Vedas in Telugu – Dasarathi Rangacharya
వేద సంహితలు– దాశరథి రంగాచార్యులు
1 ఋగ్వేదము 2 యజుర్వేదము
3 సామవేదము 4 అధర్వణవేదము
online.....
మత్స్య జయంతి
వేదాలు తెచ్చిన... నారాయణా
ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధమైనవి. భగవంతుడి దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మొదటిదైన మత్సా్యవతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.
బ్రహ్మకు ఒక పగలు, అంటే- వేయి మహాయుగాలు గడిస్తే... ఆయన సృష్టిని ఆపి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమవుతుందంటారు. దీన్ని నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మరల యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడంటారు. దీనికి ‘కల్పం’ అని పేరు.
వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు. విష్ణుభక్తుడు. ఒకసారి అతడు కృతమాలానదికి వెళ్లి స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దాన్ని నీటిలోకి జారవిడిచాడు. మళ్ళీ నీటిని తీస్తున్నప్పుడు చేప చేతిలోనికి వచ్చి ‘రాజా! నన్ను పెద్దచేపలు తినివేస్తాయి. రక్షించు’ అని కోరింది. రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు. మర్నాటికి ఆ చేప, పాత్ర పట్టనంత పెద్దదైంది. అప్పుడు చెరువులో విడిచాడు. మర్నాటికి చెరువు కూడా పట్టలేదు. అప్పుడు రాజు దాన్ని సముద్రంలో వదిలాడు. ఆ మత్స్యం శతయోజన ప్రమాణానికి విస్తరించింది. తాను శ్రీమన్నారాయణుడినని, నాటికి ఏడు రోజుల్లో ప్రళయం రానున్నదని, సర్వజీవరాసులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుందని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి, దానిలో పునఃసృష్టికి అవసరమైన ఓషధులు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తర్షులు కూడా ఆ నావలోకి రాగలరని చెప్పింది. మీనరూపుడైన నారాయణుడు తన కొమ్ముకు మహాసర్పరూపమైన తాటితో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యుడికి శ్రద్ధదేవుడిగా జన్మించి ‘వైవస్వత మనువు’గా ప్రసిద్ధికెక్కాడు.
బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయి. పరమేష్ఠి నిద్రావస్థలో ఉన్నప్పుడు సోమకాసురుడు నాలుగు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ధ్యానించగా ఆయన మత్స్యరూపంలో జలనిధిని అన్వేషించి సోమకుడితో పోరాడి ఆ రాక్షసుడి కడుపుచీల్చి వేదాలను, దక్షిణావర్త శంఖాన్ని తీసుకుని బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను గ్రహించాడు. శిథిలమైన వేదభాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యాయవతారం.
వేదాలను అపహరించడమంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేయడమని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టికార్య ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందడమే వేదాలు మరల గ్రహించడమని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి
ప్రపంచంలోని అతి పురాతనమైన మతాలలో హిందూ మతం కూడా ఒక్కటి. కానీ అనేక మతాలలో ఉన్నట్లు గా కేవలం ఒక్క దేవునికే పరిమితం కాలేదు హిందూ మతం. హిందూ మతంలో 33 మిలియన్ దేవతలు ఉన్నారు. సూచన ప్రాయంగా ముక్కోటి దేవతలుగా అభివర్ణిస్తుంటారు. ప్రతి ఒక్క దేవునికి వారికి తగ్గ ప్రత్యేకతలు మరియు కథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. హిందువుల విశ్వాసం ప్రకారం సృష్టి ఏర్పడడానికి కూడా ఒక కారణం ఉంది. మరియు ప్రతి చెడుకి ఒక మంచి రక్షగా ఉంటుంది. కానీ సృష్టి కారణం పూర్తయ్యాక, నాశనం గావించబడుతుంది. జీవన్మరణాల సమర్ధ నియంత్రణకై సృష్టి ఆవిర్భావం జరిగింది, దీని యొక్క భాద్యత సృష్టికర్త బ్రహ్మపై ఉన్నది. జీవుల కర్తలను కర్మలను నిర్ణయించి, వారి కర్మలు పూర్తయిన తర్వాత మరణం ద్వారా సమగ్ర నియంత్రణ జరిగేలా బ్రహ్మ చూస్తాడు. విష్ణువు సృష్టి రక్షకునిగా కీర్తింపబడుతాడు. ఎప్పుడైనా, సృష్టియందు చెడు పెరిగి మంచికి ఆపద వస్తున్న సమయాన, తన అవతారాలతో చెడుని తుదముట్టించి సృష్టిని కాపాడే భాద్యత అంతిమంగా విష్ణువు దే అవుతుంది. అదే సమయంలో కార్యాలన్నీ పూర్తి చేసుకున్న సృష్టిని వినాశనం భాద్యత మాత్రం మహేశ్వరునిపై ఉంటుంది. ఈ విధంగా, ఆధ్యాత్మిక దృష్టికోణంలో, విష్ణువు యొక్క తొమ్మిది అవతారాలు రామావతారం, కృష్ణావతారం, కూర్మావతారం , నరసింహావతారం, వరాహావతారం, వామనావతారo , నరసింహావతారం, భార్గవ అవతారం అలాగే మత్స్యావతారం హిందూమతంలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇతర అవతారాలలో, మత్స్యావతారం ప్రముఖమైనది. ఈ మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని హిందువులు జరుపుకుంటారు. ఈ సంవత్సరo మత్స్యజయంతి మార్చి 20 న వస్తుంది అనగా ఈరోజు. ఈ ప్రత్యేకమైన పండుగ గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి. అసలు మత్స్య జయంతి ఎప్పుడు జరుపుకుంటారు: ఈ సంవత్సరం, మత్స్య జయంతి మార్చి 20 న వస్తుంది అనగా ఈరోజు. ఇది భారతదేశం యొక్క సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం శుక్ల పక్షాన మూడవ రోజు జరుపుకుంటారు. ఈ రోజున, విష్ణు భగవానుడు వేదాలను రక్షించడానికి ఒక కొమ్ముల చేప వలె కనిపించాడు. రాబోయే శతాబ్దాల్లో భూమిని ఎదుర్కోబోయే గొప్ప మహా ప్రళయాల గురించి హెచ్చరించడానికి విష్ణువు ఈ ప్రత్యేక అవతారం లో భూమిపై కనిపించినట్లు, తద్వారా సమర్ధుడైన మనువుకి ఈ భాద్యతను అప్పగించినట్లుగా కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి. మత్స్య జయంతి విధివిధానాలు: ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు, కావున ఆలయంలో ప్రార్ధనలను చేయడం, ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే, అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం, హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ, ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.: మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత: ఈ రోజు మత్స్యo తో అనుబంధం ఉన్న కారణాన, చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జల జంతువులకు ఆహారమివ్వడం కూడా సాధారణoగా దీక్షలో భాగంగానే ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా రూపం ప్రోత్సహించబడుతుంది. అందువల్ల చాలామంది ప్రజలు ఈ రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులు విరాళంగా ఇస్తుంటారు. ఈరోజు మత్స్య్తావతారo లేదా మత్స్య పురాణం సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. సంబంధిత కథలు మరియు వాటి నమ్మకాలు : మనలో చాలామందికి తెలిసిన కథ ప్రకారం సత్యవ్రతుడు, మనువు మత్స్యాన్ని రక్షించిన వారిలో ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా మత్స్యదైవం , మనువుకు ప్రళయాన్ని గురించిన హెచ్చరికలను ముందుగానే తెలియజేస్తుంది. ఈ ప్రళయం కారణంగా సమస్త సృష్టి వినాశనానికి గురవ్వబోతున్నదని, వేదాలను కాపాడవలసిన భాద్యతలను మనువు తీసుకోవలసినది గా దేవ మత్స్యం సూచిస్తుంది. మరియు అన్నీ మొక్కలకు సంబంధించిన విత్తనాలను, ఆరోగ్యకరమైన జంటలను కూడా కాపాడవలసినదిగా మనువు ఆదేశింపబడుతాడు. ఈ హెచ్చరికల కారణంగానే ఒక భయానకమైన ప్రళయం నుండి మనువు అనేకమందిని కాపాడగలిగాడు. తద్వారా మానవాళి ఉనికి ప్రశ్నార్ధకం కాకుండా చేయగలిగాడని పురాణాల సారాంశం. మత్స్య పురాణం: మత్స్యావతారం గురించి మనకు తెలిసిన అనేక కథలు , చాలా భాగం మత్స్య పురాణం నుండే వచ్చినవి. ఈ పురాణాల్లో విష్ణువు , శివుడు మరియు శక్తి దేవతకు సంబంధించిన కథలు అనేకం ఉన్నాయి. ఇక్కడ అనేక అధ్యాయాలు హిందూమతంతో అనుబంధించబడిన పండగలు మరియు ఆచారాలకు అంకితమివ్వబడ్డాయి. ఈ పురాణం సమాజంలోని వివిధ విభాగాల (రాజులు మరియు మంత్రుల నుండి కేవలం పౌరులకు మాత్రమే) విధుల గురించి మాట్లాడుతుంది. హిందూ మతం యొక్క 18 అత్యంత ముఖ్యమైన పురాణాలలో ఒకటిగా ఈ మత్స్య పురాణం ఉండటం వలన, ఈ గ్రంథం భవననిర్మాణాలు, వేడుకలు మరియు అదే నిర్మాణాలతో అనుబంధించబడిన వేర్వేరు నిర్మాణ ఆకృతులను వివరించడానికి ఉపయోగపడుంది కూడా. మత్స్య దేవాలయం: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఆలయ పట్టణ సమీపంలో, ప్రసిద్ధమైన మరియు విష్ణువు మత్స్యావతారానికి అంకితమిచ్చిన శ్రీ వేద నారాయణస్వామి ఆలయం ఉన్నది. ముందు చెప్పినట్లుగా, మత్స్య పురాణాల్లో వివరించబడిన నిర్మాణ వివరాలు చాలా ఖచ్చితమైనవి. ఈ ఆలయ రూపకల్పన మరియు సృష్టిలో ఇదే వాడబడింది. ప్రతి సంవత్సరం, సూర్యుడి కిరణాలు నేరుగా మార్చి 25 , 26 మరియు 27 వ తేదీల్లో విగ్రహం మీద పడేలా ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ సంవత్సరం మాత్స్య జయంతి మార్చి 20 వ తేదీన జరగనున్నదని పరిశీలిస్తే, రాబోయే పది రోజులు అత్యధిక జనసందోహంతో ఉండగలదని చెప్పకనే చెప్పవచ్చు. దీనికి కారణం గర్భగుడిలో విగ్రహం పై సూర్య కిరణాల తాకిడి. ఈ సమయంలో వేద నారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు కనులారవిందం చేయనున్నాడు. మత్స్యావతారానికి సంబంధించిన మరొక పండుగ కూడా ఉందని మీకు తెలుసా ? ఈ ఉత్సవాన్ని జరుపుకునేందుకు ఆసక్తిగా ఉన్నవారికి మత్స్య ద్వాదర్షి అనునది మరొక పండుగ. ఇది మత్స్యావతారానికి అంకితమైనది. మత్స్య జయంతి మాదిరిగా కాకుండా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పండుగ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. కొన్ని వర్గాలు కార్తిక మాసం 12వ రోజు జరుపుకుంటాయి, మరికొంత మంది మార్గశిర మాసాన 12 వ రోజున చేస్తారు. ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు మత్స్య జయంతికి చాలా దగ్గర పోలికలను పోలి ఉంటాయి మరియు మీరు ఈ మత్స్య జయంతిని జరుపుకుంటున్న వారై ఉంటే, మీకు సూచించదగ్గ మరొక పండుగ ఈ మత్స్య ద్వాదర్షి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565