MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆధునిక కొలువులు డిజిటల్‌ పంచభూతాలు!_digitalisation employment


ఆధునిక కొలువులు డిజిటల్‌ పంచభూతాలు! digitalisation employment employment in now a days now a days employment employment in india robotics in industries digitization in india bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


ఆధునిక కొలువులు 
డిజిటల్‌ పంచభూతాలు!

ఈ రోజు ఒక కోర్సు చేస్తే.. మరునాటికి అది ఔట్‌డేట్‌ అయిపోతుంటే ఏంచేయాలి? ఆటోమేషన్‌తో ఉద్యోగాలన్నీ రోబోలు కొట్టేస్తే కోర్సులు చేసి ఉపయోగమేంటి? ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో కొలువులకు కోతపడితే పూటగడిచేదెలా? పెరుగుతున్న టెక్నాలజీతో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతలో ఇదే ఆందోళన. అల్లమురబ్బా నుంచి అంతరిక్షం దాకా అన్నీ డిజిటల్‌ అవుతున్నాయి. ఈ కాలంలో ఉద్యోగాలు సంపాదించాలంటే అనవసర భయాలు వదిలిపెట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలంటున్నారు... వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ సాధించిన కంపెనీగా రికార్డు సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) టెక్నాలజీ బిజినెస్‌ యూనిట్‌ గ్లోబల్‌ హెడ్‌ వి.రాజన్న!ప్రస్తుత ప్రపంచాన్ని డిజిటలైజేషన్‌ ఊపేస్తోంది. అన్నీ డిజిటల్‌ ప్రభావానికి గురవుతున్నాయి. ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రతి రంగంపైనా డిజిటల్‌ ముద్ర పడుతోంది. ఈ టెక్నాలజీలు ప్రధానంగా అయిదు రకాలు. ప్రకృతిలో భాగమైన పంచభూతాల్లాగా... డిజిటల్‌ ప్రపంచాన్ని ఈ సాంకేతిక పంచభూతాలే నడిపిస్తున్నాయి. అవే.. క్లౌడ్‌, అనలిటిక్స్‌, సోషల్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), ఆటోమేషన్‌!

వినియోగదారులకు వ్యక్తిగతంగా మెరుగైన సేవలందించేందుకు ప్రతి కంపెనీ సాంకేతికతను సంతరించుకుంటోంది. ఈ మార్పులన్నీ అభ్యర్థులకు ఉద్యోగావ కాశ మార్గాలే. కస్టమర్ల అభిరుచుల ప్రకారం సేవలందించటం ఇప్పుడు కీలకమవుతోంది.
* ఉదాహరణకు... పదేపదే విమాన ప్రయాణాలు చేసే వినియోగదారుడి వివరాల్ని ఎయిర్‌లైన్స్‌ ఇప్పుడు మళ్లీ మళ్లీ అడగదు. వారి ప్రాధాన్యాలు, భోజన అలవాట్ల ప్రకారం ఏర్పాట్లన్నీ చేసేస్తుంది.
* ఎవరైనా నిరుద్యోగి ఉద్యోగ దరఖాస్తుకు ప్రతిసారీ వివరాలను నింపాల్సిన పని లేదు. ఒకసారి నింపితే చాలు... తర్వాత ఆటోమేటిగ్గా అవే వచ్చేస్తాయి.
* అలాగే... షాపింగ్‌కు వెళ్ళారు.. అయిదారు డ్రెస్‌లు నచ్చాయి. అవి నప్పుతాయో లేదో అదేపనిగా మార్చి చూసుకోనక్కర్లేదు. ఒక ప్రత్యేక కెమెరా ముందు నిలబడితే మీరెంచుకున్న డ్రెస్‌ వేసుకుంటే మీరెలా ఉంటారో చూపించేస్తుంది.
ఇవన్నీ ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీ మాయలే. ఈ సాంకేతికత సౌకర్యాలతోపాటు సేవలను వేగంగా కూడా అందిస్తోంది.

చికిత్సకు ముందే నివారణ


కారుకు సమస్య వస్తే మెకానిక్‌ దగ్గరకు వెళ్లే కాలం చెల్లబోతోంది. కానీ ఇక ముందు సమస్య రాకముందే నివారణ జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త సాఫ్ట్‌వేర్‌ కార్లకు రాబోయే సమస్యల గురించి ముందే హెచ్చరిస్తుంది. ఏ పార్ట్‌ ఎప్పుడు పాడయ్యే అవకాశం ఉందో ఈ సాఫ్ట్‌వేర్‌ అంచనావేసి సమాచారం అందిస్తుంది. అదేవిధంగా... మన ఆరోగ్యం గురించి కూడా!

సింగపూర్‌లో వృద్ధుల గృహాల కోసం ఓ సాఫ్ట్‌వేర్‌ మెడిసిన్‌ కిట్‌ను తయారు చేశారు. ఒంటరిగా ఉండే వృద్ధులు సమయానికి మందులు వేసుకోకపోతే... వెంటనే ఆ కిట్‌ దగ్గర్లోని నర్సింగ్‌ స్టేషన్‌కు సెన్సర్ల ద్వారా సమాచారం పంపుతుంది. అలాగే శరీరానికే అమర్చుకునే డివైజ్‌లు సిద్ధమవుతున్నాయి. హెల్త్‌కేర్‌లో ఆధునిక పద్ధతుల వల్ల, డిజిటలైజేషన్‌ వల్ల ఇలాంటి నివారణ చర్యలు సాధ్యమవుతున్నాయి. భారీగా ఉద్యోగాలకు అవకాశమున్న రంగం
హెల్త్‌కేర్‌!

డాటా మొత్తం క్లౌడ్‌లో ఉంటోంది. దీని ఆధారంగా నడుస్తుంది అనలిటిక్స్‌. డాటా రక్షణే కాకుండా... ప్రతి సంస్థా తమకు, తమ డాటాకు సైబర్‌ సెక్యూరిటీ కోరుకుంటోంది.రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్పీఏ)కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రోబోలు గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ప్రభావం! ఐఓటీ తదితరాలన్నీ వీటిపై ఆధారపడినవే.

ఈ సాంకేతిక పంచభూతాలే అన్నింటికీ మూలాధారం. స్మార్ట్‌ సిటీస్‌, తర్వాతి తరం నెట్‌వర్క్‌లు... 5 జీలు... ఇవన్నీ ఈ ఆధునిక టెక్నాలజీల ఆధారంగా నడుస్తున్నవే. ఏఐని చూసి భయపడాల్సిన పని లేదు. ఆటోమేషన్‌ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా.. అంతకంటే ఎక్కువగా కొత్తవి పుట్టుకొస్తాయి. నిజానికి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కొత్తేమీ కాదు. ఇది గత 20 ఏళ్ళుగా ఉంది. క్లౌడ్‌ కూడా ఉంది. మనుషులకు ఇవేవీ ప్రత్యామ్నాయం కాదు.


అప్‌డేట్‌ అవ్వాల్సిందే!
అలాగని కొత్త టెక్నాలజీ కొలువులు ఎప్పటికీ ఉంటాయనుకోవటానికి లేదు! డిజిటల్‌ రంగంలో ఏదీ అలాగే కొనసాగదు. అన్నీ తర్వాతి తరం టెక్నాలజీలే! పాదరసంలా జారిపోయేవే! ఎప్పటికప్పుడు మారిపోయేవే! ప్రతిదానికీ తరగతులకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు. మొబైల్‌ ద్వారా కూడా నైపుణ్యాలు పెంచుకోవచ్చు. టీసీఎస్‌లో ‘ఎనీవేర్‌ ఎనీ టైమ్‌’ అంటూ... నేర్చుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ఈ కొత్త కోర్సులను నేర్పుతున్నారు. త్వరలోనే దీన్ని మరిన్ని కాలేజీలకు దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నారు. ఓపెన్‌ సోర్స్‌లో, మూక్స్‌లో అనేక శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్‌లో, ఆముదాలవలసలో ఉండీ నేర్చుకోవచ్చు. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులే కాదు... మెకానికల్‌, సివిల్‌... ఇలా వేరే బ్రాంచీల్లోని విద్యార్థులూ వీటిని నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి కూడా! ఏ బ్రాంచీ ఒక్కటే పనిచేయలేదు. అందుకే మిగిలినవాటి ఆధునికత అన్నింటిపైనా ప్రభావం చూపుతోంది.

5జీ రానుంది. అది మరిన్ని మార్పుల్ని తీసుకురాబోతోంది. కాబట్టి... నేర్చుకోవటం ముఖ్యం... వేగంగా అప్‌డేట్‌ అవటం అంతకంటే అవసరం! ఇంతగా నేర్చుకునే అవకాశాలు ఇంతకుముందెన్నడూ లేవు. డిజిటల్‌ ప్రపంచంలో అవకాశాలు లేవనే ప్రశ్నే లేదు. ఎక్కడి నుంచైనా ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనే తపనుండాలంతే!
ఏడు సూత్రాలు
కొత్త కోర్సులను నేర్చుకోవటంతో పాటు... డిజిటల్‌ యుగంలో కొలువులు కొట్టాలంటే ఈ కింది అంశాలను తెలుసుకోవాలి.
1. క్రిటికల్‌ థింకింగ్‌... సమస్య సాధన
ప్రతి కంపెనీ పోటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేయటానికి తమ ఉత్పత్తులను, సేవలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని చూస్తుంది. ఇందుకోసం టెక్నాలజీ, డిజిటలైజేషన్‌ చాలా కీలకం. వీటిని వినియోగించి కొత్త పద్ధతులను కనుక్కోవాలంటే కొత్త సామర్థ్యం అవసరం. అందుకే అభ్యర్థులు అలాంటి నైపుణ్యాలను పెంచుకోవాలి.
2. వేరే వ్యవస్థలతో కలివిడిగా!
ఏ ఒక్క కంపెనీ తమంతట తామే అన్నీ చేయడం కష్టం! మరొకరి సాయం తప్పనిసరి. ఈ లక్షణమే అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. అంటే... ఇతరులతో... వేరే బృందాలతో, వ్యవస్థలతో కలసి పనిచేస్తూ, ముందుకుసాగే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. ఎవరి పని వాళ్లు చేసుకుంటామంటే కుదరదు.
3. పాత్రలో నీటిలా....
21వ శతాబ్దంలో నిరక్షరాస్యులెవరంటే...నిరంతర అధ్యయనం, నిరంతర నైపుణ్యాల అభ్యసనం నిలిపేసినవారే అన్నారో ప్రముఖుడు. టెక్నాలజీ రంగంలో నిరంతర అధ్యయనం, అభ్యసనం, నైపుణ్యాల సాధన అత్యంత కీలకం. ఈరోజున్నది రేపు ఉండకపోవచ్చు ఈ రంగంలో! సమస్యల సులభతర పరిష్కారానికి కొత్త కోర్సులు, నైపుణ్యాలు ఎప్పుడూ వస్త్తూనే ఉంటాయి. అలాగని చాలామంది ఇదో పెద్ద సమస్య అనుకుంటారు. కానీ కానేకాదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు. ఓపెన్‌ సోర్స్‌లో అన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. అవకాశాలు మాకు లేవనే ఫిర్యాదుకు తావే లేదు. పాత్రలో నీళ్లలా ఒదిగిపోవాలంతే!
4. రిస్క్‌కు సిద్ధమా?
చొరవ తీసుకొని... కొత్తదనానికి ప్రయత్నించటం! కేవలం ప్రశ్నలు-సమాధానాలే కాదు... ప్రయోగాలు చేయటం, కొత్త పద్ధతుల్ని ఆలోచించటం... రిస్క్‌ తీసుకోవటం నేటి తరానికి చాలా అవసరం. విఫలమైనా ఫర్వాలేదు. కొత్త ప్రయోగం చేయాలన్న తపన, చొరవ ఉండాలి.
5. మనసులో ఉన్నదీ...
బుర్రలో మనకున్న ఆలోచనలెంత బలంగా ఉన్నా... వాటిని నోటితోగానీ, పేపర్‌పైగానీ సరిగ్గా వ్యక్తీకరించలేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి... సరైన కమ్యూనికేషన్‌ (రాత, మాట) నైపుణ్యాలను అలవర్చుకోవాలి. ఆత్మన్యూనత అవసరం లేదు. తెలుగు మాధ్యమంతో వచ్చి సాధన ద్వారా ఉన్నతంగా ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారు.
6. ఎలా చూస్తున్నాం...
డిజిటల్‌ ప్రపంచంలో అనుక్షణం బోలెడంత డాటా సిద్ధమవుతోంది. అందుబాటులో ఉన్న డాటాను ఎలా వినియోగిస్తామనేది చాలా ముఖ్యం! అంకెలు, సమాచారం వెనక దాగున్న తీరుల్ని, పద్ధతుల్ని చెప్పగలగాలి. అందుకే ఏం చూస్తున్నామనేది కాదు... ఎలా చూస్తున్నామనేది ముఖ్యం. డాటా విశ్లేషణ ఆధారంగా కంపెనీలు తమ వ్యూహాలను రచించుకుంటాయి. కాబట్టి కుప్పలు తెప్పలుగా వచ్చిపడే డాటాను సరిగ్గా విశ్లేషించే పరిజ్ఞానం కొలువుల్ని ఎదురొచ్చి అందిస్తుంది.
7. బాహుబలిలా....
కడుపులో చల్ల కదలకుండా... ఉన్నదాంతో సంతృప్తి పడదామంటే ఇప్పటి ప్రపంచంలో కుదరదు. క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యానికి... ఉత్సుకత, ఊహాశక్తులు... చోదకాలు. చిన్నతనం నుంచి  ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్నించే తత్వాన్ని నిలబెట్టుకోవాలి. అదే ఈ ప్రపంచంలో నిలబెడుతుంది. ‘బాహుబలి’ సినిమాలోని యుద్ధంలో హీరో ప్రభాస్‌ అప్పటికప్పుడు తన వ్యూహాల్ని మార్చి...ఎత్తుగడలు వేస్తాడు. అలాంటి ఉత్సాహం, ఇమాజినేషనే ఇప్పటితరానికి కావల్సింది!
పైథాన్‌, అనకొండ పరిచయం ఉన్నాయా?
లర్న్‌, అన్‌లర్న్‌, రీ లర్న్‌.... నేర్చుకోవటం... వదిలిపెట్టడం... మళ్ళీ కొత్తది నేర్చుకోవటం... ఇదో నిరంతర ప్రక్రియగా సాగాల్సిందే! ఎవరైతే ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారో... వారికి తిరుగులేదు. పైథాన్‌, అనకొండ, పపెట్‌, రాస్‌బెర్రీ, పై, చెఫ్‌, చాకొలెట్‌, ఎగ్‌ప్లాంట్‌... ఇలా కొత్తకొత్త టెక్నాలజీలెన్నో వస్తున్నాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలి. రోజుకో కొత్త లాంగ్వేజీ పుట్టుకొస్తోంది. నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి.

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list