్రక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం వెలిసింది ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ధగాంచింది పూర్వకాలంలో
సామంత రాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేదతీరుతు ఉండేవారని ప్రతీతి
అ కాలంలోనే భక్తి ప్రపత్తులతో ఆలయాన్ని
నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి
అప్పటినుంచి ఇప్పటివరకూ మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతుంది
గతంలో రాచోటిగా పిలవబడే నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయం అని పెద్దలు పేర్కొంటారు రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది
స్వయముగా వీరభద్రుడే విగ్రహామూర్తిగా
ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్రాలయాన్ని దక్షిణ భారతదేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్ గా పేర్కొంటారు చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు చేసి అలసిపొయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత
కోసం దేశఘటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు కొండల గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూలతోటలతో ఈ ప్రాంతం ఆయనకు విశేషంగా ఆకర్షించిందని దీంతో అయన ఇక్కడే తన సపరివారంతో నిలిచిపోయి
భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించారని చరిత్ర చెబుతుంది వీరభద్రుడికి రాచరాయుడు అనేపేరు కూడా ఉంది బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి 21 నుండి 24 వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకుని సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషం అలయ వాస్తు
నిర్మాణ చౌతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు అలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తుగల ఏక శిలారాతి దీపస్తంభం ఉంది ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
ఇంత పెద్ద ఏకశిలా దీపస్తంభం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని చెప్పవచ్చు ప్రతీఏటా కార్తీకమాసంలో ఈ స్తంభం పైభాగంలో దీపం వెలిగించి స్వామివారిని అరాధించడం ఆనవాయితీగా వస్తోంది ఈ పురాతన ఆలయం వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందినది వీరికి వీరభద్రుడు ఇలవేల్పు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా కర్నాటక తమిళనాడు మహరాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు
వీరభద్రుని హిందువులే కాక ముస్లింలు కూడా కులదైవంగా ఆరాధించే సంప్రదాయం ఉన్నది స్వామివారి బ్రహ్మోత్సవాలలో కులమతాలకు అతీతంగా సర్వమతస్తులు పాల్గొంటారు
ముస్లింలలో దేశముఖ్ తెగకు చెందినవారు ఉత్సవాలకు స్వామివారికి సాంప్రదాయ బద్ధంగా పూజసామాగ్రి పంపితే అలయ కమిటీ వాటిని స్వీకరించి వారి పేరుతో పూజలు నిర్వహించి తీర్ధప్రసాదములు తిరిగి వారికీ పంపడం ఆనవాయితీగా ఉన్నది ఈ సాంప్రదాయాలను పరమత సహసనానికి
నిదర్శనముగా పేర్కొనవచ్చు పది శతాబ్దాల పైబడిన చరిత్ర కలిగి ఈ వీరభద్రాలయం పేరుప్రతిష్ఠలు దశదిశలు వ్యాపించాయి ఆలయం మూడు గాలిగోపురాలతో అందమైన శిల్పకళా సంపదతో విరాజిల్లుతూ చూపరులను ఆకట్టుకుంటుంది !
అర్చా విగ్రహమూర్తిగా ఆవిర్భవించిన వీరభద్రుడు అలనాడు దక్షప్రజాపతి అత్మజ్ఞాన హినుడై శివ ద్వేశంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు యజ్ఞ విశయాన్ని తెలుసుకున్న శంకరుని భార్య అయిన సతీదేవి పుట్టింటిపై మమకారంతో తన తండ్రి చేస్తున్న తప్పును తెలియజేయడానికి పతిదేవుడు పిలవని పేరాంటానికి వెళ్ళకూడదని చెప్పిన తన భర్త మాటమిరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక
దేవతలందరి సమక్షంలో అత్మహుతి గావించుకుంది అది తెలసిన మహగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరిగి నేలకు విసిరితే అందుండి ప్రళయ భీకరాకర వీరభద్రుడు ఉద్భవించి
రుద్రగణ సహీతుడై యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు అ నిర్వీశ్వర యాగానికి విచ్చేసిన దేవతలందరిని దండించాడు దక్షుడను పట్టుకొని తన ఖడ్ఘంతో శిరస్సు ఖండించి అగ్నికి అహుతీ చేసాడు అర్ధాంతరంగా యజ్ఞం ఆగిపోయింది వీరభద్రుడు సృష్టించిన భీభత్సానికి శివుడు సంతోషించాడు వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడువై వర్ధిల్లువుగాక అని దీవించాడు అప్పటినుంచి వీరభద్రుడు వీరేశ్వరుడని పిలవబడ్డాడు పూర్ణవిరాగి అయిన శివుడు ఒక వటవృక్షమూలంలో ధ్యాన నిమగ్నుడై కూర్చుండిపోయాడు ప్రజాపతులలో జ్యేష్టుడైన దక్షుడు ప్రాణాలు కాల్పొవడం అర్ధాంతరంగా యజ్ఞం ఆగిపోవడం లోక ప్రదావాలకు దారితీసింది సృష్టిక్రమానికి ఆటంకం ఏర్పడింది శివాపరాధానికి గురైన దేవతలు దివ్యతేజోహీనులై దేవతలందరూ ఆలోచించి శివానుగ్రహం పొంది దక్షుణ్ణి బ్రతికించి లోక కళ్యాణార్ధం తిరిగి యాగం కొనసాగించాలని నిర్ణయించుకోన్నారు బ్రహ్మది దేవతలు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని కైలాషం వెళ్ళారు అక్కడ దక్షినాభిముఖుడై వటవృక్షమూలలో చిన్ముద్ర ధరించి మౌనియై బ్రహ్మనిష్టలో
ప్రకాశిస్తూ దక్షిణామూర్తి అయిన శివుడు దేవతలకు దర్శనమిచ్చాడు ఏకాగ్రచిత్రులై
దేవతలు భక్తితో దక్షిణామూర్తిని మనసారా ప్రార్ధించారు సర్వం గ్రహించిన గురుమూర్తి వారి తప్పును మన్నించాడు దక్షుడి అపరాధాన్ని బాలరాపరాధంగా భావించి క్షమించాడు ప్రసన్నడైన పరమేశ్వరుడు తన అంశాభూతుడైన వీరభద్రుని పిలిచి ఇలా అని పుత్రా వీరభద్రా కులదోశం పట్టి
ప్రజాపతులను దేవతలకు అత్మజ్ఞానంతో వారిచేసిన పనివల్ల సతీదేవి ప్రాణత్యాగం వారి పాలిట స్త్రీ హత్యా పాతకమై చుట్టుకుంది కారాణావతారుడువైన నువ్వే వీరందరికీ జ్ఞానభీక్ష పెట్టగల సమర్ధుడవు మూర్ఖుడైన దక్షుణికి ప్రాణభిక్ష పెడుతున్నాను అయన తిరుగు ప్రయాణంలో రామేశ్వరానికి శ్రీశైలానికి నడుమనున్న ఈ మాండవ్య నది తీరమందు వీరేశ్వర లింగము నిలిచి ప్రకాశించింది అప్పటికే ఇచ్చోట మండవిమాత [ యల్లమ్మ ] ఆలయం నెలకొని ఉండేది వీరేశలింగం వెలియడంతో ఈ క్షేత్రం శివశక్తి పీఠమై తేజరిల్లింది సర్వదేవతలకు ఇచట మనస్సు శాంతించినది అంతా శివ సంకల్పం అని భావించి వీరేశ్వరుడు తదేక భక్తితో పరమశివుడుని ధ్యానించాడు తక్షణం పొడవాటి మీసములు వాడియైన కోరలు సహస్రభుజ సహస్రాయుధాలతో విరాజితుడైన వీరభద్రుని ఉగ్రరూపం మటుమాయమైంది మౌని చిన్ముద్రదారి సర్వలోక గురుస్వరుపియైన శ్రీదక్షిణామూర్తి వీరేశ్వరునిలో మూర్తిభవించాడు సతీ జగన్మాత అత్మ శాంతించింది తమ జ్ఞాన భిక్ష పెట్టిన ఈ పుణ్యక్షేత్రములో అమరగురు వీరేశ్వరుడనే పేరుతో వెలసి నిత్యం దేవతల సేవలు అందుకొవలసిందిగా దక్షాది దేవతలు వీరభద్రుని ప్రార్ధించారు అలనాడు దక్షాది దేవతల ప్రార్ధన మన్నించి గురుపాద పూజా నిమిత్తం ప్రతీఏటా ఉత్తరాయణం మీనమాసం సూర్యోదయం ఉదయం
6 గంటలకు మీన లగ్నమందు 5రోజులు కేవలం అర గడియ కాలం ఉగ్రదేవతలకు సూర్యమండలం నుండి సూర్యరశ్మి మార్గాన గర్భాలయంలోకి ప్రవేశించి పాదార్చన చేసుకోమని వీరేశ్వరుడు వరమిచ్చాడట ఇప్పటికి మనము
ఈ విచిత్రం ప్రత్యక్షంగా చూడవచ్చును
ఆంధ్ర తెలంగాణా కర్ణాటక తమిళనాడు మరియు మహరాష్ట్రలా నుండి అశేష భక్తజనులు ఈ వీరేశ్వర క్షేత్రాన్ని నిత్యం దర్శిస్తూ ఉంటారు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565